కర్ణపేయమైన కర్ణాటక సంగీతాన్ని సినిమా మాధ్యమంద్వారా పండిత
పామరులను రంజింపజేయగలిగిన సంగీత రసజ్ఞులు ఘంటసాల మాస్టారు. ఆయన
ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంగీత నిర్దేశకత్వాన్ని చేపట్టి ఎన్నో
మధుర రాగాలలో మన హృదయాలలో అమృతపుజల్లులు చిలికించారు. తెలుగు చలనచిత్ర
సంగీత నేపథ్యానికి సారధ్యం వహించిన సంగీతత్రయము అయిన సాలూరు, పెండ్యాల,
ఘంటసాల. వీరి వచ్చిన చిత్రాలలో వారి శక్తికి మించిన సామర్ధ్యం వారి
బాణీలలో గోచరిస్తుంది. ఇదివరలో మా(మన) ఘంటసాల-రాగశాల లో మిత్రులు
చంద్రమౌళిగారు పలురాగాలైన చక్రవాకం, షణ్ముఖప్రియ, చారుకేశి, పంతువరాళి,
మలయమారుతం, హిందోళం, హంసానంది, సామ, శుద్ధసావేరి, ఆరభి, నాటకప్రియ మొదలయిన
రాగాలలో ఘంటసాల గానంచేసిన పలు పద్యాల, గేయాల, పాటల వివరాలను తెలియజేసారు.
ఈసారి మరొక రాగం హమీర్ కళ్యాణి గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యంచేయక
అడుగిడండి రాగశాలలోనికి.
రాగం: హమీర్ కళ్యాణి (కేదార్)
వాగ్గేయకారులైన త్యాగయ్య , అన్నమయ్య, రామదాసుల కథల ఆధారంగా నిర్మించిన చలన చిత్రాలలో ఘంటసాల పాడియుంటే,
ఆయన కంఠంలో కొన్ని శాస్త్ర్రీయ కీర్తనలు వెలుబడియుండేవి. శంకరాభరణంలాంటి సంగీత ప్రధానమైన చిత్రం ఘంటసాల జీవితదశలో రాలేదు. చలనచిత్ర దృశ్యాలలో పూజలు, పెళ్ళిచూపులు,
భరతనాట్యం, సంప్రదాయపు పాటలు ఇలాంటి సందర్భాలలో శాస్త్ర్రీయ సంగీతానికి ప్రవేశమున్నా, అక్కడ సంగతమయ్యేది స్త్రీగళం గనుక ఘంటసాల, శాస్త్రీయసంగీతాన్ని వినిపించడానికి అవకాశంలేదు. సంగీతప్రధానమైన "జయభేరిలో"
రెండు, "జగదేకవీరుని కథలో" ఒకటి, "టింగురంగ"లో మరొకటి తప్ప తనగళంలో, (కొన్ని లఘు శాస్త్రీయ
గేయాలు మినహా) వేరుగా శుద్ధశాస్త్రీయ సంగీతాన్ని అందించే అవకాశం ఆయనకు కలుగలేదనే చెప్పాలి.
ఆ లోటును తీర్చడానికేమో "లవకుశ", "రహ్యస్యం"
లాంటి చిత్రాలూ, కొన్ని స్వంత గానముద్రికలూ,మరియూ భగవద్గీతాగానం ఆయన గళంలో శాస్త్రీయసంగీతాన్ని వినడానికి మనకు మిగిలిన
రసస్థలాలు. త్యాగరాజ కీర్తనలను పాడే కర్ణాటక
సంగీత విద్వాంసుడైన, ఘంటసాలకు వచ్చిన మొదటి అవకాశం నాగయ్యగారి
"త్యాగయ్య"లో ఆయన వెనకు కూర్చొని తాళంవేయడం, తంబూరా వెయ్యడం వరకే లభ్యమయ్యింది. అక్కడ ఉపయోగించబడని ఘంటసాల శాస్త్ర్రీయ విద్య ఆకాశవాణికి
నచ్చి, రెండు మూడు నెలలకు ఒకసారి లెక్కప్రకారం కర్ణాటక సంగీతంలో
ముప్పయి నుండి నలభై నిమిషాల వరకు కార్యక్రమాలను ఇస్తూండేవారు. పద్యపఠన అద్భుతంగా చేయడంతో
రేడియో సంగీత రూపకాలలో ప్రధాన సంగీత పాత్రలు ధరించేవారు. సంగీత రూపకాలలో లకుమాదేవి, వెలుగువెల్లువ, నాగకన్యక, కిన్నెరసాని
ఇవి మైలు రాళ్ళవంటివి. విశ్వనాథ సత్యనారాయణగారి "కిన్నెరసాని" సంగీతరూపకానికి
"సంగీత నిర్వహణ" చేసినది ఘంటసాల. ఘంటసాల శాస్త్రీయ సంగీతాన్ని గురించి,
ఇలాంటి విశేషమైన సంగతులను తెలిపినవారు ఘంటసాలకు అండగానిలిచి ప్రోత్సహించిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు. "మధురమైన గ్రాత్ర సంపదకు తోడుగా
శాస్త్రీయ సంగీతంలో చాలావరకు అభినివేశం ఉన్న ఘంటసాల, సంప్రదాయ
సిద్ధంగా మూడు గంటలు కచేరీ చేయగల్గిన జ్ఞానాన్ని సంపాదించి, పరిస్థితిననుసరించి
సినీరంగంలో ప్రవేశించడం, దాని అదృష్టం" అన్నారు నేదునూరి
కృష్ణమూర్తిగారు. ఇతరులు తన ప్రతిభను పొగడగా "మా గురువుల ఉపదేశ మహాత్మ్యం వలన
సంగీత విద్య, లక్ష్య - లక్షణముతో, నాదశుద్ధి
మరియు శృతిశుద్ధి ఏర్పడ్డాయి" అనేవారు
ఘంటసాల. ఆయనకు కర్ణాటక శాస్త్రీయ సంగీతంతోబాటు హిందూస్థాని పద్ధలిలోనూ వైదుష్యం కలిగిన
వివరాలను ఇదివరకే "రాగశ్రీ" వ్యాసంలో ప్రస్తుతించడమైనది.
హిందూస్థాని పద్ధతిలో ఆయన పరిణతను చూపెట్టే చిత్రాలలో ముఖ్యమైనది "భక్త జయదేవ".
జయదేవుని అష్టపదులను ఈ చిత్రంలోనే గాక మరికొన్ని
పౌరాణిక చిత్రాలలో నారదముఖంగా వింటాం. ఇదిగాక ఆయన భగవద్గీత పాడుటకు ముందు, భూప్, యమన్, దర్బారి
కానడ మరియు పీలు రాగాలలో నాలుగు అష్టపదులున్న ఎల్. పి. రికార్డ్ విడుదలైంది. ఘంటసాల పాడిన దక్షిణాది వాగ్గేయకారుల కీర్తనలు మనకు అలభ్యమైనా,
జయదేవ అష్టపదులు అష్టసంఖ్యలో వినగలుగుతున్నాము. అవే: ప్రళయపయోధిజలే,
రతిసుఖసారే, అనిల తరళ కువలయ నయనేన, ప్రియేచారుశీలే, ధీరసమేరే యమునా తీరే, జయజయదేవ హరే, రాధికా కృష్టా రాధికా, రమతే యమునా పుళినవనే.
పన్నెండవ శతాబ్దంలోనవద్వీపం రాజు లక్ష్మణసేనుడి ఆస్థానకవిగా ఉండేవాడని భావించే
జయదేవుని రాధామాధవీయమైన "గీతగోవిందం", సంగీతరత్నాకరం వ్రాయడానికి ముందే పుట్టింది.
ఆ ఇతివృత్తాన్ని 1961లో తెలుగులో "భక్త జయదేవ"గా తీశారు. రసభావ సరస్వతి రాజేశ్వరరావు
మరియు ఘంటసాలవంటి గాయన గంధర్వుడు, వీరిద్దరి కలయిక ఆ నాటి సినిమా
సంగీతానికి కలిగిన ఒక మహాయోగం. హమీర్ కల్యాణి
రాగ స్వరూపాన్ని సశాస్త్రీయంగా ఇమిడించుకొన్న ఈ పాట ఘంటసాల సంగీత సవ్యసాచిత్వానికి
సుమహారం.
చిత్రం: భక్త జయదేవ
S M1, GP,
M1D, NS; / SNDPM2 PDPM RS
ఆలాపన: |
సా...సస
మా...గపా పమ(2)దాపమ దా మప, మపసా సానిరీ .....
|
ఆలాపన
(తాళబద్ధంగా చతస్రగతిలో) మపసస మపసస మపసనిదపమప
|
|
మపసా..సనిరీనిదమపా
పమనిద పమదప మదపమ గమరిస
|
|
నీ మధుమురళీగానలీల | |
సనిరీనిద
పమదా గారి గమపా,
|
|
నీ మధుమురళీగానలీల | |
సనిరిసనీద గమ గమనిద మగమగ గమపా
|
|
మనసులు
చివురిడురా కృష్ణా.
|
|
సాసమగమ
దనిమప నిససనిదపమగ సాదనిదమపా ..మపసనిదప మదమప
గమరిసనిస
|
|
నీ
మధు మురళీ గానలీల.
|
|
సనిరిసనీద గమ గమనిద మగమగ గమపా
|
|
వాద్యం: |
పా
దా మప మప మ పా
|
ఆ....
మపదామపా మపదని సనిదా మపదా నిసగమ
|
|
యమునా
తటమున మోడులు మురిసి,యమునా తటమున,
|
|
మదామప
సాససస దనిసరి నిసదప, మదమప సాససస
|
|
యమునా
తటమున ...
|
|
మదామప
సాససస....
|
|
ఆ....
దనిసరీనిదా (దనిసరీనిదా) దనిసరిదనిసరీనిదా గమపదనిసదప
|
|
పువులు
పూచినవి గోపాలా
|
|
నీ
మధుమురళీగానలీల, మనసులు చివురిడురా కృష్ణా!
|
|
నీ మధుమురళీగానలీల | |
మపసస
సససస నిరిసస నిరిసస నిససస నిరిరిరి నిససస నిరిరిరి
|
|
నిసస నిరిరి నిసస నిరిరి నిసదప మపనిస రిసదప | |
వాద్యం: | మపనిస రిసదప |
మపసనిదప మదపపప గమరిసనిస | |
ఆ..మపసనిదప
మదపపప గమరిసనిస
|
|
వాద్యం: |
మపనిసరీ...నిసగమపా...
|
ఆ....
|
(తీవ్రగతిలో సాగి అకారస్వరాలు తారపంచమంలో చేయు గమకగుంఫన ముక్తాయముద్ర ఘంటసాల
స్వీయముద్ర)
(Ghantasala/Saluri/Jayadeva)(నీ మధు మురళీ)
హమీర్ కల్యాణి షాడవ-సంపూర్ణ రాగం. ఏకధారగా నడువక, ఒకచోట నిలువక, నిరంతర నర్తనశీలమైన రాగమిది.
ఆరోహణ - అవరోహణ స్వరాలను గుర్తించి పట్టుకోలేని స్వరాల భ్రమణగతి ఈ రాగ స్వభావము. నయంగా
సాగుతూ, వయ్యారంగా వన్నెలను చిందిస్తూ, పట్టు దారాలపైన తేనెలు జారువాలినటుల నర్తించే హమీర్ కళ్యాణియొక్క సొగసు,
ఘంటసాల గళంలో, నయగారాల స్వరాలతో ప్రారంభమై నయాగరా
జలపాత గాంభీర్యంతో తుదముట్టే స్వరవర్షం ఒక శాశ్వతమైన గానశిల్పమై నిలిచింది.
ఆరోహాణం: స మ(శు), గప, మ(ప్ర)ద, ని సా,
అవరోహణం: సనిదపమ(ప్ర)గ, మ(శు) రి,స.
మరొక విన్యాసం: సపమ2పదనిస / సనిదపమ2మ1గపమ1రిస.
ఆరోహాణం: స మ(శు), గప, మ(ప్ర)ద, ని సా,
అవరోహణం: సనిదపమ(ప్ర)గ, మ(శు) రి,స.
మరొక విన్యాసం: సపమ2పదనిస / సనిదపమ2మ1గపమ1రిస.
కర్ణాటక సంగీత పద్ధతిలోని హమీర్ కల్యాణి రాగస్వరూపమే హిందుస్తాని
క్రమంలో "కేదార్" రాగము. అలనాటి సినిమా పాటలలో, ముఖ్యంగా పౌరాణిక చిత్రాలలో, ఈ రాగాన్ని
ఖ్యాత సినీ సంగీత త్రిమూర్తులందరూ వాడుకొన్నారు.
భక్త జయదేవలో ఘంటసాలచే కేదారగానవిహారం చేయించిన సాలూరివారు, "శ్రీదేవిని నీదు దేవేరిని" అంటూ వేంకటేశ్వరుని సేవించిన వర"లక్ష్మి"చే,
హమీర్ కల్యాణిని లాలించిన పెండ్యాల ఈ రాగానికి సశ్రావ్యంగా సమర్థంగా
సంగతులను సమకూర్చారు. ఘంటసాల స్వరీకరించిన "రహస్యం" చిత్రంలోని "ఝణన, ఝణన ఝణ" ఈ
రాగమే. అదే చిత్రంలో "సాధించనౌనా" పాటకు మాండ్ మరియు హమీర్ కళ్యాణి రెండురాగాల వరుసలనూ కుదిర్చి ఒక కొత్త బాణినే కట్టారు,
మాస్టారు.
"హమీర్" రాగమూ ఈ కోవకు చెందినదే. కేదార్ రాగంలో లేని శుద్ధగాంధార ప్రయోగమే "హమీర్ భిన్నత". రఫి "కోహినూర్" చిత్రానికై నౌషాద్ దర్శకత్వంలో పాడిన "మధు బన్ మె రాధికా నాచేరే" "హమీర్" రాగం. ఈ పాట ధాటినే "అందాల రాణివై ఆడుమా" అంటూ "శభాష్ రాజా" చిత్రంలో ఘంటసాల అనుసరించారు.
"హమీర్" రాగమూ ఈ కోవకు చెందినదే. కేదార్ రాగంలో లేని శుద్ధగాంధార ప్రయోగమే "హమీర్ భిన్నత". రఫి "కోహినూర్" చిత్రానికై నౌషాద్ దర్శకత్వంలో పాడిన "మధు బన్ మె రాధికా నాచేరే" "హమీర్" రాగం. ఈ పాట ధాటినే "అందాల రాణివై ఆడుమా" అంటూ "శభాష్ రాజా" చిత్రంలో ఘంటసాల అనుసరించారు.
హమీర్ కళ్యాణి రాగంలో ఘంటసాల గానామృతం
అందాలరాణివై - ఘంటసాల, లీల (శభాష్ రాజా)
మరికొన్ని మధురిమలు:
నీ మధు మురళీ గాన లీల - భక్త జయదేవ
మందాకినీ సలిల (శ్లోకం) - స్వర్ణమంజరి
ఝణన ఝణన ఝణ నాదమె - స్వర్ణమంజరి
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానామ్, యద్యద్విభూతి మత్సత్వం - భగవద్గీత
"కేదార్" కేదారనాథునికి అంకితమైన శివప్రియరాగమంటారు. కళ్యాణ్ థాట్ జన్యమైన ఈ రాగం సాయం సమయ గానయోగ్యం. ఆరోహాణం: S M1, GP, M1D, NS;
అవరోహణం: SNDPM2 PDPM1 RS.
రెండు మధ్యమాలను పలుకే ఈ రాగమే కర్ణాటక పద్ధతిలో "హమీర్ కల్యాణి" (మేచ కల్యాణి జన్యం). రెండుమధ్యమాలను అద్భుతమైనరీతిలో కూర్చే నేర్పుఆరితేరిన విద్వాంసులకే చెల్లును. రెండు రాగాలకు ఒకే ఆరోహణ స్వరాలు. హమీర్ కళ్యాణి అవరోహణ మాత్రం కొద్దిగ మారుతుంది. (అవరొహణ: SNDPM2G, M1R,S). కర్ణాటక పద్ధతిలోనున్న "కేదార" రాగానికి, ప్రస్తుతం మనం పరిశీలిస్తున్న "కేదార్" రాగానికి ఏ సంబంధమూ లేదు. ఆరోహణంలో "మపదనిస" ప్రయోగమున్ననూ "పదనిస" ప్రయోగం నిషిద్ధం. శాస్త్రీయ సంగీతంలో హమీర్ కల్యాణి రాగనిబద్ధమైన ముఖ్యమైన కృతులు: మానములేదా (త్యాగరాజు) , పరిమళ రంగనాథం (దీక్షితర్), వెంకటేశ విహార (సుబ్బరాయ శాస్త్రి), గాంగేయవసన (స్వాతి తిరునాళ్).
హమీర్ కళ్యాణి = కేదార్, హమీర్ రాగాలని విస్తారంగా, గాఢంగా వినడానికి వీలుగా ఈ క్రింది అంతర్జాల యిమిడికలను వాడగలరు.
(P.Susheela/MSV-VR/Karnan) (హమీర్ కళ్యాణి)
(ustaad Bade Gulam
Alikhan) (కేదార్)
(Rajan Sajan Mishra)(కేదార్)
(Songs in Raag
Kedar)
(Lata in Mugal E Azam)
(Raag Hamir/Rafi/Kohinur)
మరో రాగంతో మళ్ళీ కలుద్దాం.