8, డిసెంబర్ 2012, శనివారం

పరుగులు తియ్యాలి గిత్తలు ఉరకలు వెయ్యాలి - మల్లీశ్వరి నుండి

సురసాలను ఆస్వాదించే రసికతగల సంగీతాభిమానులకు 1951 లో విడుదలైన మల్లీశ్వరి చిత్రం ఆనాడే కాక, ఈనాటికీ అంతే ఆనందాన్ని కలిగిస్తుంది.  ఈ చిత్రంలో స్వరాల ర'సాలూరు రాజేశ్వ(స్వ)రం వినిపిస్తుంది, సహజకవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి కవితా పటిమ కనిపిస్తుంది. వాహినీ వారి ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రం నిర్మాణం వెనుక ఒక సంఘటన వుంది. అదేమిటంటే, ర్శ-నిర్మాత ియాహబ్ ్కే అవ్డంద్న ి ్షిీయు బి.ఎన్. రెడ్డి (్మి్డి ింహ్డి) ఒకసారి ఒక చిత్ర నిర్మాణ విషయమై హంపి లోని విజయనగరం వెళ్ళినపుడు శ్రీ కృష్ణ దేవరాయలు మసలిన ప్రదేశం ఇదే కదా అన్న స్ఫురణకు వచ్చి, ఆ సన్నివేశాన్ని ఒక ప్రేమ కథతో ముడిపెట్టి చిత్రంగా తియ్యాలనే ఆలోచన వచ్చింది. ఆ తలంపుకు రూప కల్పన మల్లీశ్వరి.  గతంలో ఆకాశ వీధిలో పాట గురించి, మల్లీశ్వరి షష్ఠి పూర్తి గురించి పోస్టు చేసాను. ప్రస్తుత పోస్టులో మరొక పాట. అదే, దేవులపల్లి వారి సహజ కవనముద్రలో ద్వంద్వ పదాల వాడుకతో చెప్పుకోదగిన పాట "పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వెయ్యాలి". ఈ పాట వింటే అందులో 'బిరబిర', 'చరచర', 'గుంపులు గుంపులు', 'బారులు బారులు' వంటి పదాలు వారి సంతకాలే అని చెప్పకనే చెబుతాయి. ఆరోజుల్లో పల్లె నుండి పట్నానికి ఎడ్ల బండ్ల మీద తిరణాలు వెళ్ళేవారు. ఆ సన్నివేశంలో ప్రేయసీ ప్రియులు  పాడుకుంటూ వెళ్ళే ఈ పాటను సాలూరు వారు మధ్యమావతి, బృందావన సారంగ రాగాలతో కూర్చారు. ముఖ్యం గా ఘంటసాల మాస్టారు, భానుమతి 'పోటీపడి పాడి అలలుగా సాగే, అందమన, ఆహ్లాదకరమైన ఆలాపనలతో ఈ పాటకు వన్నెలు తెచ్చారు' అంటే అతిశయోక్తి కాదు.    



పరుగులు తియ్యాలి ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత 

సంగీత సాహిత్య సమలంకృతం 
దేవులపల్లి   సాలూరు  ఘంటసాల  భానుమతి



చిత్రం:మల్లీశ్వరి (1951)

రచన: దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి 

సంగీతం: సాలూరు రాజేశ్వర రావు 

గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు,భానుమతీ రామకృష్ణ 



పల్లవి: భానుమతి: ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

ఘంటసాల: హెయ్! పరుగులు తియ్యాలి ఒ గిత్తలు ఉరకలు వేయాలి 


హెయ్! పరుగులు తియ్యాలి ఒ గిత్తలు ఉరకలు వేయాలి 

భానుమతి: హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి


మన ఊరు చేరాలి ఓ…


హోరు గాలి, కారు మబ్బులు - 2


ముసిరేలోగా,మూగేలోగా ఊరు చేరాలి, మన ఊరు చేరాలి 



చరణం: భానుమతి: గలగల గలగల కొమ్ముల గజ్జెలు 


ఘణఘణ ఘణఘణ మెళ్ళో గంటలు 

ఇద్దరు: ఆ..ఆ..ఆ.ఆ..గలగల గలగల కొమ్ముల గజ్జెలు 


ఘణఘణ ఘణఘణ మెళ్ళో గంటలు 


వాగులు దాటి,వంకలు దాటి ఊరు చేరాలి, మనఊరు చేరాలి 



చరణం: ఘంటసాల: ఆ..ఆ..ఆ..ఆ.. అవిగో అవిగో..


నల్లని మబ్బులు గుంపులు గుంపులు


తెల్లని కొంగలు బారులు బారులు అవిగో.. అవిగో..


నల్లని మబ్బులు గుంపులు గుంపులు


తెల్లని కొంగలు బారులు బారులు అవిగో.. అవిగో..

భానుమతి: ఆ..ఆ..ఆ..పచ్చని తోటలు, విచ్చిన పూవులు 


మూగే గాలుల తూగే తీగలు అవిగో…


కొమ్మల మూగే కోయిల జంటలు 


ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో.. అవిగో..

ఇద్దరు: అవిగో.. అవిగో..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

కృతజ్ఞతలు:  ఉపోద్గాతము లో కొంత భాగము మ్యూజికాలజిస్టు రాజా గారి ఆపాట(త) మధురం నుండి సేకరించడమైనది. వారికి ధన్యవాదాలు. Thanks to Trinidad256 for the You Tube video.

6, డిసెంబర్ 2012, గురువారం

ఐనవారు నాకెవరు ఓహో విను – చివరకు మిగిలేది! చిత్రం నుండి ఘంటసాల

1960 సంవత్సరంలో విడుదలైన మంజీరా సంస్థ నిర్మించిన “చివరకు మిగిలేది!” చిత్రం నుండి ఘంటసాల పాడిన “ఐనవారు నాకెవరు ఓహో విను” అనే ఈ ఏకగళగీతం రచన కొసరాజు, స్వరపరచినది  అశ్వత్థామ. ఈ చిత్రంలో తారాగణం బాలయ్య, సావిత్రి, కాంతారావు, జమున, ప్రభాకర రెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత వి.పురుషోత్తమరెడ్డి మరియు దర్శకుడు జి.రామినీడు.




4, డిసెంబర్ 2012, మంగళవారం

ఘంటసాల గానంలో హిందోళరాగ వైభవం

మాస్టారికి జన్మదిన శుభాకాంక్షలు.

ఈ రోజు సినీ సంగీత ప్రియులకు పర్వ దినం. ఆబాల గోపాలాన్ని తన కంచు కంఠంతో ఊగిసలాడించి, ఉర్రూతలూగించి, ఊయలలూపిన గాన గంధర్వుడు, గాయకులలో 'న భూతో న భవిష్యతి' గా వాసికెక్కిన మన గళవేల్పు మాస్టారి 90 వ పుట్టినరోజిది.  ఏ అమరలోకంలో వారీ వేళ సురలకు స్వరలహరుల కచేరీ ఇస్తున్నారో ప్రస్తుతం.  త్రిస్థాయిలలో పాడటమే కాక, అద్భుతమైన బాణీలు కట్టి, తెలుగు పద్యాలకు తన శైలిలో, తన ప్రతిభతో క్రొత్త వరవడిని దిద్ది పద్యమంటే ఇలా పాడాలని సూత్రీకరించిన మహా మేధావి, అయినా నిగర్వి మన మాస్టారు.  ఇదివరకు వ్రాసిన పోస్టులలో మలయ మారుతం, దేశ్, పంతువరాళి రాగాలలో మాస్టారు గానం చేసిన పాటల గురించి తెలుసుకున్నాం. ఈ సారి మరొక క్రొత్త రాగం హిందోళం గురించి తెలుసుకుందాం. ఈ పోస్టులో మొదటి భాగంగా రెండు చిత్రాల నుండి (సతీ అనసూయ, లవకుశ) ఎక్కువ వివరాలతో వ్రాయడం జరిగింది. త్వరలో రెండవ భాగంలో హిందోళం లో స్వల్ప వివరణ తో ఎక్కువ పాటలు క్రోడీకరిస్తాము. ముందుగా మొదటి భాగం లో హిందోళ రాగాన్ని ఆస్వాదించడానికి ప్రియ మిత్రులు చంద్రమౌళి గారి ఘంటసాల-రాగశాల లోకి అడుగిడదామా?


అందాలు చిందించే హిందోళం సర్వ కోమలస్వరాల తీయని రాగం. కొన్ని రాగాలు ఏ కారణంగా మనసుకు హత్తుకుపోతాయో చెప్పడం కష్టం.  అందులోనూ, తన ఉత్పత్తికి కారణమైన జనకరాగం కంటే అతి ప్రసిద్ధి గాంచిన జన్యరాగాల మాటకొస్తే, హిందోళం, మోహన, మధ్యమావతి, వలజి, అమృతవర్షిణి వంటి రాగాలు, తమ తండ్రుల తలనెక్కి కూర్చొని తారసిల్లుతాయి. మన సంగీత శాస్త్రం చెప్పే 12 స్వరాలలో ఐదే స్వరాల నాద స్వర సంధాన సంసారంలో ఆనంద సాగరాలని సృష్టించే శక్తి ఈ ఔడవ రాగాలది.  హిందోళ రాగంలో  స-గ-మ-ద-ని స్వరముల మధ్యనున్న దూరం ఎక్కువగా వుండడమే ఆ రాగరంజకత్వానికి  కారణమా? ఖచ్చితంగా చెప్పలేము. ప్రత్యేకించి, హిందోళరాగం ఒలికించే గంభీర భావాన్ని శ్రీరాముని నడకలో కన్న త్యాగయ్య ఒక్క సామజవరగమనా కృతిలో ఆ రాగాన్ని పోతపోశారా అనిపిస్తుంది. 

హిందోళ రాగ లక్షణం

హిందోళరాగం, అన్ని సంగీత ప్రకారాలలోనూ బహు ఖ్యాతివంతమైన ఔడవ సమరూప రాగం (symmetrical pentatonic). హనుమత్తోడి మేళకర్త జన్యమైన
(నటభైరవి జన్యమనియూ వాదన కలదు) ఈ రాగం యొక్క మూర్చన: షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం (సగ211ని2). "గ ద ని" స్వరాలు కంపితాలు. మధ్యమ స్వరకంపితం దు. స-మ, గ-ద, మ-ని, మ-స అనే జీవస్వరాలే సంవాదులు. రక్తి రాగమై, జనరంజకమై త్రిస్థాయిలో పాడుకోదగిన కరుణ, భక్తి, శృంగార రసాలకు ప్రసిద్ధిగాంచిన రాగమిది. హిందూస్తానీ శాస్త్రీయ సంప్రదాయంలో  మాల్కోన్స్‍ అనబడే ఈ రాగాన్ని కచేరీల్లో అర్ధరాత్రి దాటాక వినిపించినా, కర్ణాటక పద్ధతిలో ఈ రాగం సర్వకాలానుసరణీయం. గ్రహభేదం చేసినితే పుట్టే ఇతర రాగములు: మోహన, శుద్ధసావేరి, ఉదయరవిచంద్రిక (శుద్ధ ధన్యాసి) మరియు మధ్యమావతి (అన్నీ ఘంటసాల ప్రియరాగాలే). అతి ప్రసిద్ధమైన హిందోళ రాగంలో పలువురు ప్రముఖ వాగ్గేయకారులు చక్కని రచనలు చేసారు. ఉదాహరణకు - సామజవరగమనా, మనసులోని మర్మము (త్యాగరాజు). సామజవర గమనా కృతిని మాస్టారు కలకత్తాలో ఇచ్చిన కచేరీలో పాడారు. "మనసులోని మర్మము" కీర్తనను చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై పరంపరలో కొందరు శుద్ధ ధైవతానికి (ధ1) బదులుగా చతుశ్రుతి ధైవతంతో (ధ2) పాడినా అది రక్తి కట్టలేదు. ఈ రాగంలో మరికొన్ని రచనలు: గోవర్ధన గిరీశం (ముత్తుస్వామి దీక్షితార్‍), భజరే గోపాలం (సదాశివ బ్రహ్మేంద్ర), పద్మనాభ పాహి (స్వాతి తిరునాళ్‍), దేవదేవం భజే మరియు కొండలలో నెలకొన్న (అన్నమయ్య), మామవతు శ్రీ సరస్వతి (మైసూర్ వాసుదేవాచార్) మరియు సామగానలోలే (జి.ఎన్‍.బి.), చింతయామి జగదంబాం (జయచామరాజేంద్ర ఒడెయర్) మొదలైనవి.

మాస్టారు పాడిన సామజవర గమనా ఆడియో: మూలం - ఘంటసాల గాన చరిత 
(అందించిన వారు శ్రీ శ్రీనాథ్ జొన్నవిత్తుల)


ిందోవం

ి్ర ్శ్వలో ్ర అంశం, ాంశ ావ్ఫం, ఆయ్నివేశి్లా, ఏ ్ని, ఏ ్థాయిలో, ా వితే ్కువ ొంు, నే అవాహతో ్త్రీయ ు య్రయోిం, స్వ్తక్త  ాణతోనో, స్వ ితోనో ్రయోచే్తరు. ఘంటసాల తన శాస్త్రీయ సంగీత నైపుణ్యంతో, భావ నటన కళాభిజ్ఞతతో శాస్త్రీయ రాగాల మూల సౌందర్యాన్ని నిలుపుకుని, కొంగ్రొత్త ప్రయోగాలతో కొన్ని ఉనికిలోవున్న రాగాలకు మరింత వన్నె తెచ్చారు. ఆయన అంతిమ గానార్పణ అయిన "భగవద్గీత" లో సుమారు 50 రాగాలనుపయోగించారు. ఆయన చలన చిత్ర గానంలో వాడిన ఎన్నో రాగాలను భగవద్గీతలో వాడలేదు. తన స్వీయ దర్సకత్వంలో బాణీలు కూర్చిన చిత్రాలలో ప్రతి చిత్రం లోను 10 నుండి 20 వరకు రాగాలకు అధికంగా నాద వైవిధ్యమున్నది. అందులో ఎన్నో చిత్రాలలో తరచుగా వాడిన కొన్ని ప్రముఖ రాగాలలో పేర్కొనదగినది హిందోళ రాగం.  ఆయన ప్రతిభాకుంచం లో స్వరాల తెరపై చిత్రించిన హిందోళ రాగ వైవిధ్యాన్ని, వైభవాన్ని జ్ఞప్తి చేసుకుంటూ, రసికులతో ఆ ఆనందాన్ని పంచుకోవడమే ప్రస్తుత ప్రయత్నం. హిందోళ రాగాధారితమైన ఘంటసాల స్వరకల్పనలు, గీతాలు, పద్యాలు, శ్లోకాలు, నేపథ్య గానాలు మరియు ఆలాపనలు ఎన్నో వున్నా, అన్నిటినీ ఇక్కడ చెప్పుకోలేము. ముఖ్యంగా కొన్నిటిని పరిశీలిస్తూ, ఆ రాగ సత్వాన్ని ఆయన భక్తీ పాటలలో, ప్రేమగీతాలలో, పద్య గాయనంలో ఎలా వివిధ రసాలను ఆవిష్కరింప జేసారో గమనించడం ఆసక్తికరమైన సంగతి. మరిన్ని విశేషాలు తరువాతి భాగంలో చూద్దురుగాని.

స్తుతి వెల్లివిరియ - సతీ అనసూయ లోని గానం
          ప్రఖ్యాత సంగీతదర్శకుల స్వరసారథ్యంలోఎన్నోమంచిపాటలను వినిపించిన మాస్టారు తమ స్వీయ సంగీత దర్శకత్వంలో "సతీ అనసూయ" (1957) వంటి సామాన్యమైన చిత్రానికి కూడ అసామాన్యమైన, శాస్త్రీయతను పుణికిపుచ్చుకొన్న "శ్రిత కమలాకుచ మండలా" అను ఒక జయదేవ అష్టపదిని అత్యద్భుతంగా గానం చేశారు. ఏ కథానాయకునికీ దక్కని ఈ నేపథ్య గానావకాశాన్ని పొందిన భాగ్యశాలి, నారద పాత్రధారి పద్మనాభం. "కలిత లలిత వనమాలా" అనే ఉత్తరచరణ భాగానికి చేసిన ఆలాపన మరియు నెరవల్‍ వివిధ విధాలుగా సాగి హిందోళరాగ గమక వైభవమంతా రెండు నిముషాలలో ఆ స్వరార్ణవ కుంభసంభవునికి ఆపోశనం అయిపోయింది. ఇది తనివితీర విని నెమరు వేసుకోవలసిన వైభవానుభవమే తప్ప వర్ణించడం చప్పడిమాటలే అవుతాయి. ఆలాపనలో పై షడ్జమంలో విహరిస్తూ, అలా పై స్థాయి మధ్యమాన్ని చేరి, అక్కడే నిలబడి  "గదమగస, సమగసని, నిగసనిద, దసనిదమ, మనిదమగ, గదమగస", మొదలైన విశిష్ట గమకాలతో ఆలాపనని కొనసాగించి,  "కలిత లలిత వనమాలా" అను చరణభాగాన్ని మూడురీతుల నెరవల్‍ చేయడంలో అటు నారదసంగీత ప్రతిభ, ఇటు ఘంటసాల శాస్త్రీయగాయన సామర్థ్యం రెండూ ద్యోతకమవుతాయి. అయితే, సంపూర్ణ శాస్త్రీయ పద్దతిలో, ఏ అన్యస్వర ప్రయోగమూ లేకుండా పాడిన ఈ పాట  ఘంటసాల హిందోళరాగ గాయనానికి దీటురాయైనప్పటికీ ఎందుచేతనో మఱుగునబడింది.
 జయజయ దేవహరే ఆడియో: సతీ అనసూయ నుండి 

లవకుశ చిత్రంలో హిందోళరాగం : ప్రత్యేకత-ప్రయోగాలు
          లవకుశ లోని "సందేహించకుమమ్మా" పాట సన్నివేశంలో, అనుమానాందోళితయైన సీతమ్మను ఓదార్చి, సమాధాన భావాన్ని సృష్టించే సందర్భంలో  "గమగసదా దనిసాస" (సందేహించకుమమ్మ) అని మంద్ర ధైవత మృదు  సంచారంతో  ప్రారంభంచేస్తూ, "దని సమమమ మగగ" (రఘురాము ప్రేమను) అన్నప్పుడు మనకు ఈ రాగం హిందోళమని తెలిసినా, ఏ హిందోళ రాగాధారితమైన పాటలోనూ లేని కొత్తధాటి వినిపిస్తుంది. అలాగే చరణంలో "మరోభామతో" అన్న పదాలకు "దనిసమామమా" అని స్వరాలు కూర్చారు మాస్టారు. పై స్థాయిలో "నా కావ్యమ్మె వృథయగు" అన్నప్పుడు "దని సమగాస సగనిస" అనే స్వరాలను వేశారు. ప్రత్యేకతంతా ఇక్కడే. "సగమదనిసా" అనే ఆరోహణంలో ఘంటసాల "సమదనిస" అంటూ గాంధారాన్ని దాటి అన్ని సంచారాల్లోని ఆరోహణంలో "సమసమగస" అనే ప్రయోగాలతో "సగమా" అనే అతి ప్రసిద్ధమైన వరసను వదలి ఒక సరికొత్త బాణీనే సృష్టించారు. అలాగే అవరోహణంలో గాంధారం వెనుకనున్న షడ్జమాన్ని స్పృశించక "గనిస" అనే దాటు గమకాలతో, ఆ "సమ" మరియు "గని" ల ప్రతిఫలన రూపాన్ని అన్వయించిన ఈ పాట అతినవ్య ప్రయోగమని చెప్పవచ్చు.
          ఆశ్చర్యకరమైన మరో విశేషం ఏమిటంటే, హిందోళ రాగంలోలేని "పంచమాన్ని" తాకి ఒక వినూతనమైన మెరుపును సృష్టించడం.  ఈ ప్రయోగం మనకు "రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిననాడు" అనే రెండవ చరణాంత్యములోనూ, పాటను ముక్తాయంచేసే ఆలాపన చివరిభాగములోను మనకు వినిపిస్తుంది. "కూడిననాడు" పదాల పలుకును గమనిస్తే,  "మదనీదప మగమా" అను స్వరాలు వినిపిస్తాయి.  సాహిత్యపరంగా ఈ ప్రయోగం అసాధారణం. ఘంటసాల భావనైపుణ్యానికి ఇది మరొక నిదర్శనం. ఎందుకంటే ఆ "మరోభామతో" కూడుట అసంగతం కదా! హిందోళ రాగానికే అన్యస్వరమైన పంచమాన్ని ప్రవేశపెట్టి, రాగానికి ఏమాత్రమూ వ్యత్యాసం కలుగకుండా చేసిన, ఆ భిన్నస్వరప్రయోగం అత్యపూర్వం, అర్థగర్భితం. 
దేహిం్మ 

          ఇక "రామకథను వినరయ్య" పాటకొస్తే, ఇందులోని అకార సంచార తరంగాలను తాను కల్పించిన స్వరవిన్యాసాలనూ, పి.లీల మరియు పి.సుశీలల గళాలలో అద్భుతంగా సాధించారు మాస్టారు.  "సాసాస గమదని, సాసాస గమదని, సానిదమదని, నీదమగమని, దామగసనిస, గా మా దాని" అనే ప్రారంభిక నేపథ్య స్వరాలతో హిందోళరాగ ప్రధాన సంచారాలను సూచిస్తూ, "సానిదనిద మగ మామా" (రామకథను వినరయ్యా) అంటూ, హిందోళ జీవస్వరమైన మధ్యమ ప్రాధాన్యతతో పాటను ఆలపించడం గమనార్హం. "అయోధ్యానగరానికి" అనే భాగాన్ని సాకీ రూపంగా పాడించడం వలన పాట అర్థానుసారియై సాగుతూ ఎంతో హాయిగా వినబడతుంది. ఈనాడు మనకు నేపథ్యవాద్య భీకర, ధ్వన్యారణ్యంలో పదాలు వినిపించటంలేదు, వాటి అర్థాలు అవగతం కావడం లేదు. పాటయొక్క ఆ ముఖ్యభాగం దశరథుని భార్యల మరియు కుమారుల పేర్లు, స్పష్టంగా రాగభావయుక్తంగా వినిపించడానికి వీలుగా, మృదంగ-తాళలయాలను ఆపి, శృతిబట్టించి వినిపించిన విధానం ఆయనకున్న శ్రోత్రవిజ్ఞాన నైపుణ్యతకు నిదర్శనం. 
ు వియ్యా  

          అలా లవకుశులు  ఉత్సాహంతో పాడుతుండగా వారిని చూస్తున్న సీతాదేవి కనుపించినంతనే నేపథ్య స్వరాల తీరుమారి ఒక అంతర్గత విషాదఛాయ స్ఫురిస్తుంది. సంగీతదర్శకుడు ఈ భావవ్యంజనాన్ని ఎలా సాధించాడా అని హెచ్చరికగా గమనిస్తే, సీత ముఖం తెరమీద వికసిస్తూ కనిపిస్తుండగా వినిపించే నేపథ్యస్వరాలు ఇవి - "నిసనిసదా..మపదాదాపగమ మసనిదగమ". అలాగే రాముడు మిథిలానగర ప్రవేశము చేయనున్నాడు, ఇక సీతాకల్యాణమే కదా, ఏమిజరుగనున్నదో అనే ఆశ్చరభావంతో సీత కనిపించినంత,  "మదనకోటి సుకుమారుని గనుకొని మిథిలకు మిథిలయే మురిసినది" అన్న పదాలకు ముందుగా వచ్చే నేపథ్య వాద్యాలు పలికే స్వరాలు "సగమా దాగమా". ఈ స్వరవిన్యాసాలకు సంవాదిగా ఆ వేంటనే కనిపించే లవకుశుల దృశ్యానికే "దనిసా మాగసదనిసా" అనే శుద్ధ హిందోళ స్వరాలు వేయడంతో, మనకు సీతాదేవి భావసంఘర్షణ మెరుపులా క్షణంలో మాయమై, లవకుశుల ఆనందహిందోళమే వినిపిస్తుంది. రాగ,భావాలకు ఏ లోటూరాక, పంచమ ప్రయోగం ప్రయత్నపూర్వకంగా తెలుసుకొనాలే తప్ప స్పష్టంగా వినిపించక  రాగానికి భావ వైవిధ్యతను ఇమిడ్చిన వైఖరి అనన్య సామాన్యం. హిందోళంలో పంచమం వర్జ్యం గదా! ఒక శాస్త్రీయ కర్ణాటక పద్ధతి రాగంలోఅన్యస్వరాలు రావొచ్చునా? "ఇదిగో విని చెప్పండి భావమెలా వుందో?" అంటూ మాస్టారు ఒక నవ్యసృష్టిచేసి హిందోళమంటే ఇది అనిపించారు. 
            లవకుశులు ప్రప్రథమంగా శ్రీరామున్ని దర్శించినప్పుడు పాడిన శ్లోకం "శ్రీరాఘవం", మధ్యమస్వరం ప్రతిధ్వనించేలా, "సీతాపతిం" అనే పదాలకు నిషాద స్వరనిలకడ అలా పైస్థాయి మధ్యమం వరకు సోపానక్రమంలో హిందోళ రాగ స్వర సర్వస్వాన్ని లవకుశుల ఆనంద, ఆశ్చర్య, అద్భుత భావాలను రసవత్తరంగా పండించిన స్వరసంయోజనం ఘంటసాల రససిద్ధి.
          రాబోయే పోస్టులలో హిందోళ రాగాదారితమైన మరికొన్ని మాస్టారి మచ్చు తునకలు చూస్తారు. అంతవరకూ శలవు.
(For some reasons Google Chrome does not show the Telugu fonts properly. It looks good in Firefox and Internet Explorer). To get this article as PDF click the "Print Friendly" icon below and follow the instructions.

3, డిసెంబర్ 2012, సోమవారం

నీలకంధరా దేవా! దీనబాంధవా రావా!

్రి్ట్మ ి్ర ి్మాణ ్థ ఎ.వి.మ్‌. (ఎ.వి.మెయ్యప్పన్) ని్మింి ్తి ి్రస్ (1958).  ్గ్రాయు - న్‌.ి.ర్. (ావు), ఎ.న్‌.్. (ు) ియస్.వి.ర్. (ు) ింి ి్రం లో జమున మండోదరి గా, బి.సరోజా దేవి పార్వతిగా నటించారు.  ావ ివి ్ర్నచేి ్మిం్ని వొంి దేు. ిి ిి ్కుం ి ్డి నేమోి చేుం ు. ఆ శివిం్రి్టింి ్థమే ా పేరు పొందుతుంది.  ఈ ి్రిి ్ద్న్మర్.ర్శియర్.గోవ్ధ్చు.  ్ని ర్ హి్టే.  ి్రలో ్టు శివి్కి ు - దేవదేవ ి, దేవా! ిి, ్నో ్కి ద్యు గాగానం చేశారు.



చిత్రం: భూకైలాస్ (1958)

రచన: సముద్రాల రాఘవాచార్య (సీనియర్)

సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం

గానం: ఘంటసాల 





సాకీ: జయ జయ మహాదేవ శంభో సదాశివా...


ఆశ్రిత మందారా శృతిశిఖర సంచారా...





పల్లవి: నీలకంధరా దేవా! దీనబాంధవా రారా! నన్నుగావరా  | నీలకంధరా|


సత్యసుందరా స్వామీ, నిత్యనిర్మలా పాహీ | సత్యసుందరా |


నీలకంధరా దేవా! దీనబాంధవా రారా! నన్నుగావరా 





చరణం: అన్యదైవము గొలువా...ఆ..ఆ..ఆ..ఆ..


అన్యదైవము గొలువా నీదుపాదము విడువా | అన్య దైవమూ |


దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా | దర్శనమ్ము |


నీలకంధరా దేవా! దీనబాంధవా రారా! నన్నుగావరా 





చరణం: దేహియన వరములిడు దానగుణసీమా


పాహియన్నను ముక్తినిడు పరంధామా


నీమమున నీ దివ్యనామ సంస్మరణా


ఏమరక చేయుదును భవతాపహరణా


నీ దయామయ దృష్టి దురితమ్ములారా


వరసుధావృష్టి నా వాంఛలీడేరా


కరుణించు పరమేశ దరహాసభాసా


హరహర మహాదేవ కైలాసవాసా… కైలాసవాసా..





చరణం: ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా


నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా | ఫాలలోచన |


కన్నులనిండుగ భక్తవత్సల కానగ రావయ్యా | కన్నుల |


ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా | ప్రేమమీర |


ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా


నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా


శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా - 3

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (2) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (4) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (2) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (4) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (2) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కధ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (3) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (6) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (87) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (55) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (36) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (13) సం-ఓగిరాల (2) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (85) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (33) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (40) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (15) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (20) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (41) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (2) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (4) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (27) ర-బమ్మెఱ పోతన (2) ర-బలిజేపల్లి (1) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (29) ర-సదాశివ బ్రహ్మం (8) ర-సదాశివబ్రహ్మం (1) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (44) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1)