ఇది డిజిటలు యుగం. అద్భుతమైన ఊహ, సృజనాత్మకత చూపగలిగే ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానం, ప్రేక్షక శ్రోతలు ఆస్వాదించే మంచి ఇతివృత్తం, దానికి తగిన కథా వస్తువు దొరికితే ఓహ్! చెప్పలేనంత వినోదాన్ని కలిగించ వచ్చును. దానికి అపురూపమైన రూప కల్పన ఘంటసాల మాస్టారి పాటకు ఏనిమేషన్ అనే ఆలోచన. యధాలాపంగా యూ ట్యూబ్ లో మాస్టారి పాటలకోసం అన్వేషిస్తుంటే, అనుకోకుండా ఈ ఏనిమేటెడ్ పాట తటస్థించింది. సంతోష్ గారు దీనిని అద్భుతంగా ప్రదర్శించారు. అసలు ఆ ఊహకే జోహార్లు. అది అందరితో పంచుకోవాలని నా బ్లాగులో ఉంచుతున్నాను. సంతోష్ గారు చాల ధన్యవాదాలు. మాస్టారు పాడుతున్నారన్న భావన ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే పాట మొదటి చరణం నుండి ప్రారంభం అవుతోంది ఈ వీడియోలో అని గమనించగలరు. ముందు ముందు సంతోష్ గారు మరిన్ని మాస్టారి పాటల్ని ఏనిమేషన్ తో తయారు చేసి ఘంటసాల గారి అభిమానులను అలరిస్తారని ఆశిస్తున్నాను.
చిత్రం: భక్త తుకారాం (1973)
రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
సంగీతం: ఆదినారాయణ రావు
గానం: ఘంటసాల
రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
సంగీతం: ఆదినారాయణ రావు
గానం: ఘంటసాల
ఏనిమేషన్: టి. సంతోష్