బహుళ
ప్రజాదరణ పొందిన "అందమె ఆనందం" పాట గురించి ఆ పాటను వ్రాసిన మహానుభావుడు,
సినీ సాహిత్య సముద్రాలలో ఒకరైన శ్రీ సముద్రాల జూనియర్ (రామానుజాచార్య)
గారు ఏమన్నారంటే "యాభై మూడులో బ్రతుకు తెరువు వచ్చింది, నాకు బ్రతుకు
తెరువు ఇచ్చింది. అందమే ఆనందం అన్న పాట నన్ను గేయ రచయితను చేసింది". ఈ
పాటకు ముందు సముద్రాల గారి ఉపోద్ఘాతం తో ఉన్న వీడియోను చూసి ఆనందించండి.
అనువుగా మీకు ఎడమ ప్రక్క పాట సాహిత్యం ఇచ్చాను. ఇందులో సావిత్రి
చూపించిన హావ భావాలు ఎలాంటి నాయకుడినైనా సమ్మోహితుల్ని చేస్తుందంటే అందులో
అతిశయోక్తి, ఆశ్చర్యం లేదు.
వీడియో మూలం: ఘంటసాల గానామృతం
ఘంటసాల
శ్రీ ఘంటసాల గారు పాడిన గీతాలలో అద్భుతమైనది ఈ పాట. కథానాయకుడు పియానో వాయిస్తూ, ఎదురుగా ఉన్న కథానాయకిని ఉద్దేశించి పాడే పాటలలో చక్కగా చిత్రీకరించిన సందర్భం బ్రతుకు తెరువు చిత్రం లోది. ఇలాంటి సందర్భమే ఉన్నమరొక మంచి చిత్రం "ఆరాధన".
ప. అందమె ఆనందం అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమే ఆనందం
ఈ సందర్భం లో సాహిత్యం లో కొంచెం వైవిధ్యం గల అదే పాటను ఎన్నో సుమధుర గీతాలను పాడిన అలనాటి ప్రముఖ గాయనీమణి, శ్రీమతి పి. లీల గారు పాడిన వెర్షన్ యొక్క సాహిత్యం దిగువన చూడగలరు. లాలాలలా లాలలలా లాలా లాలా ప. అందమె ఆనందం అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమే ఆనందం
అమర గాయకుడు ఘంటసాల తెలుగు వారింట వెలసిన ఒక సంగీత తరంగం. వీనుల విందైన ఆ మహానుభావుని గానం వినడంలోను, ఆయన పాడిన పాటలలోని సాహిత్యాన్ని ఆస్వాదించడం లోను, ఆ గాన గంధర్వుని గురించి తెలుసుకోవడంలోను, నాకు సమయం తెలియదు. ఆ మధుర స్మృతులను నలుగురితో పంచు కోవాలనే ఈ చిన్ని తాపత్రయం లో మీరంతా అండ దండలు అందిస్తారని ఆశిస్తూ మాస్టారి ఒక వీరాభిమాని సూర్య నారాయణ వులిమిరి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com