ప్రతి మనిషికి తన భార్యా పిల్లల గురించి ఎన్నో కలలుంటాయి. తన ఆశయాలతో ఆశాసౌధాలు నిర్మించుకుంటాడు. కాని జీవితం విచిత్రమైనది. సంసార ఝంఝాటంలో ఒకోసారి ఓడలు బండ్లవుతాయి. మరొకసారి బండ్లు ఓడలౌతాయి. మనిషి కట్టుకున్న ఆశా సౌధాలే ఒక్కోసారి గాలిమేడలు అవుతాయి. అవసాన దశలోవున్నపుడు అశాశ్వతమైన ఆస్తిపాస్తులు అండదండలుగా వుండవని గ్రహిస్తాడు. కులమతాలకు, స్థితిగతులకు తావివ్వక తనకు సేదదీర్చి, ఇంత కూడుపెట్టి ఆదుకునే యువకుని చూచి అలాంటి కొడుకుంటే చాలని కొడుకును పోగొట్టుకున్న ఆ తండ్రి అనుకుంటాడు. అలాగే చిన్నతనం నుండి
నా అనేవారు లేక బ్రతుకు బండిని లాగే ఆ యువకుడు దీన స్థితిలో నిస్సహాయుడైయున్న ఆ ముసలివానికి సేవ చేసి తృప్తి పడతాడు. అతనిలో తన తండ్రిని చూసుకుంటాడు. కాని అతడే తన తండ్రి అని తెలియదతనికి. ఈ ఇతివృత్తం తో నిర్మించబడిన చిత్రం "గాలి మేడలు". విధి ఆడిన ఆటవలన దూరమయి, అనుకోని పరిస్థితులలో చేరువయిన తండ్రీ కొడుకులుగా నాగయ్య, ఎన్.టి. ఆర్. నటించిన హృద్యమైన ఈ సన్నివేశానికి అనుగుణంగా సముద్రాల రాఘవాచార్య రచన 'మమతలు లేని మనుజులలోన', ఎటువంటి కరడుగట్టిన హృదయాన్నైనా కదిలిస్తుంది, కరిగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ భావాన్ని అద్భుతంగా పలికించి అజరామరం చేసినది ఘంటసాల మాస్టారు.సంగీతం టి.జి.లింగప్ప.
Thanks to Sri Bollapragada Someswara Rao garu for providing the movie poster.
చిత్రం: | గాలి మేడలు (1962) | ||
రచన: | సముద్రాల రాఘవాచార్య | ||
సంగీతం: | టి.జి.లింగప్ప | ||
గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
పల్లవి: | మమతలు లేని మనుజులలోన | ||
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో | |||
మమతలు లేని మనుజులలోన | |||
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో | |||
ఎవరికి ఎవరో | |||
చరణం: | ఏ కులమైనా, నెలవెదియైనా మదిలో కూరిమీ జాలుకొనా | ||
ఏ కులమైనా, నెలవెదియైనా మదిలో కూరిమీ జాలుకొనా | |||
పిలిచీ లాలించీ, కొడుకూ చందానా | |||
పిలిచీ లాలించీ, కొడుకూ చందానా | |||
చూచి కాచే దాతే నాయన కాదా! | |||
మమతలు లేని మనుజులలోన | |||
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో | |||
ఎవరికి ఎవరో | |||
చరణం: | మాటలు నమ్మి, మనసు నీరై, దరికి తీసిన తండ్రులను | ||
మాటలు నమ్మి, మనసు నీరై, దరికి తీసిన తండ్రులను | |||
దేవుని చందానా, తలచీ, పూజించి | |||
దేవుని చందానా, తలచీ, పూజించి | |||
కొలువు చేసేవాడే కొడుకౌ గాదా! | |||
మమతలు లేని మనుజులలోన | |||
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో | |||
ఎవరికి ఎవరో | |||
ఆ..ఆ..ఆ..ఆ..ఊ..ఊ..ఊ.. |
Thanks to Sri Bollapragada Someswara Rao garu for providing the movie poster.