1950లో సాధనా బ్యానర్ పై నిర్మింపబడిన సంసారం చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడిన మధుర గీతం. సాహిత్యం-సదాశివబ్రహ్మం మరియు సంగీతం-సుసర్ల దక్షిణామూర్తి.
Thanks to GVS Sastry for the video
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
నిర్మాణం: | శ్రీరాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ వారి | |
చిత్రం: | ఆప్తమిత్రులు (1963) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల, పి.లీల | |
నిర్మాత & | దర్శకత్వం: | కె.బి.నాగభూషణం |
పల్లవి: | ఘంటసాల: | రావే చెలీ ఈ వేళ, అనురాగాల భోగాల తేలా..ఆ.. |
రావే చెలీ ఈ వేళ | ||
పి.లీల: | ఈ చిన్నదే నీదోయి చెయిచాచి నిన్నే కోరునోయీ..ఈ.. | |
ఈ చిన్నదే నీదోయి | ||
చరణం: | పి.లీల: | అందాల పూల చందాలు చూచి డెందాన పొంగారె ఆనందమే.. |
ఘంటసాల: | ఆ…ఆ….ఆ..ఆ... | |
పి.లీల: | అందాల పూల చందాలు చూచి డెందాన పొంగారె ఆనందమే | |
అందాని పూవుల పందిళ్ళలో (2) ఆనందాలు జవరాలి సందిళ్ళలో | ||
రావే చెలీ ఈ వేళ | ||
చరణం: | ఘంటసాల: | నా వూహలేలే ఆ ఊర్వశీ, నన్నూరించు రాధ నీవే ప్రేయసి |
పి.లీల: | అహహా..హహా..అహాహా.. | |
ఘంటసాల: | నా వూహలేలే ఆ ఊర్వశీ, నన్నూరించు రాధ నీవే ప్రేయసి | |
పి.లీల: | నే రాధనై నీవు గోవిందుడై..ఐ…(2) చరియించు ఈ వని బృందావనీ.. | |
ఈ చిన్నదే నీదోయి | ||
చరణం: | పి.లీల: | సురలోకమన్నది నిజమో కలా? సుఖచిందు ఈ సీమె మన స్వర్గము |
ఘంటసాల: | హాయ్, సోలేములే సఖి తొలి ప్రేమలా.. | |
సరదాలా ఈ లీలా సరాగాలా | ||
రావే చెలీ ఈ వేళ, అనురాగాల భోగాల తేలా | ||
ఈ చిన్నదే నీదోయి చెయిచాచి నిన్నే కోరునోయీ |
నిర్మాణం: | కవితా చిత్ర వారి | ||
చిత్రం: | వాగ్దానం (1961) | ||
రచన: | దాశరథి (తొలి సినీ గీతం) | ||
సంగీతం: | పెండ్యాల నాగేశ్వరరావు | ||
గానం: | ఘంటసాల, సుశీల | ||
దర్శకత్వం: | ఆచార్య ఆత్రేయ | ||
సుశీల: | ఊ..ఊ..ఊ….ఊ…ఊ…. | ||
పల్లవి: | నా కంటి పాపలో నిలిచి పోరా.. నీ వెంట లోకాల గెలువనీరా | ||
నా కంటి పాపలో నిలిచి పోరా, నీ వెంట లోకాల గెలువనీరా | |||
ఘంటసాల: | ఆ..ఆ..ఆ…ఆ.ఆ..ఆ…..ఆఆ.ఆ…ఆ.అ.ఆ..ఆ | ||
చరణం: | సుశీల: | ఈనాటీ పున్నమీ, ఏనాటీ పున్నెమో జాబిలీ వెలిగేను మనకోసమే | |
ఘంటసాల: | ఆ..అహా..ఆ..ఆ.. | ||
సుశీల: | ఈనాటీ పున్నమీ, ఏనాటీ పున్నెమో జాబిలీ వెలిగేను మనకోసమే | ||
ఘంటసాల: | నెయ్యాలలో తలపుటుయ్యాలలో - 2, అందుకొందాము అందని ఆకాశమె | ||
సుశీల: | నా కంటి పాపలో నిలిచి పోరా.. నీ వెంట లోకాల గెలువనీరా | ||
చరణం: | ఘంటసాల: | ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా | |
సుశీల: | ఆహా..హాహా ఆ..ఆ..ఆ.. | ||
ఘంటసాల: | ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా | ||
సుశీల: | మేఘాలలో వలపు రాగాలలో..ఓ. -2, దూరదూరాల స్వర్గాల చేరుదమా? | ||
సుశీల: | నా కంటి పాపలో నిలిచి పోరా.. నీ వెంట లోకాల గెలువనీరా | ||
చరణం: | సుశీల: | ఈ పూల దారులు, ఆ నీలి తారలు, తీయని స్వప్నాల తేలించగా | |
ఘంటసాల: | ఆహా..హా..ఆ..ఆ. | ||
సుశీల: | ఈ పూల దారులు, ఆ నీలి తారలు, తీయని స్వప్నాల తేలించగా | ||
ఘంటసాల: | అందాలను, తీపి బంధాలను -2, అల్లుకొందాము డెందాలు పాలించగ | ||
సుశీల: | నా కంటి పాపలో నిలిచి పోరా.. నీ వెంట లోకాల గెలువనీరా | ||
ఇద్దరు: | ఆ..ఆ..ఆ..ఆఆఆ..ఆ..ఆ..ఆ…ఆ.. | ||
సుశీల: | నా కంటి పాపలో నిలిచి పోరా.. నీ వెంట లోకాల గెలువనీరా |
చిత్రం: | పెళ్ళికాని పిల్లలు (1961) | ||
రచన: | ఆరుద్ర | ||
సంగీతం: | మాస్టర్ వేణు | ||
గానం: | ఘంటసాల, పి.సుశీల | ||
పల్లవి: | ఘంటసాల: | అనగనగా ఒక చిన్నదీ, ఆకాశంలోనున్నదీ | |
అక్కల పెళ్ళీ అయ్యేదాకా చిక్కను పోవోయ్ అన్నదీ.. | | అనగనగా | | ||
అనగనగా ఒక చిన్నది | |||
చరణం: | సుశీల: | పరులకు పెళ్ళీ జరిపేవాడు వలచినదానీ మరిచాడు (2) | |
ఘంటసాల: | మరిచాననుకుని తలచేలోగా మగువచెంతనే నిలచాడు | ||
అనగనగా ఒక చిన్నది, అభినవ ఊర్వశినన్నది | |||
ఓడినవెంటనె మనసును గెలిచి వయ్యారముగానున్నది | |||
అనగనగా ఒక చిన్నది, అభినవ ఊర్వశినన్నది | |||
సుశీల: | ఆటల పాటల ఆడువారిని ఆడించుట మీ పరిపాటి (2) | ||
ఘంటసాల: | వాలుచూపుతో (2) కీలుబొమ్మలా ఆడించకు నను వగలాడి | ||
ఆడించకు నను వగలాడి | |||
చరణం: | సుశీల: | తీయనిపాటల హాయిగ పాడి కోయిలయేదో కోరినది | |
తనమది దోచిన పాటగానికీ (2), దాసురాలిగా మారినదీ..(2) | |||
తీయనిపాటల హాయిగ పాడి కోయిలయేదో కోరినది | |||
ఘంటసాల: | అనగనగా ఒక చిన్నది, అతిశయమెంతో వున్నది | ||
రౌడీమూకలు రభసచేయగా రక్షించండోయ్ అన్నది | |||
అనగనగా ఒక చిన్నది, అతిశయమెంతో వున్నది | |||
సుశీల: | ఎందరినైనా ఎడమచేతితో కిందికి తోసే మీకు సలాం (2) | ||
ఘంటసాల: | అంతటి ధీరుడు, అంతటి వీరుడు (2) అయినాడిదిగో నీకు గులాం | ||
ఇద్దరు: | ఆహాహాహహ హాహహా ఆహాహహహ హాహహా (2) |
చిత్రంః | ఆస్తిపరులు | |||
రచనః | ఆచార్య ఆత్రేయ | |||
సంగీతంః | కె.వి. మహదేవన్ | |||
గానంః | ఘంటసాల | |||
ప. | మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా | |||
ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా (2) | । మిడిసి । | |||
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రారా | ||||
చ. | దోరవయసు అలవి కాని భారమయింది | |||
ఆ బరువు మోయలేక నడుము పలచబడింది | । దోర । | |||
నడుములేని నడకే ఒక నాట్యమయింది (2) | ||||
చూచి చూచి బావ మనసు సొమ్మసిలింది.. సొమ్మసిలింది | । మిడిసి । | |||
చ. | అత్తకూతురంటేనే హక్కు ఉందిలే | |||
అల్లరెంత చేసినా చెల్లుతుందిలే | । అత్త । | |||
ముక్కుతాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులు (2) | ||||
ఇంత అత్త కూతురూ కొత్త పెళ్ళి కూతురే కొత్త పెళ్ళి కూతురే | । మిడిసి । |
కొమ్మగాదిది బంగారు బొమ్మగాని | ||
ఇంతిగాదిది జాజిపూబంతిగాని | ||
కలికిగాదిది మరుని పూమొలికిగాని | ||
భామకాదిది లావణ్యసీమగాని |
ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో | ||
విని కృష్ణుండది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుం | ||
డనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్ | ||
నను రక్షింప ఎరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో |