Thanks to Telugu Movie Talkies for up loading the video to You Tube. Thanks to Ghantasala Galamrutamu-Patala Paalavelli (Sri Kolluru Bhaskara Rao garu) for the information about the movie.
1969 లో తమిళంలో శివాజీ గణేశన్ త్రిపాత్రాభినయంతో (తండ్రి మరియు ఇద్దరు కవల పిల్లల పాత్రలలో), జయలలిత, నాగేష్, పండరీబాయి మరియు నాగయ్య నటించిన "దేవై మగన్" చిత్రాన్ని తెలుగులో "కోటీశ్వరుడు" గా 1970 లో నిర్మించారు. కథకొస్తే ఒక జడ్జిగారికి పుట్టిన కవల పిల్లలలో ఒకడు నల్లగా అందవికారంగా పుట్టడం వలన ఆ తండ్రి ఆ పిల్లడు పుట్టి చనిపోయాడని భార్యకు చెప్పి వేరే వ్యక్తికిచ్చి పెంచమంటాడు. వేరేగా పెరిగిన కొడుకు పెద్దయ్యాక తన తల్లిని కలవడానికి ప్రయత్నిస్తే ఆ తండ్రి కలవనీయడు. తండ్రిచే నష్టపోయిన ఒక వ్యక్తి తల్లిదండ్రుల వద్ద పెరిగిన కొడుకును అపహరిస్తాడు. అపుడు దూరమైన కొడుకు తన తమ్ముడ్ని రక్షించి తల్లివొడిలో ప్రాణాలు విడుస్తాడు. ఈ చిత్రానికి మూలం డాక్టర్ నీహార్ రంజన్ గుప్తా రచించిన ఉల్కా అనే బెంగాలీ నాటకం. ఈ చిత్రానికి దర్శకులు ఎ. సి. త్రిలోకచందర్. సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్ మరియు జె.వి.రాఘవులు. ఈ డబ్బింగ్ చితానికి ఘంటసాల రెండు ఏకగళ గీతాలు, ఎల్.ఆర్. ఈశ్వరి తో ఒక యుగళ గీతం పాడారు. కృష్ణునిపై మాస్టారు పాడిన గీతం ఇక్కడ పొందుపరుస్తున్నాను.
చిత్రం:
కోటీశ్వరుడు
(డబ్బింగ్) 1970
రచన:
ఆచార్య ఆత్రేయ
సంగీతం:
ఎం.ఎస్.విశ్వనాథన్, జె.వి. రాఘవులు
గానం:
ఘంటసాల
పల్లవి:
యాదవకుల పావనా కృష్ణా! కృష్ణా!
ఆశ్రితదీన జనా
కృష్ణా! కృష్ణా!
యాదవకుల పావనా కృష్ణా! కృష్ణా!
ఆశ్రితదీన జనా కృష్ణా! కృష్ణా!
ఆలయదీపికలే కృష్ణా! కృష్ణా! -2
అనగల హృదయములు కృష్ణా! కృష్ణా!
అర్చన మాలికలే కృష్ణా! కృష్ణా!
అద్భుత గానములు కృష్ణా! కృష్ణా!
యాదవకుల పావనా కృష్ణా! కృష్ణా!
ఆశ్రితదీన జనా
చరణం:
ఆరని వేదనరా కృష్ణా! కృష్ణా!
అందనీ ఆశలెరా కృష్ణా! కృష్ణా!
ఆరని వేదనరా కృష్ణా! కృష్ణా!
అందనీ ఆశలెరా
ఓరిమి నాకొసగీ కృష్ణా! కృష్ణా!
ఓరిమి నాకొసగీ కృష్ణా నన్ ఒక దరిజేర్చుమురా
కృష్ణా కృష్ణా ఒక దరిజేర్చుమురా
యాదవకుల పావనా కృష్ణా! కృష్ణా!
ఆశ్రితదీన జనా కృష్ణా! కృష్ణా!
చరణం:
నీ వొడి చేరితిరా కృష్ణా! కృష్ణా!
నిన్నే నమ్మితిరా కృష్ణా! కృష్ణా!
ఒంటరిదొక బ్రతుకూ కృష్ణా! కృష్ణా!
వృధగా చేయుదువా కృష్ణా! కృష్ణా!
ఒంటరిదొక బ్రతుకూ కృష్ణా! కృష్ణా!
వృధగా చేయుదువా కృష్ణా! కృష్ణా!
కృష్ణా..ఆ..ఆ..ఆ..కృష్ణా….ఆ…
కృష్ణా! కృష్ణా! కృష్ణా! కృష్ణా!
చరణం:
తల్లడిల్లే ఒక దీపమున్నది కృష్ణా! కృష్ణా!
తల్లీ తండ్రిని వెదుకుతు వున్నది కృష్ణా! కృష్ణా!
కన్నుల ప్రాణము మినుగుతున్నది కృష్ణా! కృష్ణా!
కన్నయ కన్నయ శరణింకన్నది కృష్ణా! కృష్ణా!
కృష్ణా….కృష్ణా..ఆ…..
యాదవకుల పావనా కృష్ణా! కృష్ణా!
ఆశ్రితదీన జనా
కృష్ణా! కృష్ణా!
Thanks to Narasimharao Yerramsetty for uploading the video to You tube. Also thanks to Wikipedia and Ghantasala Galamrutamu-Patala paalavelli blog for the useful information.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com