1953 సంవత్సరంలో విడుదలైన శోభా సంస్థ నిర్మించిన “పరోపకారం” చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడిన "జోడెడ్ల నడమ జోరైన రగడ" అనే ఈ ఏకగళం రచన ఆరుద్ర, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ముక్కామల,సావిత్రి, జి. వరలక్ష్మి,రామశర్మ,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, రేలంగి. ఈ చిత్రానికి నిర్మాత బి.చలపతిరావు మరియు దర్శకుడు కమల్ ఘోష్.
#0000 | పాట: | జోడెడ్ల నడుమ | |
---|---|---|---|
నిర్మాణం: | శోభా వారి | ||
చిత్రం: | పరోపకారం (1953) | ||
సంగీతం: | ఘంటసాల | ||
రచన: | ఆరుద్ర | ||
గానం: | ఘంటసాల | ||
అభినయం: | ఆర్.నాగేశ్వరరావు | ||
ప: | జోడెడ్ల నడుమ జోరైన రగడ రేతిరి రేగిందోయ్ -2 | ||
నడి రేతిరి రేగిందోయ్ | |||
చ: | రోసాలు పెరిగితె రోజాలు యిరుగు కలేజాలు కరుగు -2 | ||
పసరాల కిటుకులు అసలోడి కెరుక, ముసిలోడి కెరుక | |||
అసలా కిటుకులు ఏటో.... | |||
జోడెడ్ల నడుమ జోరైన రగడ రేతిరి రేగిందోయ్ | |||
నడి రేతిరి రేగిందోయ్ | |||
ఆహా ఆహా ఆహా హయ్ (ఎడ్ల అదలింపులు) | |||
జోడెడ్ల నడుమ జోరైన రగడ రేతిరి రేగిందోయ్ | |||
నడి రేతిరి రేగిందోయ్ | |||
చ: | ముగుతాడులాగితె ముగిసేనుజోరు నిలిచేనుపోరు -2 | ||
పొగరైన కోడెల తగులాట తీరు పగ తెలవారు | |||
వెతలైన కతలేమా.....రు | |||
జోరైన బండి జోడెడ్లబండి | |||
నెర నెర నెరబండి హయ్ నెరనెర నెరబండి | |||
హయ్ నెర నెర నెరబండి హయ్! |