1966 సంవత్సరంలో విడుదలైన రాజ్యం వారి సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల బృందం తో పాడిన "ఆనందమౌనమ్మా అపరంజి బొమ్మ " అనే ఈ బృంద గీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రం లో తారాగణం ఎన్.టి.రామారావు, బి.సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధరరావు-లక్ష్మీరాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు. దీనిని నాగయ్య, తదితరులు పై చిత్రీకరించారు.
కృతజ్ఞతలు : చిత్రంలోని పాటల వివరాలను "ఘంటసాల గళామృతము" బ్లాగ్ ద్వారా అందించిన శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, సాహిత్యాన్ని"శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకము ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారములు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
ఘంటసాల బ్లాగు (HOME)
