11, అక్టోబర్ 2013, శుక్రవారం

అరుదైన 'ఫరజు' రాగంలో మాస్టారి శాస్త్రీయ గాయనం

విజయనగరములోని సంగీత కళాశాలలో విద్యనభ్యసించిన సంగీత విశారదులు ఘంటసాల మాస్టారు దక్షిణ భారత చలన చిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందేరు. రాగాల నిర్దేశంలో మాస్టారి స్వరజ్ఞాన పటిమను తరాజు తో తూచి బేరీజు వేయడం అసాధ్యం. భావానుగుణమైన రాగాన్ని పరిగణలోకి తీసుకుని పాటకు వన్నె తేవడం వారికి వెన్నతో పెట్టిన విద్య.  కర్ణాటక సంగీతంలో గల పలు ప్రక్రియలలో సంగీత కచేరీలలో ఆఖరున పాడే తిల్లానాలు స్వరజతుల సంగమమై వడితో దూసుకుపోయే జలపాతంలా శ్రవణానందంగా వుంటాయి. అయితే సినీ సంగీతంలో వీటి వాడుక అరుదు. ఈ స్వర ప్రక్రియను "సుదతి నీకు తగు చిన్నదిరా" అనే పాటకోసం "ఫరజు" రాగంలో కూర్చారు మాస్టారు తన సంగీత నిర్దేశకత్వంలో విడుదలైన "లక్ష్మమ్మ" (1950) చిత్రంలో. ఈ చిత్రంలో నాయికానాయకులు మాలతి (పాతాళ భైరవి కథానాయిక) మరియు సి.హెచ్.నారాయణ రావు. అయితే 'సుదతినీకు తగు చిన్నదిరా' తిల్లానాను సి.ఐ.డి. చిత్రంలో మొత్తం పాటను మరింత పరిణితి చెందిన కంఠంతో అద్భుతంగా సుశాస్త్రీయంగా గానం చేశారు ఘంటసాల మాస్టారు. ఈ వివరాలను రాగ లక్షణాలను ఘంటసాల-రాగశాలలో వివరిస్తారు మిత్రులు చంద్రమౌళి గారు.

“ఫరజు” అనే అపురూపమైన రాగం, 15 మేళకర్త రాగమైన మాయామాళవగౌళ జన్యం.  మాయామాళవగౌళ రాగానికి సంగీత శిక్షణపద్ధతిలో విశిష్టమైన స్థానమున్నది. ఇందులోని పూర్వాంగ ఉత్తరాంగ స్వరాల నడుమ ధ్వనిస్థానముల నిడివి పాడుకొనుటకు సులభమైనది. ఆ కారణంగానే కర్ణాటసంగీత పితామహుడైన పురందరదాసు, ఈ రాగంలోనే సరళీ వరుసలు, జంట వరుసలు, మరియు అలంకారాలను రచించటంతోపాటు, జన్య రాగమైన 'మలహరి'లో పిళ్ళారి గీతాలను రచించి బహుళ ప్రచారం చేశారు. మాయామాళవగౌళ జన్యరాగప్రవాహంలో వందిలాది జన్య రాగాలున్నాయి. అందులో కొన్ని ప్రముఖ జన్య రాగాలు: గౌళ, భౌళి, మలహరి, సారంగనాట, నాదనామక్రియ, లలిత పంచమం, మారువ, మేఘరంజి, పాడి, గౌళిపంతుఘోర్జరి, గుండక్రియ, సౌరాష్ట్రము, కమలామనోహరి, రేగుప్తి, సింధురామక్రియ, గౌరి మరియు ఫరజు.

ఫరజు రాగం
ఫరజు రాగం స్వరాలు :  శుద్ధ రిషభం, అంతరగాంధారం, శుద్ధమధ్యమం, శుద్ధ దైవతం, కాకలినిషాదం. 'సగమపదని’ ఆరోహణ, 'సనిదపమగరి’ అవరోహణ. ఇది ఉపాంగ, షాడవ-సంపూర్ణమైన, భక్తి-రక్తి ప్రబోధకమైన రాగం. కొన్నిరాగాలు ప్రసిద్ధమైన కృతియొక్క ఆధారంగా నిలుస్తాయి. అలా ప్రయోగ ప్రధానమైన రాగమిది. మరొక జన్య రాగం - పంచమంలేని మాయామాళవగౌళమే లలితరాగం. లలితరాగం అవరోహణంలో పంచమం ప్రవేశమైనట్లయితే అది లలితపంచమం అనే రాగం. అంటే లలిత’ కు పంచమం చేర్చడం. ఫరజు రాగానికి మరియు లలితపంచమానికి ఒకే మూర్ఛన!. ఫరజులో కీర్తనలు ఎక్కువగా కనపడవు. ముత్తుస్వామి దీక్షితుల “శ్రీ శుక్రభగవంతం” అనే నవగ్రహస్తుతి మనకు తెలిసినదే. ఈ రాగంలో పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్ రచించిన “తధీంధీంతనననా” అనే తిల్లాన ప్రసిద్ధమైనది. కొన్ని తిల్లానాలూ జావళీలూ తప్ప ఈ రాగంలో ఎక్కువ కృతులు అరుదనే చెప్పాలి.  త్రిలోకమాత అను శ్యామ శాస్త్రి రచనను ఈ మధ్యనే శ్రీ వినయ్ శర్మ గారు పాడగా విన్నాను.  సమాహారంగా ఆ కృతిని వినగలరు.

 Audio file - Courtesy: M.R.Chandra Mowly

'తిల్లాన' 
'తిల్లాన' పదముయొక్క మూలం మనకు ఖచ్చితంగా తెలియదు. తిరితిల్లాన అను దేశ్యప్రబంధం, తి,ల్లా,న అను అక్షర ప్రయుక్తమైనది గనుక తిల్లానకు మూలం అదియేనని, ‘తరాన’ అను హిందూస్థాని రచనాక్రమము దీనికి మూలమని అనేక అభిప్రాయాలున్నవి. ఇక ప్రయోగవిషయంలో, 18వ శతాబ్దానికి చెందిన తంజావూరు ప్రతాపసింహుని కొలువులో విద్వాంసుడైన వీరభద్రయ్య తిల్లాన ప్రథమ రచయితయని, తంజావూరు సహోదర చతుష్టయం కృషితో భరతనాట్యాంగమై తిల్లాన ప్రాచుర్యము పొందినది అని విజ్ఞులు చెప్పుదురు.  కృతులలాగే, తిల్లాన రచనాప్రక్రియలో, పల్లవి, అనుపల్లవి, చరణమను ఖండత్రయములు గలవు. పల్లవి అనుపల్లవులలో హస్తపాటములతో కూర్చిన నానా విధములైన జతులు మరియు చరణమున జతులతో స్వరసమూహములూ మిశ్రమై యుంటాయి. సాహిత్యభాగం బహు మితమై, ప్రభు-దేవతాస్తుతులను కూడియున్నా ప్రసిద్ధమైన తిల్లానాలలో శృంగారప్రధానమైన నాయకీభావమే ఎక్కువ. జతుల ఛందోలయవిన్యాస సౌందర్యం ద్వారా భక్తి-రక్తుల రససేచనజేయు తిల్లానా సంయోజనం, కచేరి గాయనంకన్నా నృత్యభాగాలలోనే ఎక్కువ.

మేళత్తూరు వీరభద్రయ్య, స్వాతి తిరునాళ్, మహావైద్యనాథభాగవతార్, పట్టణం సుబ్రహ్మణ్య అయ్యర్, రామనాడ్ శ్రీనివాస అయ్యంగార్, ముత్తయ్యభాగవతార్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, లాల్గుడి జయరామన్ మున్నగువారు తిల్లానా ప్రముఖ రచయితులు. బాలమురళికృష్ణగారు ఎంతో నవ్యత  మరియు వైవిధ్యాలతో రచించిన తిల్లానాలు స్వరప్రప్రంచంలో సుప్రసిద్ధమే.

ఘంటసాల స్వనిర్దేశకత్వంలో పాడిన తిల్లాన

పాత సినిమాలలో నృత్యసన్నివే భాగమై ప్రసిద్ధ తిల్లానాలు, జావళులూ ప్రయోగింపబడినాయి. నృత్యమణులైన  లలిత, రాగిణి, పద్మిని మరియు ఎల్.విజయలక్షి ఎన్నో జావళులకు, తిల్లానాలకు అభినయరూపాన్నిచ్చారు.

శోభనాచల మరియు ఎమ్.ఆర్.ఏ వారు 1950లో నిర్మించిన ‘లక్ష్మమ్మ’ చిత్రానికి సంగీత దర్శకులు ఘంటసాల. బెజవాడ రాజరత్నం తో కలిసి ఆయన ఈ తిల్లానాని పాడారు.  ఆ సినిమా పాటల వివరాలలో పాటల రచయిత బాలాంత్రపు రజనీకాంతరావుగారి పేరు వున్నాఇది ఆయన రచనకాదు. ఈ తిల్లాన ఎన్నో దశాబ్దాలనుండి పట్ణం సుబ్రహ్మణ్యయ్యర్ రచనగానే ప్రసిద్ధం. ఘంటసాల శాస్త్రీయ సంగీతం నేర్చుకొనే రోజుల్లో ఈ తిల్లానాని పాడుతుండేవారేమో తెలియదుగాని ‘వాతాపి గణపతిం’ మినహాయిస్తే ఈ యొక్కతిల్లాన మాత్రమే ఆయన పాడిన కర్ణాటక శాస్త్రీయ సంగీతకృతియని చెప్పుకోదగినది. ఆయన దర్శకత్వం గనుక ఖచ్చితముగా ఈ తిల్లాన గురుముఖేన నేర్చియుంటారు. ఎందుకనగా తిల్లానాలు పాడడం మామూలు పాటపాడినంత సులువుగాదు. 1950 లో, తన శాస్త్ర్రీయసంగీతానికి అనువైన గాత్రమునూ, ఒక నట్టువాంగకారుడు తిల్లానాలను పాడే తీరును మనం వినవచ్చు.


లక్ష్మమ్మ చిత్రం తరువాత దాదాపు 15 సంవత్సరాల అనంతరం ఘంటసాల తన స్వీయ దర్శకత్వంలో విజయా వారి సి.ఐ.డి. చిత్రం కోసం ఫరజు రాగంలో తిల్లానా పాడారు. లక్ష్మమ్మ చిత్రం లో ఒక పెళ్ళి సంబరంలో ఒక నర్తకి నాట్యం చేయగా మాస్టారు ఒక నాట్యాచార్యునికి నేపధ్యంగా పాడగా, సి.ఐ.డి. చిత్రానికి మరొక నాట్యాచార్యునికి (రమణారెడ్డి) పూర్తి తిల్లానాను పాడారు. లక్ష్మమ్మ లో పెళ్ళికొడుకుగా సి.హెచ్.నారాయణ రావు, పెళ్ళికూతురుగా మాలతి (పాతాళభైరవి కథానాయిక) నటించారు. సి.ఐ.డి. చిత్రంలో మీనాకుమారి నాట్యానికి రమణారెడ్డి పాడతాడు. పదిహేను సంవత్సరాల తరువాత సి.ఐ.డి. చిత్రంలో మాస్టారి గళం మరింత ప్రశస్తంగా వినిపిస్తుంది. అయితే అభినయం అంత గొప్పగా లేకపోయినా మాస్టారి గాయనం లో శాస్త్రీయత ఉట్టి పడుతుంది.



Audio file Source: From the video


               తిల్లాన: రాగం: ఫరజు;   ఆదితాళం: రచన: పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్
          ఆరోహణం: సగమపదనిస (SG3M1PD1N3S)
          అవరోహణం: సనిదపమగరిస (SN3D1PM1G3R1S)
పల్లవి: సనీ దాపపమ |పా, పమ గమద | దపమగా మమగగరిరి| సామమగగమమ పదపమ పదపద |
         తధీంధీంతతన |నం, తొం  తదర  | తకిటధీం తం-కి-ట-తక|    తా-కి-ట-కి-ట-త-క తకుందరి కిటతక|
         దాదదదా,, నీనినినీ,,| ససరిసనిసాస | సనిసగామమగ సస,| సస సానినిదదపా |
         నాదిరిధీం,,నాదిరిధీం,,| తదియన రధీంత| ఉదరదానితొంద్ర| దని, తిరునాదిరిదిరితొం|
         సామమగమదా పాదాపదపద| మమపా మప పదపద నినిసస| సగసరీనిసాపపదా|పదమపా,, పదపమ 
         పపదా|
         తాఝణుతకధీంత తకఝణు| తకధీం, త తకుదరి కిటతక| తద్ధీతళంగుతోం,, తకదధి కిటాతోం|

చరణం: సనిద పామగమ పదపమగరిగా | మగమగారిసని సమగమ పదనీ |        
         సుదతి నీకుతగిన చి..న్నదిరా |సురతకేళికది బలుసూ..టిరా|
         సనిదపాదనీ సగామగరిసని | సనిదప మగమప పమగా,మ గమపద|
         సదయుడైన వేంకటేశ్వరానిను|సరగునరమ్మనెరా..సమయముర|| తధీం ||
 
(ఈ స్వరసాహిత్యం మా గురువైన కీ.శే. కోటమరాజు వేంకటేశుగారు చెప్పగా దశాబ్దాలకింద నేను రాసుకున్నది. ఆయన ప్రఖ్యాత సంగీత విద్వాంసులైన జి.ఎన్.బాలసుబ్ర్రహ్మణ్యంగారి శిష్యులు. కల్యాణరామన్, ఎమె.ఎల్.వసంతకుమారి గార్లు ఆయన సహాధ్యాయులు. వారందరికి ఈ తిల్లాన పాఠం జి.ఎన్.బి. ఎలా నేర్పేవారో, మా గురువుగారు చెబుతుండేవారు.వ్యాసంతో ఆయన నాదాత్మకు నా నమస్సులు తెలియజేస్తున్నాను - ఎం.ఆర్.చంద్రమౌళి.)

అందరికీ దసరా శుభాకాంక్షలు

Thanks: To Sri Bollapragada Someswara rao garu for the providing the movie poster and to Sri M.R.Chandra Mowly garu for providing the video clips, to Ghantasala Galamrutamu-Patala Palavelli and Wikepedia for the information and you tube for posting the videos.

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (2) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (4) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (2) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (4) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (2) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కధ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (3) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (6) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (87) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (55) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (36) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (13) సం-ఓగిరాల (2) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (85) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (33) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (40) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (15) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (20) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (41) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (2) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (4) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (27) ర-బమ్మెఱ పోతన (2) ర-బలిజేపల్లి (1) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (29) ర-సదాశివ బ్రహ్మం (8) ర-సదాశివబ్రహ్మం (1) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (44) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1)