ఎస్.ఎస్.వి.ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై రత్నశ్రీ మరియు మోహన్ గాంధి నటించిన మనసు-మమత అనే చిత్రం కోసం ఘంటసాల మాస్టారు రికార్డు చేయబడిన ఆరు పాటలలో ఒక శ్లోకం, నాలుగు పాటలు పాడారు. అందులో ఒక ఏకగళ గీతం, ఒక బృందగానం, రెండు ఎస్. జానకితో పాడిన యుగళగీతాలు వున్నాయి. ఈ చిత్రానికి సంగీతం ఎస్.డి. బాబూరావు సమకూర్చారు. ఈ చిత్రం విడుదల కాలేదు, కాని పాటలు విడుదలయ్యాయి. అయితే ఇందులో ప్రస్తుతం ఒక యుగళగీతం, ఒక శ్లోకం అలభ్యం. ఇక్కడు మాస్టారు పాడిన బృందగీతపు శ్రవణ ఖండికను, సాహిత్యాన్ని పొందుపరుస్తున్నాను. ఈ పాట వ్రాసినది కె, వసంతరావు.
కృతజ్ఞతలుః చిత్రము యొక్క సమాచారాన్ని అందించిన ఘంటసాల గళామృతము నిర్వాహకులు శ్రీ కొల్లూరి భాస్కరరావు గారికి, శ్రవణ ఖండికను అందించిన శ్రీ నూకల ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
2429 | నిర్మాణం: | ఎస్.ఎస్.వి.ఎస్.ప్రొడక్షన్‌స్ వారి | |
చిత్రం: | మనసు మమత (విడుదల కాలేదు) | ||
రచన: | కె.వసంతరావు | ||
సంగీతం: | ఎస్.డి.బాబూ రావు | ||
గానం: | ఘంటసాల, బృందం | ||
పల్లవి: | ఘంటసాల: | కర్షకుడా! కర్షకుడా! కర్షకుడా! | |
దేశానికి వెన్నెముకవు లెమ్ము లెమ్మురా! | |||
భూమాతకు రైతుబిడ్డ రమ్ము రమ్మురా! | |||
అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | |||
ఘంటసాల: | కర్షకుడా! బృందం: కర్షకుడా! - 3 | ||
ఘంటసాల: | దేశానికి వెన్నెముకవు లెమ్ము లెమ్మురా! | ||
బృందం: | లెమ్ము లెమ్మురా! | ||
ఘంటసాల: | భూమాతకు రైతు బిడ్డ రమ్ము రమ్మురా! | ||
బృందం: | రమ్ము రమ్మురా! | ||
ఘంటసాల: | అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | ||
బృందం: | అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | ||
చరణం: | ఘంటసాల: | ఎండ వానలను నీవు లెక్కచేయవు | |
కండలన్ని పిండిచేసి ధాన్యం పండింతువు | | ఎండ | | ||
నీవులేని చోటెప్పుడు రాళ్ళ గుట్టరా - 2 | |||
సృష్టిని పోషించువాడ నీవె దిక్కురా | |||
కర్షకుడా! కర్షకుడా! కర్షకుడా! | | దేశానికి | | ||
ఘంటసాల: | కర్షకుడా! బృందం: కర్షకుడా! | ||
ఘంటసాల: | కర్షకుడా! దేశానికి వెన్నెముకవు లెమ్ము లెమ్మురా! | ||
బృందం: | లెమ్ము లెమ్మురా! | ||
ఘంటసాల: | భూమాతకు రైతు బిడ్డ రమ్ము రమ్మురా! | ||
బృందం: | రమ్ము రమ్మురా! | ||
బృందం: | అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | ||
ఘంటసాల: | కర్షకుడా! బృందం: కర్షకుడా! - 3 | ||
ఘంటసాల: | దేశానికి వెన్నెముకవు లెమ్ము లెమ్మురా! | ||
బృందం: | లెమ్ము లెమ్మురా! | ||
ఘంటసాల: | భూమాతకు రైతు బిడ్డ రమ్ము రమ్మురా! | ||
బృందం: | రమ్ము రమ్మురా! | ||
ఘంటసాల: | అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | ||
బృందం: | అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | ||
చరణం: | ఘంటసాల: | దౌర్జన్యం దగాచేయు దుండగీళ్ళను | |
ధైర్యంతో ఎదిరించి ధర్మం నెలకొల్పరా! | | దౌర్జన్యం| | ||
ఏ రోజుకైన స్వార్థం నశించితీరురా -2 | |||
ఏనాటికైన సత్యం జయించి తీరురా | |||
ఘంటసాల: కర్షకుడా! బృందం: కర్షకుడా! | |||
ఘంటసాల: | కర్షకుడా! దేశానికి వెన్నెముకవు లెమ్ము లెమ్మురా! | ||
బృందం: | లెమ్ము లెమ్మురా! | ||
ఘంటసాల: | భూమాతకు రైతు బిడ్డ రమ్ము రమ్మురా! | ||
బృందం: | రమ్ము రమ్మురా! | ||
బృందం: | అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | ||
చరణం: | ఘంటసాల: | పాడీ పంటలకెన్నడు లోటులేని దేశము | |
బృందం: | లోటులేని దేశము | ||
ఘంటసాల: | లాభాలకు సాగిన లోభులకే దక్కెరా | ||
బృందం: | లోభులకే దక్కెరా | | పాడీ | | |
ఘంటసాల: | కనరాని దోపిడీ, ప్రజ బ్రతుకున రాపిడీ | ||
బృందం: | కనరాని దోపిడీ, ప్రజ బ్రతుకున రాపిడీ | ||
ఘంటసాల: | చల్లారిన నాడే; బృందం: చల్లారిన నాడే | ||
ఘంటసాల: | దేశానికి శాంతిరా; బృందం: దేశానికి శాంతిరా | ||
ఘంటసాల: | కర్షకుడా! కార్మికుడా! | ||
నీ కష్టం నీ రక్తం వృధా కాదురా |
కృతజ్ఞతలుః చిత్రము యొక్క సమాచారాన్ని అందించిన ఘంటసాల గళామృతము నిర్వాహకులు శ్రీ కొల్లూరి భాస్కరరావు గారికి, శ్రవణ ఖండికను అందించిన శ్రీ నూకల ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.