"పరాధీనతానమ్రమైన మాతృ దేశాన్ని ఉద్ధరించే సమరంలో యువకులకు పిరికి మందు నూరిపోసి వెనకడుగు వేయించే తల్లి తల్లి కాదు. పెద్దలు పెద్దలు కారు. ప్రేమించే హృదయంలో ప్రేమ లేదు."
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
పల్లవి: | పురుషులు: | వెడలిపో | |
స్త్రీలు: | వెడలిపో | ||
అందరు: | వెడలిపో | ||
పురుషులు: | వెడలిపో | ||
స్త్రీలు: | వెడలిపో | ||
అందరు: | వెడలిపో | ||
పురుషులు: | తెల్లదొరా మాదేశపు ఎల్లదాటి వెడలిపో | ||
స్త్రీలు: | తెల్లదొరా మాదేశపు ఎల్లదాటి వెడలిపో | ||
స్త్రీలు: | వెడలిపో | ||
పురుషులు: | వెడలిపో | ||
చరణం: | పురుషులు: | కల్లతెలిసినారు ప్రజలు చెల్లదింక నీ ఆటా | |
అందరు: | కల్లతెలిసినారు ప్రజలు చెల్లదింక నీ ఆటా, వెడలిపో | ||
పురుషులు: | తెల్లదొరా | ||
స్త్రీలు: | వెడలిపో | ||
పురుషులు: | వెడలిపో | ||
చరణం: | స్త్రీలు: | కల్లబొల్లి కబురులాడి కాని పగలు కల్పించి | |
అందరు: | కల్లబొల్లి కబురులాడి కాని పగలు కల్పించి | ||
పురుషులు: | కొల్లగొట్టి మా దేశము గుల్లచేసి తిన్నారిక | ||
అందరు: | కొల్లగొట్టి మా దేశము గుల్లచేసి తిన్నారిక, వెడలిపో | ||
పురుషులు: | తెల్లదొరా | ||
స్త్రీలు: | వెడలిపో | ||
పురుషులు: | వెడలిపో | ||
చరణం: | పురుషులు: | ప్రజలె ప్రజల మేలుగోరి పాలించే యుగమ్మిది | |
అందరు: | ప్రజలె ప్రజల మేలుగోరి పాలించే యుగమ్మిది | ||
పురుషులు: | చోటు లేదు మీకిట కడసారి మాటయిదే | ||
అందరు: | చోటు లేదు మీకిట కడసారి మాటయిదే | ||
పురుషులు: | మూటగట్టి వెడలిపో వెడలిపో | ||
అందరు: | వెడలిపో |
మనదేశం చిత్రంలో ఎన్.టి.ఆర్., సి.కృష్ణవేణి
Thanks: to 'manadesamtdp' for posting the video clip and to 'Wikipedia' for providing background information. Audio file and Movie Poster are from Sakhiyaa.com