1972 లో ఎన్.టి.రామారావు త్రిపాత్రాభినయంతో నటించిన ఎన్.టి.ఆర్. మరియు అతని సోదరుడు త్రివిక్రమరావు సంయుక్తంగా రామకృష్ణ-ఎన్.ఏ.టి. పతాకంపై నిర్మించిన చిత్రం కులగౌరవం. ఈ చిత్రంకోసం కొసరాజు వ్రాసిన చక్కని గీతం మాతృత్వంలోనె వుంది ఆడజన్మ సార్ధకం. స్త్రీ పురుషుల అనుబంధం ఎంత గొప్పదో వివరించే ఆహ్లాదకరమైన గీతమిది. సహజమైన పదప్రయోగాలతో హైందవ సంప్రదాయాలకు అద్దంపడుతూ వ్రాసిన ఈ పాట చిరకాలం నిలచి ఈనాటికీ వింటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చినది టి.జి.లింగప్ప. ఈయన ఎక్కువగా కన్నడ మరియు తమిళ చిత్రాలకు సంగీత దర్శకులుగా పనిచేశారు.
ప్రతి మనిషికి తన భార్యా పిల్లల గురించి ఎన్నో కలలుంటాయి. తన ఆశయాలతో ఆశాసౌధాలు నిర్మించుకుంటాడు. కాని జీవితం విచిత్రమైనది. సంసార ఝంఝాటంలో ఒకోసారి ఓడలు బండ్లవుతాయి. మరొకసారి బండ్లు ఓడలౌతాయి. మనిషి కట్టుకున్న ఆశా సౌధాలే ఒక్కోసారి గాలిమేడలు అవుతాయి. అవసాన దశలోవున్నపుడు అశాశ్వతమైన ఆస్తిపాస్తులు అండదండలుగా వుండవని గ్రహిస్తాడు. కులమతాలకు, స్థితిగతులకు తావివ్వక తనకు సేదదీర్చి, ఇంత కూడుపెట్టి ఆదుకునే యువకుని చూచి అలాంటి కొడుకుంటే చాలని కొడుకును పోగొట్టుకున్న ఆ తండ్రి అనుకుంటాడు. అలాగే చిన్నతనం నుండి నా అనేవారు లేక బ్రతుకు బండిని లాగే ఆ యువకుడు దీన స్థితిలో నిస్సహాయుడైయున్న ఆ ముసలివానికి సేవ చేసి తృప్తి పడతాడు. అతనిలో తన తండ్రిని చూసుకుంటాడు. కాని అతడే తన తండ్రి అని తెలియదతనికి. ఈ ఇతివృత్తం తో నిర్మించబడిన చిత్రం "గాలి మేడలు". విధి ఆడిన ఆటవలన దూరమయి, అనుకోని పరిస్థితులలో చేరువయిన తండ్రీ కొడుకులుగా నాగయ్య, ఎన్.టి. ఆర్. నటించిన హృద్యమైన ఈ సన్నివేశానికి అనుగుణంగా సముద్రాల రాఘవాచార్య రచన 'మమతలు లేని మనుజులలోన', ఎటువంటి కరడుగట్టిన హృదయాన్నైనా కదిలిస్తుంది, కరిగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ భావాన్ని అద్భుతంగా పలికించి అజరామరం చేసినది ఘంటసాల మాస్టారు.సంగీతం టి.జి.లింగప్ప.
చిత్రం:
గాలి మేడలు (1962)
రచన:
సముద్రాల రాఘవాచార్య
సంగీతం:
టి.జి.లింగప్ప
గానం:
ఘంటసాల వెంకటేశ్వర రావు
పల్లవి:
మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో
మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో
చరణం:
ఏ కులమైనా, నెలవెదియైనా మదిలో కూరిమీ జాలుకొనా
ఏ కులమైనా, నెలవెదియైనా మదిలో కూరిమీ జాలుకొనా
పిలిచీ లాలించీ, కొడుకూ చందానా
పిలిచీ లాలించీ, కొడుకూ చందానా
చూచి కాచే దాతే నాయన కాదా!
మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో
చరణం:
మాటలు నమ్మి, మనసు నీరై, దరికి తీసిన తండ్రులను
మాటలు నమ్మి, మనసు నీరై, దరికి తీసిన తండ్రులను
దేవుని చందానా, తలచీ, పూజించి
దేవుని చందానా, తలచీ, పూజించి
కొలువు చేసేవాడే కొడుకౌ గాదా!
మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో
ఆ..ఆ..ఆ..ఆ..ఊ..ఊ..ఊ..
Thanks to Sri Bollapragada Someswara Rao garu for providing the movie poster.
గాలి
మేడలు చిత్రంకోసం గాయని రేణుక పాడిన ఒకే ఒక పాట “ఈ మూగచూపేలా”. సినిమాలో దీనిని ఎన్.టి.ఆర్.,
దేవికలపై చిత్రీకరించారు. ఈ రేణుక కుమార్తె మనకు చిరపరిచితమైన తెలుగు, తమిళ, కన్నడ,
హిందీ భాషలలో ఎన్నో పాటలు పాడిన కర్నాటక, హిందుస్తానీ సంగీతంలో ప్రవేశమున్న సినీ నేపథ్యగాయని
అనురాధా శ్రీరామ్ పరశురాం. ఈ చిత్ర నిర్మాత బి.ఆర్.పంతులు ఇదే చిత్రాన్ని ఏకకాలంలో
కన్నడ భాషలో “గాలిగోపుర” అనే పేరుతో రాజ్ కుమార్, లీలావతి ప్రధాన తారాగణంగా నిర్మించారు.
కన్నడ చిత్రానికి ఇవే బాణీలతో మాస్టారు, రేణుక ఆలపించారు.
#00
యుగళం:
పాట:
ఈ మూగ చూపేలా బావా
నిర్మాణం
పద్మిని పిక్చర్స్
చిత్రం:
గాలి మేడలు (1962)
రచన:
సముద్రాల రాఘవాచార్య
సంగీతం:
టి.జి.లింగప్ప
గానం:
ఘంటసాల, రేణుక
ప:
రే:
ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
ఘం:
ఓ.. హో.. మాటాడదే బొమ్మా నీ దరి నే చేరి మాటాడనా
రే:
ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
ఘం:
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
చ:
రే:
రెప్పెయ్యకుండా ఒకే తీరున నువ్వు చూస్తే నాకేదో సిగ్గౌతది
ఘం:
ఓ.. హో.. హో...ఓ..ఓ
రే:
రెప్పెయ్యకుండా ఒకే తీరున నువూ చూస్తే నాకేదో సిగ్గౌతది
ఘం:
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే -2
చెయ్యి చేయీ చేరా విడిపోవులే
రే:
ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
ఘం:
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
చ:
రే:
చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝిల్లంటది
ఘం:
ఆ.హా.. హా...హా... ఆ..ఆ..
రే:
చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝిల్లంటది
ఘం:
నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే -2
నా మనసే అదోలాగ జిల్లంటదే...
రే:
ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
ఘం:
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
చ:
రే:
జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్నచిన్నారి తొలిమోజులూ
ఘం:
ఓ.. హో.. హో... హో ... ఓ..ఓ..
రే:
జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్నచిన్నారి తొలిమోజులూ
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com