ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ వాహినీ పిక్చర్సు సంస్థాపకులు పద్మభూషణ్ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి). ఈ సంస్థ వందేమాతరం, మల్లీశ్వరి, స్వర్గసీమ, బంగారు పాప, బంగారు పంజరం వంటి చక్కని చిత్రాలు నిర్మించారు. దర్శక-నిర్మాతయైన బి.ఎన్.రెడ్డి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన తొలి దక్షిణభారతీయులు. వాహినీ సంస్థయొక్క మరొక ప్రతిష్ఠాత్మకమైన సామాజిక, రాజకీయ, వ్యంగ్య చిత్రం రంగుల రాట్నం. ఒక తల్లి (అంజలీదేవి) కడుపున పుట్టిన ఇద్దరు కొడుకులు (చంద్రమోహన్, రాంమోహన్) రాజకీయ ప్రత్యర్థులై కత్తులు దూసుకోవడం, వారిని శాంతపరచి కలిపే తాపత్రయంలో ఆ తల్లి పడే బాధను హృద్యంగా మలచిన చిత్రమిది. బి.ఎన్.రెడ్డి ఈ చిత్రం ద్వారా ఆణిముత్యాల వంటి నటులు చంద్రమోహన్, వాణిశ్రీ, విజయనిర్మల, బాలనటి భానురేఖ (హిందీ తార రేఖ) లను తెలుగు తెరకు పరిచయం చేసారు. టైటిల్ సాంగ్ ను భుజంగరాయశర్మ వ్రాసారు. సాహిత్య పరంగా ఈ పాట చెప్పుకోదగినది. దానికి ఘంటసాల, బృందం ఆలపించగా, రసాలూరు రాజేశ్వర రావు మరియు బి. (బొడ్డు) గోపాలం సంగీతం (సింధుభైరవి రాగం) సమకూర్చారు. బొడ్డు గోపాలం ఆకాశవాణి లో నేపథ్య గాయకునిగా వుండేవారు. ఆయన ఘంటసాల, సాలూరు, టి.వి.రాజు వంటి సంగీత దర్శకులతో పనిచేసారు. కెంపెరాజ్ నిర్మించిన నల దమయంతి చిత్రానికి ఈయన సంగీత దర్శకత్వం వహించారు. వీరి శ్రీమతి అలనాటి గాయని రేణుక (ఈ మూగ చూపేలా - గాలిమేడలు). రంగుల రాట్నం చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా జాతీయ పురస్కారాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంగారు నంది పురస్కారాన్ని అందుకుంది.
చిత్రం: | రంగుల రాట్నం (1967) | |
రచన: | భుజంగరాయ శర్మ | |
సంగీతం: | ఎస్.రాజేశ్వర రావు, బి. గోపాలం | |
గానం: | ఘంటసాల, బృందం |
పల్లవి: | బృందం: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ |
ఘంటసాల: | కలిమి నిలవదు లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు -2 | |
నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా, వాడిన బ్రతుకే పచ్చగిల్లదా | ||
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము | ||
బృందం: | ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము | |
చరణం: | బృందం: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ |
ఘంటసాల: | ఏనుగుపైని నవాబు, పల్లకిలోని షరాబు | |
గుఱ్ఱము మీది జనాబు, గాడిదపైని గరీబు | ||
నడిచే దారుల గమ్యమొక్కటే..ఏ.. | ||
బృందం: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ | |
ఘంటసాల: | నడిచే దారుల గమ్యమొక్కటే, నడిపే వానికి అందరొక్కటే | |
బృందం: | ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము -2 | |
చరణం: | ఘంటసాల: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ |
కోరిక ఒకటి జనించు, తీరక ఎడద దహించు | ||
కోరనిదేదో వచ్చు, శాంతి సుఖాలను తెచ్చు | ||
ఏది శాపమో ఏది వరమ్మో..ఓ.. | ||
బృందం: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ | |
ఘంటసాల: | ఏది శాపమో ఏది వరమ్మో, తెలిసీ తెలియక అలమటించుటే | |
బృందం: | ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము -2 | |
చరణం: | ఘంటసాల: | త్యాగమొకరిది ఫలితమొకరిది, అమ్మప్రాణమాఇద్దరిదీ |
వ్యధలూ బాధలు కష్టగాధలు, చివరికి కంచికి వెళ్ళే కధలే | ||
బృందం: | ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము -2 | |
బ్రతుకే రంగుల రాట్నము | ||
చరణం: | ఘంటసాల: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ |
ఆగదు వలపు ఆగదు వగపు, ఆరదు జీవనమాగదు | ||
ఎవరు కులికినా ఎవరు కుమిలినా ఆగదు కాలం ఆగదు | ||
బృందం: | ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము | |
బ్రతుకే రంగుల రాట్నము | ||
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ | ||
ఘంటసాల: | కలిమి నిలవదు లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు | |
నవ్విన కళ్ళే చెమ్మగిల్లును, వాడిన బ్రతుకే పచ్చగిల్లును | ||
బృందం: | ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము -2 | |
చరణం: | బృందం: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ |
ఘంటసాల: | ఇరుగింటిలోన ఖేదం, పొరుగింటిలో ప్రమోదం | |
రాలినపువ్వుల రెండు పూచే గుత్తులు మూడూ | ||
బృందం: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ | |
ఘంటసాల: | ఒకరి కనులలో చీకటిరేయి, ఇరువురి మనసుల వెన్నెలహాయి | |
బృందం: | ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము | |
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము | ||
ఘంటసాల: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ | |
బ్రతుకే రంగుల రాట్నము -2 |
బి.ఎన్.రెడ్డి గుఱించి మరికొన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
Thanks to Phanindrudu Vadlamani for uploading the song to You Tube.