ఆచార్య ఆత్రేయ నిర్మించిన చక్కని కుటుంబకథా చిత్రం వాగ్దానం. అప్పటికే ఆత్రేయ కలం సినీక్షేత్రంలో కోలాహలం సృష్టించింది. అయితే తాను వ్రాయగలిగినా ముగ్గురు రచయితలకు తన చిత్రంకోసం పాటలు వ్రాసే అవకాశం కల్పించాడు. వారు మహాకవి శ్రీ శ్రీ, నార్ల చిరంజీవి మరియు దాశరథి. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే దాశరథికి యిది చలనచిత్ర రంగం లో తొలి అవకాశం. దాశరథి పూర్తిపేరు దాశరథి కృష్ణమాచార్య. నిజాం పాలనకు నిరసనగా తన కలంతో ఎదురించి నా తెలంగాణా కోటి రతనాల వీణ అని సగర్వంగా చెప్పుకున్నాడు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాడు. దాశరథి తదుపరి ఎన్నో చక్కని పాటలు ఇద్దరు మిత్రులు, దాగుడు మూతలు, మూగమనసులు వంటి చిత్రాలకు వ్రాసారు. 1961 లో వచ్చిన వాగ్దానం చిత్రంలో నా కంటిపాపలో నిలచిపోరా చక్కని యుగళగీతం. పున్నమీ - పున్నెమో, చందమామ - ఆనందసీమ, నీలితారలు - పూలదారులు వంటి సొగసైన పదాలతో ఈ గీతం ఆహ్లాదకరంగా వుంటుంది. దీనిని ఘంటసాల, సుశీల గానం చే్శారు.
చిత్రం:
వాగ్దానం (1961)
రచన:
దాశరథి (తొలి సినీ గీతం)
సంగీతం:
పెండ్యాల నాగేశ్వరరావు
గానం:
ఘంటసాల, సుశీల
సుశీల:
ఊ..ఊ..ఊ….ఊ…ఊ….
పల్లవి:
నా కంటి పాపలో నిలిచి పోరా.. నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచి పోరా, నీ వెంట లోకాల గెలువనీరా
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com