పరమశివుని సతి పరమేశ్వరి. ఆమె సర్వ శుభాలకు శుభకర్త్రి, సర్వమంగళ. సర్వార్ధ దాయిని. నారాయణుని సహోదరియైన నారాయణి. అందరికి చిరపరిచితమైన గౌరీ దేవి ప్రార్థనా శ్లోకం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే. ఈ శ్లోకం తో మొదలిడి నిరపరాధులైన తన తల్లిదండ్రులకు మాంత్రికుని చెఱ నుండి ముక్తిని కోరుతూ, శక్తివర్ధనియైన శక్తిస్వరూపిణి అమ్మవారిని ఒక రాజకుమారుడు ప్రార్థించే "ఈశ్వరీ జయము నీవే" పాటను సి. నారాయణ రెడ్డి 'రాజకోట రహస్యం' చిత్రం కోసం వ్రాయగా, ఘంటసాల బృందం గానం చేసారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినది - తెలుగు చలన చిత్రసీమ సాంకేతికంగా ప్రాథమిక దశలో ఉన్నపుడు స్వల్ప వ్యయంతో తన సృజనాత్మకతతో అద్బుతమైన మాయలు మంత్రాల ప్రత్యేక ప్రక్రియలతో లక్షలాది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన వ్యక్తి 'జానపద బ్రహ్మ' బి. విఠలాచార్య. కర్ణాటకలో పుట్టి, తొలుత కన్నడ చిత్రాలు రూపొందించిన విఠలాచార్య తదుపరి కాలంలో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించి మరియు/లేదా దర్శకత్వం వహించారు. అతనికి "మాయాజాల మణ్ణన్" అని తమిళ రంగంలో మరొక బిరుదు. ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలలో అత్యధిక సంఖ్య (19) ఎన్.టి.రామారావు నటించిన చిత్రాలు. అందులో ఒక మాణిక్యం రాజకోట రహస్యం. ఈ చిత్రానికి సంగీతం విజయా కృష్ణమూర్తి.
సాకీ: | సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే | ||
శరణ్యే త్ర్యంబికే దేవీ! నారాయణి నమోస్తుతే! | |||
పల్లవి: | ఈశ్వరీ! జయమునీవే, పరమేశ్వరీ అభయమీవే | ||
ఈశ్వరీ! జయమునీవే, పరమేశ్వరీ అభయమీవే | |||
ఈశ్వరీ! జయమునీవే | |||
చరణం: | సూర్యులు కోటిగ.. చంద్రులు కోటిగ.. | ||
వెలసిన తేజము నీవే దేవీ | |||
శక్తి వర్ధనివి వరదాయినివే..ఏ..ఏ…ఏ.. | | శక్తి వర్ధనివి | | ||
ఇహము..పరము..నాకిక నీవే | |||
ఈశ్వరీ! జయమునీవే | |||
చరణం: | మంత్ర తంత్రముల మాయల ప్రబలిన | ||
క్షుద్రుల పీడకు బలియగుటేనా.. | |||
దుష్ట శక్తులను రూపుమాపగా..ఆ..ఆ..ఆ.. | | దుష్ట శక్తులను | | ||
మహామహిమలే నాకిడలేవా.. | |||
ఈశ్వరీ! జయమునీవే | |||
చరణం: | నిరపరాధులగు తలిదండ్రులు సరి | ||
క్రూరుల బాధల గురియగుటేనా.. | |||
దుర్మార్గులనిక నాశము చేసీ…ఆ..ఆ.. | | దుర్మార్గుల | | ||
తరించు వరమిడి దయగన రావా.. | | ఈశ్వరీ | | ||
ఈశ్వరీ! జయమునీవే | |||
బృందం: | ఓం! నారాయణీ… ఓం! నారాయణీ! | ||
చరణం: | ప్రాణములైదుగా.. వేదనలైదుగా.. | ||
పరిపరి విధముల నిను వేడితినే..ఏ…ఏ… | |||
ఆ..ఆ…ఆ..ఆ…ఆ.. | |||
అమోఘ మహిమల ఆది శక్తివే.. | |||
బృందం: | ఓం! నారాయణీ… ఓం! నారాయణీ! | ||
అమోఘ మహిమల ఆది శక్తివే.. | |||
కరము.. బలము.. నాకిక నీవే.. దేవీ… దేవీ | |||
బృందం: | ఓం! నారాయణీ… ఓం! నారాయణీ! | ||
ఓం! నారాయణీ… |
కృతజ్ఞతలు: వికి పీడియాకు, విడియో పొందుపరచిన jaiannantr13 కు, సమాచారము అందించిన ఘంటసాల గళామృతము బ్లాగు వారికి ధన్యవాదములు.