1962 లో గౌతమీ ప్రొడక్షన్‌స్ పతాకంపై, పౌరాణికబ్రహ్మకమలాకరకామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మింపబడిన చారిత్రాత్మక చిత్రం మహామంత్రి తిమ్మరుసు. విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో సంగమ వంశానికి చెందిన హరిహర (హక్క) రాయలు, బుక్కరాయలు కర్ణాటకలో గల హంపి సమీపంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. విద్యారణ్య స్వామి పేరున దీనిని విద్యా నగరం లేక విద్యా పురం అని కూడ అంటారు. విజయనగర సామ్రాజ్యానికి రాజైనశ్రీకృష్ణదేవరాయలకు సాళువ తిమ్మరుసు అమాత్యునిగా వుండి పరిపాలనలో చాల కీలకమైన పాత్ర వహిస్తాడు. శ్రీకృష్ణదేవరాయల వీరత్వము, సాళ్వ తిమ్మరుసు మంత్రిత్వం చేదోడు వాదోడుగా కలసి రాయల పరిపాలన రామరాజ్యాన్ని మరపించిందిఅంటే అతిశయోక్తి కాదు. మాతృభాషతుళు అయినప్పటికీ రాయలకు తెలుగు భాష పట్ల గల మక్కువ. "దేశభాషలందు తెలుగు లెస్స" యని పలికాడు.సాహితీ సమరాంగణసార్వభౌముడైనరాయలు తన ఆస్థానంలో అష్ట దిగ్గజాలను కవి శిఖామణులను నెలకొలిపి తన కవన, సాహిత్య సభను భువనవిజయము పేర తీర్చిదిద్దాడు.మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో తిమ్మరుసు గా గుమ్మడి వెంకటేశ్వర రావు, శ్రీకృష్ణ దేవరాయలు గా నందమూరి తారక రామారావు నటించారు. తిమ్మరుసు పాత్రలో చూపించిన నటనకు గుమ్మడికి ఈ చిత్రం జాతీయస్థాయిలో ఉత్తమసహాయనటునిపురస్కారంతో ఎనలేని ఖ్యాతి తెచ్చింది. ఇదివరలో ఈ చిత్రం నుండి జయవాణీ చరణకమలఅనే పాటను, తెలుగదేల యన్నదేశంబు తెలుగు అన్నపద్యాన్ని ప్రచురించాను. ప్రస్తుతం శ్రీ విద్యా వజ్రపీఠమునఅన్నపద్యాన్నిఘంటసాలగళంలో వినండి.
తుళువ వంశీయుడు అయినప్పటికీ, తెలుగు భాషకు ఎనలేని సేవచేసి "భువన విజయము" అనబడే తన ఆస్థానములో అష్టదిగ్గజాలను నెలకొల్పి తెలుగు కవితను, కావ్య రచనను ప్రోత్సహించిన కవి, సాహితీ సమరాంగణ సార్వ భౌముడు అయిన శ్రీకృష్ణదేవరాయలు మన కందరికీ చిరస్మరణీయుడు. ఆంధ్ర-కర్ణాటక ప్రజల సమన్వయానికి కృషి చేసిన ఈతనిని "ఆంధ్ర భోజుడు" మరియు "కన్నడ రాజ్య రమారమణ" అని పేర్కొంటారు. తెలుగులో "ఆముక్త మాల్యద" లేదా విష్ణుచిత్తీయము (గోదా దేవి కథ) అనే ప్రబంధాన్ని రచించాడు. ఏ దేశంలో వుంటే అక్కడి భాష, సంస్కృతి నేర్చుకోవడం, ఉపయోగించడం అవసరం. ఆ భావాన్ని తెలిపే "తెలుగదేల యన్న దేశంబు తెలుగు", అనే ఈ పద్యం కృష్ణదేవరాయ విరచితమైన ఆముక్తమాల్యద లోనిది. పౌరాణిక, జానపద, చారిత్రక ప్రాముఖ్యత గల పాత్రలకు శ్రీ రామారావు గారిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఈ చిత్రంలో రాయలే తప్ప రామారావు కనిపించడు. రాయల గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ పోస్టులో చూడండి.
1962 లో విడుదల అయిన అద్భుత చారిత్రాత్మక చిత్రం "మహామంత్రి తిమ్మరుసు". అమర గాయకులు శ్రీ ఘంటసాల గారు పాడిన ఎన్నో ఆణి ముత్యాల వంటి యుగళ గీతాలలో శ్రీమతి పి. లీల గారితో పాడిన "జయవాణీ చరణ కమల సన్నిధి మన సాధనా.." అన్న ఈ పాట చెప్పుకోదగినది. ఈ పాట శ్రీకృష్ణ దేవరాయలు (NTR) మరియు చిన్నా దేవి (ఎల్. విజయలక్ష్మి) మీద చిత్రీకరించబడింది. అయితే ఈ పాటలో ఒక సాంకేతిక లోపం ఉంది. అదేమిటంటే, రామారావు గారు వాయించే వాయిద్యం చేత్తో వాయించే సరస్వతీ వీణ కాదు. దీనిని చిత్ర వీణ లేదా గొట్టు వాయిద్యం అంటారు. దీనికి మెట్లు ఉండవు. దీనిని ఒక కర్రతో వీణ పైభాగం లో తంత్రులను తాకుతూ వాయిస్తారు. సాధారణంగా పాత తెలుగు చిత్రాలలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుని సహజంగా కనిపించేలా చిత్రీకరిస్తుంటారు. కాని ఈ సినిమా విషయంలో ఈ పొరపాటు జరిగింది. అయితే చెబితేకాని తెలియదనుకోండి. ఏది ఏమైనా, ఈ యుగళగీతం మాస్టారు పాడిన వాటిలో మెచ్చుకోదగినది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇందులో తిమ్మరుసు గా నటించిన శ్రీ గుమ్మడి వెంకటేశ్వర రావు గారికి ఉత్తమ సహాయ నటుడు గా జాతీయ పురస్కారం లభించింది. ఇది వారి చలన చిత్ర జీవితంలో ఒక చిరస్మరణీయమైన పాత్ర.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com