1970 సంవత్సరంలో విడుదలైన విజయలక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మించిన ఆడజన్మ చిత్రం నుండి ఘంటసాల పాడిన "నీ కధ ఇంతేనమ్మా " అనే ఈ ఏకగళం రచన ఆత్రేయ, స్వరపరచినది మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం జమున, హరనాధ్, నాగభూషణం,చంద్రమోహన్, గీతాంజలి, మాలతి. ఈ చిత్రానికి నిర్మాత జి.వి.ఎస్.రాజు మరియు దర్శకుడు ఐ.ఎస్.మూర్తి. చిత్రంలో ఈ పాట నేపథ్యగానంలో వినిపిస్తుంది.
#000 | పాట: | నీ కథ యింతేనమ్మా! | |
---|---|---|---|
నిర్మాణం: | విజయలక్ష్నీ మూవీస్ | ||
చిత్రం: | ఆడజన్మ (1970) | ||
రచన: | ఆత్రేయ | ||
సంగీతం : | మాస్టర్ వేణు | ||
అభినయం : | నేపథ్యగానం | ||
పాడినవారు : | ఘంటసాల | ||
ప: | నీ కథ యింతేనమ్మా నీ కథ యింతేనమ్మా | ||
దీనికి అంతే లేదమ్మా | |||
కాలం మార్చని కన్నీటి గాథమ్మా | |||
యీ ఆడజన్మ | ॥నీ కథ॥ | ||
చ: | పుట్టడమే పుట్టింటికి పుట్టెడు ఖర్చుగా పుడతావు -2 | ||
ఎదిగిన కొలది కన్నవారికి మోయరాని బరువౌతావు | |||
కన్నీరే నీ సారెగా, మెట్టినింటికీ వెళతావు -2 | |||
వారి కలిమిలేములకు నువు కారణమని | |||
మెప్పులో నిందలో పడతావు | ॥నీ కథ॥ | ||
చ: | భర్తను కాదని పసిడి లేడికై ఆశపడినది జానకి | ||
తండ్రి యింట తనకన్నీ కలవని | |||
తరలిపోయినది దాక్షాయణీ | |||
అవమానాలే మిగిలినవి, అనుమానాలే రగిలినవి | |||
నరకమైనా స్వర్గమైనా, మెట్టినిల్లే యిల్లాలికమ్మా | |||
ఆశలైనా నిరాశలైనా, మగని నీడనె మగనాలికమ్మా | |||
మగని నీడనె మగనాలికమ్మా | |||
నీ కథ యింతేనమ్మా నీ కథ యింతేనమ్మా | |||
దీనికి అంతే లేదమ్మా | |||
కాలం మార్చని కన్నీటి గాథమ్మా | |||
ఆడజన్మ, ఆడజన్మ, ఆడజన్మ, ఆడజన్మ |