1964 సంవత్సరంలో విడుదలైన విక్రమ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన అమరశిల్పి జక్కన్న చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "తరమా వరదా " అనే ఈ యుగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది సాలూరు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, బి.సరోజాదేవి, నాగయ్య, హరనాధ్, గిరిజ, రేలంగి, ధూళీపాళ... ఈ చిత్రానికి నిర్మాత బి.ఎస్.రంగా మరియు దర్శకుడు బి.ఎస్.రంగా. దీనిని అక్కినేని, బి.సరోజాదేవి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 27.3.1964 న విడుదలైంది.
| చిత్రం: | అమరశిల్పి జక్కన్న (1964) | |
| రచన: | సముద్రాల రాఘవాచార్య | |
| సంగీతం: | ఎస్.రాజేశ్వర రావు | |
| గానం: | ఘంటసాల, సుశీల, బృందం |
| సాకీ: | ఘం: | శ్రీ వేణుగోపాలా..ఆ.. చిన్మయానంద లీలా |
| నారాయణ విజయనారాయణ నారాయణా పాహీ..ఈ.. | ||
| పల్లవి: | ఘం: | తరమా! వరదా..ఆ.. కొనియాడ నీ లీలా.. -2 |
| తనువూ, మనసూ తరియించె ఈ వేళా.. | ||
| తరమా! వరదా..ఆ.. కొనియాడ నీ లీలా.. | ||
| చ: | ఘం: | ఎండిపోయిన గుండెలలోన పండువెన్నెల చిలికితివీవు |
| సు: | తోడునీడగ మా దరినిలిచి కావుమా, కరుణాజలధి | |
| ఇద్దరు: | తరమా! వరదా..ఆ.. కొనియాడ నీ లీలా.. | |
| శరణు చెన్నకేశవా! శరణు దీనబాంధవా! | ||
| బృం: | శరణు చెన్నకేశవా! శరణు దీనబాంధవా! | |
| ఇద్దరు: | నాట్యకళా మోహనా, సకలలోక పావనా | |
| బృం: | నాట్యకళా మోహనా, సకలలోక పావనా | |
| శరణు చెన్నకేశవా! శరణు దీనబాంధవా! -2 | ||
| ఇద్దరు: | నీవే తల్లివి తండ్రివి మాకు జీవనదాతవు నీవె ప్రభూ! | |
| బృం: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. | |
| ఇద్దరు: | నీదు సేవయే జీవనరక్ష, నీదు సన్నిధే పెన్నిధిరా | |
| బృం: | ఒ ఓ..ఓ..ఓ ఓ ఓ | |
| ఇద్దరు: | నందనందనా గోవిందా, భక్తచందనా గోవిందా | |
| బృం: | నందనందనా గోవిందా, భక్తచందనా గోవిందా | |
| ఇద్దరు: | నందనందనా గోవిందా, భక్తచందనా గోవిందా | |
| ఘం: | చెన్నకేశవా, పాహీ చెన్నకేశవా - 2 | |
| ఘం-బృం: | చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా | |
| చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా | ||
| ఘం: | కేశవా…నా…. తరమా… వరదా.. | |
| కొనియాడ నీ లీలా… కేశవా.. | ||
| బృం: | చెన్నకేశవా, పాహీ చెన్నకేశవా - 4 |