అక్కట కన్నుగానక మదాంధుడనై ప్రియురాలి యింటిలో
చిక్కితి, శైవపూజ యెటుల సేయుదు! వేళ అతిక్రమించె ఇం
దెక్కడ కానరాదు పరమేశ్వర లింగముబోలు రాయో! వే
రొక్క స్వరూపమో? తుదకయుక్తమెయైన ఇకెట్టులీశ్వరా!
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
1966 సంవత్సరంలో విడుదలైన శ్రీ శంభు ఫిలింస్ సంస్థ నిర్మించిన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ చిత్రం నుండి ఎస్.జానకి తో పాడిన కుశలమా నీకు (విషాదం) అనే ఈ యుగళం రచన పింగళి, స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, రేలంగి, లింగమూర్తి, జమున, గిరిజ, ఛాయాదేవి. ఈ చిత్రానికి నిర్మాత డి.లక్ష్మీనారాయణ చౌదరి మరియు దర్శకుడు ఎ.కె.శేఖర్.
#000 | పాట: | ఓ! రంగయో పూల రంగయో | ||
---|---|---|---|---|
నిర్మాణం: | అన్నపూర్ణా వారి | |||
చిత్రం: | వెలుగునీడలు (1961) | |||
రచన: | శ్రీశ్రీ | |||
సంగీతం: | పెండ్యాల | |||
గానం: | ఘంటసాల, పి.లీల, బృందం | |||
బృం: | ఓ...హొహోహో హొహోహో హొహోహో హో.. | |||
ఘం: | ఓ...హొహోహో హొహోహో హొహోహో హో.. | |||
పల్లవి: | సు: | ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | ||
బృం: | ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | |||
సు: | పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి | |||
బృం: | పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి | |||
ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | ||||
చరణం: | సు: | పగలనక, రేయనక పడుతున్న శ్రమనంతా | ||
పరుల కొఱకు ధారపోయు మూగజీవులు | | పగలనక | | |||
ఘం: | ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి | |||
ఆనందం పొందగలుగు ధన్యజీవులు | ||||
బృం: | ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | |||
ఘం: | ఆ..ఆ..ఆ.. (బృందంతో సమాంతరంగా) | |||
బృం: | పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి | |||
ఓ! రంగయో, పూలరంగయో, ఓరచూపు చాలించి సాగిపోవయో | ||||
పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి | ||||
చరణం: | సు: | కడుపారగ కూడులేని, తలదాచగ గూడులేని | ||
ఈ దీనుల జీవితాలు మారుటెన్నడొ? | | కడుపారగ | | |||
ఘం: | తనవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి | |||
కనిపెట్టీ మేలుచేయగలిగినప్పుడే! | ||||
బృం: | ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | |||
పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి | ||||
ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | ||||
ఘం: | ఆ..ఆ..ఆ.. |
#0000 | పాట: | ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను | |
---|---|---|---|
పతాకం: | శ్రీ విఠల్ ప్రొడక్షంస్ | ||
చిత్రం: | అగ్గిబరాటా (1966) | ||
సంగీతం: | విజయా కృష్ణమూర్తి | ||
రచన: | సినారె | ||
గానం: | ఘంటసాల, సుశీల | ||
ప: | సు: | ఊమ్.మ్... హొయ్ హోయ్ హోయ్ హొయ్.. | |
ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత... | |||
ఘ: | ఏ వింతా .. ? | ||
సు: | ఏ నాడు లేని వింత లోలోన చక్కిలిగింత | ||
ఘ: | హొయ్ హోయ్ హోయ్ హొయ్.. | ||
ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత.. | |||
సు: | ఏ వింతా.. ? | ||
ఘ: | ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత | ||
సు: | హొయ్ హోయ్ హోయ్ హొయ్.. | ||
చ: | సు: | నిన్ను నేను చూసిన నాడే కన్ను చెదరిపోయింది | |
నిన్ను నేను చూసిన నాడే కన్ను చెదరిపోయింది | |||
కన్ను చెదరిపోయిన నాడే కన్నెమనసు మారింది | |||
ఘ: | నీ లేత వన్నె ఏదో నాలోన మెరిసింది.. | ||
నీ లేత వన్నె ఏదో నాలోన మెరిసింది.. | |||
సు: | హొయ్ హోయ్ హోయ్ హొయ్.. | ||
ఘ: | ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను | ||
ఈ వింత ఈ వింత | |||
చ: | ఘ: | నిగ్గులొలుకు బుగ్గలు చూసీ నిలిచిపోతి ఆనాడు | |
నిగ్గులొలుకు బుగ్గలు చూసీ నిలిచిపోతి ఆనాడు | |||
చేతినిండ సిగ్గులు దూసీ చేరుకుంటి ఈ నాడూ | |||
సు: | అందాల తీరమేదో అందుకుంటి నీతోడూ | ||
అందాల తీరమేదో అందుకుంటి నీతోడూ | |||
ఘ: | హొయ్ హోయ్ హోయ్ హొయ్.. | ||
సు: | ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను | ||
ఈ వింత ఈ వింత | |||
ఇ: | ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత | ||
ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత |
#000 | దండకం: | శ్రీ క్షీరవారాసి కన్యాపరీరంభ |
---|---|---|
చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల | |
నిర్మాణం: | అశ్వరాజ్ పిక్చర్స్ | |
ఘం: | శ్రీ క్షీరవారాసి కన్యాపరీరంభ సంభూత మందస్మితా | |
శంఖచక్రాంకితా కౌస్తుభాలాంకృతా | ||
దివ్య మందార దామోదరా నీల ధారాధరాకారా విజ్ఞానసారా | ||
నిరాకారా సాకార ప్రేమావతారా | ||
ముకుందా సదానందా గోవిందా సంరక్షితానేక యోగీశబృందా | ||
దయాపాంగ సంతోషితానంద దాసాంతరంగా! | ||
భవదివ్య సౌందర్య కారుణ్య లీలావిలాసంబు | ||
బృందారకాధీశులే చాటలేరన్ననేనెంతవాడన్ ప్రభో! | ||
దాటగారాని మాయా ప్రవాహమ్ములో చిక్కి | ||
వ్యామోహ తాపమ్ములన్ చొక్కి శోషించు | ||
ఘోషించు నీ దాసునిన్ జూచి వాత్సల్యమే పారగా బ్రోచి | ||
సాలోక్య మిప్పించుమా, నీదు సాయుజ్యమున్ గూర్చుమా, | ||
స్వామీ శ్రీ సత్యనారాయణా! | ||
నమస్తే నమస్తే నమః |
#000 | యుగళం: | జాబిల్లి శోభ నీవే | |
---|---|---|---|
చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | ||
రచన: | సముద్రాల జూనియర్ | ||
సంగీతం: | ఘంటసాల | ||
గానం: | ఘంటసాల, పి.సుశీల | ||
నిర్మాణం: | అశ్వరాజ్ పిక్చర్స్ | ||
ప: | ఘ : | ఆ..... | |
జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే | |||
జలతారు మెరుపు నీవే, జగమేలు స్వామి నీవే | |||
సు: | ఆ... | ||
జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే | |||
జగమేలు వలపు నీవే జవరాలి ఆశ నీవే | |||
చ: | ఘ : | కుసుమాల సోయగాల శుకపాళి కలరవాల | ॥కుసుమాల॥ |
జగమంత నీదులీలా.... ఆనందమధుర హేల | ॥జాబిల్లి॥ | ||
చ: | సు: | మదిలోన మమత నీవే మనసేలు స్వామినీవే | ॥మదిలోన॥ |
మురిపించు ఆశనీవే కరుణించి ఏలలేవే... ఏ.... | ||జాబిల్లి|| |
#000 | బృందగీతం: | జగన్నాయక అభయదాయక |
---|---|---|
చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల | |
నిర్మాణం: | అశ్వరాజ్ పిక్చర్స్ | |
సాకీ | హే మాధవా... మధుసూదనా... కనజాలవా...ఆ...ఆ.. | |
ఘం: | జగన్నాయక అభయదాయకా జాలము సేయగ రావా | |
హేమురారి కరుణాకర శౌరి నామొరలే వి నలేవా | ||
నమ్మిసేవించు నన్నుశోధింప న్యాయమా నీకు దేవా.. | ||
బృం: | సాకారా నిరాకారా ఆశ్రిత కామిత మందార -2 | |
ఘం: | పాలముంచిన నీటముంచినా భారము నీదే దేవా | |
శ్రీనివాస వైకుంఠనివాస దేవానాగతి నీవే | ||
జగము తరియింప కరుణ కురిపించి కావుమా దేవ దేవా.. | ||
బృం: | సాకారా నిరాకారా ఆశ్రిత కామిత మందార -2 | |
కామిత మందార | ||
ఘం: | హే మాధవా కరుణించవా -3 | |
హే మాధవా..... మధుసూదన ..... కనజాలవా |
1964 సంవత్సరంలో
విడుదలైన అశ్వరాజ్ పిక్చర్స్
సంస్థ నిర్మించిన శ్రీసత్యనారాయణమహాత్మ్యం
చిత్రం నుండి ఘంటసాల
మాస్టారు పి.లీల, బృందం తో
పాడిన "జయజయ శ్రీమన్నారాయణ"
అనే ఈ యుగళగీతం రచన
సముద్రాల జూ., స్వరపరచినది ఘంటసాల.
ఈ చిత్రంలో
తారాగణం ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రేలంగి,కాంతారావు,రమణారెడ్డి. ఈ
చిత్రానికి నిర్మాత పి.సత్యనారాయణ మరియు దర్శకుడు
రజనీకాంత్.
#000 | బృందగీతం: | జయ జయ శ్రీమన్నారాయణ | |
---|---|---|---|
చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | ||
రచన: | సముద్రాల జూనియర్ | ||
సంగీతం: | ఘంటసాల | ||
గానం: | ఘంటసాల, లీల, బృందం | ||
నిర్మాణం: | అశ్వరాజ్ పిక్చర్స్ | ||
ఇ: | జయ జయ శ్రీమన్నారాయణా, జయ విజయీభవ నారాయణా | ||
జయ జయ శ్రీమన్నారాయణా, జయ విజయీభవ నారాయణా | |||
జయ విజయీభవ నారాయణా | |||
లీ: | జలనిధి సొచ్చి సోమకు ద్రుంచి, వేదాలు గాచిన మీనావతారా | ||
బృ: | ఆ...... | ||
ఘ: | క్షీరజలధి మథనమ్మున మంధరగిరిని మోసిన కూర్మావతారా | ||
బృ: | సా, దనిరీ, దనిసా నిదపా మగరీ గమపదనిస | ||
లీ: | ధర చాపచుట్టిన ధనుజుని బరిమార్చి, ధారుణి నేలిన వరాహావతారా | ||
బృ: | ఆ......... | ||
ఘ: | వరదుడవై ప్రహ్లాదుని కావగ తరలిన వర నరసింహావతారా | ||
బృ: | సా..... దనిసా... నిసనిదమా... గదమగసా గమదనిసా | ||
లీ: | దానమడిగి మూడడుగులనేల బలి దానవు నణిచిన వామనావతారా | ||
ఘ: | ఇటు బ్రాహ్మ్యంబని అటు క్షాత్రంబను పటుతర పరశురామావతారా | ||
లీ: | దశరథు నానతి కానలకేగి దశకంఠు దునిమిన రామావతారా | ||
ఘ: | కాళీయ విషమ నాగు గర్వము నణచీ, కంసుని కూల్చిన కృష్ణావతారా | ||
బృ: | సా..... దనిసా... నిసనిదమా... గదమగసా గమదనిసా | ||
లీ: | సత్యమహింసయే పరమధర్మమని బోధన చేసిన బుద్ధావతారా | ||
ఘ: | ధర్మముతొలగిన ధరలో కలిలో, ధర్మము నిలిపే కలికావతారా | ||
ఇ: | జయ జయ శ్రీమన్నారాయణా, జయ విజయీభవ నారాయణా | ||
జయ విజయీభవ నారాయణా |