నిర్మాణం: | వాహినీ వారి | ||
---|---|---|---|
చిత్రం: | మల్లీశ్వరి (1951) | ||
రచన: | దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి | ||
సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు | ||
గానం: | ఘంటసాల,భానుమతి | ||
పల్లవి: | భానుమతి: | ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. | |
ఘంటసాల: | హెయ్! పరుగులు తియ్యాలి ఒ గిత్తలు ఉరకలు వేయాలి | ||
హెయ్! పరుగులు తియ్యాలి ఒ గిత్తలు ఉరకలు వేయాలి | |||
భానుమతి: | హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి | ||
మన ఊరు చేరాలి ఓ... | |||
హోరు గాలి, కారు మబ్బులు - 2 | |||
ముసిరేలోగా,మూగేలోగా ఊరు చేరాలి, మన ఊరు చేరాలి | |||
చరణం: | భానుమతి: | గలగల గలగల కొమ్ముల గజ్జెలు | |
ఘణఘణ ఘణఘణ మెళ్ళో గంటలు | |||
ఇద్దరు: | ఆ..ఆ..ఆ.ఆ..గలగల గలగల కొమ్ముల గజ్జెలు | ||
ఘణఘణ ఘణఘణ మెళ్ళో గంటలు | |||
వాగులు దాటి,వంకలు దాటి ఊరు చేరాలి, మనఊరు చేరాలి | |||
చరణం: | ఘంటసాల: | ఆ..ఆ..ఆ..ఆ.. అవిగో అవిగో.. | |
నల్లని మబ్బులు గుంపులు గుంపులు | |||
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో.. అవిగో.. | |||
నల్లని మబ్బులు గుంపులు గుంపులు | |||
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో.. అవిగో.. | |||
భానుమతి: | ఆ..ఆ..ఆ..పచ్చని తోటలు, విచ్చిన పూవులు | ||
మూగే గాలుల తూగే తీగలు అవిగో... | |||
కొమ్మల మూగే కోయిల జంటలు | |||
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో.. అవిగో.. | |||
ఇద్దరు: | అవిగో.. అవిగో..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. | ||
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ |