ఘంటసాల మాస్టారు పాడిన పాటలలో ఎక్కువ శాతం వ్రాసిన ఒకే ఒక కవి సి.నారాయణ రెడ్డి గారు. ఆయన తెలుగు చలన చిత్ర రంగప్రవేశం చేసిన చిత్రం గులేబకావళి కథ. ఆ చిత్రానికి ఆయన రాసిన మొదటి పాట "నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని" మాస్టారు, సుశీల పాడారు. మాస్టారు పాడిన విషాద గీతాలలో సినారె వ్రాసిన మల్లియలారా మాలికలారా మరపురాని గీతం. ఇది గౌతమి పిక్చర్సు పతాకం పై 1967 లో నిర్మించబడిన నిర్దోషి చిత్రం లోనిది. దీనికి సంగీత దర్శకత్వం మాస్టారే వహించారు. అయితే ఇదే పేరుతో మరొక సినిమా 1951 లో వచ్చింది దానికి మాస్టారు మరియు హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి గార్లు ఉభయులు సంగీత దర్సకత్వం వహించారు.ఒకసారి ఆకాశవాణి జనరంజని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఘంటసాల మాస్టారు 'మల్లియలారా' పాట గుఱించి, దానిని వ్రాసిన నారాయణ రెడ్డి గుఱించి ఇలా అన్నారు.
జనరంజని కార్యక్రమం లో ఘంటసాల ఉపోద్ఘాతం తో మల్లియలారా పాట ఇక్కడ వినండి.
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
ఆడియో మూలం: వీడియో నుండి
చిత్రం: | నిర్దోషి (1967) | |
రచన: | సి.నారాయణ రెడ్డి | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల | |
హు.హు.హుహ్హుహుహు | ||
పల్లవి: | మల్లియలారా, మాలికలారా మౌనముగా వున్నారా.. | |
మా కధయే విన్నారా! | ||
మల్లియలారా, మాలికలారా మౌనముగా వున్నారా.. | ||
మా కధయే విన్నారా! | ||
హు.హు.హుహ్హుహుహు | ||
చరణం: | జాబిలిలోనే జ్వాలలు రేగె, వెన్నెలలోనే చీకటి మూగె | |
పలుకగ లేక, పదములు రాక | ||
పలుకగా లేక, పదములే రాక | ||
బ్రతుకే తానే బరువై సాగె | ||
మల్లియలారా, మాలికలారా మౌనముగా వున్నారా.. | ||
మా కధయే విన్నారా! | ||
హు.హు.హుహ్హుహుహు | ||
చరణం: | చెదరిన వీణా రవళించేనా, జీవనరాగం చివురించేనా | |
చెదరిన వీణా రవళించేనా, జీవనరాగం చివురించేనా | ||
కలతలు పోయి, వలపులు పొంగి | ||
కలతలే పోయి, వలపులే పొంగి | ||
మనసే లో లో పులకించేనా | ||
మల్లియలారా, మాలికలారా మౌనముగా వున్నారా.. | ||
మా కధయే విన్నారా! | ||
మల్లియలారా, మాలికలారా మౌనముగా వున్నారా.. | ||
మా కధయే విన్నారా! |
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారి శ్రవణ ఖండికను భద్రపరచి అందరు అభిమానులుకు అందుబాటులో వుండేట్టు నిక్షిప్తం చేసిన ఘంటసాల గాన చరిత నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.