తెనాలి రామకృష్ణుడు చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన వికటకవి. విజయనగర
సామ్రాజ్యపు కవన, సాహిత్య వేదికయైన భువనవిజయంలోని అష్టదిగ్గజాలలో ఒకడైన ఆతనికి ఒక ప్రత్యేకమైన
స్థానం వుంది. ఒక సందర్భంలో శ్రీ కృష్ణదేవరాయలను శ్లాఘిస్తూ ఒక పద్యం
చెబుతాడు. ఈ పద్యంలో తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయల కీర్తిని
స్వచ్ఛతకు ప్రతీకయైన శ్వేత వర్ణం (తెలుపు రంగు) తో పరోక్షంగా వ్యక్తి,
వస్తు, వాహన విశేషాల ఉపమానాలుపయోగించి ఆరు అంశాలతో పోలుస్తూ వర్ణిస్తాడు.
అదెలాగంటే, నరసింహ కృష్ణరాయల - నరసింహ రాయల కుమారుడైన కృష్ణ దేవరాయల
(తండ్రి పేరును తనయుని పేరుకు జతచేసి చెప్పడం దక్షిణాదిన ఒక ఆనవాయితీ
కదా!) అపూర్వమైన కీర్తి ఎలా
ఒప్పిందంటే - "కరిభిద్గిరిభిత్కరి కరిభిద్గిరి గిరిభిత్కరి భిద్గిరిభిత్తురంగ కమనీయంబౌ" అని. ఇందులోని తెలుపు రంగును గలిగిన ఆరు అంశాలు పదచ్ఛేదనం చేస్తే - కరిభిత్
(1) + గిరిభిత్-కరి (2) + కరిభిత్-గిరి (3) + గిరిభిత్ (4) + కరిభిత్
గిరిభిత్ తురంగ అంటే కరిభిత్ తురంగ (5) మరియు గిరిభిత్ తురంగ (6).
వీటి అర్ధం - 1. కరిభిత్ = శివుడు (కరి = ఏనుగు; భిత్ = తునక లేక ముక్క) గజాసురుడు అనే కరి రూపుగల రాక్షసుడ్ని ముక్కలు చేసినవాడు అయిన శివుడు తెల్లగా వుంటాడు; 2. గిరిభిత్ కరి - గిరుల రెక్కలు త్రుంచిన ఇంద్రుని యొక్క ఏనుగు - ఐరావతం తెల్లనిది; 3. కరిభిత్ గిరి - కరిభిత్ అంటే శివుడు, కరిభిత్ గిరి అంటే శివుని కొండ లేక ధవళగిరి తెల్లనిది; 4. గిరిభిత్ - తెల్లనైన తళుకుమనే వజ్రాయుధం; 5. కరిభిత్ తురంగము అంటే శివుని వాహనము అయిన నంది తెల్లనిది (తురంగము అంటే గుఱ్ఱమైనప్పటికీ వాహనము అన్న అర్ధంలో కూడ తీసుకోవచ్చును. అందువలన శివునికి వాహనము అని అనుకోవచ్చును); 6. గిరిభిత్ తురంగము అంటే గిరుల రెక్కలను ఖండించిన ఇంద్రుని వాహనమైన ఉచ్ఛైశ్రవము కూడ తెల్లనిది; . ఆవిధంగా - శివుడు (కరిభిత్), ఐరావతం (గిరిభిత్ కరి), వెండి కొండ (కరిభిత్ గిరి), వజ్రాయుధం (గిరిభిత్), నందీశ్వరుడు (కరిభిత్తురంగము) మరియు ఉచ్ఛైశ్రవము (గిరిభిత్తురంగము) అన్నీ తెల్లనివే. తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకు, చైతన్యానికి ప్రతీక. ఆవిధంగా శ్రీ కృష్ణదేవరాయల అపూర్వమైన కీర్తి స్వచ్ఛతకు చిహ్నమై తెల్లగా వున్నదని తెనాలి రామకృష్ణ కవి భావము.
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
పద్యం: తెనాలి రామకృష్ణ
సంగీతం: విశ్వనాథన్-రామ్మూర్తి
గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు
కృతజ్ఞతలు: ఈ విశేషాలను 'తురుపుముక్క' బ్లాగు కవితాభిషేకం-4 నుండి సేకరించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ విశేషాలు చదువుతుంటే మనసుకు ఎంతో ఆనందం కలిగింది. అది మీతో ఇక్కడ పంచుకుంటున్నాను. దృశ్యఖండికను యూ టూబ్ లో సమకూర్చిన అన్వితా రాం కు ధన్యవాదములు.
వీటి అర్ధం - 1. కరిభిత్ = శివుడు (కరి = ఏనుగు; భిత్ = తునక లేక ముక్క) గజాసురుడు అనే కరి రూపుగల రాక్షసుడ్ని ముక్కలు చేసినవాడు అయిన శివుడు తెల్లగా వుంటాడు; 2. గిరిభిత్ కరి - గిరుల రెక్కలు త్రుంచిన ఇంద్రుని యొక్క ఏనుగు - ఐరావతం తెల్లనిది; 3. కరిభిత్ గిరి - కరిభిత్ అంటే శివుడు, కరిభిత్ గిరి అంటే శివుని కొండ లేక ధవళగిరి తెల్లనిది; 4. గిరిభిత్ - తెల్లనైన తళుకుమనే వజ్రాయుధం; 5. కరిభిత్ తురంగము అంటే శివుని వాహనము అయిన నంది తెల్లనిది (తురంగము అంటే గుఱ్ఱమైనప్పటికీ వాహనము అన్న అర్ధంలో కూడ తీసుకోవచ్చును. అందువలన శివునికి వాహనము అని అనుకోవచ్చును); 6. గిరిభిత్ తురంగము అంటే గిరుల రెక్కలను ఖండించిన ఇంద్రుని వాహనమైన ఉచ్ఛైశ్రవము కూడ తెల్లనిది; . ఆవిధంగా - శివుడు (కరిభిత్), ఐరావతం (గిరిభిత్ కరి), వెండి కొండ (కరిభిత్ గిరి), వజ్రాయుధం (గిరిభిత్), నందీశ్వరుడు (కరిభిత్తురంగము) మరియు ఉచ్ఛైశ్రవము (గిరిభిత్తురంగము) అన్నీ తెల్లనివే. తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకు, చైతన్యానికి ప్రతీక. ఆవిధంగా శ్రీ కృష్ణదేవరాయల అపూర్వమైన కీర్తి స్వచ్ఛతకు చిహ్నమై తెల్లగా వున్నదని తెనాలి రామకృష్ణ కవి భావము.
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
పద్యం: తెనాలి రామకృష్ణ
సంగీతం: విశ్వనాథన్-రామ్మూర్తి
గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు
నరసింహ కృష్ణ రాయల
కరమరుదగు కీర్తి వెలయు కరిభిత్గిరిభి
త్కరి కరిభిద్గిరి గిరిభి
త్కరిభిత్గిరిభిత్తురంగ కమనీయంబై!కృతజ్ఞతలు: ఈ విశేషాలను 'తురుపుముక్క' బ్లాగు కవితాభిషేకం-4 నుండి సేకరించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ విశేషాలు చదువుతుంటే మనసుకు ఎంతో ఆనందం కలిగింది. అది మీతో ఇక్కడ పంచుకుంటున్నాను. దృశ్యఖండికను యూ టూబ్ లో సమకూర్చిన అన్వితా రాం కు ధన్యవాదములు.