పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకోవడం ఒకప్పటి ఆనవాయితీ. అయితే కాలానుగుణంగా ఆ భావనలో మార్పులు వచ్చాయి. ప్రేమించి పెళ్ళిచేసుకోవడం అన్నది ఈ రోజు రివాజు. అయితే ఈ ప్రక్రియ పురాణాలలోను, ఇతిహాసాలలోనూ ఉంది. ఉదాహరణకు నలుడు దమయంతిని, శ్రీకృష్ణుడు రుక్మిణిని ప్రేమించి పెళ్ళాడారు. దానిని పురాణ పురుషులో లేక చక్రవర్తులోమాత్రమే చేయగలరు అనే తలంపు ఉండేది. కాని ఇది సగటు వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో ఈనాడు ఈ రీతి బహు ప్రతీతి. ఈ ప్రేమ సందేశాన్ని అభ్యుదయ కవి ఆరుద్ర (భాగవతుల సదాశివశంకర శాస్త్రి ) ఆత్మగౌరవం చిత్రం ద్వారా అందించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం కళాతపస్వి పద్మశ్రీ కె. విశ్వనాథ్ (కాశీనాథుని విశ్వనాథ్) కు దర్శకునిగా తొలి చిత్రం.రసాలూరు రాజేశ్వరంలో ఘంటసాల ఆలపించిన ఈ గీతాన్ని ఆలకించి ఆనందించండి.
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
చిత్రం: | ఆత్మ గౌరవం (1965) | |||
సంగీతం: | ఎస్. రాజేశ్వరరావు | |||
రచన: | ఆరుద్ర | |||
గానం: | ఘంటసాల | |||
సాకీ. | ఓ..సోదర సోదరీమణులారా.. | |||
ఆదరించి నామాట వింటారా.. | ||||
స్త్రీ కంఠం: | వింటాం. చెప్పు. | |||
పల్లవి: | ప్రేమించి పెళ్ళిచేసుకో నీ మనసంత హాయి నింపుకో | |||
ప్రేమించి పెళ్ళి చేసుకో.. | ||||
చరణం: | వరుని వలపేమిటో, వధువు తలపేమిటో | |||
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా | | వరుని | | |||
తెలిసి కట్నాలకై బతుకు బలిచేసినా | ||||
కడకు మిగిలేది ఎడమోము పెడమోములే | | ప్రేమించి | | |||
చరణం: | మనిషి తెలియాలిలే, మనసు కలవాలిలే | |||
మరచిపోలేని స్నేహాన కరగాలిలే | | మనిషి | | |||
మధుర ప్రణయాలు మనువుగా మారాలిలే | ||||
మారి నూరేళ్ళ పంటగా వెలగాలిలే | | ప్రేమించి | | |||
చరణం: | నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని | |||
వలచి రుక్మిణియె పిలిపించె శ్రీకృష్ణుని | | నలుడు | | |||
తొలుత మనసిచ్చి మనువాడె దుష్యంతుడు | ||||
పాత ఒరవళ్ళు దిద్దాలి మీరందరూ | | ప్రేమించి | | |||