1951 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పాతాళ భైరవి చిత్రం నుండి వసంత,పి.లీల,బృందం పాడిన "తీయని ఊహలు హాయిని" అనే ఈ బృందగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, మాలతి, ఎస్.వి.రంగారావు, రేలంగి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి. దీనిని మాలతి, తదితరులు పై చిత్రీకరించారు. ఈ చిత్రం 15.03.1951 న విడుదలైంది.
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
13, డిసెంబర్ 2025, శనివారం
తీయని ఊహలు హాయిని - పాతాళ భైరవి చిత్రం నుండి పి.లీల,బృందం
కలవరమాయే మదిలో - పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల, పి.లీల
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
కనుగొనగలనో లేనో - పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల
1951 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల పాడిన "కనుగొనగలనో లేనో" అనే ఈ ఏకగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, మాలతి, ఎస్.వి.రంగారావు, రేలంగి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి. దీనిని ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించారు. ఈ చిత్రం 15.03.1951 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
హయిగా మనకింక స్వేచ్చగా - పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల, పి.లీల
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఎంత ఘాటు ప్రేమయో - పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల, పి.లీల
1951 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల పి.లీల తో పాడిన "ఎంత ఘాటు ప్రేమయో" అనే ఈ యుగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, మాలతి, ఎస్.వి.రంగారావు, రేలంగి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి. దీనిని ఎన్.టి.ఆర్., మాలతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 15.03.1951 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
30, మే 2013, గురువారం
మా నాన్నకు నచ్చిన పాట - 'ప్రేమకోసమై వలలో పడెనే' - పాతాళభైరవి నుండి
1951 లో విజయా వారి పతాకం పై విడుదలైన "పాతాళ భైరవి" చిత్రం ఒక చక్కని మధురమైన జానపద చిత్రం. అలనాటి తెలుగు చిత్రాలలో తలమానీకం యీ చిత్రం. ఘంటసాల మాస్టారి అద్భుతమైన బాణీలు, పింగళి వారి పాటలు మరియు "సాహసం శాయరా డింభకా", "ధైర్యం శాయరా" వంటి ఎన్నో సరళమైన తెలుగులో వాడిన ప్రయోగాలు ప్రతి ఒక్కరిని అలరిస్తాయి. తాహతుకు మించిన కోరికలున్నా, ధైర్యం వుంటే ఏదైనా సాధించవచ్చనే ఇతివృత్తం తో రాజకుమారి, తోటరాముడు మధ్య జరిగే ప్రేమ కథకు ప్రతి రూపం పాతాళ భైరవి. ధనసంపాదనకోసం మాయావియైన మాంత్రికుని (ఎస్.వి.ఆర్.) నమ్ముకుని, తనను నమ్ముకున్న రాజకుమారిని (మాలతి) ఎడబాసి సాగే తోట రాముడిని (ఎన్.టి.ఆర్.) రక్షించమని వేయిమార్లు (వేమరు) ప్రార్థించే తల్లి (సురభి కమలాబాయి) నేపథ్యంలో ఈ నలుగురి పై చిత్రీకరించిన పాట ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు. ఉత్తరోత్తరా ఈ పాట గుడ్డిగా ప్రేమించుకునే ప్రేమికుల గురించి అందరి నోటా నానే సామెతలా మారిందంటే ఆ క్రెడిట్ పింగళిదే. అలనాటి ప్రముఖ రంగస్థల నటి సురభి కమలాబాయి 1931 లో హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో విడుదలైన తొలి తెలుగు చిత్రం భక్త ప్రహ్లాద లో లీలావతి పాత్ర పోషించింది. ఆ విధంగా ఆవిడ తొలి తెలుగు చలన చిత్ర కథానాయిక అని చెప్పవచ్చు. మాలతి నటించిన మరొక చక్కని చిత్రం, బహుశా కథానాయికగా ఆఖరి చిత్రం కాళహస్తి మహాత్యం. నా చిన్నతనంలో మా నాన్న గారు ఈ పాటను సరదాగా ఈలతో పాడేవారు. ఈ పాట విన్నపుడల్లా మా నాన్న నా కళ్ళ ముందు కనిపించేవారు. గత నెల ఏప్రిల్ 25 న మా తండ్రిగారు స్వర్గస్థులైనారు. అయితే ఆయన జ్ఞాపకాలు మాతోనే వదిలారు. అవి గుండెలో అలాగే భద్రం చేశాను. మా నాన్నకు నచ్చిన ఈ పాటను వి.జె.వర్మ మరియు మాస్టారు (ఆలాపన) పాడారు. సింధు భైరవి రాగం లో సాగే ఈ పాటకు రచన పింగళి నాగేంద్ర రావు. ఈ చిత్రానికి దర్శకత్వం కె.వి.రెడ్డి.

| ప: | వర్మ: | ప్రేమ కోసమై వలలో పడెనో పాపం పసివాడు... | |
| అయ్యో పాపం పసివాడు | | ప్రేమ కోసమై | | ||
| చ: | వర్మ: | వేమరు దేవుల వేడుకుని తన కొమరుని క్షేమం కోరుకుని | |
| ఘం: | ఓ..ఓ.ఓ.ఓ.. ఓ.ఓ.ఓ.. ఓ..ఓ..ఓ.. | ||
| వర్మ: | వేమరు దేవుల వేడుకుని తన కొమరుని క్షేమం కోరుకుని | ||
| ఏమైనాడో, ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ | | ప్రేమ కోసమై | | ||
| చ: | వర్మ: | ప్రేమకన్ననూ పెన్నిధియేమని యేమి ధనాలిక తెత్తుననీ | | ప్రేమ కన్ననూ | |
| భ్రమసి చూచు ఆ రాజకుమారిని నిముసమె యుగముగ గడుపుమనీ | | ప్రేమ కోసమై | | ||
| చ: | వర్మ: | ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకుని | | ప్రేమలు దక్కని | |
| ఏమివ్రాసెనో... అటు కానిమ్మని బ్రహ్మదేవునిదే భారమనీ | | ప్రేమ కోసమై | | ||
| ప్రేమ కోసమై వలలో పడెనో పాపం పసివాడు... | |||
| అయ్యో పాపం పసివాడు | | అయ్యో | |