1951 సంవత్సరంలో విడుదలైన వాహినీ సంస్థ నిర్మించిన మల్లీశ్వరి చిత్రం నుండి ఘంటసాలపి.భానుమతి తో పాడిన "ఔనా ! నిజమేనా ఔనా !" అనే ఈ యుగళగీతం రచన దేవులపల్లి, స్వరపరచినది ఎస్.రాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, పి.భానుమతి, శ్రీవాత్సవ, సురభి కమలాబాయి, న్యాయపతి రాఘవరావు. ఈ చిత్రానికి నిర్మాత బి.ఎన్.రెడ్డి మరియు దర్శకుడు బి.ఎన్.రెడ్డి. దీనిని ఎన్.టి.ఆర్., భానుమతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 20.12.1951 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.










