1950 సంవత్సరంలో విడుదలైన శోభనాచల & ఎం.ఆర్.ఏ. సంస్థ నిర్మించిన లక్ష్మమ్మ చిత్రం నుండి ఘంటసాల, బృందం పాడిన "అమ్మా లక్ష్మమ్మా దేవతై" అనే ఈ బృందగీతం రచన బాలాంత్రపు, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం సి.హెచ్.నారాయణరావు, మాలతి, సులోచన, సి.కృష్ణవేణి. ఈ చిత్రానికి నిర్మాత సి.కృష్ణవేణి మరియు దర్శకుడు గోపీచంద్. దీనిని వంగర, మద్దాలి కృష్ణమూర్తి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 26.02.1950 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
1950 సంవత్సరంలో విడుదలైన శోభనాచల & ఎం.ఆర్.ఏ. సంస్థ నిర్మించిన లక్ష్మమ్మ చిత్రం నుండి ఘంటసాల పాడిన "పడినదారిని విడవబోకమ్మా " అనే ఈ ఏకగళగీతం రచన బాలాంత్రపు, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం సి.హెచ్.నారాయణరావు, మాలతి, సులోచన, సి.కృష్ణవేణి. ఈ చిత్రానికి నిర్మాత సి.కృష్ణవేణి మరియు దర్శకుడు గోపీచంద్. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 26.02.1950 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
1950 సంవత్సరంలో విడుదలైన శోభనాచల & ఎం.ఆర్.ఏ. సంస్థ నిర్మించిన లక్ష్మమ్మ చిత్రం నుండి ఘంటసాలసి.కృష్ణవేణి తో పాడిన "చిన్ననాటి స్వప్నసీమా" అనే ఈ యుగళగీతం రచన బాలాంత్రపు, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం సి.హెచ్.నారాయణరావు, మాలతి, సులోచన, సి.కృష్ణవేణి. ఈ చిత్రానికి నిర్మాత సి.కృష్ణవేణి మరియు దర్శకుడు గోపీచంద్. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 26.02.1950 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
విజయనగరములోని సంగీత కళాశాలలో విద్యనభ్యసించిన సంగీత విశారదులు ఘంటసాల మాస్టారు దక్షిణ భారత చలన చిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందేరు. రాగాల నిర్దేశంలో మాస్టారి స్వరజ్ఞాన పటిమను తరాజు తో తూచి బేరీజు వేయడం అసాధ్యం. భావానుగుణమైన రాగాన్ని పరిగణలోకి తీసుకుని పాటకు వన్నె తేవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. కర్ణాటక సంగీతంలో గల పలు ప్రక్రియలలో సంగీత కచేరీలలో ఆఖరున పాడే తిల్లానాలు స్వరజతుల సంగమమై వడితో దూసుకుపోయే జలపాతంలా శ్రవణానందంగా వుంటాయి. అయితే సినీ సంగీతంలో వీటి వాడుక అరుదు. ఈ స్వర ప్రక్రియను "సుదతి నీకు తగు చిన్నదిరా" అనే పాటకోసం "ఫరజు" రాగంలో కూర్చారు మాస్టారు తన సంగీత నిర్దేశకత్వంలో విడుదలైన "లక్ష్మమ్మ" (1950) చిత్రంలో. ఈ చిత్రంలో నాయికానాయకులు మాలతి (పాతాళ భైరవి కథానాయిక) మరియు సి.హెచ్.నారాయణ రావు. అయితే 'సుదతినీకు తగు చిన్నదిరా' తిల్లానాను సి.ఐ.డి. చిత్రంలో మొత్తం పాటను మరింత పరిణితి చెందిన కంఠంతో అద్భుతంగా సుశాస్త్రీయంగా గానం చేశారు ఘంటసాల మాస్టారు. ఈ వివరాలను రాగ లక్షణాలను ఘంటసాల-రాగశాలలో వివరిస్తారు మిత్రులు చంద్రమౌళి గారు.
“ఫరజు”
అనే అపురూపమైన రాగం, 15వమేళకర్తరాగమైన మాయామాళవగౌళ
జన్యం. మాయామాళవగౌళ రాగానికి సంగీత
శిక్షణపద్ధతిలో విశిష్టమైన స్థానమున్నది. ఇందులోని పూర్వాంగ ఉత్తరాంగ స్వరాల నడుమ ధ్వనిస్థానముల
నిడివి పాడుకొనుటకు సులభమైనది. ఆ కారణంగానే కర్ణాటసంగీత పితామహుడైన పురందరదాసు, ఈ రాగంలోనే సరళీ వరుసలు, జంట వరుసలు, మరియు అలంకారాలను రచించటంతోపాటు, జన్య రాగమైన 'మలహరి'లో పిళ్ళారి గీతాలను రచించి బహుళ ప్రచారం
చేశారు. మాయామాళవగౌళ జన్యరాగప్రవాహంలో వందిలాది జన్య రాగాలున్నాయి. అందులో కొన్ని ప్రముఖ జన్య
రాగాలు:గౌళ, భౌళి, మలహరి, సారంగనాట, నాదనామక్రియ, లలిత పంచమం, మారువ, మేఘరంజి, పాడి, గౌళిపంతు, ఘోర్జరి, గుండక్రియ, సౌరాష్ట్రము, కమలామనోహరి, రేగుప్తి, సింధురామక్రియ, గౌరి మరియు ఫరజు.
ఫరజు
రాగం
ఫరజు రాగం స్వరాలు : శుద్ధ రిషభం, అంతరగాంధారం, శుద్ధమధ్యమం, శుద్ధ
దైవతం, కాకలినిషాదం. 'సగమపదని’ ఆరోహణ, 'సనిదపమగరి’
అవరోహణ. ఇది ఉపాంగ, షాడవ-సంపూర్ణమైన, భక్తి-రక్తి ప్రబోధకమైన రాగం. కొన్నిరాగాలు
ప్రసిద్ధమైన కృతియొక్క ఆధారంగా నిలుస్తాయి. అలా ప్రయోగ ప్రధానమైన రాగమిది. మరొక జన్య రాగం - పంచమంలేని మాయామాళవగౌళమే లలితరాగం. లలితరాగం
అవరోహణంలో పంచమం ప్రవేశమైనట్లయితే అది లలితపంచమం అనే రాగం. అంటే ‘లలిత’ కు పంచమం చేర్చడం. ఫరజురాగానికి
మరియు లలితపంచమానికి ఒకే మూర్ఛన!. ఫరజులో కీర్తనలు ఎక్కువగా కనపడవు. ముత్తుస్వామి
దీక్షితుల “శ్రీ శుక్రభగవంతం” అనే నవగ్రహస్తుతి మనకు తెలిసినదే. ఈ రాగంలో పట్ణం
సుబ్రహ్మణ్య అయ్యర్ రచించిన “తధీంధీంతనననా” అనే తిల్లాన ప్రసిద్ధమైనది. కొన్ని తిల్లానాలూ జావళీలూ తప్ప ఈ రాగంలో ఎక్కువ కృతులు అరుదనే చెప్పాలి. “త్రిలోకమాత” అను శ్యామ శాస్త్రి రచనను ఈ
మధ్యనే శ్రీ వినయ్ శర్మ గారు పాడగా విన్నాను. సమాహారంగా ఆ కృతిని వినగలరు.
Audio file - Courtesy: M.R.Chandra Mowly
'తిల్లాన' 'తిల్లాన' పదముయొక్క మూలం మనకు ఖచ్చితంగా తెలియదు. తిరితిల్లాన అను
దేశ్యప్రబంధం, తి,ల్లా,న అను అక్షర ప్రయుక్తమైనది గనుక తిల్లానకు మూలం అదియేనని, ‘తరాన’
అను హిందూస్థాని రచనాక్రమము దీనికి మూలమని అనేక అభిప్రాయాలున్నవి. ఇక ప్రయోగవిషయంలో, 18వ
శతాబ్దానికి చెందిన తంజావూరు ప్రతాపసింహుని కొలువులో విద్వాంసుడైన వీరభద్రయ్య తిల్లాన
ప్రథమ రచయితయని, తంజావూరు సహోదర చతుష్టయం కృషితో భరతనాట్యాంగమై
తిల్లాన ప్రాచుర్యము పొందినది అని
విజ్ఞులు చెప్పుదురు. కృతులలాగే, తిల్లాన
రచనాప్రక్రియలో, పల్లవి, అనుపల్లవి, చరణమను ఖండత్రయములు గలవు. పల్లవి అనుపల్లవులలో
హస్తపాటములతో కూర్చిన నానా విధములైన
జతులు మరియు చరణమున జతులతో స్వరసమూహములూ మిశ్రమమై యుంటాయి. సాహిత్యభాగం బహు మితమై, ప్రభు-దేవతాస్తుతులను
కూడియున్నా ప్రసిద్ధమైన తిల్లానాలలో శృంగారప్రధానమైన నాయకీభావమే ఎక్కువ. జతుల
ఛందోలయవిన్యాస సౌందర్యం ద్వారా భక్తి-రక్తుల రససేచనజేయు తిల్లానా సంయోజనం, కచేరి గాయనంకన్నా
నృత్యభాగాలలోనే ఎక్కువ.
పాతసినిమాలలో నృత్యసన్నివేశ భాగమై ప్రసిద్ధ తిల్లానాలు, జావళులూ
ప్రయోగింపబడినాయి. నృత్యమణులైన లలిత,రాగిణి,పద్మిని
మరియు ఎల్.విజయలక్షి ఎన్నో జావళులకు, తిల్లానాలకు అభినయరూపాన్నిచ్చారు.
శోభనాచల మరియు ఎమ్.ఆర్.ఏ వారు 1950లో నిర్మించిన ‘లక్ష్మమ్మ’ చిత్రానికి సంగీత
దర్శకులు ఘంటసాల. బెజవాడ రాజరత్నం తో కలిసి ఆయన ఈ తిల్లానాని పాడారు. ఆ సినిమా పాటల వివరాలలో పాటల రచయిత బాలాంత్రపు
రజనీకాంతరావుగారి పేరువున్నాఇది ఆయన రచనకాదు. ఈ తిల్లాన ఎన్నో దశాబ్దాలనుండి పట్ణం
సుబ్రహ్మణ్యయ్యర్ రచనగానే ప్రసిద్ధం. ఘంటసాల శాస్త్రీయ సంగీతం నేర్చుకొనే రోజుల్లో
ఈ తిల్లానాని పాడుతుండేవారేమో తెలియదుగాని ‘వాతాపి గణపతిం’ మినహాయిస్తే ఈ యొక్కతిల్లాన మాత్రమే ఆయన పాడిన కర్ణాటక
శాస్త్రీయ సంగీతకృతియని చెప్పుకోదగినది. ఆయన దర్శకత్వం గనుక ఖచ్చితముగా ఈ తిల్లాన
గురుముఖేన నేర్చియుంటారు. ఎందుకనగా తిల్లానాలు పాడడం మామూలు పాటపాడినంత సులువుగాదు. 1950 లో, తన శాస్త్ర్రీయసంగీతానికి అనువైన గాత్రమునూ, ఒక నట్టువాంగకారుడు తిల్లానాలను పాడే తీరును మనం వినవచ్చు.
లక్ష్మమ్మ చిత్రం తరువాత దాదాపు 15 సంవత్సరాల అనంతరం ఘంటసాల తన స్వీయ
దర్శకత్వంలో విజయా వారి సి.ఐ.డి. చిత్రం కోసం ఫరజు రాగంలో తిల్లానా పాడారు. లక్ష్మమ్మ చిత్రం లో ఒక పెళ్ళి సంబరంలో ఒక నర్తకి నాట్యం చేయగా
మాస్టారు ఒక నాట్యాచార్యునికి నేపధ్యంగా పాడగా, సి.ఐ.డి. చిత్రానికి మరొక
నాట్యాచార్యునికి (రమణారెడ్డి) పూర్తి తిల్లానాను పాడారు. లక్ష్మమ్మ లో
పెళ్ళికొడుకుగా సి.హెచ్.నారాయణ రావు, పెళ్ళికూతురుగా మాలతి (పాతాళభైరవి
కథానాయిక) నటించారు. సి.ఐ.డి. చిత్రంలో మీనాకుమారి నాట్యానికి రమణారెడ్డి
పాడతాడు. పదిహేను సంవత్సరాల తరువాత సి.ఐ.డి. చిత్రంలో మాస్టారి గళం
మరింత ప్రశస్తంగా వినిపిస్తుంది. అయితే అభినయం అంత గొప్పగా లేకపోయినా
మాస్టారి గాయనం లో శాస్త్రీయత ఉట్టి పడుతుంది.
(ఈస్వరసాహిత్యం
మా గురువైన
కీ.శే. కోటమరాజు వేంకటేశుగారు చెప్పగా దశాబ్దాలకింద నేను రాసుకున్నది. ఆయన ప్రఖ్యాతసంగీతవిద్వాంసులైన జి.ఎన్.బాలసుబ్ర్రహ్మణ్యంగారి శిష్యులు. కల్యాణరామన్,
ఎమె.ఎల్.వసంతకుమారి గార్లు ఆయన
సహాధ్యాయులు. వారందరికి ఈ తిల్లాన పాఠం జి.ఎన్.బి. ఎలానేర్పేవారో,
మా గురువుగారుచెబుతుండేవారు. ఈ వ్యాసంతో
ఆయన నాదాత్మకు నా నమస్సులుతెలియజేస్తున్నాను - ఎం.ఆర్.చంద్రమౌళి.)
అందరికీ దసరా శుభాకాంక్షలు
Thanks: To Sri Bollapragada Someswara rao garu for the providing the movie poster and to Sri M.R.Chandra Mowly garu for providing the video clips, to Ghantasala Galamrutamu-Patala Palavelli and Wikepedia for the information and you tube for posting the videos.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com