7, ఏప్రిల్ 2012, శనివారం

శ్రీ వేంకటేశ్వర వైభవం - మూడు, నాలుగు భాగములు, ఘంటసాల పాట - ఏడుకొండల శ్రీనివాసా!

1972 లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రం శ్రీ వేంకటేశ్వర వైభవం. ఈ చిత్రంలో తిరుమల మరియు తిరుపతిలో గల యాత్రా స్థల విశేషాలు, యాత్రికులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, చూడవలసిన ప్రదేశాలు, ఆలయములో స్వామివారికి జరిగే నిత్య సేవల వివరాలు కళావాచస్పతి శ్రీ కొంగర జగ్గయ్య గారి వ్యాఖ్యానంతో వివరించబడ్డాయి. సంగీతాన్ని శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సమకూర్చారు. ఘంటసాల, మంగళంపల్లి, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలు, సుశీల, విజయలక్ష్మి, శ్రీరంగం గోపాలరత్నం, బి.వసంత తదితరులు నేపథ్య గానం అందించారు. ఆచార్య ఆత్రేయ, సి.నా.రె., ఏడిద కామేశ్వరరావు గార్లు  పాటలు, డి.రామారావు గారు పద్యాలు వ్రాసారు. ఆచార్య ఆత్రేయ వ్రాయగా, ఘంటసాల మాస్టారు పాడిన ఏడుకొండల శ్రీనివాసా అనే భక్తిగీతం నాలుగవ భాగం వీడియోలో వస్తుంది.  వెంకటేశ్వర సుప్రభాతం మొదటినుండి వినడానికి ఇంతకు ముందు పోస్టు చేసిన 
మొదటి, రెండవ భాగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మూడవ భాగం
Thanks to "nikilkvn" for kindly loading this video to You Tube.

నాలుగవ భాగం
Thanks to "nikilkvn" for kindly loading this video to You Tube.
                              
                              చిత్రం:      శ్రీ వేంకటేశ్వర వైభవం (1971)
                              రచన:      ఆచార్య ఆత్రేయ 
                              సంగీతం:  సాలూరు రాజేశ్వర రావు
                              గానం:     ఘంటసాల, బృందం
                                             ఈ పాట వీడియో నాలుగవ భాగంలో 3 నిముషాల 10 సెకండ్లకు మొదలవుతుంది.


పల్లవి: ఘంటసాల: ఏడుకొండల శ్రీనివాసా!


ఏడుకొండల శ్రీనివాసా! మూడు మూర్తుల తిరుమలేశా!


ఏడేడు జన్మల పాపముల నెడబాపి బ్రోచే వేంకటేశా! ఆ.. ఆ..చరణం: ఘంటసాల: కోటికీ పడగెత్తినా ధనవంతుడూ

బృందం: కోటికీ పడగెత్తినా ధనవంతుడూ


నీ గుడి ముంగిటా సామాన్యుడూ


కూటికోసం శ్రమపడే నిర్భాగ్యుడూ

బృందం: కూటికోసం శ్రమపడే నిర్భాగ్యుడూ


నీ కృపకెప్పుడూ సమ పాత్రుడూ

బృందం: ఏడుకొండల శ్రీనివాసా! మూడు మూర్తుల తిరుమలేశా!


గోవిందా! గోవిందా!చరణం: ఘంటసాల: మమకారాలూ వుండరాదని మా తలనీలాలు తీసుకొందువు


నీది నాదని ఏది లేదని నిలువుదోపిడి వొలుచుకొందువు 


వెళ్ళునపుడూ వెంటరాదని ముడుపులన్నీ ఊడ్చుకొందువు 


అడుగడుగునా..  అడుగడుగునా వేదాంతమున్నది 


నీ ఆరాధనలో సాధనున్నది 

బృందం: ఏడుకొండల శ్రీనివాసా! మూడు మూర్తుల తిరుమలేశా!


గోవిందా! గోవిందా!చరణం: ఘంటసాల: ఆసేతు సీతాచలము నీవే దైవము

బృందం: ఆ..ఆ..ఆ..ఆ..

ఘంటసాల: ఆబాల గోపాలమ్ము నిన్నే కొల్తుము 

బృందం: ఆ..ఆ..ఆ..ఆ..

ఘంటసాల: నీ దివ్య మంగళ రూపము

బృందం: ఆ..ఆ..ఆ..ఆ..

ఘంటసాల: మా నిత్య దర్శన తేజము

బృందం: ఆ..ఆ..ఆ..ఆ..

ఘంటసాల: నీ పాద పద్మ యుగళము 

బృందం: ఆ..ఆ..ఆ..ఆ..

ఘంటసాల: సంసార సాగర తరళము 

బృందం: ఏడుకొండల శ్రీనివాసా! మూడు మూర్తుల తిరుమలేశా!

ఘంటసాల: ఏడేడు జన్మల పాపముల నెడబాపి బ్రోచే వేంకటేశా! ఆ.. ఆ..

బృందం: ఏడుకొండల శ్రీనివాసా! మూడు మూర్తుల తిరుమలేశా!

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

ధూర్జటి పై దూకిన వికటకవి - తెనాలి రామకృష్ణ నుండి మాస్టారి గొంతులో

శ్రీ కృష్ణదేవ రాయల ఆస్థానంలో గల సంగీత పీఠాన్ని భువనవిజయం అంటారు.  రాయలు తెలుగు భాషకు ఎనలేని సేవ చేసాడు. తను రచించిన ఆముక్త మాల్యద (గోదాదేవి చరిత్ర) లో "దేశ భాషలందు తెలుగు లెస్స" అని పలికాడు.  రాయల భువనవిజయంలో గల ఎనిమిది మంది కవులను "అష్ట దిగ్గజాలు" అంటారు. వారిలో ధూర్జటి కవి ఒకరు. ఇతనినే పెద ధూర్జటి అంటారు.  శ్రీ కృష్ణదేవరాయల వారికి ఇతడంటే చాల అభిమానం.  తన మాటలలో, కవిత్వంలో శ్లేష వాడటం ఈయనకు అలవాటు.  శ్రీకాళహస్తికి చెందిన ఈ కవివరేణ్యుడు శివుని పై శ్రీకాళహస్తి మహత్మ్యం, కాళహస్తి శతకము, పలు చాటువులు రచించాడు.  ధూర్జటి గురించి మరికొన్ని వివరాలు. రాయల పరిపాలన, కవితా వైభవం, శత్రు శక్తులతో పోరాటాన్ని ఘంటసాల మాస్టారి పద్యాలతో, పాటలతో అద్భుతంగా మలచిన దృశ్య కావ్యం 1956 లో విడుదలైన తెనాలి రామకృష్ణ చిత్రం. సంగీతం విశ్వనాథన్‌-రామ్మూర్తి.

Thanks to "tenaliramakrishnudu" for uploading the You Tube video.
ఒకపరి భువన విజయము అనే తన కవితా దర్బారులో శ్రీ కృష్ణదేవరాయలు అష్ట దిగ్గజాలతో కొలువై ఉంటాడు. రాయలు ఒకానొక దిగ్గజమైన ధూర్జటి ని స్తుతిస్తూ ఒక పద్యం అందుకుంటాడు.

      స్తుతమతియైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో 
      అతులిత మాధురీ మహిమ?

అయితే దొరికినదే సందని ధూర్జటి చీకటింటి భాగోతాన్ని బయట పెట్టాలని వికటకవి రామకృష్ణుడు వెంటనే లేచి ఈ విధంగా చమత్కారమైన సమాధానంతో పూరిస్తాడు.
                                ఆ.. తెలిసెన్ భువనైక మోహనో
      ద్దత సుకుమార వారవనితా జనతా ఘనతాపహారి సం
      తత మధురాధరోదిత సుధారస ధారల గ్రోలుటంజుమీ !

అని పూరించి దూర్జటితో "అంతేనా తాతయ్యా?" అని ప్రశ్నిస్తాడు. దానికి ధూర్జటి తేలుకుట్టిన దొంగలా "ఔనేమో మనవడా!" అని సమాధానం యిచ్చేసరికి సభ అంతా పగలబడి నవ్వుతారు. ఎందుకంటే, "వనిత" అంటే స్త్రీ, కాని "వారవనిత" అంటే వేశ్య. ఆవిధంగా వికటకవితో గిల్లి కజ్జా పెట్టుకుని గెలిచిన వారు లేరు రాయల సభలో. అందుకే అతనంటే రాయల వారికి అంత యిష్టం.  ఇలాంటి సాహిత్య ప్రక్రియలు, చెణుకులు, విసుర్లు వింటుంటే మనసుకు ఎంతో ఆనందంగా వుంటుంది.

5, ఏప్రిల్ 2012, గురువారం

రాజ మకుటం చిత్రం నుండి ఆహ్లాదమైన యుగళగీతం - ఊరేది పేరేది

1960 లో విడుదలైన జానపద చిత్రం రాజ మకుటం. ఈ చిత్రంలో ఎన్‌.టి.ఆర్., రాజసులోచనల పై "ఊరేది పేరేది ఓ చందమామా" అనే ఆహ్లాదకరమైన యుగళ గీతాన్ని చిత్రీకరించారు. దీనిని ఘంటసాల, పి.లీల పాడారు. ఈ పాటను చారుకేశి రాగంలో ప్రధానంగా కూర్చి దానిలో మాయామాళవ గౌళ, రేవతి, మరియు సావేరి రాగాల మిశ్రమ ఛాయలు ఏర్పరిచి సంక్లిష్టమైన రాగమాలికగా కూర్చినది శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు గారు. ఆర్కెకెస్ట్రేషన్‌ సమకూర్చినది సంగీత దర్శకులు శ్రీ మాస్టర్ వేణు రజనీకాంత్ గారి తండ్రిగారు ఆధునిక  కవి ద్వయమైన వెంకట పార్వతీశ కవులలో ఒకరైన శ్రీ బాలాంత్రపు వెంకటరావు గారు.  ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది వినడానికి. చక్కని బాణీలో కూర్చిన ఈ పాట వింటుంటే ఏదో ఊహాలోకాల్లో తేలిపోతున్నట్లనిపిస్తుంది. ఈ పాట దృశ్య, శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. శ్రీ రజనీ గారిపై శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు ఈ మాట వెబ్‌జైన్‌ కు వ్రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.


Thanks to "Kotaonline" for uploading this video.


ఆడియో ఫైలు మూలం: ఘంటసాల గాన చరిత


సాకీ: పి.లీల: ఎందుండి వచ్చేవో!  ఏదిక్కు పోయేవో! ఓ...ఓ..
పల్లవి:
ఊరేది?  పేరేది?  ఓ చందమామ! (2) (చారుకేశి)


నిను జూచి నీలి కలువ పులకింపనేల?


ఊరేది పేరేది ఓ చందమామ!

ఘంటసాల: ఓ..ఓ..జాబిల్లి నీలి కలువ విడరాని జంట


ఊరేల? పేరేల? ఓ కలువ బాల


ఊగేటి తూగేటి ఓ కలువ బాల
చరణం: పి.లీల: ఆ..ఆ..ఆ..


విరిసిన రేకుల చెలువనురా..ఆ..ఆ.. (వకుళాభరణం)


కురిసే తేనెల కలువనురా


కలికి వెన్నెలల దొర రారా ఆ..ఆ..ఆ.. (రేవతి)


మరుగేలనురా నెలరాజ తెర తీయర చుక్కల ఱేడా  (చారుకేశి)


రావోయి రావోయి ఓ చందమామ
చరణం: ఘంటసాల: పరువము లొలికే విరిబోణి (2) (వకుళాభరణం)

బృందం: ఆ..ఆ..ఆ..


స్వప్నసరసిలో సుమరాణి ఆ..ఆ.. (రేవతి)


కొలనంతా వలపున తూగే అలలై పులకింతలు రేగే (చారుకేశి)


నీవాడ నేగానా ఓ కలువ బాల
చరణం: పి.లీల: తరుణ మధుర మొహనా హిమకర  (మాయామాళవ గౌళ)


గరళ యవ్వనాంబురాశి కనర


సురుచిర మదనా నివాళి ఇదిగో (2) (సావేరి)


వలచిన నా హృదయమె గైకొన రారా

పి.లీల: నీదాననే గానా ఓ కలువ ఱేడా

ఘంటసాల: నీవాడనే గానా ఓ కలువ బాల

ఇద్దరు: ఊహూ..హు..హూ..హూ..హు. హూ..హూ..హు..

కృతజ్ఞతలు: పాట వివరాలను, రాగాల సమాచారాన్ని ఘంటసాల గాన చరిత వెబ్ సైట్ లో పొందుపరచిన శ్రీ నూకల ప్రభాకర్ గారికి.  అంతేకాక, పాటలోని సాహిత్యానికి సవరణలు, ఆయా పంక్తులకు నిర్దేశించబడిన రాగాలను సూచించిన శ్రీ శ్రీనివాస్ పరుచూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

4, ఏప్రిల్ 2012, బుధవారం

పిలిచిన పలుకవు ఓ జవరాలా! - పిడుగు రాముడు నుండి

చిత్రం:      పిడుగు రాముడు (1966)
రచన:      డా.సి.నారాయణ రెడ్డి
సంగీతం:  టి.వి.రాజు
గానం:      ఘంటసాల, పి.సుశీల

1966 లో విడుదలైన జానపద చిత్రం పిడుగు రాముడు. ఇందులో శ్రీ ఎన్‌.టి. ఆర్., రాజశ్రీలు  జంటగా నటించారు. ఈ చిత్రానికి జానపద బ్రహ్మ శ్రీ బి.విఠలాచార్య దర్శకులు. సి.నారాయణ రెడ్డి గారు చక్కని గీతాలు వ్రాసారు. అందులో ఒకటైన పిలిచిన పలుకవు ఓ జవరాలా! ను ఇక్కడ పొందుపరుస్తున్నాను.పల్లవి: ఘంటసాల: పిలిచిన పలుకవు ఓ జవరాలా | పిలిచిన |


చిలిపిగ ననుచేర రావా! రావా!


పిలిచిన పలుకవు ఓ జవరాలా

సుశీల: కలువల రాయడు చూసే వేళ | కలువల |


చెలియను కవ్వింతువేలా యేలా


కలువల రాయుడు చూసే వేళ
చరణం: ఘంటసాల: చల్లగ విరిసే నీ చిరునవ్వులు | చల్లగ |


మల్లెలు కురిసెను నాలోన

సుశీల: తొలిచూపులలో చిలికిన వలపులు | తొలి చూపులలో |


తొందర చేసెను నీలోన


పిలిచిన పలుకవు ఓ జవరాలా


చిలిపిగ ననుచేర రావా! రావా! | పిలిచిన |
చరణం: ఘంటసాల: జగములనేలే సొగసే నీదని  | జగముల |


గగనములో దాగే నెలఱేడు

సుశీల: మనసును దోచే మరుడవు నీవని | మనసున |


కనుగొంటినిలే ఈనాడు

ఘంటసాల: పిలిచిన పలుకవు ఓ జవరాలా


చిలిపిగ ననుచేర రావా! రావా!

సుశీల: కలువల రాయడు చూసే వేళ


చెలియను కవ్వింతువేలా యేలా

ఘంటసాల: పిలిచిన పలుకవు ఓ జవరాలా

3, ఏప్రిల్ 2012, మంగళవారం

పావురము పై పద్యం - సారంగధర చిత్రం నుండి ఘంటసాల గళంలో

1957 లో జానపద కథ ఆధారంగా మినర్వా పిక్చర్స్ పతాకంపై విడుదలైన చిత్రం సారంగధర.  ఇందులో ఎన్‌.టి.ఆర్., భానుమతి, రాజసులోచన నటించారు. సంగీతం ఘంటసాల మాస్టారు, గీత, పద్య రచన శ్రీ సముద్రాల రాఘవాచార్యులు (సీనియర్) గారు. ఇందులో మాస్తారు ఏకగళ పద్యాలు, భానుమతి గారితో సంవాద పద్యాలు, ఒక చక్కని యుగళ గీతం పాడారు. సముద్రాల గారు వ్రాసిన "గగన సీమంతిని" అనే పద్యం యొక్క దృశ్య, శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ వీడియోను సమకూర్చినది శ్రీ కె.వి.ఆర్.హరీష్ (Bank of Sri Ghantasala, Machilipatnam) గారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
  


ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత

 చిత్రం: సారంగధర (1957)
కలం:  సముద్రాల రాఘవాచార్యులు
స్వరం, గళం: ఘంటసాల వెంకటేశ్వర రావు
గగన సీమంతిని కంఠ హారములోన దనరారు నాయకమణి యనంగ 

హాయిగా నందనోద్యాన సీమనుకుల్కు అందాల కొదమ రాయంచయనగ

అమరులైరావత హస్తాగ్రమున వేయ చెలువారు మల్లె పూచెండనంగ

గంగాధరుని మౌళి రంగుగా కొలువై పసలు నించెడు చంద్రవంకయనగ

చూడుడదిగో నిక్కి చుక్కలలో నిల్చి రెక్కలార్పకుండ చొక్కకుండ 

ఆకసాన తేలియాడుచున్నది నాదు పావురమ్ము రాచఠీవి మెఱయ

 ఆ..ఆ..ఆ.. 

2, ఏప్రిల్ 2012, సోమవారం

ఓ! దేవి ఏమి కన్నులు నీవి - విజయం మనదే నుండి

చిత్రం: విజయం మనదే (1970)
రచన: సి.నారాయణ రెడ్డి 
సంగీతం: ఘంటసాల
గానం:  ఘంటసాల, పి. సుశీల
1970 లో జానపద బ్రహ్మ శ్రీ బి.విఠలాచార్య దర్శకత్వంలో ఎన్‌.టి.ఆర్., బి.సరోజాదేవి నటించిన జానపద చిత్రం విజయం మనదే. ఇందులో ఘంటసాల మాస్టారు ఆరు పాటలు పాడారు. అయితే అందులో ఎక్కువ పాపులర్ అయినది "ఓ! దేవి, ఏమి కన్నులు నీవి". మాస్టారే సంగీత దర్శకులు ఈ చిత్రానికి. ఈ పాట రచన శ్రీ సినారె గారు. పి.సుశీలతో పాడారు మాస్టారు. ఈ పాట దృశ్య, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

పల్లవి: ఘంటసాల: ఓ!...... దేవి,      ఏమి కన్నులు నీవి 


ఓ! దేవి, ఏమి కన్నులు నీవి 


కలకల నవ్వే కలువలు .. అవి 


కాముని పున్నమి చలువలు  | ఓ! దేవి |

సుశీల: వాడిపోయే, వీడిపోయే కొలనులోని


కలువపూలు నా నయనాలా..


చాలు.. చాలు.. చా..లు..

ఘంటసాల: ఓ! దేవి, ఏమి కన్నులు నీవి 
చరణం: ఘంటసాల: ఏమని అందును ఎర్రని పెదవుల అందాలు 


అవి ఎంతో వింతగ మెరిసే నున్నని పగడాలు  | ఏమని |

సుశీల: రూపమే కాని రుచియేలేని పగడాలు  | రూపమె |


తేనియలూరే తీయని పెదవికి సరిరావు 


సరిరావు చాలు.. చాలు.. చాలు..

ఘంటసాల: ఓ! దేవి, ఏమి కన్నులు నీవి 
చరణం: సుశీల: ఆ.. ఆ.  ఆ.. ఆ..

ఘంటసాల: కులుకుల నడకల కలహంసలు కదలాడెనా..


నల్లని జడలో నాగులు ఊగిసలాడెనా.. | కులుకుల |


దివికు భువికి వంతెన వేసెను మీ మనసు  | దివికి |

సుశీల: అల్లరి పిల్లకు కళ్ళెం వేసెను నీ మనసు 


నీ మనసు చాలు.. చాలు.. చాలు..

ఘంటసాల: ఓ!.. దేవి..  ఏమి సొగలులు నీవి 

సుశీల: ఓ!.. రాజా.. రసికతా రతి రాజా..

ఐద్దరు: ఆహ హా హా హ హా హా 

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (2) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (3) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎల్.ఆర్.ఈశ్వరి తో (1) గా-ఎస్.జానకి తో (4) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (20) గా-పి.సుశీల తో (46) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (11) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (78) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (29) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (1) సం-పెండ్యాల (37) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (11) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-0 ర-అనిశెట్టి ర-అనిసెట్టి ర-అనిసెట్టి-పినిసెట్టి ర-ఆత్రేయ ర-ఆదినారాయణ రావు ర-ఆరుద్ర ర-ఉషశ్రీ ర-ఎ.వేణుగోపాల్ ర-కాళిదాసు ర-కాళ్ళకూరి ర-కొసరాజు ర-కోపల్లి ర-గబ్బిట ర-గోపాలరాయ శర్మ ర-ఘంటసాల ర-చేమకూర. ర-జంపన ర-జయదేవకవి ర-జాషువా ర-జి.కృష్ణమూర్తి ర-తాండ్ర ర-తాపీ ధర్మారావు ర-తిక్కన ర-తిరుపతివెంకటకవులు ర-తోలేటి ర-దాశరథి ర-దాశరధి ర-దీక్షితార్ ర-దేవులపల్లి ర-నార్ల చిరంజీవి ర-పరశురామ్‌ ర-పాలగుమ్మి పద్మరాజు ర-పింగళి ర-బమ్మెర పోతన ర-బమ్మెఱ పోతన ర-బాబ్జీ ర-బాలాంత్రపు ర-బైరాగి ర-భాగవతం ర-భావనారాయణ ర-భుజంగరాయ శర్మ ర-మల్లాది ర-ముద్దుకృష్ణ ర-రాజశ్రీ ర-రామదాసు ర-రావులపర్తి ర-రావూరి ర-వసంతరావు ర-వారణాసి ర-విజికె చారి ర-వీటూరి ర-వేణు ర-వేములపల్లి ర-శ్రీశ్రీ ర-సదాశివ బ్రహ్మం ర-సముద్రాల జూ. ర-సముద్రాల సీ. ర-సి.నా.రె. ర-సినారె ర-సుంకర-వాసిరెడ్డి ర-సుబ్బారావు రచన-ఘంటసాల రచన-దాశరధి రచన-దేవులపల్లి రచన-పానుగంటి రచన-పింగళి రచన-బలిజేపల్లి రచన-సముద్రాల సీ.