సం-గాలి పెంచల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సం-గాలి పెంచల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, నవంబర్ 2025, ఆదివారం

తీరిపోయెనా మాతా - పల్నాటి యుద్ధం (1947) చిత్రం నుండి ఘంటసాల

1947 సంవత్సరంలో విడుదలైన శారదా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన పల్నాటి యుద్ధం చిత్రం నుండి ఘంటసాల పాడిన "తీరిపోయెనా మాతా" అనే ఈ ఏకగళగీతం  రచన సముద్రాల సీ., స్వరపరచినది  గాలిపెంచెల. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, ఎస్.వరలక్ష్మి, గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, వంగర, సురభి బాలసరస్వతి, ముదిగొండ లింగమూర్తి. ఈ చిత్రానికి నిర్మాత కోగంటి వెంకట సుబ్బారావు మరియు దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం, ఎల్.వి.ప్రసాద్. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 24.09.1947 న విడుదలైంది.


#చిత్రం#పాట#పాటతీరు
 53తీరిపోయెనా మాతాఏకగళం
     
  ప:తీరిపోయెనా మాతా 
   నేటికి నీతో ఋణానుబంధము॥ తీరి ॥
     
  చ:నీ కౌగిటిలో పెరిగీ 
   నీ కరుణారస పానము జేసి 
   చౌకళించు మా వీర సింహముల 
   చౌకజేసి సిరి క్షణభంగురమై॥ తీరి ॥
     
  చ:పసిడి పొలాలు, పచ్ఛల బీళ్ళు 
   కేశవ పూజలు ఎడబాసీ 
   మాట కోసమై పర పంచలకూ 
   పోవలెనా పలనాటి మాతా॥ తీరి ॥

7, జనవరి 2022, శుక్రవారం

ఘంటసాల, అక్కినేని, బృందం పాడిన 'మేతదావినిబడ్డ మేలంపుటావా" పల్నాటియుద్ధం (1947) నుండి

 

1947 సంవత్సరంలో విడుదలైన శారదా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన పల్నాటి యుద్ధం చిత్రం నుండి ఘంటసాల-బృందం పాడిన “మేతదావినిబడ్డ మేలంపుటావా”  అనే ఈ బృందగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది  గాలి పెంచెల. ఈ చిత్రంలో తారాగణం గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, అక్కినేని, ఎస్.వరలక్ష్మి. ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి నాలుగు పాటలు పాడారు. అలనాటి ప్రముఖ నటి, గాయని అయిన పసుపులేటి కన్నాంబ నాయకురాలు నాగమ్మ గాను, గోవిందరాజుల సుబ్బారావు బ్రహ్మనాయుడు గాను, ఎ.ఎన్.ఆర్. బాలచంద్రుడు గాను ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులైన శ్రీ గాలి  పెంచల నరసింహారావు గారికి ఘంటసాల మాస్టారు సహాయ సంగీత దర్శకునిగా పనిచేసారు. అక్కినేని గారు స్వయంగా పాడారు, మాష్టారితో కలిసి పాడారు. 




#006  బృందగీతం  పాటః మేతదావినిబడ్డ మేలంపుటావా
  నిర్మాణం:శారదా ప్రొడక్షన్స్
  చిత్రం:పల్నాటి యుద్ధం (1966)
  సంగీతం:గాలి పెంచల నరసింహారావు
  రచన:సముద్రాల సీనియర్
  గానం:ఘంటసాల, అక్కినేని, కోరస్
    
 ఘంటసాలఃగురజాల రైతులు:ఓహో.. ఓ.. ఒయ్!
   మేత దావినిబడ్డ మేలంపుటావా,
   నీటి కారాటపడు నీలంపుటావా
   మాచెర్ల అడవులూ మడుగులూ మనవే
   మలిదేవుడడ్డినా మరలిరాకండి..ఈ.., మరలిరాకండి
  మాచెర్ల రైతులు :అడవి పచ్చికలోన అడుగు పెట్టేరు
   మడుగులో నీరాని మకిలజేసేరు
   గడి దాటితే పట్టి కట్టివేసేము
   మాచెర్ల అడవులూ మడుగులూ మావే
  గురజాల రైతులు :తెగతెంపులిక చచ్చు తెగవేసి చెప్పవోయ్
   నాగమో నాయుడో నస పనికి రాదింక, తెగవేసి చెప్పవోయ్
  మాచెర్ల రైతులుఃమూడు లోకాలేకమై యెత్తి వచ్చినా
   ఆడదానికి జోహారనము, మే మనము
   మాచెర్ల ఆడపులే మాకు రేపల్లె
   నాయుడే మాపాలి నందగోపయ్య
  గురజాల రైతు భార్యఃఅమ్మా నాన్నని చూడాలనిపిస్తున్నది మావా -2
   ఒక్కసారి నన్నంపు, ఉన్నట్టే తిరిగొస్తా -2
   యిక్కడ ఉన్నట్టే తిరిగొస్తా
  గురజాల రైతు :ఏయ్! మగనిమీద మమతుంటే, కాపురం కావాలంటే
   మగనిమీద మమతుంటే, కాపురం కావాలంటే
   ఈ సీమలోని చిలక ఆ సీమ వాలరాదే
   ఈ సీమలోని చిలక ఆ సీమ వాలరాదే పోరాదేపిల్లా
  గురజాల రైతు (భార్య)ఃవాదా అమ్మకచెల్లా
  భర్తఃపోరాదేపిల్లా
  భార్యఃఅపవాదా అమ్మకచెల్లా
   ఓహో...
  గురజాల యువకుడుఃవడిసేల రువ్వేటి వయ్యారిపడుచా -2
   జడిసిపోయేవారి జడిపించబోకే -2
  మాచెర్ల యువతులుఃబంగారుతల్లికీ పంట మాలచ్చిమికి -2
   పాలపొంగలి మొక్కుబళ్ళు చెల్లిద్దాము -2
  మాచెర్ల యువకులు :రండోయి నవయువకులు రండోయి, త్వరగ రండోయి
  యువతులుఃఆ.. ఆ..
  మాచెర్ల యువకులు :త్వరగ రండోయి దండులోన చేరండి రండోయి
   దండులోన చేరండి రండోయి, త్వరగ రండోయి
   గరిడి సాములో చేరీ గండు మగలు కండి-2
  యువకులు :రండోయి..
  యువతులుఃరండోయి..
  యువకులు :రండోయి..


5, అక్టోబర్ 2014, ఆదివారం

"గోవింద మాధవ దామోదరా!" -సీతారామ కల్యాణం నుండి

భగవదవతార ముఖ్యోద్దేశం దుష్టశిక్షణ మరియు శిష్టరక్షణ. అధర్మము వృద్ధిచెంది, ధర్మము నశించినపుడు తాను ప్రతియుగములో అవతరిస్తానని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో అర్జునునకు ఉపదేశించాడు. జగన్నాటక సూత్రధారియైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో పదింటిని ముఖ్యమైన అవతారాలుగా పేర్కొంటారు. అవి మీన, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, మరియు కల్కి అవతారాలు.   1961 లో విడుదలైన సీతారామ కల్యాణం చిత్రంలో మీనావతారం నుంచి రామావతార ప్రారంభం వరకు గల సారాంశాన్ని చక్కని సముద్రాల రాఘవాచార్యుల వర్ణన తో "గోవింద మాధవ దామోదరా" అనే గీతంలో చక్కగా వర్ణించగా దాన్ని తన గళమాధుర్యం తో ఘంటసాల మాస్టారు గాలి పెంచల నరసింహారావు సంగీత దర్శకత్వంలో గానం చేశారు.  



Thanks to ideal Dreams for uploading the video to You Tube



నిర్మాణం: నేషనల్ ఆర్త్స్ థియేటర్స్


చిత్రం: సీతారామ కల్యాణం (1961)


రచన: సముద్రాల రాఘవాచార్య 


సంగీతం: గాలి పెంచలనరసింహారావు


గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు






ప: గోవింద మాధవ దామోదరా



జయ గోవింద మాధవ దామోదరా, జగదానంద కారణ నారాయణా



జయ గోవింద మాధవ దామోదరా






చ: కృతులు హరించీ జలనిధి దాగిన (2)



సోమక దానవు ద్రుంచీ.... వేదోద్ధరణము చేసిన వీరా..



మీనాకార శరీరా నమో మీనాకార శరీరా






చ: పాల సముద్రము బానగ జేసి (2), మందర శైలము కవ్వము జేసి 



వాసుకి కవ్వపు త్రాటిని జేసి (2)



సురదానవులు తఱచగా గిరిని మోసిన కూర్మ శరీరా నమో



గిరిని మూపున మోసిన కూర్మ శరీరా






చ: పుడమిని బట్టి చాపగా జుట్టి (2), కడలిని దాగిన హిరణ్యాక్షుని 



కోరను గొట్టీ ధారుణి గాచిన



వీర వరాహ శరీరా నమో వీర వరాహ శరీరా






చ: సర్వమయుడవగు నిను నిందించే (2), హిరణ్య కశిపుని (2) వధియించీ



ప్రహ్లాదుని పరిపాలన జేసిన నరసింహాద్భుత రూపా



నమో నరసింహాద్భుత రూపా






చ: సురలబ్రోవ మూడడుగుల నేల (2)



బలిని వేడి ఆ..ఆ..ఆ.. బలిని వేడి 



ఇల నింగిని నిండీ మూడవ పాదము బలి తలమోపిన 



వామన విప్ర కుమారా, నమో! వామన విప్ర కుమారా






చ: ధరణీ నాధుల శిరముల గొట్టీ (2)



సురలోకానికి నిచ్చెనగట్టీ, తండ్రికి రుధిరము తర్పణ జేసిన 



పరశుధరా భృగురామా! నమో పరశుధరా భృగురామా!



గోవింద మాధవ దామోదరా జయ గోవింద మాధవ దామోదరా



జగదానంద కారణ నారాయణా గోవింద మాధవ దామోదరా 

9, ఏప్రిల్ 2012, సోమవారం

శివునిపై భావోద్వేగమైన భక్తి గీతం మరియు స్తోత్రం ఘంటసాల గళంలో- సీతారామ కల్యాణం నుండి

1961 లో విడుదలైన సీతారామ కల్యాణం చిత్రం శ్రీ ఎన్‌.టి.ఆర్. స్వీయ దర్శకత్వంలో అతని సోదరుడైన త్రివిక్రమరావు గారు ఎన్‌.ఏ.టి. పతాకంపై నిర్మించిన పౌరాణిక దృశ్య కావ్యం. సంగీతం శ్రీ గాలి పెంచల నరసింహారావు గారు. ఈ చిత్రంలోనిదే "సీతారాముల కల్యాణము చూతము రారండి" అనే పాట ఈ నాటికీ ప్రతి పెళ్ళిలోనూ వినబడుతుంది. ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, ఎన్‌.టి.ఆర్. నటన, గాలి పెంచల నరసింహారావు గారి సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు. అయితే నిజానికి ఈ పాట, స్తోత్రం శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు స్వరపరచి కారణాంతరాల వలన తప్పుకున్నారట. ఈ చిత్రంలో శివుడు, పార్వతి కైలాసంలో తాండవం చేసే సమయంలో రావణుడు వస్తాడు. నంది శివదర్శనానికి అనుమతించకపోతే లంకేశ్వరుడు పర్వత సానువులో కూర్చుని స్వయం విరచిత శివతాండవ స్తోత్రాన్ని గానం చేస్తాడు. మూల స్తోత్రంలో 15 చరణాలున్నాయి. కాని సినిమాలో కొద్ది భాగం మాత్రమే ఉపయోగించారు. అది మాస్టారు అద్భుతంగా గానం చేసారు. అయితే కొన్ని పదాలను కూడ కారణాంతరాల వలన మార్చినట్లు కనబడుతుంది. ఈ స్తోత్రం యొక్క మొత్తాన్ని ఇక్కడ చూడవచ్చును. సినిమాలో ఈ స్తోత్రం "కానరార కైలాస నివాస" అనే సముద్రాల సీ. వ్రాసిన పాట తరువాత వస్తుంది. ఈ చిత్రంలో దాదాపు 26 వరకు పాటలు, పద్యాలు వున్నాయి. 




చిత్రం: సీతారామ కల్యాణం (1958)

పాట రచన: సముద్రాల రాఘవాచార్య 

స్తోత్రం: రావణాసుర విరచితము

సంగీతం: సాలూరు రాజేశ్వర రావు (గాలి పెంచల)

గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు 


పాట: పల్లవి: కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా


కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా


కానరార


భక్తజాల పరిపాల దయాళా  | భక్తజాల |


హిమశైల సుతా ప్రేమలోలా


కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా


కానరార

చరణం: నిన్ను చూడ మది కోరితిరా..


నిన్ను చూడ మది కోరితిరా నీ సన్నిధానమున చేరితిరా | నిన్ను చూడ |


కన్నడ సేయక కన్ను చల్లగ మన్నన సేయర గిరిజారమణా


కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా


కానరార

చరణం: సర్ప భూషితాంగ, కందర్ప దర్పభంగ | సర్ప |


భవ పాశనాశ, పార్వతీ మనోహర


హే! మహేశ, వ్యోమకేశ, త్రిపురహర


కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా


కానరార

స్తోత్రం:
జయత్వదభ్ర విభ్రమత్ భ్రమద్భుజంగమస్ఫురత్ 


ధగద్ధగద్వినిర్గమత్ కరాళఫాల హవ్యవాట్!


ధిమిద్ధిమిద్ధిమిద్ద్వనన్‌ మృదంగ తుంగ మంగళ


ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః


ఓం నమః శివాయ 





అగ(ఖ)ర్వ సర్వ మంగళా కళాకదంబ మంజరీ


రసప్రవాహ మాధురీ విజృంభణా మధూవ్రతం


స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం


గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే


ఓం నమః హరాయ 





ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలి మఝ్ఝటా


విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం


స్మరచ్ఛిదం, పురచ్ఛిదం, భవచ్ఛిదం, మఖచ్ఛిదం


గజచ్ఛికాంధకచ్ఛిదం తమంత కచ్ఛిదం భజే

ఈ స్తోత్రంలో కొద్ది భాగాన్ని 1972 లో శ్రీ బాపు దర్శకత్వంలో విడుదలయిన సంపూర్ణరామాయణం చిత్రంలో మాధవపెద్ది పాడగా, రావణపాత్రధారి శ్రీ ఎస్.వి.ఆర్. పై చిత్రీకరించారు.

 
ఋషి పీఠం నుంచి పద్యాల వివరణ: 
(కొన్ని పదాలలో మార్పులున్నాయని గమనించగలరు)

మొదటి పద్యం: జయతు - సర్వోత్కృష్టుడై రాజిల్లు గాక!; అదభ్ర - అధికమైన; విభ్రమభ్రమత్ - వేగంగా తిరుగుతున్న; భుజంగమశ్వశత్ - బుసకొట్టు పాములచేత (సినిమాలో భుజంగమస్ఫురత్ అని వుంది); వినిర్గమత్ - వెలికి వస్తూ; క్రమస్ఫురత్ - క్రమంగా మెరుస్తున్న; కరాల(ళ) - భయంకరమైన; ఫాల -నుదుట;  హవ్యవాట్ -  అగ్ని కలవాడు; ధిమిద్ధిమిద్ధ్వనత్ - ధిమి ధిమి ధ్వనులు మ్రోగుతున్న; మృదంగ - మద్దెల యొక్క; తుంగ - మిక్కిలియైన; మంగళ ధ్వని క్రమ - మంగళమయ ధ్వనులననుసరించి; ప్రవర్తిత - సాగించబడిన; ప్రచండ తాండవ - ప్రచండంగా తాండవిస్తున్న; శివః - శివుడు.
తాత్పర్యం: అధికమైన వేగంతో తిరుగుతున్న సమయంలో పాములు బుసలు కొడుతుండగా, వెలికి కాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తున్న ఫాలనేత్రంతో, ధిమిధిమి ధ్వనుల ఉన్నతమైన మంగళనాదాలకు అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రచండంగా తాండవిస్తున్న శివుడు సర్వోన్నతుడై రాజిలుగాక!

రెండవ పద్యం: అఖర్వ - పరిపూర్ణురాలైన (అగర్వ అని వాడారు సినిమాలో); సర్వ మంగళా - గౌరీదేవి యొక్క; కలాకదంబ - విలాస సమూహములనెడి; మంజరీ - గుత్తిలోని; రసప్రవాహ మాధురి - మకరంద మాధుర్యాల తీయదనానికై; విజృంభణ - చెలరేగు; మధువ్రతం - తుమ్మెద వంటివాడై;  అంతకం - నశింపజేయువాడు; స్మర - మన్మధుడు; పుర - త్రిపురాసురుడు; భవ - సంసారం; మఖ - యజ్ఞం (దక్ష); గజ - గజాసురుడు; అంధక - అంధకాసురుడు; అంతక - నాశనము; అంతకాంతక - యముడు; భజే - ఆశ్రయిస్తున్నాను.
తాత్పర్యం: గొప్పదైన సర్వమంగళాదేవి కళావిలాసాల తీయదనపు ఒరవడిలో గండు తుమ్మెదలా ఆసక్తితో చెలరేగేవాడు (శివుడు) - మన్మథునీ, పురాసుర-అంధకాసురులను, సంసారాన్నీ, గజాసురునీ, యముడినీ సంహరించిన స్వామిని ఆశ్రయిస్తున్నాను.

మూడవ పద్యం: ప్రఫుల్ల - విరబూసిన; నీల పంకజ - నల్ల కలువల; ప్రపంచకాలిమప్రభా - గుంపుయొక్క నల్లని కాంతులను (సినిమాలో "ప్రచండ కాలి మఝ్ఝటా" అని వుంది); అవలంబి (విడంబి) - దాల్చియున్న; కంఠ కందలీరుచి - నడుమ భాగములోని కాంతితో; ప్రబద్ధ (ప్రబంధ) - బాగా ప్రకాశిస్తున్న; కంధరం - కంఠముగలవానిని; స్మరచ్ఛిదం - మన్మథుని దునిమినవాడు; పురచ్ఛిదం - త్రిపురాసురుని ఛేదించినవాడు; భవచ్ఛిదం - సంసార బంధములను తొలగించువాడు; మఖచ్ఛిదం - దక్ష యజ్ఞ ధ్వంసకుని; గజచ్ఛిత్ + అంధకచ్ఛిదం - గజాసురుని, అంధకాసురుని ఛేదించిన వానిని; తం అంతకచ్ఛిదం - యముని సంహరించిన శివుని; భజే - ఆశ్రయిస్తున్నాను.
తాత్పర్యం: నల్లకలువల గుంపుల నడుమనున్న గాఢమైన నల్లదనంతో పోలిన కంఠం గలవానిని, మన్మథునీ, త్రిపురాసురునీ, సంసార బాధలను, దక్ష యజ్ఞాన్నీ, గజాసురునీ, అంధకాసురునీ, యముణ్ణీ హరించే ఆ పరమశివుని ఆశ్రయిస్తున్నాను. 

కృతజ్ఞతలు: పరోక్షంగా దోహద పడిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శుభచరణాలకు నమస్సులతో. ఈ సమాచారం నలుగురితో పంచుకోవాలనే సంకల్పంతో ఈ వివరాలు సేకరించి వ్రాయడమైనది. ఏవైనా పొరపాట్లు దొర్లివుంటే చదువరులు సవరణలు, సూచలను తప్పక నా దృష్టికి తీసుకురాగలరు.

7, ఫిబ్రవరి 2012, మంగళవారం

ధర్మాంగద చిత్రం కోసం మాస్టారు పాడిన ప్రబోధ గీతం


1949 లో విడుదలైన ధర్మాంగద ఒక జానపద చిత్రం. కాశ్మీర రాజు అయిన ధర్మాంగదుడు, భార్య అర్మిలిదేవికి సంతానం ఉండరు. సంతానం లేక రాజు పరమశివుని నిరసించడం వలన అతనికి ఒక సర్పం కొడుకుగా, నాగ కుమారుడై పుడతాడు. మరొక రాజు అయిన రత్నాంగదునికి త్రిలోకసుందరి అనే అందమైన కుమార్తె వుంటుంది. అతని వద్దనుండే రాజగురువు తనను రాజకుమారి తిరస్కరించిందన్న కక్షతో ఆమెకు పాము రూపం గల నాగ కుమారునితో వివాహం చేయిస్తాడు. వివాహం అయిన పిదప ఆమె తన పాతివ్రత్యంతో భర్తకు మానవరూపం వచ్చేలా చేస్తుంది. క్లుప్తంగా అదీ కథ. ఇందులో ధర్మాంగదుడుగా శ్రీ గోవిందరాజుల సుబ్బారావు (షావుకారు ఫేం), త్రిలోక సుందరి గా శ్రీమతి సి.కృష్ణవేణి, రాణి అర్మిలి దేవి గా శ్రీమతి ఋష్యేంద్రమణి, రాజ గురువుగా శ్రీ ముదిగొండ లింగమూర్తి గార్లు నటించారు. శ్రీమతి కృష్ణవేణి గారు గాయని, నటి, నిర్మాత. ఆమె మీర్జాపురం రాజా వారి సతీమణి. ఈ చిత్రానికి మాస్టారు మూడు పాటలు, ఒక పద్యం పాడారు. అయితే అందులో ఒక్కటి మాత్రమే దొరుకుతున్నది. ఆ పాట "జయీభవ విజయీభవ", చిత్రంలో ఒక సాధువు పాడతాడు. మాస్టారు పాడిన ఈ పాట యొక్క శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.  (Story source from Sakhiyaa.com)
                         చిత్రం:         ధర్మాంగద (1949)
                         రచన:         తాపీ ధర్మారావు నాయుడు
                         సంగీతం:      గాలి పెంచల నరసింహారావు
                         గానం:         ఘంటసాల వెంకటేశ్వరరావు

Thanks to Priyansh Doneparthy for the You Tube clip

                      ప.     జయీభవ! విజయీభవ! జయీభవ!
                              దీక్షా కంకణధారి విజయీభవ               | దీక్షాకంకణ |
                              విజయీభవ! విజయీభవ!
                              విజయీభవ! విజయీభవ!
                              దీక్షా కంకణధారి విజయీభవ!
                      అ.ప.  ధీర భావములు వీడకుమా                  | ధీర భావములు |
                              దిగ్విజయము నీవే సుమా                  | దిగ్విజయము |
                              దీక్షా కంకణధారి విజయీభవ!

                      చ.     జయమో, మరణమో రెండే కాని
                              అన్యంబైనది శూన్యమె గాదా                        | జయమో |
                              దీక్షే కవచము, దీక్షే సాధన
                              దీక్షే సర్వము దీక్షే
                              దీక్షా కంకణధారి విజయీభవ!

                      చ.     కార్యసిద్ధి చేకూరినదాకా
                              కష్టసుఖాలొక కంటనే చూడు               | కార్యసిద్ధి |
                              వెనుకంజన్నది వెదకినా కలుగదు
                              అపజయమన్నది అసలే లేదు
                              దేవ దుందుభులు మ్రోగును నీకై           | దేవ దుందుభులు |
                              కుసుమ వర్షములు కురియును నీకై
                              ప్రతి నోటను నీ పేరే వినబడు
                              ప్రజలకు నీవే మార్గదర్శివి                   | ప్రజలకు |
                              దీక్షా కంకణధారి విజయీభవ!
                              జయీభవ! విజయీభవ!
                              విజయీభవ! విజయీభవ!
కృతజ్ఞతలు:  కథ వివరాలను అందించిన సఖియా.కాం కు, శ్రవణ ఖండిక పొందుపరచిన ఘంటసాల గాన చరితకు, యూ ట్యూబ్ వనరులను అందించిన ప్రియంశు దోనెపర్తి లకు మనఃపూర్వక ధన్యవాదములు.

29, జనవరి 2012, ఆదివారం

మాచెర్ల చెన్నకేశవునిపై అలనాటి పల్నాటి యుద్ధం (1947) నుండి ఘంటసాల బృందం పాడిన పాట

మాచెర్ల చెన్న కేశవస్వామి ఆలయం 
పన్నెండవ శతాబ్దంలో పల్నాడు (ఉత్తర గుంటూరు జిల్లా) లోని మాచెర్ల మరియు గురజాల కు చెందిన దాయాదుల మధ్య వైష్ణవ-శైవ మత వైషమ్యాలు, రాజ్య కాంక్షల విభేదాలతో రగుల్కొన్న విరోధాల ప్రతిఫలం కారంపూడి రణభూమిగా జరిగిన పోరు "పల్నాటి యుద్ధం" గా తెలుగు చరిత్రలో ప్రసిద్ధం. సారూప్యంలో ఇదొక ఆంధ్ర కురుక్షేత్రం. గురజాల రాజు నలగామరాజు. ఇతని కొలువులోని సలహాదారుగా వున్న నాయకురాలు నాగమ్మ రాజనీతెరిగిన ప్రతిభాశాలి మరియు శివభక్తురాలు. నలగామరాజు సోదరుడు మలిదేవుడు మాచెర్ల రాజు. మలిదేవుని కొలువులో మంత్రి అయిన బ్రహ్మనాయుడు విష్ణుభక్తుడు. యితడు మాచెర్లలో చెన్నకేశవస్వామి ఆలయం కట్టించాడు. పరమతసహనం గలవాడై అన్నికులాలవారు సహపంక్తిని భోజనం చేయాలన్న "చాపకూటి సిద్ధాంతం" ప్రతిపాదించిన సామ్యవాది. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించి మాలదాసరులను  చెన్నకేశవ స్వామి కోవెలకు అర్చకులుగా నియమిస్తాడు. ఈ చర్య మత విద్వేషాలను ఎక్కువ చేస్తుంది. ఈ జరిగిన చరిత్ర ఇతివృత్తంతో "పల్నాటి యుద్ధం" పేరుతో 1947 లోను, 1966 లోను చలన చిత్రాలు వచ్చాయి. 1947 లో వచ్చిన చిత్రంలో గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, ఎ.ఎన్.ఆర్.లు, 1966 లోని చిత్రంలో ఎన్.టి.ఆర్, భానుమతి , హరనాథ్ వరుసగా బ్రహ్మనాయుడు, నాగమ్మ, బాలచంద్రుడు (బ్రహ్మనాయుని కొడుకు) ల పాత్రలు పోషించారు. 1947 పల్నాటి యుద్ధం చిత్రంలో చెన్నకేశవస్వామి ఆలయంలోకి ప్రవేశిస్తూ ఆనందంతో హరిజనులంతా పాడే పాట "చూతము రారయ్యా చెన్నయ్యను చూతము రారయ్యా" ఘంటసాల వెంకటేశ్వర రావు, అక్కినేని నాగేశ్వరరావు, మాలవల్లి సుందరమ్మ, ప్రయాగ నరసింహ శాస్త్రి, బృందం గానం చేసారు. ఈ పాట సాహిత్యం, ఆడియోను ఇక్కడ పొందుపరుస్తున్నాను. 
 
చిత్రం:         పల్నాటి యుద్ధం (1947)
రచన:         సముద్రాల రాఘవాచార్య
సన్గీతం:       గాలి పెంచల నరసింహారావు
గానం:         ఘంటసాల, అక్కినేని, సుందరమ్మ, ప్రయాగ, బృందం

ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత

పురుషులు:  చూతము రారయ్యా చెన్నయ్యను
                చూతము రారయ్యా ఆ..ఆ                                      | చూతము |
సుందరమ్మ:  కన్నుల పండువుగా కన్నయ్యను
                చూతము రారమ్మా ఆ..ఆ..
స్త్రీలు:          కన్నుల పండువుగా కన్నయ్యను చూతము రారమ్మా
అందరు:      తరతరాల పాపాలు కరగి మరగి తొలగిపోయె                    | తరతరాల |
                మొర వినెనో యిలవేలుపు దొరకె నేడు మన పాలికి            | మొర వినెనో |
ప్రయాగ:      చూతాము రారయ్యా చెన్నయ్యను
పురుషులు:  మనం చూతాము, మనం చూతాము రారయ్యా చెన్నయ్యను
సుందరమ్మ:  చూదాము రారమ్మ కన్నయ్యను
స్త్రీలు:          మనము చూదాము, మనము చూదాము రారమ్మా కన్నయ్యను

అందరు:      ఎల్ల లోకాలేలు చల్లన్ని సామినీ                                   | ఎల్ల లోకాలేలు |
                కళ్ళలో పెట్టుకుని కాపాడమందాము                              | కళ్ళలో |
అందరు:      చూతము రారయ్యా చెన్నయ్యను చూతము రారయ్యా          | చూతము |
                దరిశెనమాయెనుగా సామీ! దరిశెనమాయెనుగా
                మా జన్మ తరించెనుగా.. జన్మ తరించెనుగా
                నీ దరిశెనమాయెనుగా
ఘంటసాల:   చెన్నుడు మము దయ చూచెనుగా
                పొన్నలు, పూవులు పూచెనుగా                                  | చెన్నుడు |
                వెన్నుని చూచిన మా కన్నులలో                                 | వెన్నుని |
                పున్నమి వెన్నెల గాచెనుగా                                       | పున్నమి |
అందరు:      దరిశెనమాయెనుగా సామీ! దరిశెనమాయెనుగా
                చంద్రవంక జాలువార నాగులేరు పొంగార                          | చంద్రవంక |
                పలనాడే సెలయేరై పరవశించెగా
                మా పలనాడే సెలయేరై పరవశించెగా
                దరిశెనమాయెనుగా సామీ! దరిశెనమాయెనుగా

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన "క" నుంచి "జ" చిత్రాలు

చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1953 (2) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొండవీటి దొంగ(డ)-1958 (1) చి-కొడుకు కోడలు-1972 (1) చి-కోటీశ్వరుడు (డ)-1970 (1) చి-గంగా గౌరీ సంవాదము(డ)-1958 (1) చి-గాంధారి గర్వభంగం(డ)-1959 (2) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (4) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1)

మాస్టారు పాడిన "ట" నుంచి "న" చిత్రాలు

చి-టింగ్ రంగా-1952 (5) చి-టైగర్ రాముడు-1962 (1) చి-టౌన్‌ బస్ (డ)-1957 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తలవంచని వీరుడు(డ)-1957 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (2) చి-దశావతారములు(డ)-1962 (1) చి-దసరా బుల్లోడు-1971 (1) చి-దసరాబుల్లోడు-1971 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (6) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొంగ రాముడు-1955 (2) చి-దొంగనోట్లు (డ)-1964 (2) చి-దొరబాబు-1974 (3) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (2) చి-నిర్దోషి-1967 (1)

మాస్టారు పాడిన "ప" చిత్రాలు

చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (4) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (3) చి-పల్లెటూరు-1952 (11) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (6) చి-పిచ్చి పుల్లయ్య-1953 (2) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెంపుడు కొడుకు-1953 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (11) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రాయశ్చిత్తం(డ)-1962 (3) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (3) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1)

"బ, భ, మ" - చిత్రాలు

చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడిపంతులు-1972 (3) చి-బభ్రువాహన-1964 (3) చి-బలిపీఠం-1975 (1) చి-బలే బావ-1957 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (3) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (3) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భలేపాప-1971 (1) చి-భాగ్యదేవత-1959 (3) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భాగ్యవంతులు (డ)-1962 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మదన మంజరి(డ)-1961 (1) చి-మనదేశం-1949 (17) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (4) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (7) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1)

మాస్టారు పాడిన "య, ర, ల, వ" చిత్రాలు

చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (2) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (3) చి-రణభేరి-1968 (2) చి-రత్నగిరి రహస్యం (డ)-1957 (2) చి-రత్నమాల-1948 (1) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (5) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-లైలా మజ్ను-1949 (5) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాలి సుగ్రీవ-1950 (2) చి-వాల్మీకి-1963 (2) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విప్లవ స్త్రీ (డ)-1961 (1) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరఖడ్గము(డ)-1958 (1) చి-వీరాంజనేయ-1968 (2) చి-వీరాభిమన్యు-1965 (9) చి-వెలుగు నీడలు-1961 (4)

మాస్టారు పాడిన "శ,ష" చిత్రాలు

చి-శకుంతల-1966 (10) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శభాష్ సత్యం-1969 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (2) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వల్లీ కల్యాణం (డ)-1962 (1) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (3) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణతులాభారం-1966 (5) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జునయుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీమతి-1966 (3) చి-శ్రీరామభక్త హనుమాన్ (డ)-1958 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీశైల మహత్యం(డ)-1962 (1) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2)

సహగాయనీ గాయకులు

గా-L.R.ఈశ్వరి తో (1) గా-M.S.రామారావు-పి.సుశీల తో (1) గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (7) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (142) గా-ఘంటసాల-బృందం (4) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (10) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (15) గా-పి.లీల తో (25) గా-పి.లీల-బృందం తో (1) గా-పి.సుశీల తో (77) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పి.సుశీల-వసంత తో (1) గా-పిఠాపురం తో (2) గా-బహుగళం తో (2) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (45) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (4) గా-సి.కృష్ణవేణి-బృందం తో (1) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

సం -టి.వి.రాజు (1) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1) సం-S.L.మర్చెంట్-M.Sశ్రీరామ్ (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (7) సం-ఆదినారాయణరావు (7) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (3) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎ.ఎం.రాజా (2) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (14) సం-ఎస్.రాజేశ్వరరావు (1) సం-ఓగిరాల (4) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (3) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-గాలి పెంచల (7) సం-ఘంటసాల (144) సం-చక్రవర్తి (1) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (4) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (4) సం-టి.వి.రాజు (34) సం-టి.వి.రాజు-దినకరరావు (5) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-నిత్యానంద్ (3) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.ఆదినారాయణరావు (3) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (48) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (15) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయభాస్కర్ (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విజయాకృష్ణమూర్తి (1) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్-పామర్తి (1) సం-సాలూరు (49) సం-సాలూరు-గోపాలం (2) సం-సి.ఆర్.సుబ్బురామన్ (17) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (20) సం-హనుమంతరావు (2)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (16) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (28) ర-ఆరుద్ర (48) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (20) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (4) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (7) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (15) ర-తిక్కన (3) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (12) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (5) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (45) ర-బమ్మెఱ పోతన (3) ర-బలిజేపల్లి (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (6) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (9) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (34) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సదాశివబ్రహ్మం (4) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (79) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (8) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (1) రచన-బలిజేపల్లి (1)