1, జూన్ 2014, ఆదివారం

“సింహేంద్రమధ్యమ రాగం” లో ఘంటసాల పండించిన భక్తి, కరుణ, వీర భావరసరంగ తరంగాలు

గర్భస్థశిశువైనా, డోలాగర్భంలోని పాపాయైనా, గర్భగుడిలోని  దేవుడైనా అతని గానమాధురికి అందరూ పరవశులే. భామప్రీతి-ప్రేమగీతి, శోకభావం-లోకజీవం, రక్తివాదం-భక్తినాదం ఏభావానికైనా ఆయన పలికితే ప్రాణం. “రావే నా చెలియా” అనగా ఆమె పరవశించవలసిందే, “రారా కృష్ణయ్య” అని ఆలపించగా కృష్ణుడు నడచిరావలసిందే. ఏభావాల సృష్టికి, ఏ స్వరం, ఏ స్థాయిలో, ఎలా పలకాలో, ఎలా పలికించాలో తెలిసిన స్వరభావరసజ్ఞుడు ఘంటసాల.

     శాస్త్రీయ సంగీతచక్రవర్తిగా ఎందరినో ఒప్పించాలా? లేక, లలిత సంగీత సార్వభౌమునిగా అందరీనీ మెప్పించాలా అన్న ద్వంద్వం ఆయన మనోలోకంలో ఒకప్పుడు కలిగియుండవచ్చు. “పాటకు పల్లవి ప్రాణం” అంటూ శాస్త్రీయ సంగీత పట్టభద్రుడైనా, జీవిత సమరమే ప్రధానమైన ఆ తొలిరోజుల్లో “పాడనా! ప్రభూ పాడనా!” అంటూ ఆయన అంతరంగం నినదిస్తే, “పాడుతా తీయగా చల్లగా” అంటూ జనుల మెప్పును సంపాదించే విధానం ఆనాటి ప్రాస్తావికం. అంత్యదశలో భగవద్గీతాగానమే ఆయన 'హంసగీత' కావడం తన అంతర్భావాలను వెల్లడిస్తుంది. అయినప్పటికీ తనకు వచ్చిన అవకాశాలలోనే గాయకుడిగా మరియు స్వరకర్తగా ఆయన సంగీతంలో చేసిన అన్వేషణోపేతమైన గతులూ, సంగతులూ, స్వర-రస-భావ త్రైగుణ్యనిర్ణయాధారితమై ఆయన సృజించిన అపూర్వ బాణీలు, సముచిత శాస్త్రీయరాగప్రయోగాలతో కర్ణపుటాలనుండి లోనికి దిగి, హృదయాంతరాళాలలో ఒదిగి కలకాలం నిలిచే జనప్రియత గడించిన పాటలను పాడిన ప్రతిభచే ఘంటసాల మన భావసంగీత త్రిమూర్తులలో సర్వదా, సర్వథా ఆద్యుడే. విశేషించి సింహేంద్రమధ్యమ రాగంలో ఘంటసాల ఆలపించిన అపురూపమైన పాటలను, పద్యాలను, శ్రవణ ఖండికలను సింహావలోకనం చేస్తూ వేమరు పర్యాయములు నెమరువేసుకోవడం ఒక రసానుభవం.
     పద్యగాయన విధాన సార్వభౌమత్వము ఆయనదే. తెనాలి రామకృష్ణకవి రాయలను శ్లాఘించిన 'మత్తేభవిక్రీడిత’ నిబద్ధమైన ఈ పద్యాన్ని వినండి.
 కలనన్ తావక (తెనాలి రామకృష్ణ)

"కలనన్ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మం 
డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్ హార కుం 
డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయణుంగాంచి లో 
గలగంబారుతునేగె నీవయనుశంకన్ కృష్ణరాయాధిపా!!"
     ఘంటసాల పద్యగానంలో కవితావాచన గాంభీర్యం, క్లిష్టమైన పదాల అర్థాలు వికసించేలా పాడిన తీరు, "నారాయణుంగాంచి" అను చోట తార స్థాయిలో గమక సంచారం ఆనాటి ఆయనలోని త్రిస్థాయి గాత్ర మాధుర్యం నేటికీ ఇతరులకు అనితరసాధ్యమే.  ఆ మత్త-ఇభ-విక్రీడితాన్ని సమర్ధవంతంగా నిర్వహించింది, ఘంటసాలకు సింహేంద్రమధ్యమ రాగంపై నున్న పట్టు, ఆ రాగ సర్వస్వాన్నీ ఆకళింపు చేసుకొన్న అకార గమకవర్షం అతి హర్షణీయం. ఇది శ్లోకాంతంలో గోచరిస్తుంది.  సింహాచల క్షేత్ర మహిమ చిత్రానికి ఘంటసాల పాడిన ఈ సీసపద్యం భక్తిరసభరితమైన సహృదయ హృద్య నైవేద్యం. 
 భక్త శిఖామణి (శ్రీ సింహాచల క్షేత్ర మహిమ)
     కల్యాణి, కానడ రాగాలవలె పూర్ణ స్థాయిలో సింహేంద్రమధ్యమ రాగాన్ని గానం చేసే అవకాశాలు లేకపోయినా, ఒక సందర్భంలో ఘంటసాల ఈ రాగంలో ఒక మంచి పాటకు బాణీ కట్టి ఆలపించారు. పౌరాణిక చిత్రాలకే శాస్త్రీయ రాగాలు సరిపోతాయి అన్న అభిప్రాయాన్ని మార్చి, ఒక సామాజిక చిత్రంలో సింహేంద్రమధ్యమ రాగాన్ని శాశ్వతీకరించారు. అదే 'టైగర్ రాముడు' చిత్రం కోసం తన సంగీత సారధ్యం లోనే పాడిన పాట 'పాహి దయానిధే'. శుద్ధ శాస్త్రీయ పద్ధతిలో స్వరకల్పన జేసి పాడిన ఈ పాట సింహేంద్రమధ్యమ రాగానికి మంచి నిదర్శనం. ఈ చిత్రంలో నాయకుడు సందర్భవశమై పాప కార్యాలకు లోబడి, తుదకు పశ్చాత్తాపద్రవిత హృదయంతో దైవానికి శరణనే సమర్పణాభావం చూపించడం ఈ పాటలోని ఆంతర్యం. సింహేంద్రమధ్యమ స్వరాల ద్వారా ఆ భావాన్ని కలుగజేసే ఈ పాటను ఒక సంగీత కృతి స్థాయికి చేర్చారు మాస్టారు. 

హే! దయానిధే (టైగర్ రాముడు)
     కొన్ని చలనచిత్రాలు సామాన్యశ్రేణిలో ఉన్నా, అందులోని పాటలు అసామాన్యంగా ఉంటాయి. ఈ కోవకు చెందిన డబ్బింగ్ చిత్రాలు మనకు కొన్ని మంచిపాటలను తెచ్చిపెట్టాయి.  అలాంటిదే సింహేద్రమధ్యమరాగంలో మాస్టారు పాడిన ఈ పాట “ఓంకారమై ధ్వనించు నాదం”. తమిళంలో సినిమాపాటల గాయన విధానానికి (ఆశ్చర్యసూచకంగా కొన్నిచోట్ల పాటను ఆపివేయడం, చతురశ్రగతి ఆదితాళంలో వైవిధ్యంకోసం పదాలను త్రిశ్రగతిలో నాటకీయతతో ఇమిడించిడం) అనుగుణంగా, అంటే ఆ ప్రాదేశిక భాష ఉచ్చరించే తీరుకి, పెదవుల కదలికలకు పొందిక కుదిరేలా ఉన్నది మాస్టారి గానం. సహజత్వానికి కొంచెం దూరమనిపించినా, మాస్టారు ఈరాగంలో పాడిన మరోపాట లేదు కాబట్టి ఇక్కడ వినిపించడమైనది. పాటయొక్క రాగసంచారం, ఆకాలంనాటి చిన్నప్ప, త్యాగరాజ భాగవతార్, శీర్కాళి గోవిందరాజన్ గాయన పద్ధతిని జ్ఞప్తికి తెచ్చినా, ఘంటసాల గానంలో భక్తి, వీర, అద్భుత రసస్పర్శ కనిపించకపోదు.
ఓంకారమై ధ్వనించు(తలవంచని వీరుడు)

     తెలుగులో సింహేంద్రమధ్యమ రాగాధారితమైన సినిమా పాటలు చాల అరుదనే చెప్పాలి. రాగమాలికలకూ శ్లోక-పద్యగాయనానికి ఈరాగం పరిణామకారిగా ఉంటుంది. "మహాకవి కాళిదాసు" చిత్రంలో శాకుంతల నాటక సన్నివేశంలో దుష్యంతుడు (ఏ.ఎన్.ఆర్) పలికే 'పౌరవ సురక్షితాశ్రమవనము జేరి' అనే పద్యం వింటే ఈ రాగం క్షణంలో ఎలా రసానుభూతిని కలగజేయునో స్ఫురిస్తుంది. “ఎవడువాడు” అని వీరరసం ప్రవేశించి, “అబలులైన సపత్నికన్యాజనమ్మునిటుల” అంటూ దయ మరియు కరుణ రసాలను పలికించి, ఇరవై సెకనుల పద్యంలో భావరసావిష్కరణచేసిన ప్రతిభ ఆయనకే చెల్లు. పద్యభావం ఇంచుమించు కుపిత దుష్యంతుని పరాక్రమయుతమైన మాటలు, ఆశ్రమ పరిసరములలో చెల్లని భీషణ ప్రతిజ్ఞకాదు. వీరరసంలోనూ ఒక నయాన్ని సంయమనాన్ని సూచించే విధంగా పద్యగానం ఉండడం ఒక విశేషం.
పౌరవ సురక్షితా (మహాకవి కాళిదాసు)

     ప్రతిజ్ఞబూనుట, వీరావేశ భావప్రకటనలాంటి సందర్భానికి సింహేంద్రమధ్యమరాగం పెట్టింది పేరు. ఉదాహరణకు “శ్రీకృష్ణరాయబారం” చిత్రంలోని అర్జునుని ప్రతిజ్ఞసంధర్భం. ఇక్కడి సింహేంద్రమధ్యమం వీరరసప్రధానమై ఆవేశపూరితమైన ఆలాపన. మాస్టారు ఆలపించిన ఈ ధీరవీరవిహారాన్ని వినండి.  
ఆర్ణవ సప్తకంబు (శ్రీకృష్ణ రాయబారం)

     “శ్రీరామాంజనేయ యుద్ధ” అను కన్నడ చిత్రంలో ఆంజనేయుని పద్యం “ముక్తిధామ శ్రీరామన” మరియు రహస్యం చిత్రంలో స్వరకల్పనచేసి ఆలపించిన ఉత్పలమాల “నాదు సమస్త శక్తులును” రెండూ ప్రతిజ్ఞాపద్యాలే. మొదటి పద్యం భక్తితోనిండిన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తే, రెండవది రాజసాహంకార పూరితమైయున్న భావాన్ని కలుగజేసే విధానం గాయకుని పాత్ర గుణ సన్నివేశాంశధారణాప్రతిభ గమనీయం.
ముక్తిధామ (శ్రీ రామాంజనేయ యుద్ధ -కన్నడ)
నాదు సమస్త శక్తులును (రహస్యం)
     “శ్రీకాళహస్తీశ్వరమాహాత్మ్యం” చిత్రంలో కన్నప్పజేయు భక్తినివేదన “స్వామీ చంచలమైన చిత్తమిదే” (శార్దూలవిక్రీడిత వృత్తము), ఒక భక్తుని సర్వ సమర్పణాభావం ఆర్ద్రతతో నిండిపొంగే స్వరాభిషేకం. ఘంటసాల గళం అత్యంత ఉత్కృష్టదశలోనున్న రోజుల్లో వెలుబడిన ఈ పద్యం సింహేంద్రమధ్యమరాగానికి ఉత్తమ నిదర్శనం. స్వరాలు సోపానమార్గంలో కొనసాగి “చీకాకై నశియించెన్” అన్నతారస్థాయిసంచారం, చివరిలోని అకారతరంగవాహిని, గుండెలను కరగించే ఆ స్వరనిర్ఝరిణీ నిరాకారుడైన కాళహస్తీశ్వరుణ్ణి సాకారప్రకటన గావిస్తుంది.
స్వామీ చంచలమైన (కాళహస్తి మహత్మ్యం)
     
అలాగే "పాండురంగ మహాత్మ్యం" లో పాప పశ్చాత్తాప తప్తహృదయుడైన పుండరీకుని ఆవేదన “ఏపాదసీమ” రామకృష్ణకవి విరచిత సీసపద్యగానం శోక, కరుణారసముల ఆటపట్టు. వినగావినగా అది విలాపమా, ఆలాపనా, ఆవేదనా అనే సంవేదనలోనే మనస్సు నిలిచి ద్రవిస్తుంది. హృదయం ద్రవించే నేపథ్యగాయనం ఆ గానానికి తగిన అద్భుత నటన అందరికి తెలిసిన సినిమాప్రక్రియ. ఐతే ఘంటసాల గానంలో ఆ పాత్రకు నటనాస్వరూపం శ్రవ్యంగా మొదటే సృష్టించబడి, ఆ పద్యసందర్భానికి నటించడమంటే ఘంటసాల గానరూపంలో చూపిన భావాలకు అభినంయించి చూపడమా లేక తన నటనాప్రతిభను పాత్రలోప్రవేశబెట్టి పాటకు పెదవులు కదలించడమా అనే సమస్య నటునకు లేకపోలేదు. ఆయన గానానికి సరిజోడుగా నటించడమే నటులకు ఒక ఉత్తేజకశక్తిగా ఉండేదన్న అంశాన్ని ప్రముఖులెందరో పేర్కొన్నారు. ఈ పద్యగానంలో పశ్చాత్తాప-శోక-కరుణారసాలు కలిగించే ఆర్ద్రత అనుభవవేద్యమే. అది రాగస్వరాలను ఆకళింపుజేసుకొన్న ప్రతిభేకదా.
ఏ పాదసీమ (పాండురంగ మహాత్మ్యం)

     ప్రసిద్ధమైన తన భగవద్గీత గాయనంలో ఘంటసాల,  రెండు శ్లోకాలను సింహేంద్రమధ్యమ రాగంలో ఆలపించారు. (అనాదిత్వాన్...యథాప్రకాశయత్యేకః). దీనికి మునుపే ఆయన “శ్రీకృష్ణగారడి” చిత్రానికై మూడు భగవద్గీతాశ్లోకాలను పాడారు. ఆ చిత్రం కన్నడం మరియు తెలుగు భాషలలో నిర్మించబడింది. బహుశ సంగీత దర్శకత్వంవహించింది పెండ్యాల. ఆ మూడుశ్లోకాలలో ఒకటి “వాయుర్యమోగ్నిః వరుణః శశాంకః” సింహేంద్రమధ్య రాగనిబద్ధమే.
అనాదిత్వాన్ (భగవద్గీత)
వాయుర్యమోగ్ని (శ్రీ కృష్ణ గారడి)

సింహేంద్రమధ్యమం సుప్రసిద్ధ రసాత్మకమైన రాగం. 57వ మేళకర్త.  వేంకటముఖి సంప్రదాయంలో రాగనామం సుమద్యుతి. స్వరస్థానాలు:  షఢ్జమ పంచమాలతో చతురశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమ, శుద్ధదైవతం మరియు కాకలీయ నిషాదం. శ్రవణ మాత్రమున శాంత, కరుణ, భక్తి రసాలను మనస్సున నెలకొల్పే రాగమిది. శాస్త్రీయ సంగీత పద్ధతిలో రాగం తానం పల్లవికి, రాగమాలికలకూ, విస్తృతత్వానికి త్రిస్థాయి గానానికి మంచి అవకాశమున్న రాగం. చిన్న శ్లోకమైననూ, విళంబకాల దీర్ఘమైన కీర్తననైననూ రాణింపజేసే రాగమిది. ఒక్క నిషాదస్వర వ్యత్యాసమాత్రానషణ్ముఖప్రియరాగానికి తోబుట్టువంటిది. పంచమ స్వర గ్రహభేదక్రియలో మాయామాళవగౌళ మరియు ధైవతాన్ని గ్రహముచేయగా రసికప్రియరాగాలు వచ్చును. ప్రసిద్ధమైన త్యాగరాజకృతి “నతజనపరిపాల ఘనా” ఈరాగంలో సమకూర్చబడినదే.  “నీదు చరణములే” “రామ రామ” కృతులూ సుప్రసిద్ధమే. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈ రాగంలో రచించిన ’మరకత సింహాసన నరసింహ’ బహు సుశ్రావ్యమైన కృతి.

     రాగమాలికల పాటలలోనూ, రాగమాలికగా పాడిన పద్యాలలోనూ సింహేంద్రమధ్యమ రాగం బాగా ఇమిడి ప్రత్యేక భావాలను స్ఫురించడం గమనీయం.  “చిన్నిపాపలూ కడసారి చెప్పుచుంటి “(లవకుశ), భక్తజయదేవ చిత్రంలోని ’ప్రళయపయోధిజలే’ అష్టపదియొక్క చరణం ’తవకర కమలవరే’ ఈ రాగంలోనిదే. సీతారామకల్యాణం చిత్రంలో ఘంటసాల ఆలపించిన సీస పద్యం "దానవకులవైరి" ఐదురాగాలో సాగి అందులో నాల్గవ పాదం సింహేంద్రమధ్యమం. గాలిపెంచల ఆ ఒక్కపద్యాన్ని మోహన, ఖరహరప్రియి, కేదారగౌళ, సింహేంద్రమద్యమ, శ్రీ రాగాలలో సమకూర్చారు.   దీనికి సమ ఉజ్జీగా భక్తరఘునాథ్ చిత్రంలో “అదిగో జగన్నాథుడు” అనే సీసపద్యాన్ని, తన స్వీయ బాణితో మాస్టారు  కెదారగౌళ, కానడ, సింహేద్రమధ్యమ, మోహన మరియు కాపి రాగాలలో పాడినది అలనాటి రాగమాలిక పద్యవిశేషం.

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (2) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (4) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (2) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (4) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (2) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కధ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (3) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (6) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (87) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (55) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (36) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (13) సం-ఓగిరాల (2) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (85) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (33) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (40) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (15) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (20) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (41) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (2) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (4) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (27) ర-బమ్మెఱ పోతన (2) ర-బలిజేపల్లి (1) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (29) ర-సదాశివ బ్రహ్మం (8) ర-సదాశివబ్రహ్మం (1) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (44) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1)