ఘంటసాల సంగీత దర్సకత్వంలో చిత్రపు నారాయణ మూర్తి 1961 లో నిర్మించిన భక్తి రస ప్రధాన చిత్రం శ్రీకృష్ణ కుచేల. కుచేలుని గా సి.ఎస్.ఆర్. (చిలకలపూడి సీతారామాంజనేయులు), శ్రీకృష్ణుని గా కె. రఘురామయ్య, ఇతర పాత్రలలో ముక్కామల, కన్నాంబ మొదలగువారు నటించారు. ఈ చిత్రం ఆర్ధికంగా విజయవంతం కాలేదు. శ్రీకృష్ణ కుచేల చిత్రానికి ఇంచుమించు అన్ని పద్యాలు, పాటలు వ్రాసినది పాలగుమ్మి పద్మరాజు. తన స్వీయ అనుభవంతో వ్రాసిన గాలివాన అనే కథ బహుళ ప్రచారం పొందింది. అందుకు ప్రతిగా ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీకృష్ణ కుచేల చిత్రానికి ఈయన వ్రాసిన ఈ 'చెఱ బాపగదయ్యా' గీతం యొక్క సాహిత్యం, దృశ్య ఖండికను ఇక్కడ పొందుపరుస్తున్నాను. విని ఆనందించండి.
Video Courtesy: Sri Rajasekhar Raju
చిత్రం: | శ్రీకృష్ణ కుచేల (1961) | ||
రచన: | పాలగుమ్మి పద్మరాజు | ||
సంగీతం: | ఘంటసాల | ||
గానం: | ఘంటసాల, బృందం. | ||
సాకీ | ఘంటసాల: | కరిరాజు గాచిన కారుణ్య సింధో, | |
పరమపదమిచ్చి ప్రహ్లాదు బ్రోచిన, | |||
ఓ ఓ ఓ దీనభందో, ఓ ఓ ఓ దీనభందో ఓ ఓ ఓ | |||
పల్లవి: | ఘంటసాల: | ఈ చెఱ బాపగదయ్యా | |
ఈ చెఱ బాపగదయ్యా, దయామయా, ఈ చెఱ బా..పగదయ్యా | |||
చరణం: | ఘంటసాల: | తాపాగ్ని జ్వాలా, దహించేను చాలా, | |
గోపాల రావా, మాపాలి దేవా | |||
బృందం: | మాపాలి దేవా, మమ్మేల రావా | ||
ఘంటసాల: | తాపాగ్ని జ్వాలా, దహించేను చాలా, | ||
గోపాల రావా, మాపాలి దేవా | |||
చల్లనైన జాలీవానా జల్లవేమి స్వామీ | |చల్లనైన | | ||
బృందం: | ఈ చెఱ బాపగదయ్యా, దయామయా, ఈ చెఱ బాపగదయ్యా | ||
చరణం: | ఘంటసాల: | వంతలదీర్చి, చెంతనుజేర్చే, తల్లివి నీవే, తండ్రివి నీవే | |
బృందం: | తల్లీ తండ్రీ నీవే, మా తల్లీ తండ్రీ నీవే | ||
ఘంటసాల: | వంతలదీర్చి, చెంతనుజేర్చే, తల్లివి నీవే, తండ్రివి నీవే | ||
కన్నీటి కడలీదాట, కర్ణధారి వీవే, | | కన్నీటి | | ||
బృందం: | ఈ చెఱ బాపగదయ్యా, దయామయా, ఈ చెఱ బాపగదయ్యా | ||
బృందం: | ఈ చెఱ బాపగదయ్యా, దయామయా, ఈ చెఱ బాపగదయ్యా |
కృతజ్ఞతలు: సమాచారము పొందుపరచిన ఘంటసాల గళామృతము మరియు వికిపీడియా బ్లాగులకు సినిమా పోస్టరు పొందుపరచిన బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి ధన్యవాదములు.