1966 సంవత్సరంలో
విడుదలైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన
శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ
" అనే ఈ ఏకగళం రచన దాశరథి, స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,
జమున, కాంతారావు, అంజలీదేవి, పద్మనాభం. ఈ చిత్రానికి నిర్మాత డి. రామానాయుడు మరియు
దర్శకుడు కె.కామేశ్వర రావు.
Thanks to Sri Nukala Prabhakar garu for providing the video clip.
| #000 | పాట: | ఓ చెలీ! కోపమా |
| | చిత్రం: | శ్రీకృష్ణ తులాభారం (1969) |
| | రచన: | పాట - సముద్రాల రాఘవాచార్య |
| | | పద్యం - నందితిమ్మన (పారిజాతాపహరణం నుండి) |
| | సంగీతం: | పెండ్యాల |
| | గానం: | ఘంటసాల |
| | | |
| | ప : | ఓ చెలి! కోపమా అంతలో తాపమా |
| | | సఖీ నీ వలిగితే నే తాళజాలా |
| | | ఓ చెలి! కోపమా అంతలో తాపమా |
| | | సఖీ నీ వలిగితే నే తాళజాలా |
| | | |
| | చ : | అందాలు చిందేమోము కందేను ఆవేదనలో.. |
| | | పన్నీట తేలించెదనే మన్నించవే... |
| | | ఓ చెలి! కోపమా... అంతలో తాపమా... |
| | | సఖీ నీ వలిగితే నే తాళజాలా |
| | | ఓ చెలి! కోపమా అంతలో తాపమా.. |
| | | సఖీ నీ వలిగితే నే తాళజాలా |
| | | |
| | చ : | ఏనాడు దాచని మేను ఈ నాడు దాచెదవేల? |
| | | దరిచేరి అలరించెదనే దయచూపవే... |
| | | ఓ చెలి! కోపమా అంతలో తాపమా |
| | | సఖీ నీ వలిగితే నే తాళజాలా |
| | | |
| | చ : | ఈ మౌనమోపగలేనే విరహాలు సైపగలేనే |
| | | తలవంచి నీ పదములకూ మ్రొక్కేనులే.... |
| | | ఓ చెలి! కోపమా అంతలో తాపమా |
| | | సఖీ నీ వలిగితే నే తాళజాలా |
| | | |
| | | నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా |
| | | చిన అది నాకు మన్ననయా, చెల్వగు నీ పదపల్లవమ్ము మ |
| | | త్తను పులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చునంచు నే |
| | | ననియెద! అల్క మానవుకదా యికనైన అరాళ కుంతలా! ఆ..ఆ. |