1958 లో నిర్మించబడిన "నడోడి మన్నన్" (The Vagabond King) అనే తమిళ చిత్రాన్ని తెలుగులో "అనగాఅనగా ఒక రాజు" గా డబ్బింగు చేశారు. ఈ చిత్రం ఆరోజుల్లో రూపొందిన అతి పెద్ద చిత్రం. ఇది 5 గంటల సినిమా. అయితే కొంత ఎడిటింగ్ చేసాక 3.5 గంటలకు వచ్చింది. ఎం.జి.రామచంద్రన్ దర్శకత్వంలో ఆయన ద్విపాత్రాభినయంతో పి.భానుమతి, బి.సరోజాదేవి తో కలసి నటించిన ఈ చిత్రానికి ఘంటసాల ఒక పాట పాడారు. దీనిని మహాకవి శ్రీ శ్రీ వ్రాసారు. సందేశాత్మక గీతాలు వ్రాయడం లో శ్రీశ్రీది అందె వేసిన చెయ్యి. డబ్బింగ్ పాటలో కూడ తన పదాల వాడిని తెలుగువాడికి చూపించి ప్రభావితుడ్ని చేశారు ఆయన. ఈ చిత్రం కోసం శ్రీశ్రీ వ్రాసిన "సుఖపడుటే సుఖమై పరుగిడ నీజన్మం" అన్న పాటలోని భావం అక్షర సత్యం. అయితే ఇది మరుగున పడి వున్న ఒక ఆణి ముత్యం. తమిళంలో ఈ పాటను గోవిందరాజన్ పాడారు. అయితే చలన చిత్ర శైశవ దశలో శ్రీ శ్రీ ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలకు పాటలు వ్రాసేవారు. తరువాత ప్రముఖులు రాజశ్రీ. అయితే డబ్బింగు పాటలకుండే ఇబ్బందులు పద విచ్చేదనలో స్పష్టంగా తెలుస్తాయి. ఉదాహరణకు - కల్మి, కాన్‌పడదు, కాల్లు చేతుల్ మొదలయినవి. అవి పెదవుల కదలికలకు కూడ అతికినట్టు ఉండాలి మరి.ఈ చిత్రానికి సంగీత దర్శకులు టి.ఎం.ఇబ్రహీం. అయితే తమిళ చిత్రానికి సంగీత దర్శకులు ఎస్.ఎం.సుబ్బయ్యనాయుడు (సంగీతయ్య).
కృతజ్ఞతలు: ఆడియోను పొందుపరచిన సఖియా.కామ్ వారికి, వివరాలు సమకూర్చిన వికిపీడియా మరియు ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగులకు హృదయపూర్వక ధన్యవాదములు.
వీడియో మూలం: ఘంటసాల గానామృతం
చిత్రం: | అనగాఅనగా ఒక రాజు (1959) | ||
రచన: | శ్రీ శ్రీ | ||
గానం: | ఘంటసాల | ||
సంగీతం: | టి.ఎం.ఇబ్రహిం | ||
పల్లవి: | సుఖపడుటే సుఖమై పరుగిడ నీ జన్మం | ||
శోకాలు తెచ్చేనోయ్ తెలుగోడా! | | సుఖపడుటే | | ||
సుఖపెట్టుటే గుణమై పరగిన నీ జన్మం - 2 | |||
లోకాలు మెచ్చేనోయ్ తెలుగోడా! | | సుఖపెట్టుటే | | ||
చరణం: | కల్మినెంతో మెచ్చి గర్వించ నీ జన్మం | ||
కలత పడు చూడూ తెలుగోడా! | | కల్మినెంతో | | ||
అల్లాడు పేదలను సేవింప యిలయందే | | అల్లాడు | | ||
కాన్‌పడదా స్వర్గం తెలుగోడా! | | కాన్‌పడదా | | ||
చరణం: | ఘనమైన కాల్లు చేతుల్ కల్గియుండె బిచ్చమునెత్తు | | ఘనమైన | | |
జన్మ దుఃఖాల చేసే తెలుగోడా! -2 | |||
అందరు పనిచేసి ఆ ఫలమున్ పొంద | |||
అద్భుతమౌను జన్మం తెలుగోడా! | | అందరు | | ||
అద్భుతమౌను జన్మం తెలుగోడా! | |||
చరణం: | బ్రతుకంతా పదవి జొరబడితే జన్మం | | బ్రతుకంతా | | |
హీనమయ్యేనయ్యా తెలుగోడా! | | హీనమయ్యే | | ||
ఉసురిచ్చి తల్లి నేలన్..ఆ..ఆ..ఆ.. | |||
ఉసురిచ్చి తల్లి నేలన్ గౌరవించితే జన్మం | | ఉసురిచ్చి | | ||
లోకాలు మెచ్చేనోయ్ తెలుగోడా! | | లోకాలు | |
కృతజ్ఞతలు: ఆడియోను పొందుపరచిన సఖియా.కామ్ వారికి, వివరాలు సమకూర్చిన వికిపీడియా మరియు ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగులకు హృదయపూర్వక ధన్యవాదములు.