బసంత్ పిక్చర్స్ వారు 1948 లో నిర్మించిన హిందీ పౌరాణిక చిత్రం "శ్రీరామభక్త హనుమాన్" ను అదే పేరుతో 1958 లో డబ్బింగ్ చిత్రంగా తెలుగులో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్.ఎన్. త్రిపాఠి. అతనే హనుమంతుని పాత్ర పోషించాడు. చిత్రకథను వాల్మీకి రామాయణం నుంచి తీసుకున్నారు. ఈ చిత్రానికి దర్శకులు ట్రిక్ ఫోటోగ్రఫీ లో దిట్టయై పలు పౌరాణిక, ఫాంటసీ చిత్రాలకు దర్శకునిగా వ్యవహరించిన బాబూభాయ్ మిస్త్రీ. ఈయన 1937 లో దర్శకత్వం వహించిన మొట్టమొదట ఫాంటసీ లేండ్ (ఖ్వాబ్ కీ దునియా) చిత్రంతో ఆయన ట్రిక్ ఫోటోగ్రఫీ కౌశల్యం సినీ రంగంలో మొదలయింది. ఈ చిత్రానికి ఘంటసాల నాలుగు పాటలు పాడారు. అందులో మూడు మాత్రమే లభ్యం. మాటలు, పాటలు మహాకవి శ్రీ శ్రీ వ్రాసారు. సంగీతం విజయభాస్కర్. ఇందులో శ్రీరాముని మహిమను "మహిలో యెపుడూ" అనే గీతంలో కౌశికయాగ రక్షణం, అహల్యా శాపవిమోచనం, సీతాస్వయంవరం, శబరి ఆశ్రమ సందర్శనం, శ్రీరామ పట్టాభిషేకానంతరం సభలో హనుమ తన శ్రీరామభక్తిని నిరూపిస్తూ గుండె చీల్చి హృదయాంతరంగులైన సీతారాములను చూపించడం ఘంటసాల గానం చేయగా హృద్యంగా చిత్రీకరించారు. ఈ అమూల్యమైన దృశ్యఖండికను సమకూర్చినవారు "బేంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల" వారు. వారి ఉదాత్తమైన కృషికి నమోవాకములు.
Thanks to Sri Kolluru Bhaskar Rao garu of Ghantasala Galamrutamu, Wickipedia and You Tube for providing the information on the movie. Heartfelt thanks to "Bank of Sri Ghantasala" for uploading the valuable video clip of the song. This blog is used for entertainment purpose only and there is no commercial intent.
నిర్మాణంః | బసంత్ పిక్చర్స్ వారి | |
చిత్రం: | శ్రీరామభక్త హనుమాన్ (డబ్బింగ్) - 1958 | |
రచన: | శ్రీ శ్రీ | |
సంగీతం: | విజయభాస్కర్ | |
గానం: | ఘంటసాల | |
దర్శకత్వంః | బాబూ భాయ్ మిస్త్రీ | |
సాకీః | ఘంటసాలః | మహాసభన్ శ్రీరామ భక్తులే కోరీ చేరిరి నేడే |
భక్తులకెందు తొలియాధారము రాముడే నిరతం సహాయం | ||
పల్లవిః | మహిలో యెపుడూ చూడ రాముని మహిమ అపురూపం -2 | |
మొరలను వినెడి ప్రభువుకదా! సీతావిభుడౌ కరుణాధార రాముని మహిమ అపురూపం | ||
చరణంః | ఘంటసాలః | బాల్యమునందు విశ్వామిత్రుని వెంటజని అవలీల |
బాణమొక్కటి వేసి వధించె చరు తాటక రాగా | ||
రఘువీరుండే మహాకృపాళుడు యజ్ఞరక్షణదార రాముని | ||
మహిమ అపురూపం | ||
మహిలో యెపుడూ చూడ రాముని మహిమ అపురూపం | ||
చరణంః | ఘంటసాలః | రాతిగ మారి పడీ అహల్యా గౌతముడీయ శాపం |
దీనబంధుని చరణధూళిచే కనెను మానవరూపం | ||
సతీ అహల్య కోరిన వరమే ఒసగెను సదా వుదార రాముని మహిమ అపురూపం | ||
మహిలో యెపుడూ చూడ రాముని మహిమ అపురూపం | ||
చరణంః | ఘంటసాలః | మిథిలలో సీతాస్వయంవర వేళనేతెంచే ధనుర్ధర |
వీరులా యీ శరధనుస్సును యెత్తలేక వీడగా | ||
అచటనే లంకేశుడంతా ధనువు వంచగలేకపోగా | ||
రాముడే శివ కార్ముకమును భంగ పఱచి క్రీడగా | ||
అల్లుడాయెను మిథిలాపురికి - 2 | ||
పడెన్ సుమముల తార రాముని మహిమ అపురూపం | ||
మహిలో యెపుడూ చూడ రాముని మహిమ అపురూపం | ||
చరణంః | ఘంటసాలః | ఎంతో భక్తిని శబరి యిచ్చిన యెంగిలి పండ్లను కోరి |
చాలభక్తితో రామచంద్రుడు స్వీకరించెను కాదే | ||
శ్రీరామునికి భేదభావమే లేదూ కదా జగాన రాముని మహిమ అపురూపం | ||
మహిలో యెపుడూ చూడ రాముని మహిమ అపురూపం | ||
చరణంః | ఘంటసాలః | భక్తాళిన్ దయబూనీ వడిన్, నీవే కావగలేవో |
భక్తాళిన్ దయబూనీ వడిగా, నీవే కావగలేవో | ||
సంతోషముగా స్వామీ నేడే మదిలో దర్శనమీవో | ||
మదిలో దర్శనమీవో, జయజయజయ శ్రీరాం | ||
సాకీః | ఘంటసాలః | ఓ! రఘుపతి రాఘవ రాజా రాం పతీత పావన సీతారాం |
బృందంః | రఘుపతి రాఘవ రాజా రాం పతీత పావన సీతారాం - 4 |
Thanks to Sri Kolluru Bhaskar Rao garu of Ghantasala Galamrutamu, Wickipedia and You Tube for providing the information on the movie. Heartfelt thanks to "Bank of Sri Ghantasala" for uploading the valuable video clip of the song. This blog is used for entertainment purpose only and there is no commercial intent.