|
శ్రీమతి రాధా కుమారి |
22-4-2012 న హైదరాబాదు చిక్కడపల్లి త్యాగరాయ గానసభ లో ఘంటసాల సంగీత సాహిత్య సామాజిక సంస్థ "చైతన్య భారతి" అధ్వర్యంలో అలనాటి చలనచిత్ర నటి, శ్రీ రావి కొండలరావు గారి సతీమణి శ్రీమతి రాధా కుమారి గారి శ్రద్ధాంజలి లో భాగంగా ఘంటసాల మాస్టారి పాటలు, సంగీతం, చిత్రాల విశేషాలపై అవధానం జరిగింది. దీనిలో పలువురు పృచ్ఛకులు పాల్గొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు అవధాని శ్రీ సయ్యద్ రహమతుల్లా గారు అదే వరుస క్రమంలో సమాధానాలు చెప్పారు. దాదాపు అరగంటకు పైగా జరిగింది ఈ కార్యక్రమమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పృచ్చకులు - భవానీ దేవి, కమలశ్రీ, అక్కిరాజు సుందర రామకృష్ణ, ముదిగొండ శివ ప్రసాద్, గుండు హనుమంత రావు, రామారావు, ఇల్లిందల హేమ సుందర్, డా.విజయ్ కుమార్, తాతా బాల కామేశ్వర రావు, లక్ష్మయ్య, శ్రీనివాస రావు, రామచంద్ర రావు, ఆంజనేయులు, వడ్డాది రామకృష్ణ, ఎమ్.వి. అనూరాధ, స్వర్ణ కుమార్, పెళ్లూరి శ్రీరామకృష్ణ మూర్తి, అరవింద, నూకల ప్రభాకర్ గార్లు.
అక్కిరాజు రామకృష్ణ గారు శ్రీమతి రాదా కుమారి గారి గురించి చెప్పిన పద్యం -
"మొన్న నిన్నటి దాక మాముందె నిలచి
ఆటపాటల నడయాడినట్టి నీవు
మాయమైతివి సోదరీ! మమ్ము వదలి,
ఎడను దుఃఖంబు పొంగగా యిచ్చుచుంటి
నీకు అశ్రుతర్పణము రాధాకుమారి".
Thanks to TeluguOne for uploading the Video