శుభోదయా పిక్చర్సు పతాకం పై 1964 లో తాపీ చాణక్య దర్శకత్వంలో అంజలి, ఎన్.టి.ఆర్. నాయికా నాయకులుగా, గుమ్మడి, రాజనాల, రేలంగి, గిరిజ యితర భూమికలు ధరించిన చిత్రం వారసత్వం. పసి పిల్లాడిని చిలిపి పనులు చేసే బాలకృష్ణుని తో పోల్చుకుని మురిసిపోవడం తల్లిదండ్రులకు కద్దు. అంత చిన్నతనంలోనే ఎన్నో ఘనకార్యాలు చేసి లీలలను చూపిన కృష్ణునితో పోటీ పడే కొడుకుని చూస్తూ తండ్రి పాడే పాటను చిత్రీకరించిన సన్నివేశం. ఈ పాట రచన నార్ల చిరంజీవి. ఈయన కవి, కధకుడు మరియు మంచి రచయిత. పిల్లల సాహిత్యంలో ఎనలేని కృషి చేశారు. అయితే సినిమాలకు పరిమితంగా పాటలు వ్రాసారు. వీరు వ్రాసిన కొన్ని పాటలు - నీ చెలిమీ నేనె కోరితిన (ఆరాధన-1964), తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో బాజాలోయ్ (వాగ్దానం-1961), నీ కనుదోయిని (గుడిగంటలు-1964). వారసత్వం చిత్రానిక మరొక పాట - మనగుట్టే నిలుపుకోవాలి - కూడ వీరే వ్రాసారు. ఈ చిత్రానికి సంగీత నేతృత్వం ఘంటసాల మాస్టారు. పాడినది మాస్టారు, పి.లీల.
Thanks to Mangomusic for uploading the video to you tube.
చిత్రం: | వారసత్వం (1964) | ||
రచన: | నార్ల చిరంజీవి | ||
సంగీతం: | ఘంటసాల | ||
గానం: | ఘంటసాల, పి.లీల | ||
పల్లవి: | ఘంటసాల: | చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ | |
ఆ స్వామితో నీవు అన్నింట సాటి | |||
జో..జో..జో.జో. | | చిలిపి | | ||
చరణం: | ఘంటసాల: | చెఱసాలలో పుట్టి, వ్రేపల్లెలో వెలసి | |
గొల్ల తల్లుల మనసు కొల్లగొనినాడు | |||
ఏ తల్లి వొడి జారి ఏలాగు చేరావొ | |||
ఆపదలె కాపుదలలాయేను నీకు | |||
పి.లీల | జో అచ్యుతానంద జోజో ముకుందా...ఆ.. | ||
రార పరమానంద రామ గోవిందా...ఆ.. | |||
జో….జో.. | |||
చరణం: | పి.లీల | పలు వేసములు పూని పగవారు హింసింప | |
పల్ పోకడలు చూపె బాల గోపాలుడు | |||
ఘంటసాల: | ఈ యీడుకే యెన్ని గండాలు గడిచాయొ | ||
ఎంత జాతకుడమ్మ అనిపించినావు | |||
పి.లీల | జో అచ్యుతానంద జోజో ముకుందా...ఆ.. | ||
రార పరమానంద రామ గోవిందా...ఆ.. | |||
జో….జో.. | |||
చరణం: | పి.లీల | కాళింది పొగరణచి, కంసుణ్ణి పరిమార్చి | |
కన్నవారికి చెఱలు తొలగించినాడు | |||
ఘంటసాల: | వసుదేవ తనయుని వారసత్వము నిలిపి | ||
నీవారి వెతలెల్ల నీవె తీర్చేవు | |||
ఇద్దరు: | చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ | ||
ఆ స్వామితో నీవు అన్నింట సాటి | |||
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ | |||
ఆ స్వామితో నీవు అన్నింట సాటి | |||
జో..జో..జో.జో. -3 |