ర-శ్రీశ్రీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ర-శ్రీశ్రీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, ఏప్రిల్ 2026, సోమవారం

ఎంత మంచిదానవోయమ్మ - కన్నతల్లి చిత్రం నుండి ఘంటసాల

1953 సంవత్సరంలో విడుదలైన ప్రకాశ్ సంస్థ నిర్మించిన కన్నతల్లి చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఎంత మంచిదానవోయమ్మ" అనే ఈ ఏకగళగీతం  రచన శ్రీశ్రీ, ఆరుద్ర, స్వరపరచినది  పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, జి.వరలక్ష్మి, నంబియార్, ఆర్.నాగేశ్వరరావు. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 16.04.1953 న విడుదలైంది.




కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

ఘంటసాల గానపదసూచిక (HOME)



29, డిసెంబర్ 2025, సోమవారం

ఎవరిది విజయం - శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల, పిఠాాపురం, వి.సూర్యనారాయణ, బృందం

1966 సంవత్సరంలో విడుదలైన శ్రీనిలయం పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల, పిఠాాపురం, వి.సూర్యనారాయణ, బృందంపాడిన "ఎవరిది విజయం " అనే ఈ బహుగళగీతం  రచన శ్రీశ్రీ, స్వరపరచినది  శ్రీ నిత్యానంద్. ఈ చిత్రంలో తారాగణం కాంతారావు,శారద,చలం,గీతాంజలి, వాసంతి. ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు విజయానంద్. దీనిని కాంతాారావు, చలం, పొన్నతోట రఘురాం, తదితరులు పైచిత్రీకరించారు. ఈ చిత్రం 9.12.1966 న విడుదలైంది.



కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

11, డిసెంబర్ 2025, గురువారం

మదిని హాయి నిండెగా - భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల, పి.సుశీల

1959 సంవత్సరంలో విడుదలైన శ్రీ సారథీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన "మదిని హాయి నిండెగా " అనే ఈ యుగళం  రచన శ్రీశ్రీ, స్వరపరచినది  మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం జగ్గయ్య, సావిత్రి, బాలయ్య, రాజసులోచన, రేలంగి, సూర్యకాంతం. ఈ చిత్రానికి నిర్మాత సారథీ స్టూడియోస్ మరియు దర్శకుడు తాపీ చాణక్య. దీనిని జగ్గయ్య, సావిత్రి లపై చిత్రీకరించారు. ఈ చిత్రం 23.10.1959 న విడుదలైంది.




కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

28, జనవరి 2025, మంగళవారం

చిత్రమె పాడునటే - శభాష్ పిల్ల - అనువాద చిత్రం నుండి ఘంటసాల

1959 సంవత్సరంలో విడుదలైన పద్మిని పిక్చర్స్ సంస్థ నిర్మించిన సెబాష్ పిల్లా() చిత్రం నుండి ఘంటసాల మాస్టారు  పాడిన "చిత్రము పాడునటే " అనే ఏకగళం  రచన శ్రీశ్రీ, స్వరపరచినది  టి.జి.లింగప్ప. చిత్రంలో తారాగణం  శివాజీగణేశన్చంద్రబాబు, ఎస్.వి. రంగారావు,బి. సరోజాదేవి, కుసుమకుమారి. చిత్రానికి నిర్మాత బి.ఆర్.పంతులు మరియు దర్శకుడు బి.ఆర్.పంతులు.  ఈ పాట ఎం.జి.ఆర్ పై చిత్రీకరించబడింది.


#000పాట:చిత్రమె పాడునదె 
 చిత్రం:సెబాష్ పిల్లా (డబ్బింగ్) (1959)  
 రచన:శ్రీశ్రీ 
 గానం:ఘంటసాల 
 సంగీతం: టి,జి.లింగప్ప 
    
 ప:చిత్రమె పాడునటే 
  ఓహో చిత్రమె పాడునటే 
  నా చిత్తమె ఆడునటే..ఏ.॥ చిత్రమె॥
  ముచ్చటగా యిపుడూ..ఊ..ఊ 
  ముచ్చటగా యిపుడూ 
  మోహనమూర్తియై మించునటే..ఏ.. 
  ముచ్చటగా యిపుడూ 
  మోహనమూర్తియై మించునటే..ఏ..॥ చిత్రమె॥
    
 చ:నా హృదయం మీదా..ఆ..ఆ.. 
  నా హృదయం మీదా ఒక నక్షత్రము పోలే -2 
  పాదము పెట్టినదే చేరి నావలె చూచునటే -2॥ చిత్రమె॥
    
 చ:నా మనం నీదైతే, సుఖరాజ్యము నాదె సుమా -2 
  ఎంత మనోబలమో మౌనం ఏల సఖీమణికి -2॥ చిత్రమె॥

24, జనవరి 2025, శుక్రవారం

ఓహో మోహనరూపా - శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల,బి.వసంత


1966 సంవత్సరంలో విడుదలైన  సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల,బి.వసంత పాడిన "ఓహో మోహనరూపా" అనే ఈ బహుగళం  రచన శ్రీశ్రీ, స్వరపరచినది  పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,జమున,కాంతారావు,అంజలీదేవి, పద్మనాభం. ఈ చిత్రానికి నిర్మాత డి. రామానాయుడు మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.




#000పాట:ఓహో మోహనరూపా
 చిత్రం:శ్రీకృష్ణ తులాభారం (1969)
 రచన:శ్రీశ్రీ
 సంగీతం: పెండ్యాల
 గానం:ఘంటసాల, పి.సుశీల, బి.వసంత
   
 ఘ:ఓహో.... మోహనరూపా,
  కేళీ... కలాపా కృష్ణా...ఆ..ఆ.
  ఓహో మోహనరూపా కేళీ కలాపా
  కృష్ణా నిను గని మురిసెను నా మనసే
  ఓహో మోహనరూపా కేళీ కలాపా
  కృష్ణా నిను గని మురిసెను నా మనసే
   
 సు:ఓఓఓ.ఓఓఓ..ఆఆఅ....
  మధువులు చిందే మందహాసం
  మరులూరించే వేణుగానం
  మధువులు చిందే మందహాసం
  మరులూరించే వేణుగానం
  వినివిని పరవశనైతినిలే - 2
  బిగిబిగి కౌగిట కరగితిలే
  ఓహో మోహనరూపా కేళీ కలాపా
  కృష్ణా... నిను గని మురిసెను నా మనసే
   
 ఘ:ప్రణయారాధన వేళ బాలా
  పతిపూజలు నీకేల బేలా
  ప్రణయారాధన వేళ బాలా
  పతిపూజలు నీకేల బేలా
  ఆ...వలపు చిలుకు నీ చూపులు నాపై
  నిలుపవే శుభాంగీ..ఈ.., నిలుపవే లతాంగీ
 వ:ఓ...ఓహో మోహనరూపా కేళీ కలాపా కృష్ణా...
  నిను గని మురిసెను నా మనసే
   
 సు:ఓఓఓ....ఆఆఆ....
  మధుర సుధా రాగమే, మదిలో కదిలే తీయగా
 ఘ:ఓఓఓఓఓ....
  మధుర సుధా రాగమే, మదిలో కదిలే తీయగా
  శిఖిపింఛమౌళీ నన్నేలగా
  తనువే ఊగే హాయిగా
 ఇ:ఆఆఅ...ఓఓఓ..మ్మ్మ్...
   
 ఘ:అహో లీలామానుషవేషధారీ మురారీ
  తనివార నినుగాంచి ధన్యతనొందితి శౌరీ
  ఓహో మోహనరూపా కేళీ కలాపా
  మోహనరూపా..మోహనరూపా..

25, డిసెంబర్ 2024, బుధవారం

ఓ రంగయో పూల రంగయో - వెలుగు నీడలు చిత్రం నుండి ఘంటసాల, సుశీల, బృందం


1961 సంవత్సరంలో విడుదలైన అన్నపూర్ణా పిక్చర్స్ సంస్థ నిర్మించిన వెలుగు నీడలు చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల, బృందం తో పాడిన "ఓ రంగయో పూల రంగయో" అనే ఈ బృందగీతం  రచన శ్రీశ్రీ, స్వరపరచినది  పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, సావిత్రి,ఎస్. వి.రంగారావు, సూర్యకాంతం, రేలంగి, జగ్గయ్య, గిరిజ. ఈ చిత్రానికి నిర్మాత డి.మధుసూదనరావు మరియు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు.




#000 పాట:ఓ! రంగయో పూల రంగయో 
  నిర్మాణం:అన్నపూర్ణా వారి 
  చిత్రం:వెలుగునీడలు (1961) 
  రచన:శ్రీశ్రీ 
  సంగీతం:పెండ్యాల 
  గానం:ఘంటసాల, పి.లీల, బృందం 
     
  బృం:ఓ...హొహోహో హొహోహో హొహోహో హో.. 
  ఘం:ఓ...హొహోహో హొహోహో హొహోహో హో.. 
 పల్లవి:సు:ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో 
  బృం:ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో 
  సు:పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి 
  బృం:పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి 
   ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో 
     
 చరణం:సు:పగలనక, రేయనక పడుతున్న శ్రమనంతా 
   పరుల కొఱకు ధారపోయు మూగజీవులు| పగలనక |
  ఘం:ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి  
   ఆనందం పొందగలుగు ధన్యజీవులు 
  బృం:ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో 
  ఘం:ఆ..ఆ..ఆ.. (బృందంతో సమాంతరంగా) 
  బృం:పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి 
   ఓ! రంగయో, పూలరంగయో, ఓరచూపు చాలించి సాగిపోవయో 
   పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి 
     
 చరణం:సు:కడుపారగ కూడులేని, తలదాచగ గూడులేని 
   ఈ దీనుల జీవితాలు మారుటెన్నడొ?| కడుపారగ |
  ఘం:తనవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి  
   కనిపెట్టీ మేలుచేయగలిగినప్పుడే! 
  బృం:ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో 
   పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి 
   ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో 
  ఘం:ఆ..ఆ..ఆ..

26, డిసెంబర్ 2021, ఆదివారం

నా రాణి కనులలోనే - చిలకా - గోరింక చిత్రం నుండి ఘంటసాల

 






నిర్మాణం:ఆత్మా ఆర్ట్స్
చిత్రం:చిలకా - గోరింక (1966)
సంగీతం:సాలూరు రాజేశ్వరరావు
రచన:శ్రీశ్రీ
గానం:ఘంటసాల
దర్శకత్వంకె. ప్రత్యగాత్మ
  
పల్లవి:నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే...ఏ
 నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే
 ఊరించు తొలిదినాలే ఈరేయి పిలువసాగే..ఏ..ఏ..
 నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే
  
చరణం:నగుమోము చూడబోయి, నిను చేర నాటి ఈరేయీ..ఈ..ఈ
 నగుమోము చూడబో...ఓ..యి, నిను చేర నాటి ఈరేయీ..ఈ..ఈ
 నను క్రీగంటనే, కని ఆవెంటనే, చని దూరాన దాగుంటివే..ఏ..ఏ
 నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే
  
చరణం:సిగలోని మల్లెపూల, సవరించబోవు వేళా..ఆ..ఆ
 సిగలోని మల్లెపూ..ఊ..ల సవరించబోవు వేళ
 మది గిలిగింతగా, చెయి విదలించగా, ఎద నిను కోరి పులకించెనే..ఏ..ఏ
 నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే
  
చరణం:పడకింటిశయ్య చెంతా..ఆ.., నీ మేను తాకినంత
 పడకింటిశయ్య చెంతా..ఆ.., నీ మేను తాకినంత
 మన గీతాలలో, జలపాతాలలో
 మన గీతాలలో, జలపాతాలలో, నవరాగాలు మ్రోగేనులే..ఏ..ఏ
 నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే
 ఊరించు తొలిదినాలే, ఈరేయి పిలువసాగే..ఏ..ఏ..
 నా రాణి కనులలోనే

21, జూన్ 2020, ఆదివారం

నీలో రేగీ నాలో మ్రోగెనులే - రక్త సిందూరం నుండి ఘంటసాల, సుశీల

రిపబ్లిక్ సంస్థ 1967 లో నిర్మించిన "రక్త సిందూరం" చిత్రం నుండి ఘంటసాల, పి.సుశీల పాడిన పాట. గీత రచన మహాకవి  శ్రీ శ్రీ. సంగీతం సాలూరు రాజేశ్వర రావు. ఇందులో శోభన్ బాబు, రాజశ్రీ, రామకృష్ణ, గీతాంజలి, విజయలలిత ముఖ్య తారాగణం. దర్శకత్వం సీతారాం.



ఘంటసాల: ప్రియురాలా! ప్రియురాలా!

సుశీల: చెలికాడా! చెలికాడా! చెలికాడా!



పల్లవి: సుశీల: నీలో రేగీ, నాలో మ్రోగెనులే, మధుర భావాలే, ప్రణయ గీతాలే


ఆనందాలే పూలై విరిసెనులే, హాయి కలిగెనులే, ఆశ పెరిగెనులే


నిన్ను విడువనులే



చరణం: ఘంటసాల: తళుకు తళుకుమను, మినుకు మినుకుమను తారకవే, నా చెలివే


వయసు పరువముల, నిలిపి మురిపెముల కులుకు చెలువముల జవ్వనివే


విందులు చేసెను నీ సొగసు 

సుశీల: ఒహొహో!

ఘంటసాల: చిందులు వేసెను నా మనసు 

సుశీల: అహహా!

ఘంటసాల: కవ్వించి కదిలించె నీ చూపు నీ రూపు 

సుశీల: నీలో రేగీ, నాలో మ్రోగెనులే మధుర భావాలే, ప్రణయ గీతాలే

ఘంటసాల: ఆనందాలే పూలై విరిసెనులే, హాయి కలిగెనులే, ఆశ పెరిగెనులే


నిన్ను విడువనులే

సుశీల: ఆ..ఆ..ఆ..ఆ..



చరణం: సుశీల: మొదట చూడగను తగిన వాడవని ముచ్చటగా మెచ్చితినే


హృదయపీఠమున నిలిపి కొలిచితిని నుదుటి తిలకముగ దాల్చితినే


కారుడవని నిను మదినెంచి 

ఘంటసాల: ఆహా!

సుశీల: సతినే నేనని యెదనెంచి 

ఘంటసాల: ఓహో!

సుశీల: నీ చెంత చేరేను నీ పొందు కోరేను 

ఘంటసాల: నీలో రేగీ, నాలో మ్రోగెనులే మధుర భావాలే, ప్రణయ గీతాలే

సుశీల: ఆనందాలే పూలై విరిసెనులే, హాయి కలిగెనులే, ఆశ పెరిగెనులే


నిన్ను విడువనులే



చరణం: ఘంటసాల: నిగ్గు చెక్కిలిని సిగ్గు మిక్కిలిగ నించెనుగా, పండెనుగా

సుశీల: పెదవి మీద చిరునగవు వెన్నెలలు నాట్యమాడ కనుపండువుగా

ఘంటసాల: రాధవు నీవని తలచానే

సుశీల: మాధవుడని నిను పిలిచానే

ఇద్దరు: ఏ వేళ, ఈ లీల ఈ ప్రేమ సాగేను 

సుశీల: నీలో రేగీ, నాలో మ్రోగెనులే మధుర భావాలే, ప్రణయ గీతాలే

ఇద్దరు: ఆనందాలే పూలై విరిసెనులే, హాయి కలిగెనులే, ఆశ పెరిగెనులే


నిన్ను విడువనులే

20, జూన్ 2020, శనివారం

వెదుకాడే కన్నులలోన - భాగ్యదేవత నుండి ఘంటసాల, జమునారాణి

1959 సంవత్సరంలో విడుదలైన శ్రీ సారథీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల మాస్టారు జమునారాణి తో పాడిన "వెతుకాడే కన్నులలోనా" అనే ఈ యుగళం  రచన శ్రీశ్రీ, స్వరపరచినది  మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం జగ్గయ్య, సావిత్రి, బాలయ్య, రాజసులోచన, రేలంగి, సూర్యకాంతం. ఈ చిత్రానికి నిర్మాత సారథీ స్టూడియోస్ మరియు దర్శకుడు తాపీ చాణక్య. దీనిని బాలయ్య, రాజసులోచన పై చిత్రీకరించారు. ఈ చిత్రం 21846 న విడుదలైంది.




చిత్రం: భాగ్యదేవత (1959)


రచన: శ్రీ శ్రీ


సంగీతం: మాస్టర్ వేణు


గానం: ఘంటసాల, కె. జమునారాణి






పల్లవి ఘంటసాల: వెదుకాడే కన్నులలోన, వెలిగించి ప్రేమజ్యోతి



ఆనందసాగరాన తేలి ఆడరావా, నీ ఓలలాడరావా । వెదుకాడే ।

జమునారాణి: పులకించే గుండెలలోన, పలికించి ప్రేమగీతి



ఆనందసాగరాన తేలి ఆడరావా, నీ ఓలలాడరావా । పులకించే ।





చరణం ఘంటసాల: మనసూగించే మధుమాస వేళ



కొసరుచు పాడే కోయిల బాల - 2



అనురాగ భావగీతి ఆలకించలేవ । వెదుకాడే ।





చరణం జమునారాణి: మరులూరించే విరజాజితోట



మలయసమీరం మసలేచోట - 2



ఆశించె నన్ను చేరి ఆటలాడరావా



పులకించే గుండెలలోన, పలికించిన ప్రేమగీతి


ఇద్దరు: ఆనందసాగరాన తేలి ఆడరావా, నీ ఓలలాడరావా

 

16, జూన్ 2020, మంగళవారం

శ్రీశ్రీ రచన "పొలాలనన్నీ హలాల దున్నీ" - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల, బృందం

శ్రీశ్రీ ఆధునిక కవితా ప్రభంజనానికి ఊపిరి. ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి.  పురాతన కవితాధోరణులు, ఛందస్సు అధునాతన కవనానికి ఉపయోగపడవని కవితకు అనూహ్యమైన మార్పులు చేశారు. అయితే రెండు విధాలలోను ఉద్దండుడు శ్రీశ్రీ. ఆయన వ్యాసం "1947-1972 : నేను - ఈ పాతికేళ్ళ వచన సాహిత్యం" ఆంధ్రభారతి బ్లాగ్ లో చూడవచ్చు.  శ్రీశ్రీ  కవితల గుఱించి,  ఆయన పదాలతో ఎలా ఆడుకున్నారో శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారు "ఈ మాట" వెబ్ జైన్ లో
"శ్రీశ్రీ ఛందఃశిల్పము" అనే చక్కని వ్యాసం వ్రాసారు.

శ్రీశ్రీ తను వ్రాసిన ఒక కవిత  "పొలాలనన్నీ హలాలదున్నీ" గుఱించి ఒకసారి ఒక ప్రసంగంలో ప్రస్తావించారు.  ఈ
గేయాన్ని మెచ్చుకుంటూ "అభ్యుదయ రచయితల లండన్‌ మానిఫెస్టో సారాంశం అంతా ఇందులో దించేశావోయ్‌" అని శ్రీశ్రీని పొగిడారట.  ఈ గేయాన్ని ఎన్.టి. ఆర్., సావిత్రి, ఎస్.వి. ఆర్. నటించిన, 1952లో పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్సు బ్యానర్ పై నిర్మింపబడిన "పల్లెటూరు" చిత్రం కోసం ఘంటసాల మాస్టారు ఎం.ఎస్. రామారావు, పిఠాపురం, మాధవపెద్ది బృందం తో కలసి పాడారు.  ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి సంగీత దర్శకులు.



కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

పయనించే మనవలపుల - బావమరదళ్ళు నుండి ఘంటసాల, సుశీల

1961 లో కృష్ణ చిత్ర సంస్థ పి.ఎ.పద్మనాభరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "బావమరదళ్ళు" చిత్రం నుండి  శ్రీశ్రీ రచనను పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరచగా, ఘంటసాల పి.సుశీల తోపాడిన "పయనించే మన వలపుల బంగరు నావ" అనే యుగళగీతం ఇక్కడ పొందుపరుస్తున్నాను. 

 

నిర్మాణం: కృష్ణ చిత్ర వారి

చిత్రం: బావమరదళ్ళు (1961)

రచన: శ్రీశ్రీ

సంగీతం: పెండ్యాల

గానం: ఘంటసాల, పి. సుశీల

దర్శకత్వం: పి.ఎ.సుబ్బారావు



పల్లవి: ఘంటసాల: పయనించే మన వలపుల బంగరు నావ


శయనించవె హాయిగా జీవనతార, నా.ఆ..జీవనతారా..ఆ..ఆ.


పయనించే..



చరణం: సుశీల: ఊ..ఊ..ఊ..ఊ..ఊ..ఊ..ఊ..


నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల కోనలలో.ఓ


నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల కోనలలో


చెలరేగే అలలమీద ఊయలలూగీ.ఈ..ఈ

ఘంటసాల: పయనించే మన వలపుల బంగరు నావ


శయనించవె హాయిగా జీవనతార, నా.ఆ..జీవనతారా..ఆ..ఆ.


పయనించే..



చరణం: ఘంటసాల: వికసించే విరజాజులు వెదజల్లగ పరిమళాలు


వికసించే విరజాజులు వెదజల్లగ పరిమళాలు


రవళించే వేణుగీతి రమ్మని పిలువా..ఆ..


పయనించే మన వలపుల బంగరు నావ


శయనించవె హాయిగా జీవనతార, నా.ఆ..జీవనతారా..ఆ..ఆ.


పయనించే ఆ..ఆ..ఆ..  ఆ..ఆ..ఆ..







14, జూన్ 2020, ఆదివారం

"అందం కోసం పందెం" చిత్రం నుండి ఘంటసాల పద్యాలు

1971 లో విడుదలైన "అందం కోసం పందెం" చిత్రం కోసం డా. సి. నారాయణ రెడ్డి మరియ్ మహాకవి శ్రీశ్రీ వ్రాసిన పద్యాలకు సంగీత దర్శకులు ఎస్.పి. కోదండపాణి స్వరపరచగా ఘంటసాల మాస్టారు ఆలపించారు.





చిత్రం: అందం కోసం పందెం (1971)

రచన: సి.నారాయణ రెడ్డి

సంగీతం: ఎస్.పి. కోదండపాణి

గానం: ఘంటసాల




నందనము తలదన్ను మందారవనమందు


వెన్నెలలు విరజిమ్ము విరిమంటపము ముందు


జీవకళలొలికించు శిల్పసుందరివీవు


ఏ మధురకవి కల్పనామూర్తివో నీవు ఆ..





అంత సన్నని నడుము అలసిపోవునొ ఏమో


ఎంతసేపని అటులనే నిలిచిపోయేవూ


ముద్దులను గురిపించు ముఖచంద్రబింబమ్ము


మేలిముసుగున నీవు ఏలదాచేవూ?


ఓ శిల్పసుందరీ - ఓ.. నా మనోహరీ..





విరబూసెడు పువ్వులనెవ్వరు కాదనగలరూ?


రివ్వుమనెడి యవ్వనమునెవ్వరాపగలరూ?


కలుసుకొన్న నయనమ్ములు కలనైనా విడిపోవు


వలపులొలుకు హృదయాలే కలకాలం నిలచిపోవూ..


కలకాలం నిలచిపోవూ




రచన: శ్రీ శ్రీ


పదములు లేజివుళ్ళ చెలువమ్ముల సొమ్ముల కాలయమ్ములో


ముదిత పిరుందులందముల మూటలుకట్టెడు సైకతమ్ములో


వదనము పారిజాతమో సువాసనలీనెడు పారిజాతమో


మదనుని బంతియో, చెలియ మల్లెలదొంతియో, వైజయంతియో


ఆహా… వదనము వారిజాతమో

5, జూన్ 2020, శుక్రవారం

సమ్మతి కోరితిరా - శ్రీ వళ్ళీ కల్యాణం అనువాద చిత్రం నుండి ఘంటసాల, బృందం

గానగంధర్వులు ఘంటసాల మాస్టారు ఎన్నో మధురమైన భక్తి గీతాలు తాదాత్మ్యంతో పాడారు. అందులో అనువాద చిత్రాలకు పాడినవి ఎక్కువగా ప్రసార మాధ్యమాలలో కనిపించవు.  అయితే ఆయన వీరాభిమానులు, ఆరాధకులు చేసిన ప్రయత్నాల వలన కొన్ని వెలుగు చూస్తున్నాయి. షణ్ముఖుడు లేదా సుబ్రహ్మణ్యస్వామి మరియు వల్లిల కల్యాణాన్ని తమిళంలో మొదట 1945 లో "శ్రీ వల్లి" అనే పేరుతోనిర్మించారు. ఆ చిత్రాన్ని అదే పేరుతో 1961 లో శివాజీ గణేశన్ సుబ్రహ్మణ్య స్వామిగా, పద్మిని వల్లిగా, టి.ఆర్. మహాలింగం నారదునిగా పునర్నిర్మించారు. తదుపరి 1962 లో "శ్రీ వళ్ళీ (వల్లీ) కల్యాణం (సుబ్రహ్మణ్య స్వామి మహాత్మ్యం)" అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.  ఈ చిత్రంలో నారద పాత్రధారి అయిన మహాలింగంకు ఘంటసాల మాస్టారు, బృందం పాడిన పాట "సమ్మతి కోరితిరా". అనువాద గీతాలకు ఆద్యులు, మహాకవి శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ఈ భక్తి గీతాన్ని స్వరపరచినది టి. చలపతిరావు. 


Video Courtesy: Sri Rajasekhar Raju



ఘంటసాల - సమ్మతి కోరితిరా 


సమ్మతి కోరితిరా నిన్ సన్నుతి జేసెదరా షణ్ముఖా. ఆ  ఆ -2


సమ్మతి కోరితిరా 


జన్మతరించెనయా ఆ ఆ ఆ ఆ 


జన్మతరించెనయా, పాలన చేయవే అమృతమయా, షణ్ముఖా..


ఏలవే అమృతమయా షణ్ముఖా ఆ ఆ


సమ్మతి కోరితిరా 




ఘంటసాల - నిను మది వేడితిరా ఆ ఆ స్వామీ! షణ్ముఖా.. ఆ ఆ ఆ


నిను మది వేడితిరా, నాలో నిలిచిన జ్యోతివిరా, స్వామీ


నిను మది వేడితిరా, నాలో నిలిచిన జ్యోతివిరా


స్వామీ మరుపేలా, మందిర ద్వారము తెరువుమయా


షణ్ముఖా  ఆ ఆ, షణ్ముఖా.. ఆ.. ఆ..


షణ్ముఖా  ఆ ఆ, షణ్ముఖా.. ఆ.. ఆ..




బృందం జయ జయ దీన మందార, భక్తజనముల కాచేటి జగదేక వీరా!


జాలము చేసేవదేలా! జయ జగదేక వీరుడవె గౌరీ కుమారా


జయ జయ దీన మందార


నిను నమ్మి యున్నాము కాదా


నీవు కనిపించి కాపాడి కరుణించరాదా


నిరతమ్ము దేవాధిదేవా


నిన్ను వేనోళ్ళ కొనియాడ వేగగ రావా


జయ జయ దీనావతారా




ఘంటసాల - మోహనమూర్తివిరా నినుగన ముచ్చటపడితినిరా స్వామీ -2


నాదము పొంగెనురా - 2


మురిసి నా మది పాడెనురా


నాదము పొంగెనురా, మురిసి నా మది పాడెనురా


అద్భుత తేజముతో ఆ.. ఆ.. హా.. ఆ ఆ  


అద్భుత తేజముతో వెలిగే, ఆనందజ్యోతివిరా స్వామీ


భక్తజనావళికే, 


భక్తజనావళికే షణ్ముఖా ముక్తిప్రదాతవురా-2

16, మే 2020, శనివారం

కాని పనులు చేస్తే - "సాహసవీరుడు" అనువాద చిత్రం నుండి ఘంటసాల, జిక్కీ

1956 లో విడుదలైన అనువాద చిత్రం సాహస వీరుడు. ఎం.జి. రామచంద్రన్, భానుమతి, పద్మిని, బాలయ్య ప్రధానంగా నటించిన ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు జిక్కీతో కలసి ఒక యుగళగీతం పాడారు.  ఈ చిత్రానికి అనేక విజయవంతమైన తమిళ చిత్రాలకు స్వరకర్తయై, శాస్త్రీయ సంగీతాన్ని సినీ మాధ్యమం ద్వారా అందించి పామరులను సైతం రంజింపజేసిన సంగీత దర్శకులు  జి. రామనాథన్. అనువాద చిత్రగీత రచనకు ఆద్యుడు శ్రీశ్రీ పాటలు వ్రాసారు. అనువాద చిత్రాలకు నటీనటుల పెదవుల కదలికకు అతికినట్టుగ పాటలు వ్రాయడం కత్తి మీద సామువంటిది.  అయినా ఇది శ్రీశ్రీకి ఇది కొట్టినపిండి. అయితే పాటలో "నంగిరి" (వెకిలితనం) అనే పదం చూసి ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఇది శ్రీకాకుళం మాండలికానికి చెందినది. అన్యప్రాంతాల వారికి తెలియకపోవచ్చును. మరి శ్రీశ్రీ శ్రీకాకుళానికి చేరువనగల విశాఖ నుండి కదా. ఈ చిత్రంలో భానుమతి, ఎం.ఎల్.వసంతకుమారి ఇతర గాయనీమణులు. ఘంటసాల ఒక పద్యాన్ని కూడ పాడారు. కాని అది ప్రస్తుతం అలభ్యం.

Video Courtesy:Sri Rajasekhar Raju





చిత్రం: సాహసవీరుడు-1956 (డబ్బింగ్)

గానం: ఘంటసాల, జిక్కీ

సంగీతం: రామనాథన్

రచన: శ్రీశ్రీ

దర్శకత్వంః డి.యోగానంద్



పల్లవి: ఘంటసాల: కానిపనులు చేస్తే మరియాదా కాదు కాదయా -2


అయ్యా కాదు కాదయా

ఘంటసాల-జిక్కీ: అయ్యా కాదు కాదయా



చరణం: ఘంటసాల: నాగులప్పా నంగిరికుప్పా, కూచిలాంటి పోకిరి తుప్పా


ఊళ్ళుకొడితే నిన్నే విడిచేనా దగా చాలయా


అయ్యా దగా చాలయా -2



చరణం: ఘంటసాల కేటుమారి తుంటరి దొంగా, కోట చెఱలో గంజి తాగగా -2

జిక్కీ: పాడుబతుకు బతికే జనులారా మేలుకోండయా


పాడుబతుకు, పాడుబతుకు, పాడుబతుకు


పాడుబతుకు బతికే జనులారా మేలుకోండయా


నేడే మేలుకోండయా -2

ఘంటసాల: కాలు విరిగే పరువులు మేలా, కన్నమేసే పని మనకేలా

జిక్కీ: కలలో కూడా వద్ధుగదయ్య, వద్దే వద్దయా -2


అయ్యా, వద్దే వద్దయా -2



చరణం: ఘంటసాల: ఊరుదోచీ బ్రతుకుట చాలూ..ఊ.. ఆ.. --2


ఎవరికైనా భయపడరాదు -2

జిక్కీ: కాడి పట్టీ బ్రతికే బ్రతుకే మేలు మేలయా -2


అయ్యా మేలు మేలయా, అయ్యా మేలు మేలయా -2

ఇద్దరు: కానిపనులు చేస్తే మరియాదా కాదు కాదయా -2


అయ్యా కాదు కాదయా, అయ్యా కాదు కాదయా


Thanks to Wickipedia and Ghantasala Galamrutamu-Patala Palavelli for providing useful information.

1, మే 2020, శుక్రవారం

మహిలో ఎపుడు - శ్రీరామభక్త హనుమాన్ (డబ్బింగ్) చిత్రం నుండి ఘంటసాల, బృందం

బసంత్ పిక్చర్స్ వారు 1948  లో నిర్మించిన హిందీ పౌరాణిక చిత్రం "శ్రీరామభక్త హనుమాన్" ను అదే పేరుతో  1958 లో డబ్బింగ్ చిత్రంగా తెలుగులో నిర్మించారు.  ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్.ఎన్. త్రిపాఠి. అతనే హనుమంతుని పాత్ర పోషించాడు. చిత్రకథను వాల్మీకి రామాయణం నుంచి తీసుకున్నారు.  ఈ చిత్రానికి దర్శకులు ట్రిక్ ఫోటోగ్రఫీ లో దిట్టయై పలు పౌరాణిక, ఫాంటసీ చిత్రాలకు దర్శకునిగా వ్యవహరించిన బాబూభాయ్ మిస్త్రీ.  ఈయన 1937 లో దర్శకత్వం వహించిన మొట్టమొదట ఫాంటసీ లేండ్ (ఖ్వాబ్ కీ దునియా) చిత్రంతో ఆయన ట్రిక్ ఫోటోగ్రఫీ కౌశల్యం సినీ రంగంలో మొదలయింది. ఈ చిత్రానికి ఘంటసాల నాలుగు పాటలు పాడారు. అందులో మూడు మాత్రమే లభ్యం. మాటలు, పాటలు మహాకవి శ్రీ శ్రీ వ్రాసారు. సంగీతం విజయభాస్కర్.  ఇందులో శ్రీరాముని మహిమను "మహిలో యెపుడూ" అనే గీతంలో కౌశికయాగ రక్షణం, అహల్యా శాపవిమోచనం, సీతాస్వయంవరం, శబరి ఆశ్రమ సందర్శనం, శ్రీరామ పట్టాభిషేకానంతరం సభలో హనుమ తన శ్రీరామభక్తిని నిరూపిస్తూ గుండె చీల్చి హృదయాంతరంగులైన సీతారాములను చూపించడం ఘంటసాల గానం చేయగా హృద్యంగా చిత్రీకరించారు. ఈ అమూల్యమైన దృశ్యఖండికను సమకూర్చినవారు "బేంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల" వారు. వారి ఉదాత్తమైన కృషికి నమోవాకములు.




నిర్మాణంః బసంత్ పిక్చర్స్ వారి

చిత్రం: శ్రీరామభక్త హనుమాన్ (డబ్బింగ్) - 1958

రచన: శ్రీ శ్రీ

సంగీతం: విజయభాస్కర్

గానం: ఘంటసాల

దర్శకత్వంః  బాబూ భాయ్ మిస్త్రీ



సాకీః ఘంటసాలః మహాసభన్ శ్రీరామ భక్తులే కోరీ చేరిరి నేడే


భక్తులకెందు తొలియాధారము రాముడే నిరతం సహాయం
పల్లవిః
మహిలో యెపుడూ చూడ రాముని మహిమ అపురూపం -2


మొరలను వినెడి ప్రభువుకదా! సీతావిభుడౌ కరుణాధార రాముని మహిమ అపురూపం



చరణంః ఘంటసాలః బాల్యమునందు విశ్వామిత్రుని వెంటజని అవలీల


బాణమొక్కటి వేసి వధించె చరు తాటక రాగా


రఘువీరుండే మహాకృపాళుడు యజ్ఞరక్షణదార రాముని


మహిమ అపురూపం


మహిలో యెపుడూ చూడ రాముని మహిమ అపురూపం



చరణంః ఘంటసాలః రాతిగ మారి పడీ అహల్యా గౌతముడీయ శాపం


దీనబంధుని చరణధూళిచే కనెను మానవరూపం


సతీ అహల్య కోరిన వరమే ఒసగెను సదా వుదార రాముని మహిమ అపురూపం


మహిలో యెపుడూ చూడ రాముని మహిమ అపురూపం



చరణంః ఘంటసాలః మిథిలలో సీతాస్వయంవర వేళనేతెంచే ధనుర్ధర 


వీరులా యీ శరధనుస్సును యెత్తలేక వీడగా


అచటనే లంకేశుడంతా ధనువు వంచగలేకపోగా


రాముడే శివ కార్ముకమును భంగ పఱచి క్రీడగా


అల్లుడాయెను మిథిలాపురికి - 2


పడెన్ సుమముల తార రాముని మహిమ అపురూపం


మహిలో యెపుడూ చూడ రాముని మహిమ అపురూపం



చరణంః ఘంటసాలః ఎంతో భక్తిని శబరి యిచ్చిన యెంగిలి పండ్లను కోరి


చాలభక్తితో రామచంద్రుడు స్వీకరించెను కాదే


శ్రీరామునికి భేదభావమే లేదూ కదా జగాన రాముని మహిమ అపురూపం


మహిలో యెపుడూ చూడ రాముని మహిమ అపురూపం



చరణంః ఘంటసాలః భక్తాళిన్ దయబూనీ వడిన్, నీవే కావగలేవో 


భక్తాళిన్ దయబూనీ వడిగా, నీవే కావగలేవో 


సంతోషముగా స్వామీ నేడే మదిలో దర్శనమీవో 


మదిలో దర్శనమీవో, జయజయజయ శ్రీరాం
సాకీః ఘంటసాలః ఓ! రఘుపతి రాఘవ రాజా రాం పతీత పావన సీతారాం

బృందంః రఘుపతి రాఘవ రాజా రాం పతీత పావన సీతారాం - 4


Thanks to Sri Kolluru Bhaskar Rao garu of Ghantasala Galamrutamu, Wickipedia and You Tube for providing the information on the movie.  Heartfelt thanks to "Bank of Sri Ghantasala" for uploading the valuable video clip of the song. This blog is used for entertainment purpose only and there is no commercial intent.

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన "క" నుంచి "జ" చిత్రాలు

చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1953 (2) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొండవీటి దొంగ(డ)-1958 (1) చి-కొడుకు కోడలు-1972 (1) చి-కోటీశ్వరుడు (డ)-1970 (1) చి-గంగా గౌరీ సంవాదము(డ)-1958 (1) చి-గాంధారి గర్వభంగం(డ)-1959 (2) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1)

మాస్టారు పాడిన "ట" నుంచి "న" చిత్రాలు

చి-టింగ్ రంగా-1952 (5) చి-టైగర్ రాముడు-1962 (1) చి-టౌన్‌ బస్ (డ)-1957 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తలవంచని వీరుడు(డ)-1957 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (2) చి-దశావతారములు(డ)-1962 (1) చి-దసరా బుల్లోడు-1971 (1) చి-దసరాబుల్లోడు-1971 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (6) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొంగ రాముడు-1955 (2) చి-దొంగనోట్లు (డ)-1964 (2) చి-దొరబాబు-1974 (3) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (2) చి-నిర్దోషి-1967 (1)

మాస్టారు పాడిన "ప" చిత్రాలు

చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (4) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (3) చి-పల్లెటూరు-1952 (11) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (6) చి-పిచ్చి పుల్లయ్య-1953 (2) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెంపుడు కొడుకు-1953 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (11) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రాయశ్చిత్తం(డ)-1962 (3) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (3) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1)

"బ, భ, మ" - చిత్రాలు

చి-బంగారు గాజులు-1968 చి-బండ రాముడు-1959 చి-బందిపోటు-1963 చి-బడి పంతులు-1972 చి-బభ్రువాహన-1964 చి-బలిపీఠం-1975 చి-బలే బావ-1957 చి-బాలనాగమ్మ-1959 చి-బాలభారతం-1972 చి-బాలరాజు కథ-1970 చి-బాలరాజు-1948 చి-బాలసన్యాసమ్మ కథ-1956 చి-బావమరదళ్ళు-1961 చి-బికారి రాముడు-1961 చి-బొబ్బిలి యుద్ధం-1964 చి-బ్రతుకుతెరువు-1953 చి-భక్త అంబరీష-1959 చి-భక్త జయదేవ-1961 చి-భక్త తుకారాం-1973 చి-భక్త రఘునాథ్-1960 చి-భక్త రామదాసు-1964 చి-భక్త శబరి-1960 చి-భట్టి విక్రమార్క-1960 చి-భలే అమ్మాయిలు-1957 చి-భలేపాప-1971 చి-భాగ్యదేవత-1959 చి-భాగ్యరేఖ-1957 చి-భాగ్యవంతులు (డ)-1962 చి-భామా విజయం-1967 చి-భీమాంజనేయ యుద్ధం-1966 చి-భీష్మ-1962 చి-భూకైలాస్-1958 చి-భూలోకంలో యమలోకం-1966 చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 చి-మంచి మనసులు-19 చి-మంచిరోజులు వచ్చాయి-1972 చి-మదన మంజరి(డ)-1961 చి-మనదేశం-1949 చి-మనసు మమత చి-మనుషులు-మమతలు-1965 చి-మరపురాని కథ-1967 చి-మర్మయోగి-1964 చి-మల్లీశ్వరి-1951 చి-మహాకవి కాళిదాదు-1960 చి-మహామంత్రి తిమ్మరుసు-1962 చి-మాయాబజార్-1957 చి-మూగ మనసులు-1964 చి-మోహినీ భస్మాసుర-1966

మాస్టారు పాడిన "య, ర, ల, వ" చిత్రాలు

చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (2) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (3) చి-రణభేరి-1968 (2) చి-రత్నగిరి రహస్యం (డ)-1957 (2) చి-రత్నమాల-1948 (1) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (5) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-లైలా మజ్ను-1949 (5) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాలి సుగ్రీవ-1950 (2) చి-వాల్మీకి-1963 (2) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విప్లవ స్త్రీ (డ)-1961 (1) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరఖడ్గము(డ)-1958 (1) చి-వీరాంజనేయ-1968 (2) చి-వీరాభిమన్యు-1965 (9) చి-వెలుగు నీడలు-1961 (4)

మాస్టారు పాడిన "శ,ష" చిత్రాలు

చి-శకుంతల-1966 (9) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శభాష్ సత్యం-1969 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (2) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వల్లీ కల్యాణం (డ)-1962 (1) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (3) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణతులాభారం-1966 (5) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జునయుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీమతి-1966 (3) చి-శ్రీరామభక్త హనుమాన్ (డ)-1958 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీశైల మహత్యం(డ)-1962 (1) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2)

సహగాయనీ గాయకులు

గా-L.R.ఈశ్వరి తో (1) గా-M.S.రామారావు-పి.సుశీల తో (1) గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (7) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (138) గా-ఘంటసాల-బృందం (4) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (10) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (15) గా-పి.లీల తో (25) గా-పి.లీల-బృందం తో (1) గా-పి.సుశీల తో (76) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పి.సుశీల-వసంత తో (1) గా-పిఠాపురం తో (2) గా-బహుగళం తో (2) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (45) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (4) గా-సి.కృష్ణవేణి-బృందం తో (1) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1) సం-S.L.మర్చెంట్-M.Sశ్రీరామ్ (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (7) సం-ఆదినారాయణరావు (7) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (3) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎ.ఎం.రాజా (2) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (13) సం-ఎస్.రాజేశ్వరరావు (1) సం-ఓగిరాల (4) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (3) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-కె.వి.మహదేవన్ (17) సం-గాలి పెంచల (7) సం-ఘంటసాల (140) సం-చక్రవర్తి (1) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (4) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (4) సం-టి.వి.రాజు (34) సం-టి.వి.రాజు-దినకరరావు (5) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-నిత్యానంద్ (3) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.ఆదినారాయణరావు (3) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (48) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (15) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయభాస్కర్ (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విజయాకృష్ణమూర్తి (1) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్-పామర్తి (1) సం-సాలూరు (49) సం-సాలూరు-గోపాలం (2) సం-సి.ఆర్.సుబ్బురామన్ (17) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (20) సం-హనుమంతరావు (2)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (16) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (27) ర-ఆరుద్ర (48) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (20) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (4) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (7) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (15) ర-తిక్కన (3) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (11) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (5) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (42) ర-బమ్మెఱ పోతన (3) ర-బలిజేపల్లి (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (6) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (9) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (34) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సదాశివబ్రహ్మం (4) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (78) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (8) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1)