31, డిసెంబర్ 2011, శనివారం

శివ శివ మూర్తివి గణనాథా - పెద్ద మనుషులు చిత్రం నుండి ఇంకొక సెటైర్ సాంగ్

సంఘంలో పెద్దమనుషులు గా చలామణి అవుతున్న వ్యక్తులు తెర వెనుక ఎన్ని అన్యాయాలు, ఘోరాలు చేస్తుంటారో చూపించే వ్యంగ్య (సెటైర్) చిత్రం "పెద్ద మనుషులు" ఈ చిత్రంలో రేలంగి గారిది ఒక కీలకమైన పాత్ర. ప్రధాన ప్రతినాయకుడైన గ్రామ సర్పంచ్ (శ్రీ జంద్యాల గౌరీనాథ శాస్త్రి గారు) కు తమ్ముడు "తిక్క శంకరయ్య" గా నటించిన రేలంగి అన్న ఆగడాలను నిరసిస్తూ, పిచ్చి వాడిలాగా తిరుగుతుంటాడు. పెద్ద మనుషులు చిత్రానికి శ్రీ  ఘంటసాల గారు రెండు చక్కని పాటలు పాడారు.  ఇంతకు ముందు పోస్టులో "నందామయా గురుడ నందామయా" చూసారు. ఈ చిత్రంలో మరొక అద్భుతమైన వ్యంగ్య రచన శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి గారు వ్రాసారు. భక్తి పాటలాగ అనిపించే ఈ పాట నిజానికి "గణనాథా" అన్నది ఊత పదం. రాజకీయ పార్టీల పై సెటైర్ ఇది. అయితే ఇది ఘంటసాల-బృందం పాడగా, ఎంతో క్రమ బద్ధంగా స్టెప్పులు వేస్తూ రేలంగి బృందం ఆడుతూ పాడతారు.1954 లో విడుదల అయిన చిత్రం అయినా అప్పటికి, ఇప్పటికి సదరు సగటు రాజకీయ వాతావరణంలో గాని, రాజకీయ నాయకులలో గాని ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ పాట దృశ్య (అసంపూర్ణ), శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. 

వీడియోలో పాట అసంపూర్ణంగా వుంది. అయితే రేలంగి గారి స్టెప్పులు వీడియోలో చూసి తీర వలసిందే.

చిత్రం:         పెద్దమనుషులు (1954)
రచన:         కొసరాజు
సంగీతం:      ఓగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు
గానం:         ఘంటసాల, బృందం

ఘంటసాల:   శివశివ మూర్తివి గణనాథా
                నీవు శివుని కుమారుడవు గణనాథా
బృందం:       హెయ్! శివశివ మూర్తివి గణనాథా
                నీవు శివుని కుమారుడవు గణనాథా
ఘంటసాల:   ఓయ్! శివశివ మూర్తివి గణనాథా
                నీవు శివుని కుమారుడవు గణనాథా
బృందం:       నీవు శివుని కుమారుడవు గణనాథా

ఘంటసాల:   ఓ.. ఓ..ఓ.ఓ.ఓ.ఓ.
                కాంగ్రెసోళ్ళు నిను గొల్వ గణనాథా
                నీవు కామితార్థమిత్తువయ్య గణనాథా
బృందం:       కాంగ్రెసోళ్ళు నిను గొల్వ గణనాథా
                నీవు కామితార్థమిత్తువయ్య గణనాథా
ఘంటసాల:   వారి కాంక్షలన్ని తీర్తువయ్య గణనాథా
బృందం:       వారి కాంక్షలన్ని తీర్తువయ్య గణనాథా

ఘంటసాల:   ఓయ్! కమ్యూనిష్టులు నినుగొలువ గణనాథా
                వార్ని కాపాడుచుందువయ్య గణనాథా    
బృందం:       కమ్యూనిష్టులు నినుగొలువ గణనాథా
                వార్ని కాపాడుచుందువయ్య గణనాథా    
ఘంటసాల:   ఓయ్! శివశివ మూర్తివి గణనాథా
                ఆ..ఆ..ఆ.
                నీవు శివుని కుమారుడవు గణనాథా
బృందం:       నీవు శివుని కుమారుడవు గణనాథా

ఘంటసాల:   తిక థై, తిక థై, తిక థైయకు తాథిమి
                ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథా
                నీవు ఓడకుంటె ఒట్టుపెట్టు గణనాథా
బృందం:       ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథా
                నీవు ఓడకుంటె ఒట్టుపెట్టు గణనాథా
ఘంటసాల:   పదవి ఊడకుంటె ఒట్టు పెట్టు
బృందం:       గణనాథా!
ఘంటసాల:   ఓయ్! శివశివ మూర్తివి గణనాథా
                నీవు శివుని కుమారుడవు గణనాథా
బృందం:       శివశివ మూర్తివి గణనాథా
                నీవు శివుని కుమారుడవు గణనాథా

ఘంటసాల:   బ్లాకూ మార్కెట్టు చెయ్యి గణనాథా
                నిన్ను పట్టకుంటె ఒట్టు పెట్టు గణనాథా
బృందం:       బ్లాకూ మార్కెట్టు చెయ్యి గణనాథా
                నిన్ను పట్టకుంటె ఒట్టు పెట్టు గణనాథా
ఘంటసాల:   ఒక్క పెట్టకుంటె ఒట్టు పెట్టు
బృందం:       గణనాథా
ఘంటసాల:   నిన్ను పట్టకుంటె ఒట్టు పెట్టు
బృందం:       గణనాథా

30, డిసెంబర్ 2011, శుక్రవారం

తొంబది వసంతాలు నిండిన స్వర బ్రహ్మ శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారితో ఇంటర్వ్యూ

అలనాటి ప్రముఖ సంగీత దర్శకులు స్వర బ్రహ్మ శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారికి నవంబరు 11, 2011 నాటికి తొంభై వసంతాలు నిండాయి. ఈ సందర్భంగా శ్రీ సుసర్ల వారితో టీవీ-1 చేసిన ఇంటర్వ్యూను యూ ట్యూబ్ లో చూసాను. ఆ మహామహుని గురించి, వారి సంగీత సారధ్యంలో శ్రీ ఘంటసాల మాస్టారి పాటలకు గల అనుబంధాన్నిగురించి నాలుగు ముక్కలు వ్రాయాలనిపించింది.
            వాయులీన విద్వాంసులైన శ్రీ సుసర్ల వారు అలనాటి ప్రముఖ సినీ సంగీత దర్శకులు శ్రీ సి.ఆర్.సుబ్బరామన్ గారి వద్ద అసిస్టెంట్ గా పనిచేసి, 1946 లో విడుదలైన "నారద నారది" చిత్రం (నటి సూర్యకాంతం తొలి చిత్రం కూడ) ద్వారా సంగీత దర్శకునిగా మారారు. సుసర్ల వారి అద్భుత స్వర సృష్టిలో చెప్పుకోదగ్గ చిత్రాలు - సంసారం (1950), సంతానం (1955), అన్నపూర్ణ (1960), నర్తనశాల (1963). క్రొత్త గాయనీ గాయకులను ప్రోత్సాహపరచి సినీ రంగంలో మంచి స్థాయిని కలుగజేసిన వారిలో శ్రీ సుసర్ల వారొకరు. తెలుగు చిత్రాలలో సుసర్ల వారు పరిచయం చేసిన మధుర గాయనీ గాయకులు శ్రీమతి లతా మంగేష్కర్ (సంతానం-నిదురపోరా తమ్ముడా), శ్రీమతి ఎం.ఎల్.వసంత కుమారి (వచ్చిన కోడలు నచ్చింది - ఘంటసాల, జిక్కీ తో పాడిన -శరణంటినమ్మా కరుణించవమ్మా), శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ (నర్తనశాల - సలలిత రాగ సుధారస సారం), శ్రీ రఘునాథ్ పాణిగ్రాహి (ఇలవేల్పు - చల్లని రాజా ఓ చందమామ).  ప్రముఖ నటి లక్ష్మీరాజ్యం స్వంత బ్యానర్ అయిన రాజ్యం పిక్చర్స్ పై తిక్కన విరచిత మహాభారతంలోని విరాటపర్వం ఆధారంగా నిర్మించబడిన "నర్తనశాల" కు సుసర్ల వారు పాటలకు, ఉత్తర గోగ్రహణం లోని పద్యాలకు కూర్చిన బాణీలు, వాటికి జీవం పోసిన ఘంటసాల గారి గానమాధుర్యం ఇప్పటికీ మరచిపోలేము. అది వొక రసమయ సంగీతభరిత దృశ్యకావ్యం.
మొదటి భాగం
 
          గాయకులతో ప్రయోగాలు చేయడం దక్షిణామూర్తి గారి స్టయిల్.  వీర కంకణం (1957) చిత్రంలో ఎన్.టి.ఆర్. కు ఎ.ఎమ్.రాజా తో, జగ్గయకు ఘంటసాల తో పాడించారు. ఈ చిత్రంలో మాస్టారు జిక్కీతో పాడిన "రావే రావే పోవు స్థలమ్మది చేరువయే", "తేలి తేలి నా మనసు" చక్కని పాటలు.  అలాటిదే మరొక ప్రయోగం ఎ.ఎన్.ఆర్. కు “ఇలవేల్పు” చిత్రంలో ఒరియా గాయకులు శ్రీ రఘునాథ్ పాణిగ్రాహి గారితో "చల్లని రాజా ఓ చందమామ" పాడించారు. ఆపాట సూపర్ హిట్ అయింది. తమిళం నుండి తెలుగులోకి డబ్బింగ్ చేయబడ్డ "ఆలీబాబా 40 దొంగలు" లో ఏ.ఎం.రాజా-భానుమతి పాడిన "ప్రియతమా మనసు మారునా" అలనాటి సూపర్ డూపర్ హిట్ సాంగ్. (పైన గల వీడియోలో పొరపాటుగా ఎన్.టి.ఆర్. నటించిన, 1970 లో విడుదలైన, అదేపేరుగల చిత్రం గురించి ప్రస్తావించారు. దీనికి ఘంటసాల గారు సంగీత దర్శకులు అని గమనించవలెను).

రెండవ భాగం 

          ఎన్.టి.ఆర్. కు శ్రీ సుసర్ల గారంటే ప్రత్యేక గౌరవం. తన స్వంత చిత్రాలయిన "శ్రీమద్విరాట పర్వము", "శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర" కు సుసర్లగారినే యెన్నుకున్నారు. శ్రీ సుసర్ల వారు గడ్డు పరిస్థితుల కారణంగా ప్రముఖ తెలుగు సంగీత దర్శకులు చక్రవర్తి గారి వాద్య బృందంలో 80 లలో వయొలిన్ వాయిద్య సహకారాన్ని అందించారు. మధుమేహం (డయాబిటీస్) మూలంగా శ్రీ సుసర్ల వారికి దృష్టిలోపం కలిగింది. అయినా మొక్కవోని విశ్వాసంతో తన సంగీతయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు చెన్నైలో కుమార్తె వద్ద వుంటున్నారట. 
మూడవ భాగం
 

          శ్రీ సుసర్ల వారి విశేషాలను ఇటీవల ఒక శీర్షికలో ప్రజాశక్తి అనే పత్రికలో ప్రచురించారు. ఆ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. ఎన్నో అద్భుతమైన బాణీలను కూర్చి మన మనసులను రంజింప జేసిన మహానుభావులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారికి శత సహస్ర నమస్సుమాంజలులు.

28, డిసెంబర్ 2011, బుధవారం

కళ్యాణి రాగంలో మాస్టారి కమనీయ గానం - పసుపు కుంకుమ చిత్రం నుండి

1955 లో విడుదల అయిన చిత్రం పసుపు-కుంకుమ. ఇందులో జి.వరలక్ష్మి, కొంగర జగ్గయ్య గార్లు నాయికా నాయకులు. చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు ప్రముఖ కన్నడ సంగీత దర్శకులు, సంగీత కలాన్మణి శ్రీ ఎం. రంగా రావు గారు. వీరు భక్తి సంగీతానికి కొన్ని ప్రైవేట్ ఆల్బములు  తయారు చేసారు. ఈయన స్వరపరచిన పాటలలో ప్రైవేట్ ఆల్బం "భక్తి పాటలు" వివిధ దేవుళ్ళ పై శ్రీ పి.బి.శ్రీనివాస్ గారు రచించిన భక్తి గీతాలను శ్రీమతి ఎస్.జానకి గారు పాడారు. అంతే కాక రంగారావు గారు తిరుపతి వేకంటేశ్వరుని పై "శ్రీ వెంకటేశ్వర మహోత్సవ సేవలు" అనే భక్తిమాలను కూడా స్వరపరిచారు. ఇంకొక విషయం ఏమిటంటే, రంగారావు గారు శ్రీ ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గారికి తను సంగీత దర్శకత్వం వహించిన "నక్కరే అదే స్వర్గ" అనే కన్నడ చిత్రంలో పాడే అవకాశం కల్పించి బాలును కన్నడ చిత్ర సీమకు పరిచయం చేసారట.పసుపు కుంకుమ చిత్రానికి మాస్టారు ఒకే ఒక పాట పాడారు. ఈ పాటను అభ్యుదయ కవి గా ప్రఖ్యాతి గాంచిన శ్రీ అనిసెట్టి సుబ్బారావు గారు వ్రాసారు. ఆయన అగ్నివీణ, ఖండకావ్యం వంటి పేరెన్నికగన్న రచనలు చేసారు. నిరుపేదలు, పిచ్చిపుల్లయ్య చిత్రాలకు మాటలను, పాటలను సమకూర్చారు. అంతేకాక కొన్ని డబ్బింగ్ చిత్రాలకు కూడ తన రచనలను అందించారు. 1969 లో విడుదలయిన "కన్నుల పండుగ" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.మరుగున పడియున్న ఈ ఆణిముత్యాన్ని పాటను వెదకి, సానపట్టి మనకందించిన ఘంటసాల అభిమానులకు కృతజ్ఞతలు. ఈ పాట యొక్క  ఆడియో, సాహిత్యాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.

చిత్రం:     పసుపు కుంకుమ (1955)
గానం:     ఘంటసాల



ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత 

                        ఆ..ఆ..ఆ..ఆ...ఆ
                ప.     నీవేనా! నిజమేనా!                          | నీవేనా |
                        జీవన రాణివి నీవేనా
                        నా జీవన రాణివి నీవేనా

                చ.    పూల తీగవో, పొంగే నదివో
                        తళుకు మెరుపువో, తలికి వెన్నెలవో        | పూల |
                        మమత గొలుపు అందాల సునిథివో         | మమత |
                        అరుగ యవ్వనానందపు సుధవో          
                        నీవేనా! నిజమేనా!

                చ.   నీలి నీడలో, నీ ముంగురులో,
                        కమలములో, నీ నయనములో           | నీలి నీడలో |
                        మరుని విల్లు ఇరువైపుల సాగిన          | మరుని |
                        విరుల తూపులో, వాలు చూపులో
                        నీవేనా! నిజమేనా!

                చ.   చిందు రవళిలో కలల శయ్యపై
                        నను వరించు నవ మోహినివేమో...      | చిందు |
                        అఖిలావనిలో శోభవింపగా                 | అఖిలా |
                        అవతరించిన దేవతవేమో
                        నీవేనా! నిజమేనా! జీవన రాణివి నీవేనా
                        నా జీవన రాణివి నీవేనా ..నిజమేనా.. 

24, డిసెంబర్ 2011, శనివారం

ఘంటసాల తదితరులు గానం చేసిన రామదాసు కీర్తన - అదిగో భద్రాద్రి - భక్త రామదాసు (1964) నుండి

రామదాసు గా శ్రీ నాగయ్య
ఖమ్మం జిల్లా పాల్వంచ తాలూకా తహసీల్దారైన శ్రీ కంచెర్ల గోపన్న భద్రాచల రాముని భక్తికి దాసుడై "రామదాసు" గా మారతాడు.  పోకల దమ్మక్క అనే రామభక్తురాలి ప్రేరణతో  భద్రాచలంలో రాముని గుడి నిర్మాణానికి పూనుకొని, ధనం సరిపోక, ప్రజలు యిచ్చిన శిస్తుల వసూళ్ల నుండి కొంత ధనాన్ని గుడి కట్టించడానికి వినియోగించి, తద్వారా కుతుబ్ షా వంశస్థుడైన గోల్కొండ సుల్తాన్ తానీషా ఆగ్రహానికి గురై, కోటలో బందీ చేయబడతాడు.  చెఱసాలలో తన ఆరాధ్య దైవమైన శ్రీ రాముని పై కీర్తనలు రాసి, తదుపరి రామకృప వలన చెఱ నుండి విముక్తుడవుతాడు. ఈ కీర్తనలే "భద్రాచల రామదాసు కీర్తనలు" గా ప్రసిద్ధి పొందాయి. భక్త రామదాసు గా శ్రీ చిత్తూరు వి. నాగయ్య గారు నటించి, దర్శకత్వం వహించిన యీ చిత్రంలో శ్రీ మహమ్మద్ రఫీ గారు కబీర్ దాస్ పాత్రధారికి  "దిల్ కో హమారే దర్శన్ దేనా", "కహే కో రోనా" అనే రెండు పాటలు పాడారు. శ్రీ  నాగయ్య, రఫీ గార్ల మధ్య గల అన్యోన్యతకు సంబంధించిన చర్చ, వ్యాసం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. శ్రీయుతులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, శ్రీమతులు టి.జి.కమల (నాగయ్య గారి మరదలు), జిక్కీ, సుశీల గార్లు కూడా పాడారీ చిత్రానికి. దాదాపు యాభై పాటలు, శ్లోకాలు గలిగి, నలుగురు ప్రముఖులు -నాగయ్య, ఓగిరాల రామచంద్ర రావు (వీరి ఆఖరి చిత్రం), హెచ్.ఆర్.(హోస్పేట రామశేష) పద్మనాభ శాస్త్రి (తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద, 1931 సంగీత దర్శకులు), అశ్వథ్థామ - సంగీత సారధ్యం వహించిన యీ చిత్రంలో చెప్పుకోదగ్గ విషయం ఏమంటే టైటిల్స్ పడేటప్పుడు వినిపించే రామదాసు కీర్తనను ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, మరియు ఎ.పి.కోమల గార్లు పాడారు. టైటిల్స్ ముందు గల శ్లోకాన్ని కూడా ఘంటసాల గారు ఆలపించారు.  ఆ కీర్తన వివరాలు ఇక్కడ పొందు పరుస్తున్నాను.   


నాగయ్య,   ఘంటసాల,   పి.బి.శ్రీనివాస్,  ఎ.పి.కోమల
 చిత్రం:    భక్త రామదాసు (1964)
రచన:    రామదాసు (కంచెర్ల గోపన్న)
గానం:    ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎ.పి. కోమల
సంగీతం: నాగయ్య, అశ్వథ్థామ, ఓగిరాల, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి

 (వీడియోలో పూర్తి పాటలేదు.)


శ్లోకం:
ఘంటసాల: ఓమ్! నమో విఘ్నేశ్వరాయ
              ఓమ్! నమో విశ్వేశ్వరాయ
              ఓమ్! నమో నారాయణాయ
కీర్తన:
అందరు:     అదిగో భద్రాద్రీ గౌతమి ఇదిగో చూడండి                     | అదిగో |
పి.బి.        ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు
              ఆ..ఆ...ఆ
              ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు
              కలిసి కొలువగా రఘుపతి యుండెడి
అందరు:     అదిగో భద్రాద్రీ గౌతమి ఇదిగో చూడండి

కోమల: చారు స్వర్ణ ప్రాకారముతో ఆ..ఆ..
              చారు స్వర్ణ ప్రాకార గోపుర
              ద్వారముతో సుందరమై యుండెడి                          | అదిగో |

ఘంటసాల: అనుపమానమై అతి సుందరమై..ఈ...ఈ...
              అనుపమానమై అతి సుందరమై
              దనరు చక్రముగ ధగధగ మెరసెడి                            | అదిగో |

పి.బి.        కలియుగమందున అల వైకుంఠము..ఆ..ఆ..
              కలియుగమందున అల వైకుంఠము
              అలరు చున్నది ప్రజముగ మొక్కుడి                      | అదిగో |

21, డిసెంబర్ 2011, బుధవారం

సుసర్ల సుందర స్వరకల్పనలో 'బలేబావ' నుండి ఘంటసాల ఆలపించిన సుమధుర గీతం


1957 లో వచ్చిన జగ్గయ్య, షావుకారు జానకి నటించిన హాస్య కుటుంబ కథా చిత్రం "బలే బావ".  ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన రెండు చక్కని పాటలున్నాయి. మాస్టారు పాడిన "ఆనందమంతా" పాట కల్యాణి రాగం లో స్వర పరిచారు. చాల మంచి పాట.  దక్షిణామూర్తి గారు గొప్పగా స్వర పరిచారు. ఇది అనిసెట్టి గారు వ్రాసిన ఒక చక్కని రొమాంటిక్ సాంగ్.  అందులో మాస్టారు పాడుతుంటే ఎంతో ఆహ్లాదంగా వీనుల విందుగా  వుంటుంది ఈ పాట.  కొద్దిగా అరుదైన పాటే.  ఈ చిత్రం కు సంబంధించి ఎక్కువ వివరాలు దొరకలేదు. ఈ పాట ఆడియో, సాహిత్యం ఇక్కడ పొందు పరుస్తున్నాను. మీకు తప్పక నచ్చుతుంది ఈ పాట.

 చిత్రం:        బలే బావ (1957)
గానం:         ఘంటసాల
రచన:         అనిసెట్టి 
సంగీతం:      సుసర్ల దక్షిణామూర్తి

Thanks to Sri Rajasekhar Raju for compiling 
the audio-vedio clip in You Tube

                      ఆ..ఆ...ఆ..
              ప.     ఆనందమంతా అనురాగమంతా
                      ఆశించవా యీ వేళా అందాలబాల అందాలబాల  | ఆనంద |

              చ.    ఆ చందమామయె ఆశించి పిలచె                   | ఆ చంద |
                      జగమే పులకించె                                     | జగమే |
                      వికసించె తారలే వెదజల్లె కాంతులే
                      ఈ రేయిలోనా ఈ హాయి లోనా  ఆ..ఆ..           | ఆనంద |

              చ.     చిన్నారి పూలే చిరు సిగ్గు లొలికే                   | చిన్నారి |
                      వలపే చిలికేనా                                       | వలపే |
                      చల్లని గాలులే సయ్యాటలాడెలే
                      ఈ రేయి లోనా ఈ హాయి లోనా ఆ..ఆ..           | ఆనంద |
                      ఆ..ఆ..ఆ..

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)