1959 సంవత్సరంలో విడుదలైన శ్రీ సారథీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల పాడిన "హరేహరే రాం సీతారాం " అనే ఈ ఏకగళగీతం రచన కొసరాజు, స్వరపరచినది మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం జగ్గయ్య, సావిత్రి, బాలయ్య, రాజసులోచన, రేలంగి, సూర్యకాంతం. ఈ చిత్రానికి నిర్మాత సారథీ స్టూడియోస్ మరియు దర్శకుడు తాపీ చాణక్య. దీనిని రేలంగి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 23.10.1959 న విడుదలైంది.
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
11, డిసెంబర్ 2025, గురువారం
హరేహరే రాం సీతారాం - భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల
మదిని హాయి నిండెగా - భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల, పి.సుశీల
1959 సంవత్సరంలో విడుదలైన శ్రీ సారథీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన "మదిని హాయి నిండెగా " అనే ఈ యుగళం రచన శ్రీశ్రీ, స్వరపరచినది మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం జగ్గయ్య, సావిత్రి, బాలయ్య, రాజసులోచన, రేలంగి, సూర్యకాంతం. ఈ చిత్రానికి నిర్మాత సారథీ స్టూడియోస్ మరియు దర్శకుడు తాపీ చాణక్య. దీనిని జగ్గయ్య, సావిత్రి లపై చిత్రీకరించారు. ఈ చిత్రం 23.10.1959 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
26, జనవరి 2025, ఆదివారం
నీ కథ ఇంతేనమ్మా - ‘ఆడజన్మ’ చిత్రం నుండి ఘంటసాల
1970 సంవత్సరంలో విడుదలైన విజయలక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మించిన ఆడజన్మ చిత్రం నుండి ఘంటసాల పాడిన "నీ కధ ఇంతేనమ్మా " అనే ఈ ఏకగళం రచన ఆత్రేయ, స్వరపరచినది మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం జమున, హరనాధ్, నాగభూషణం,చంద్రమోహన్, గీతాంజలి, మాలతి. ఈ చిత్రానికి నిర్మాత జి.వి.ఎస్.రాజు మరియు దర్శకుడు ఐ.ఎస్.మూర్తి. చిత్రంలో ఈ పాట నేపథ్యగానంలో వినిపిస్తుంది.
| #000 | పాట: | నీ కథ యింతేనమ్మా! | |
|---|---|---|---|
| నిర్మాణం: | విజయలక్ష్నీ మూవీస్ | ||
| చిత్రం: | ఆడజన్మ (1970) | ||
| రచన: | ఆత్రేయ | ||
| సంగీతం : | మాస్టర్ వేణు | ||
| అభినయం : | నేపథ్యగానం | ||
| పాడినవారు : | ఘంటసాల | ||
| ప: | నీ కథ యింతేనమ్మా నీ కథ యింతేనమ్మా | ||
| దీనికి అంతే లేదమ్మా | |||
| కాలం మార్చని కన్నీటి గాథమ్మా | |||
| యీ ఆడజన్మ | ॥నీ కథ॥ | ||
| చ: | పుట్టడమే పుట్టింటికి పుట్టెడు ఖర్చుగా పుడతావు -2 | ||
| ఎదిగిన కొలది కన్నవారికి మోయరాని బరువౌతావు | |||
| కన్నీరే నీ సారెగా, మెట్టినింటికీ వెళతావు -2 | |||
| వారి కలిమిలేములకు నువు కారణమని | |||
| మెప్పులో నిందలో పడతావు | ॥నీ కథ॥ | ||
| చ: | భర్తను కాదని పసిడి లేడికై ఆశపడినది జానకి | ||
| తండ్రి యింట తనకన్నీ కలవని | |||
| తరలిపోయినది దాక్షాయణీ | |||
| అవమానాలే మిగిలినవి, అనుమానాలే రగిలినవి | |||
| నరకమైనా స్వర్గమైనా, మెట్టినిల్లే యిల్లాలికమ్మా | |||
| ఆశలైనా నిరాశలైనా, మగని నీడనె మగనాలికమ్మా | |||
| మగని నీడనె మగనాలికమ్మా | |||
| నీ కథ యింతేనమ్మా నీ కథ యింతేనమ్మా | |||
| దీనికి అంతే లేదమ్మా | |||
| కాలం మార్చని కన్నీటి గాథమ్మా | |||
| ఆడజన్మ, ఆడజన్మ, ఆడజన్మ, ఆడజన్మ |
14, మార్చి 2024, గురువారం
టౌను పక్కకెళ్ళొద్దురో - ఘంటసాల, జిక్కీ తోడికోడళ్ళు చిత్రం నుండి
17, జనవరి 2022, సోమవారం
వెళ్ళిపోదామా మావా వెళ్ళిపోదామా – అంతా మనవాళ్ళే చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట
1954
సంవత్సరంలో విడుదలైన సారథీ సంస్థ నిర్మించిన “అంతా మనవాళ్ళే” చిత్రం నుండి ఘంటసాల పాడిన
“వెళ్ళిపోదామా మావా వెళ్ళిపోదామా” అనే ఈ ఏకగళగీతం రచన కొనకళ్ళ వెంకటరత్నం, స్వరపరచినది మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం వల్లం నరసింహారావు,
కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత సి.వి.ఆర్.ప్రసాద్
మరియు దర్శకుడు తాపీ చాణక్య. ఈ పాటను నేపథ్యగానం గా చిత్రీకరించారు.![]() |
| కొనకళ్ళ వెంకటరత్నం |
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
1, జులై 2020, బుధవారం
రైతు మేడి పట్టి - నమ్మినబంటు చిత్రం నుండి ఘంటసాల, సుశీల, బృందం
25, జూన్ 2020, గురువారం
ఇదియే హాయి కలుపుము చేయి - రోజులు మారాయి నుండి ఘంటసాల, జిక్కి
1955 సంవత్సరంలో
విడుదలైన సారథీ సంస్థ నిర్మించిన రోజులు మారాయి చిత్రం
నుండి జిక్కీ తో పాడిన ఇదియే
హాయి కలుపుము చేయి
అనే ఈ యుగళగీతం రచన
తాపీ ధర్మారావు, స్వరపరచినది మాస్టర్
వేణు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని,
జానకి, రేలంగి, సి.ఎస్.ఆర్.
ఆంజనేయులు, అమ్మాజీ, హేమలత.ఈ చిత్రానికి
నిర్మాత సి.వి.ఆర్.ప్రసాద్
మరియు దర్శకుడు తాపీ
చాణక్య.
| నిర్మాణం : | సారథీ వారి | ||
|---|---|---|---|
| చిత్రం : | రోజులు మారాయి (1955) | ||
| రచన : | తాపీ ధర్మారావు | ||
| సంగీతం : | మాస్టర్ వేణు | ||
| గానం : | ఘంటసాల, జిక్కీ | ||
| ప. | ఆమె : | ఇదియే హాయి కలుపుము చేయి, వేయి మాటలేలనింక | |
| వేయి మాటలేలనింక ఓ.ఓ.ఓ.ఓ. | |||
| ఇదియే హాయి కలుపుము చేయి | |||
| అతడు : | ఇదియే హాయి కలుపుము చేయి, వేయి మాటలేలనింక | ||
| వేయి మాటలేలనింక ఓ.ఓ.ఓ.ఓ. | |||
| ఇదియే హాయి కలుపుము చేయి | |||
| చ. | ఆమె: | ఓ..ఓ.. ఆ చూపులోనె కురియును తేనె | |
| చిరునగువాహా వెలుగున వాలె | |||
| మనసెదో హాయి సోలునే ఓ.ఓ.ఓ.ఓ | |||
| మనసెదొ హాయి సోలునే | |||
| నీ వాడిన మాట సాటిలేని పూలబాట | |||
| సాటిలేని పూలబాట ఓ.ఓ.ఓ.ఓ. | |||
| ఇదియే హాయి కలుపుము చేయి | |||
| చ. | అతడు : | అందాలలోన నడవడిలోన | |
| తొలుతను నీవే తెలియగరావె | |||
| బ్రతుకున మేలు చూపవె ఓ.ఓ.ఓ.ఓ | |||
| బ్రతుకున మేలు చూపవె | |||
| నీ చూపే చాలు అదే నాకు వేనవేలు | |||
| అదే నాకు వేనవేలు ఓ.ఓ.ఓ.ఓ. | |||
| ఇదియే హాయి కలుపుము చేయి | |||
| చ. | ఇద్దరు : | ఈ లోకమేమో మరే లోకమేమో | |
| మనసులతోనే తనువులు తేలే | |||
| బ్రతుకిక తూగుటూయలే ఓ.ఓ.ఓ.ఓ. | |||
| బ్రతుకిక తూగుటూయలే | |||
| ఈనాటి ప్రేమ లోటు లేని మేటి సీమ | |||
| లోటు లేని మేటి సీమ ఓ.ఓ.ఓ.ఓ. | |||
| ఇదియే హాయి కలుపుము చేయి, వేయి మాటలేలనింక | |||
| వేయి మాటలేలనింక ఓ.ఓ.ఓ.ఓ. | |||
| ఇదియే హాయి కలుపుము చేయి |
20, జూన్ 2020, శనివారం
వెదుకాడే కన్నులలోన - భాగ్యదేవత నుండి ఘంటసాల, జమునారాణి
1959 సంవత్సరంలో విడుదలైన శ్రీ సారథీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల మాస్టారు జమునారాణి తో పాడిన "వెతుకాడే కన్నులలోనా" అనే ఈ యుగళం రచన శ్రీశ్రీ, స్వరపరచినది మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం జగ్గయ్య, సావిత్రి, బాలయ్య, రాజసులోచన, రేలంగి, సూర్యకాంతం. ఈ చిత్రానికి నిర్మాత సారథీ స్టూడియోస్ మరియు దర్శకుడు తాపీ చాణక్య. దీనిని బాలయ్య, రాజసులోచన పై చిత్రీకరించారు. ఈ చిత్రం 21846 న విడుదలైంది.
| చిత్రం: | భాగ్యదేవత (1959) | |||
| రచన: | శ్రీ శ్రీ | |||
| సంగీతం: | మాస్టర్ వేణు | |||
| గానం: | ఘంటసాల, కె. జమునారాణి | |||
| పల్లవి | ఘంటసాల: | వెదుకాడే కన్నులలోన, వెలిగించి ప్రేమజ్యోతి | ||
| ఆనందసాగరాన తేలి ఆడరావా, నీ ఓలలాడరావా | । వెదుకాడే । | |||
| జమునారాణి: | పులకించే గుండెలలోన, పలికించి ప్రేమగీతి | |||
| ఆనందసాగరాన తేలి ఆడరావా, నీ ఓలలాడరావా | । పులకించే । | |||
| చరణం | ఘంటసాల: | మనసూగించే మధుమాస వేళ | ||
| కొసరుచు పాడే కోయిల బాల - 2 | ||||
| అనురాగ భావగీతి ఆలకించలేవ | । వెదుకాడే । | |||
| చరణం | జమునారాణి: | మరులూరించే విరజాజితోట | ||
| మలయసమీరం మసలేచోట - 2 | ||||
| ఆశించె నన్ను చేరి ఆటలాడరావా | ||||
| పులకించే గుండెలలోన, పలికించిన ప్రేమగీతి | ||||
| ఇద్దరు: | ఆనందసాగరాన తేలి ఆడరావా, నీ ఓలలాడరావా | |||
10, జూన్ 2020, బుధవారం
అనగనగా ఒక చిన్నది - పెళ్ళికాని పిల్లలు నుండి ఘంటసాల, సుశీల
| చిత్రం: | పెళ్ళికాని పిల్లలు (1961) | ||
| రచన: | ఆరుద్ర | ||
| సంగీతం: | మాస్టర్ వేణు | ||
| గానం: | ఘంటసాల, పి.సుశీల | ||
| పల్లవి: | ఘంటసాల: | అనగనగా ఒక చిన్నదీ, ఆకాశంలోనున్నదీ | |
| అక్కల పెళ్ళీ అయ్యేదాకా చిక్కను పోవోయ్ అన్నదీ.. | | అనగనగా | | ||
| అనగనగా ఒక చిన్నది | |||
| చరణం: | సుశీల: | పరులకు పెళ్ళీ జరిపేవాడు వలచినదానీ మరిచాడు (2) | |
| ఘంటసాల: | మరిచాననుకుని తలచేలోగా మగువచెంతనే నిలచాడు | ||
| అనగనగా ఒక చిన్నది, అభినవ ఊర్వశినన్నది | |||
| ఓడినవెంటనె మనసును గెలిచి వయ్యారముగానున్నది | |||
| అనగనగా ఒక చిన్నది, అభినవ ఊర్వశినన్నది | |||
| సుశీల: | ఆటల పాటల ఆడువారిని ఆడించుట మీ పరిపాటి (2) | ||
| ఘంటసాల: | వాలుచూపుతో (2) కీలుబొమ్మలా ఆడించకు నను వగలాడి | ||
| ఆడించకు నను వగలాడి | |||
| చరణం: | సుశీల: | తీయనిపాటల హాయిగ పాడి కోయిలయేదో కోరినది | |
| తనమది దోచిన పాటగానికీ (2), దాసురాలిగా మారినదీ..(2) | |||
| తీయనిపాటల హాయిగ పాడి కోయిలయేదో కోరినది | |||
| ఘంటసాల: | అనగనగా ఒక చిన్నది, అతిశయమెంతో వున్నది | ||
| రౌడీమూకలు రభసచేయగా రక్షించండోయ్ అన్నది | |||
| అనగనగా ఒక చిన్నది, అతిశయమెంతో వున్నది | |||
| సుశీల: | ఎందరినైనా ఎడమచేతితో కిందికి తోసే మీకు సలాం (2) | ||
| ఘంటసాల: | అంతటి ధీరుడు, అంతటి వీరుడు (2) అయినాడిదిగో నీకు గులాం | ||
| ఇద్దరు: | ఆహాహాహహ హాహహా ఆహాహహహ హాహహా (2) |
27, మే 2020, బుధవారం
నా వరాల తండ్రీ నీవేల పుడితివి? - కలసివుంటే కలదుసుఖం చిత్రం నుండి ఘంటసాల
| సాకీ: | నా వరాల తండ్రీ..ఈ.. నీవేల పుడితివి? | ||
| పల్లవి: | నా వరాల తండ్రీ నీవేల పుడితివి? -2 | ||
| ఏయింట పుట్టినను, హాయిగా మనగలవు | |||
| మాయింట పుట్టావా! నా పిచ్చి తండ్రి | |||
| నా వరాల తండ్రీ నీవేల పుడితివి? | |||
| చరణం: | నా జన్మమెందుకని నేనే చింతించ | ||
| నీవేల పుట్టావూ బంగరుకొండ? | |||
| నా జన్మమెందుకని నేనే చింతించ | |||
| నీవేల పుట్టావూ బంగరుకొండ | |||
| నా వరాల తండ్రీ నీవేల పుడితివి? | |||
| చరణం: | భర్తయను పదమునకు భరియించువాడనుచు | ||
| అర్థము చెబుతారూ లోకానా | |||
| భర్తయను పదమునకు భరియించువాడనుచు | |||
| అర్థము చెబుతారూ లోకానా | |||
| భార్యకు భారముగా, భూమికి భారముగా | |||
| బ్రతుకును విధిలేకా నీ తండ్రి | |||
| నా వరాల తండ్రీ నీవేల పుడితివి? | |||
| చరణం: | ఓర్చుకొను సుగుణములో భూమాతనే మించే | ||
| ఉత్తమా యిల్లాలు నీ తల్లి | |||
| ఓర్చుకొను సుగుణములో భూమాతనే మించే | |||
| ఉత్తమా యిల్లాలు నీ తల్లి | |||
| నీవెదిగి యిరువురికి నీడయిచ్చే వరకు | |||
| నీ తల్లికీ పాట్లు తప్పవుగా | |||
| జోజో నా బాబూ, జోజో బాబూ -2 | |||
| జోజో బాబూ, జోజో బాబూ |
11, జనవరి 2017, బుధవారం
ముద్దబంతి పూలు పెట్టీ - కలసి వుంటే కలదు సుఖం నుండి ఘంటసాల, సుశీల యుగళగీతం
| చిత్రం: | కలసివుంటే కలదు సుఖం (1961) | |
| రచన: | కొసరాజు | |
| సంగీతం: | మాస్టర్ వేణు | |
| గానం: | ఘంటసాల, పి.సుశీల, ఎం.ఎస్.విశ్వనాథన్ (ఆలాపన) | |
| దర్శకత్వం: | తాపీ చాణక్య |
| ఆలాపన: | ఎం.ఎస్.వి. | తందనాన తాననానా..ఆ..ఆ, తందరారరారరారా...ఆ..ఆ.. |
| తానే తందరనన్నే...ఓ..తానారె నందనన్నా.ఆ..ఆ...తారారిరో..ఓ.. | ||
| పల్లవి: | ఘంటసాల: | ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడను జుట్టి |
| సుశీల: | జడను చుట్టి | |
| ఘంటసాల: | హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా..ఆ..ఆ.. | |
| సుశీల: | చిట్టెమ్మా..ఆ.. | |
| ఘంటసాల: | మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా.. | |
| సుశీల: | చెప్పమ్మా.. | |
| ఘంటసాల: | ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడను జుట్టి | |
| హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా | ||
| సుశీల: | అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది | |
| ఘంటసాల: | వయసు ఉంది.. | |
| సుశీల: | ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా | |
| ఘంటసాల: | కిట్టయ్యా.. | |
| సుశీల: | ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా | |
| ఘంటసాల: | చెప్పయ్యా.. | |
| సుశీల: | అద్దమంటి మనసు వుంది అందమైనా వయసు వుంది | |
| ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా | ||
| ఘంటసాల: | తందాన తానెననే, తందానె తానెననే, తన్నెననె నానే..ఏ., తానేనా హో..య్ | |
| చరణం: | ఘంటసాల: | పుట్టింటి అరణాలూ..ఊ.. ఘనమైన కట్నాలూ..ఊ..హోయ్.. ఓ..ఓ. |
| పుట్టింటి అరణాలు, ఘనమైన కట్నాలు.. అత్తవారింటినిండా వేసినా | ||
| అవి అభిమానమంత విలువజేసునా..ఆ.. అభిమానమంత విలువజేసునా | ||
| ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడను జుట్టి | ||
| హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా | ||
| ఎం.ఎస్.వి. | తందరార రారరందనా..ఆ..ఆ…, తానే తందరనానే..ఏ...ఏ..హో | |
| తానారె నదరన్నా..ఆ..ఆ.., తానారిరో..ఓ...ఓ.. | ||
| సుశీల: | అభిమానమాభరణం మరియాదే భూషణం..-2, గుణము మంచిదైతే చాలయా | |
| మన గొప్పతనము చెప్పుకోను వీలయా..ఆ.. గొప్పతనము చెప్పుకోను వీలయా | ||
| అద్దమంటి మనసు వుంది అందమైనా వయసు వుంది | ||
| ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా | ||
| చరణం: | ఘంటసాల: | కాలు చేయి లోపమనీ..ఈ.ఈ..ఈ... కొక్కెరాయ్ రూపమనీ..ఈ..ఈ..ఈ.. |
| కాలు చేయి లోపమని కొక్కెరాయ్ రూపమని.. వదినలు నన్ను గేలిచేతురా | ||
| పిల్లనుదెచ్చి పెళ్ళిజేతురా..ఆ.. పిల్లనుదెచ్చి పెళ్ళిజేతురా | ||
| సుశీల: | ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి.. | |
| ఎవరేమి అన్ననేమి ఎగతాళీ చెయ్యనేమి.. నవ్విన నాప చేనె పండదా! | ||
| నలుగురు మెచ్చురోజు వుండదా!..ఆ.. నలుగురు మెచ్చురోజు వుండదా! | ||
| అద్దమంటి మనసు వుంది అందమైనా వయసు వుంది | ||
| ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా | ||
| ఘంటసాల: | ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడనుజుట్టి | |
| హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా | ||
| ఎం.ఎస్.వి. | తందరార రానరందా..ఆ..ఆ.., తందరార రారరందే..ఏ..ఏ..ఓ.., తారే..ఓ.. |
15, జులై 2016, శుక్రవారం
తీరెను కోరిక తీయతీయగా - కుంకుమరేఖ నుండి ఘంటసాల, జిక్కీ యుగళ గీతం
సామాజిక స్పృహ గల మాలపిల్ల (1939), రోజులు మారాయి (1000) వంటి మేటి చిత్రాలను నిర్మించిన, పేరెన్నిక గన్న సినీ బ్యానరు అయిన సారథీ స్టూడియోస్ వారు తాపీ చాణక్య దర్సకత్వంలో నిర్మించిన మరొక సామాజిక విలువలు తెలిపే చిత్రం కుంకుమ రేఖ (1960). ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు (మద్దూరి వేణుగోపాల్). 'కళావాచస్పతి' కొంగర జగ్గయ్య, 'మహానటి' సావిత్రి, బాలయ్య ముఖ్య తారాగణం. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు జిక్కీ (పి.జి.కృష్ణవేణి) తో కలసి మూడు యుగళ గీతాలు, రెండు ఏకగళ గీతాలు పాడారు. అందులో ఎక్కువ పాపులర్ అయినవి తీరెను కోరిక తీయ తీయగా, ఈ నాటి రేయి జాబిల్లి హాయి. ఈ చిత్రానికి కథ వ్రాసినది ప్రముఖ బాలీవుడ్ స్క్రీన్ ప్లే రచయిత అయిన పండిత్ ముఖ్ రాం శర్మ. ఈయన పలు సామాజిక సమస్యల ఇతివృత్తాలను కథలుగా వ్రాసి హిందీ తెరకెక్కించారు. ఈ చిత్రానికి మూలం 'ఏక్ హీ రాస్తా' అనే హిందీ చిత్రం.
| చిత్రం: | కుంకుమ రేఖ (1960) | |
| గీతం: | ఆరుద్ర | |
| సంగీతం: | మాస్టర్ వేణు | |
| గానం: | ఘంటసాల, జిక్కీ | |
| పల్లవి: | ఇద్దరు: | తీరెను కోరిక తీయతీయగా హాయిగా మనసులు తేలిపోవగా |
| కలసిప్రయాణం కలుగు వినోదం కలలు ఫలించె కమ్మకమ్మగా | ||
| తీరెను కోరిక తీయతీయగా హాయిగా మనసులు తేలిపోవగా | ||
| కలసిప్రయాణం కలుగు వినోదం కలలు ఫలించె కమ్మకమ్మగా | ||
| చరణం: | జిక్కీ: | ఊహాలలోనికి ప్రయాణము ఉందామచటే నివాసము -2 |
| ఘంటసాల: | తేనెలు కురిశాయి మన జీవితాన -2 | |
| చూచెడువారలు యీసుచెందగ | ||
| ఇద్దరు: | తీరెను కోరిక తీయతీయగా హాయిగా మనసులు తేలిపోవగా | |
| కలసిప్రయాణం కలుగు వినోదం కలలు ఫలించె కమ్మకమ్మగా | ||
| చరణం: | జిక్కీ: | ఇలలో స్వర్గం ఇదే ఇదే పాడేను నామది పదే పదే -2 |
| ఘంటసాల: | పాటకు నా మనసు పరవశమొంది -2 | |
| తన్మయమాయను తనివితీరగా | ||
| ఇద్దరు: | తీరెను కోరిక తీయతీయగా హాయిగా మనసులు తేలిపోవగా | |
| కలసిప్రయాణం కలుగు వినోదం కలలు ఫలించె కమ్మకమ్మగా |
కృతజ్ఞతలు: సినిమా పోస్టరును పొందుపరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి మరియు సమాచారం అందించిన వికిపీడియాకు.










