వాహినీ వారి మల్లీశ్వరి. ఇది దేవులపల్లి వారి తొలి సినిమా. వారి పాటలు-మాటలు, ర'సాలూరు రాజేశ్వర రావు గారి కమ్మని బాణీలు, ఎన్.టి.ఆర్., భానుమతిల అద్భుత నటన, ఘంటసాల-భానుమతి గార్ల విలక్షణమైన గాన పటిమ అన్నీ కలబోసిన రాగేశ్వరి మల్లీశ్వరి. శ్రీ కృష్ణ దేవరాయలు పాలించే విజయనగరానికి సమీపాన నివసించే పల్లెటూరి యువ ప్రేమికులు మల్లి, నాగరాజు. తెలియక వెటకారానికి మారువేషంలో వున్న రాయలు, పెద్దనలతో రాణివాసం పల్లకి కోరి, తద్వారా ప్రేమికులు విడిపోయి, విరహ వేదన అనుభవిస్తారు. అలనాడు మహాకవి కాళిదాసు ప్రేమికుల సంకేతాలను 'మేఘసందేశం' గా రచించగా, ఈ చిత్రంలో నాయికా నాయకుల నడుమ తొణికిసలాడే ప్రణయ స్పందనా తరంగాలను 'ఆకాశ వీధిలో హాయిగా' తేలియాడే మబ్బు తునకతో పంపారు శ్రీ కృష్ణ శాస్త్రి గారు. అంతేకాదు ఈ మల్లీశ్వరి మేఘమాల నిజంగానే దేశదేశాలు తిరిగింది, చైనాతో సహా. సాలూరివారికిష్టమైన ఈ చక్కని ఈ పాటను రాగ మాలిక గా భీంపలాస్, కీరవాణి, హంసానంది రాగాలలో కూర్చి ఘంటసాల, భానుమతి గార్లతో పాడించారు సాలూరు వారు.
ఈ పాట గురించి ఆకాశవాణి జనరంజని కార్యక్రమంలో శ్రీ ఘంటసాల మాస్టారు మాట్లాడుతూ ఇలా అన్నారు. (క్రింది ఆడియో ఫైలు క్లిక్ చేయండి.)
ఈ పాట గురించి ఆకాశవాణి జనరంజని కార్యక్రమంలో శ్రీ ఘంటసాల మాస్టారు మాట్లాడుతూ ఇలా అన్నారు. (క్రింది ఆడియో ఫైలు క్లిక్ చేయండి.)
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
~ మాస్టారి మాటలు ~
"తరువాత మల్లీశ్వరి చిత్రం. ఈ చిత్రంలో నేను పాడేటప్పుడు నాకు కలిగినటువంటి అనుభూతుల్ని, ఆనందం చెప్పలేనటువంటి పరిస్థితి. అందులో రాజేశ్వర రావు గారు సమకూర్చినటువంటి ’ఆకాశ వీధిలో’ అనేటటువంటి పాట భానుమతి తోటి కలిసి పాడినప్పుడు, ఈ పాట ఎంతో జనాదరణ పొందాలి, అది గాకుండా ఈ మేఘసందేశం అనేటువంటి ఆ సందేశాన్ని, కృష్ణశాస్త్రి గారు రచించినటువంటి భావాన్ని పోకుండా చక్కగా గానం చేయాలనే కుతూహలంతో ఎంతో శ్రద్ధ వహించి నేను పాడాను. ఆ పాడినందుకు భగవంతుడి ఆశీర్వాదాలతో ఆ సాంగ్ ఎంతో ప్రచారానికొచ్చి, బహుళ ప్రచారం పొంది మంచి కీర్తి ప్రతిష్టలు నాకు సంపాదించి పెట్టాయి. ఆ పాట ’ఆకాశ వీధిలో’, మల్లీశ్వరిలో ’ఆకాశ వీధిలో’ అనేటువంటి పాట వినండి"
చిత్రం: మల్లీశ్వరి (1951)
భానుమతి: ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు
![]() |
దేవులపల్లి సాలూరు ఘంటసాల భానుమతి |
సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
భానుమతి: ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగి చూసేవూ..ఊ..ఊ
ఏడ తానున్నాడొ బావా | ఏడ తానున్నాడొ |
జాడ తెలిసిన పోయి రావా...ఆ..ఆ..
చందాల ఓ మేఘమాలా ఆ.ఆ..
ఘంటసాల: గగన సీమల తేలు ఓ! మేఘమాలా..
మావూరు గుడిపైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైన నాతో..
మనసు చల్లగ చెప్పి పోవా...
మనసు చల్లగ చెప్పి పోవా...
నీలాల ఓ! మేఘమాలా ఆ..ఆ.
రాగాల ఓ! మేఘమాలా
భానుమతి: మమత లెరిగిన మేఘమాలా..ఆ... | మమత |
నా.. మనసు బావకు చెప్పి రావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు | ఎన్నాళ్ళు |
ఎదురు తెన్నులు చూసెనే... బావకై
చెదరి కాయలు కాసెనే ఏ..ఏ..
నీలాల ఓ! మేఘమాలా ఆ..ఆ..
రాగాల ఓ! మేఘమాలా
ఘంటసాల: మనసు తెలిసిన మేఘమాలా..ఆ..
మరువలేననీ చెప్పలేవా మల్లితో
మరువలేననీ చెప్పలేవా
కళ్ళు తెరచిన గాని కళ్ళూ మూసిన గాని | కళ్ళు |
మల్లి రూపే నిలిచెనే నా చెంత
మల్లి మాటే పిలిచెనే
భానుమతి: జాలి గుండెల మేఘమాలా..ఆ..
బావ లేనిదీ బ్రతుకజాలా..
జాలి గుండెల మేఘమాలా
కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని
వానజల్లుగ కురిసిపోవా..
ఆనవాలుగ బావ మ్రోల