పక్షిరాజా చిత్ర నిర్మాణ సంస్థ 1960 లో నిర్మించిన సాంఘిక చిత్రం విమల. కథానాయిక విమల పాత్రలో సావిత్రి, జమీందారు కొడుకు గా ఎన్.టి.రామారావు నటించారు. ఈ చిత్రానికి నిర్మాణదర్శకత్వం ఎస్.ఎమ్. శ్రీరాములు. సంగీతాన్ని శ్రీరాములు గారి సోదరుడైన ఎస్.ఎమ్. సుబ్బయ్య నాయుడు సమకూర్చారు. ఈయనను చిత్రసీమలో సంగీతయ్య అని పిలిచేవారట. ఈ చిత్రం లోని మరొక చక్కని యుగళగీతం ఘంటసాల, రాధాజయలక్ష్మి పాడిన "కన్నుల బెళుకే కలువలురా". ఈ పాటను ఇదివరలో మా బ్లాగులో పోస్టు చేసాను. నిజానికి రాధ, జయలక్ష్మి గారు అక్కచెల్లెళ్ళు. వీరు శాస్త్రీయ సంగీతంలో పేరుగన్న వారు. చిత్రంలో పాడినది జయలక్ష్మి గారు. ఆవిడ తన సోదరి రాధ పేరును కలిపి రాధాజయలక్ష్మి అని చిత్రం లో వాడారు. ఇక్కడ ఈ చిత్రం లోని మరొక మధురమైన గీతం "కన్నుల్లో నీ బొమ్మ చూడు" ఆలకించి ఆనందించండి. నాయికానాయకుల అద్బుత హావభావాలు ప్రస్ఫుటించే ఈ రసవత్తరమైన శృంగార గీతాన్ని రచించినది ముద్దుకృష్ణ.
Thanks to VEGA music for posting the video clip to You Tube
చిత్రం: | విమల (1960) | |
రచన: | ముద్దుకృష్ణ | |
గానం: | ఘంటసాల, రాధా జయలక్ష్మి | |
సంగీతం: | ఎస్.ఎమ్. సుబ్బయ్య నాయుడు | |
పల్లవి: | ఘంటసాల: | కన్నుల్లో నీ బొమ్మ చూడు |
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు | ||
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడూ..ఊ.. | ||
కన్నుల్లో నీ బొమ్మ చూడు | ||
చరణం: | రాధాజయలక్ష్మి: | పున్నమ వెన్నెల వన్నెలలో....ఓ...ఓ.. ఆ...ఆ..ఆ..ఆ.. |
పున్నమ వెన్నెల వన్నెలలో, కన్నుల కట్టిన రూపముతో | ||
నీవే మనసున తోచగా... ఆ..ఆ.. | ||
నీవే మనసున తోచగ, నను నేనే మరిచిపోదురా… | ||
ఘంటసాల: | కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు | |
కన్నుల్లో నీ బొమ్మ చూడు... | ||
చరణం: | ఘంటసాల: | కోయిల పాటల తీరులతో.. ఓ..ఓ… |
కోయిల పాటల తీరులతో, సరిపోయిన రాగాలల్లుదమా | ||
సరిపోయిన రాగాలల్లుదమా | ||
రాధాజయలక్ష్మి: | నచ్చిన పూవు గద నేను... | |
నచ్చిన పూవు గద నేను, కోరి వచ్చిన తుమ్మెద నీవెరా.ఆ..ఆ | ||
కన్నుల్లో నీ బొమ్మ చూడు | ||
ఘంటసాల: | నా కన్నుల్లో నీ బొమ్మ చూడు | |
చరణం: | ఘంటసాల: | రాగమాలికల వీణ నీవే.. ఏ..ఏ. |
రాగమాలికల వీణ నీవే, అనురాగములేలే జాణనేనే | ||
అనురాగములేలే జాణనేనే | ||
రాధాజయలక్ష్మి: | నీవే వలపుల జాబిలిరా... ఆ...ఆ..ఆ.. | |
నీవే వలపుల జాబిలిరా, మరి నేనే కులుకుల వెన్నెలరా | ||
కన్నుల్లో నీ బొమ్మ చూడు | ||
ఘంటసాల: | నా కన్నుల్లో నీ బొమ్మ చూడు | |
ఇద్దరు: | అది కమ్మని పాటలు పాడు | |
కన్నుల్లో నీ బొమ్మ చూడు | ||
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు | ||