మహాభారతములోని విరాట పర్వములో గోగ్రహణసమయంలో కురుసైన్యం తస్కరించి తరలించుకు పోతున్న ఆలమందలను విడిపించి తేవడానికి బృహన్నల మరియు ఉత్తరకుమారుడు బయలుదేరుతారు. యుద్ధ రంగం లో కురువీరులను ఎవరు ఎవరో ఎలా గుర్తు పడతావు అని ఉత్తరుడు బృహన్నలను అడుగుతాడు. అప్పుడు దానికి సమాధానంగా పార్థుడు వారి జండాలను వర్ణిస్తూ వివరాలు తెలియజేస్తాడు. యుద్ధంలో శంఖనాదాన్ని బట్టి మరియు వారివారి రథాల జండాలపై గల బొమ్మలను బట్టి గుర్తుపట్టేవారు. శ్రీ మదాంధ్ర మహాభారతము లోని విరాట పర్వమున తిక్కన ఆరుగురు కురువీరుల జండాలను - కేతనము, కేతువు, ధ్వజము, పతాకము, పడగ, సిడము వంటి వివిధమైన వ్యుత్పత్తులతో వివరించాడు. బంగారువన్నె గల వేదికపై ప్రకాశిస్తున్న కేతనము గలవాడు గురువైన ద్రోణాచార్యుడు. సింహముతోక గుర్తుతో గాలిలో రెపరెపలాడుతూ నాట్యం చేస్తున్న జెండాగల రథము వాడు ద్రోణసుతుడైన అశ్వత్థామ. బంగారు ఆవు మరియు ఎద్దుల జంటగలిగిన జండా గల రథము పై కృపాచార్యుడు, శంఖం గుర్తు గల జండా కర్ణునిది, నాగ కేతనం గలవాడు సుయోధనుడు మరియు ఎత్తైన తాటి చెట్టు జండాపై గుర్తుగా ఉన్నవాడు భీష్మాచార్యుడు. (మిగిలిన వివరాలు వ్యాసభారతం.కాం లో చూడగలరు.) ఆ వర్ణన వినగానే ఉత్తరకుమారునికి వణుకు పుట్టి ఈ యుద్ధం వద్దు బృహన్నలా బతికుంటే బలుసాకు తినవచ్చు రథాన్ని మళ్ళించవయ్యా అని ప్రాధేయపడతాడు. చక్కని మహాభారతంలోని ఈ పద్యాలను మాస్టారు, మాధవపెద్ది గానం చేశారు. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.
కృతజ్ఞతలు: వ్యాసభారతం.కాం వారికి, వికిపీడియాకు, యూ ట్యూబ్ కు, మరియు తెలుగు వన్ వారికి.
కాంచనమయ వేదికా - ఘంటసాల
కౌరవసేనజూచి - మాధవపెద్ది
ఘంటసాల: | సీ. | కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమమువాడు కలశజుండు |
సింహలాంగూలభూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాడు ద్రోణసుతుడు | ||
కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబువాడు కృపుడు | ||
లలిత కంబుప్రభాకలిత పతాక విహారంబువాడు రాధాత్మజుండు | ||
తే.గీ. | మణిమయోరగ రుచిజాల మహితమైన | |
పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర | ||
శిఖరఘన తాళతరువగు సిడమువాడు | ||
సురనదీసూనుడేర్పడ జూచికొనుము | ||
మాధవపెద్ది: | కౌరవసేనజూచె వణకెన్‌దొడగెన్ మదిలోన నేను నీ | |
వూరక పోవుచుంటి యిది వొప్పునే ఇప్పటి భంగి జూచినన్ | ||
వీరలనేను మార్కొనది నిశ్చయము అట్లగుటన్ రయమునన్ | ||
తేరు మరల్పు ప్రాణములు తీపన మున్వినదే బృహన్నలా! |
కృతజ్ఞతలు: వ్యాసభారతం.కాం వారికి, వికిపీడియాకు, యూ ట్యూబ్ కు, మరియు తెలుగు వన్ వారికి.