1964 సంవత్సరంలో విడుదలైన ఉషా సంస్థ నిర్మించిన దొంగ నోట్లు అనువాద చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన పిలిచెనొక చిలుకా అనే ఈ యుగళగీతం రచన అనిసెట్టి, స్వరపరచినది పెండ్యాల శ్రీనివాస్. ఈ చిత్రంలో తారాగణం ఎం.జి.ఆర్, బి.సరోజ. ఈ చిత్రానికి నిర్మాత అలభ్యం మరియు దర్శకుడు కె.శంకర్. ఈ పాటను భద్రపరచి అందించిన “బ్యాంక్ ఆఫ్ ఘంటసాల” వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
| నిర్మాణం: | ఉషా వారి | |
|---|---|---|
| చిత్రం: | దొంగనోట్లు (1964) - అనువాద చిత్రం | |
| రచన : | అనిసెట్టి | |
| పాడినవారు : | ఘంటసాల, సుశీల | |
| అభినయం : | యం.జి. రామచంద్రన్, బి.సరోజాదేవి | |
| సంగీతం: | పెండ్యాల శ్రీనివాస్ | |
| ప. | ఘ: | పిలిచెనొక చిలుక, చెలియే మల్లియల మొలక |
| హంసవలె నడకా.., అందముల నొలుకా.., హోయ్ | ||
| పిలిచెనొక చిలుకా... ఆ.. మల్లియల మొలకా | ||
| సు: | పాడెనొక కవియే - నన్నే, పాటవినమనియే | |
| కాంతునకు గురువా-స్నేహముల నెలవా.. హో..య్ | ||
| పాడెనొక కవియే - నన్నే, పాటవినమనియే | ||
| కాసులకు గురువా-స్నేహముల నెలవా.. హోయ్, హోయ్, హోయ్, హోయ్ | ||
| పాడెనొక కవియే - నన్నే, పాటవినమనియే | ||
| చ. | ఘ: | నాలోన మైకం నించు సోయగమే..ఏ.. యెదను |
| లాలించే చల్లని రాగం మంజులమే | ||
| సు: | విరహిణియౌ కలువను గాంచి | |
| వెలుగులతో చంద్రుడు నించె | ||
| ఒక చూపును హృదయమ్మంతా దోచెడువాడు | ||
| నా ప్రియుడేలే | ||
| ఘ: | పిలిచెనొక చిలుకా చెలియే మల్లియల మొలకా | |
| హంసవలె నడకా..ఆ. అందముల నొలుకా హోయ్, హోయ్, హోయ్, హోయ్ | ||
| సు: | పాడెనొక కవియే, నన్నే పాట వినమనియే | |
| చ. | సు: | మధురాశల జ్యోతుల వెలిగే మందిరమా - హృదయం |
| మన ప్రేమ దేవతలాడే మంటపమా.ఆ. హో.య్ | ||
| ఘ: | గగనంలో తారకయేనా, కనువిందౌ చంద్రికయేనా | |
| నా కోసం చెలియగ మారి నవ్వుల పువ్వుల నర్పించేనా | ||
| సు: | పాడెనొక కవియే, నన్నే పాట వినమనియే | |
| కాంతునకు గురువా, స్నేహముల నెలవా, హోయ్, హోయ్, హోయ్, హోయ్ | ||
| ఘ: | పిలిచెనొక చిలుకా చెలియే, మల్లియల మొలకా | |
| హంసవలె నడకా, అందములనొలుకా, హోయ్, హోయ్, హోయ్, హోయ్ | ||
| సు: | ఆహహ్హహహహా | |
| ఘ: | ఓహో | |
| సు: | లల్లలల లలలా | |
| సు: | ఆహహ్హహహహా | |
| ఘ: | ఓహో | |
| సు: | లల్లలల లలలా |

%20-%20Antastulu.jpeg)
