ఘంటసాల-కొసరాజు-రేలంగి కాంబినేషనులో చక్కని పాటలు వచ్చాయి. కొసరాజు పాటలు సందేశాత్మకం గాను, అపుడపుడు చురకలు వేసే వ్యంగ్య గీతాలుగాను, మరొక సారి గిలిగింతలు పెట్టే హాస్య గీతాలు గాను కనిపిస్తాయి. ఉదాహరణకు పెద్ద మనుషులు చిత్రంలో రేలంగికి పాడిన "శివ శివ మూర్తివి గణ నాథా", రాజు-పేద చిత్రం లో పాడిన "జేబులో బొమ్మ జేజేల బొమ్మ" వంటివి ఈ కోవకు చెందుతాయి. ఇక్కడ 1959 లో విడుదలైన 'శభాష్ రాముడు' చిత్రం కోసం మరొక చక్కని గీతం ఆశలే అలలాగా. పడవలో తోటి ప్రయాణీకులతో వెళుతూ పరిసరాలకు అనుగుణంగా, పరిచయస్థులకు ప్రమోదం కలిగించే రీతిలో వేదాంతాన్ని మరియు వినోదాన్ని జోడించి వ్రాసిన చక్కని కొసరాజు పాటను రేలంగి కోసం ఘంటసాల పాడారు. కొసరాజు వ్రాసిన సందేశాత్మక గీతం జయమ్ము నిశ్చయమ్మురా ఈ చిత్రం లోనిదే. ఈ చిత్రానికి మాస్టారే సంగీత సారధులు.
Thanks to ANVITA RAM for up loading the video clip to You Tube
చిత్రం: శభాష్ రాముడు (1959)
రచన: కొసరాజు
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల
పల్లవి: ఆశలే అలలాగ ఊగెనే సరదాగా
ఓడలాగ జీవితమంతా ఆడేముగా | ఆశలే అలలాగ |
చరణం: యవ్వనమ్మను గాలిలో,
ఎగురు వలపుల తేరులో
ఆలుమగలు జతగా,
మురిపెముగా, సుఖింతురుగా
రేపటి లోకం మాటే మరచీపోయేరుగా | ఆశలే అలలాగ |
చరణం: జీవితము కథ తీరెలే,
దేహముతొ పనిలేదులే
సొగసు,వయసు మరలా రాదిటులా
ముసలితనమే మేలా?
కాలం పోకడ చూడక ఎంతో వింతౌనిలా | ఆశలే అలలాగ |
చరణం: తుఫానులోని పడవవలే,
ఊపివేయును కష్టములే
తనువు,ధనము స్థిరమా? ఇది నిజమా!
సుఖము శాశ్వతమా?
బ్రహ్మవ్రాసిన వ్రాతా తెలియా సామాన్యమా? | ఆశలే అలలాగ |
ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ..