ఆ రోజుల్లో ఆంగ్ల పదాల వాడుక తెలుగు పాటలలో అరుదుగా వుండేది. సాధారణంగా అది హాస్య గీతాలలో సన్నివేశానికో, సమయానికో అనుకూలంగా ఉపయోగించేవారు. ఈ రోజుల్లో అది ఒక సాంప్రదాయమై పోయింది. అప్పట్లో హాస్య గీతాలు కూడ అర్ధవంతంగా వుండేవి. ఆరుద్ర అప్పుడప్పుడు హాస్య రచనలు చేసారు. ఆరుద్ర-రేలంగి-ఘంటసాల కాంబినేషనులో ఆంగ్ల పదాలతో వచ్చే పాట ఆరాధన చిత్రం నుండి "ఇంగ్లీషులోన మారేజి, హిందీలొ అర్ధము షాది". ఘంటసాల మాస్టారు రేలంగికి పాడినపుడు చక్కని వైవిధ్యం చూపేవారు. మాస్టారు రేలంగి కి పాడిన మరికొన్ని గీతాలు "జేబులో బొమ్మ" (రాజు-పేద), "శివశివ మూర్తివి గణనాథా" (పెద్దమనుషులు), "సుందరి నీ వంటి" (మాయా బజార్), "నీవక్కడా నేనిక్కడ" (శ్రీ గౌరీ మహత్మ్యం), "ఆశా ఏకాశా" (జగదేకవీరుని కథ) మొదలయినవి. 1960 లో జగపతి పిక్చర్సు పతాకం
పై నిర్మించబడిన సాంఘిక చిత్రం అన్నపూర్ణ కి ఆరుద్ర వ్రాసిన "వగలాడీ వయ్యారం
బలేజోరు, నీ వయ్యారం వొలికించు వన్సు మోరు", గిలిగింతలు కలిగించే హాస్య జంట
గిరిజ-రేలంగిల పై చిత్రీకరించారు. జగ్గయ్య, జమున నటించిన ఈ చిత్రానికి దర్శకులు వి. మధుసూదన రావు. సంగీతం ఇటీవల దివంగతులైన స్వర బ్రహ్మ సుసర్ల దక్షిణామూర్తి.
కృతజ్ఞతలు: సమాచారం అందించిన వికీపీడియా-తెలుగు మరియు ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి
వీడియో మూలం: ఘంటసాల గానామృతం
రథసారధులు
చిత్రం: | అన్నపూర్ణ (1960) | |
రచన: | ఆరుద్ర | |
సంగీతం: | సుసర్ల దక్షిణామూర్తి | |
గానం: | ఘంటసాల, జిక్కీ | |
పల్లవి: | ఘంటసాల: | వగలాడీ వయ్యారం బలేజోరు |
నీ వయ్యారం వొలికించు వనుసు మోరు | ||
జిక్కీ: | ఆడకండి నాటకాలు అయ్యగారు | |
మీ వన్సుమొరుపు జవాబే మూయి నోరు | ||
ఘంటసాల: | ఆహా! | |
వగలాడీ వయ్యారం బలేజోరు | ||
నీ వయ్యారం వొలికించు వనుసు మోరు | ||
జిక్కీ: | ఆడకండి నాటకాలు అయ్యగారు | |
మీ వన్సుమొరుపు జవాబే మూయి నోరు | ||
చరణం: | ఘంటసాల: | ఆడకు నా ప్రాణంతో చెలగాటకం |
అమ్మ తోడు నా మాటలు కావు నాటకం | ||
జిక్కీ: | ఆహా! | |
ఘంటసాల: | ఇదిగో రాణీ! | |
ఘంటసాల: | ఆడకు నా ప్రాణంతో చెలగాటకం | |
అమ్మ తోడు నా మాటలు కావు నాటకం | ||
జిక్కీ: | ఊ..చాలు చాలు కట్టి పెట్టు యీ బూటకం | |
సాగదోయి నా దగ్గర పితలాటకం | ||
ఘంటసాల: | ఆహా! | |
జిక్కీ: | చాలు చాలు కట్టి పెట్టు యీ బూటకం | |
సాగదోయి నా దగ్గర పితలాటకం | ||
ఘంటసాల: | చాల్లే. వగలాడీ వయ్యారం బలేజోరు | |
నీ వయ్యారం వొలికించు వనుసు మోరు | ||
జిక్కీ: | ఆడకండి నాటకాలు అయ్యగారు | |
మీ వన్సుమొరుపు జవాబే మూయి నోరు | ||
చరణం: | ఘంటసాల: | కోరుకున్నదిచ్చుటలో కొద్దిగా లేటు |
కోపమేల యిదే కదా నా పొరబాటు | ||
జిక్కీ: | హు.. | |
ఘంటసాల: | రాణీ! కోరుకున్నదిచ్చుటలో కొద్దిగా లేటు | |
కోపమేల యిదే కదా నా పొరపాటు | ||
జిక్కీ: | పొరపాటులు చేయుటే తమకలవాటు | |
అయినా యిమ్మంటారు హృదయంలో చోటు | ||
పొరపాటులు చేయుటే తమకలవాటు | ||
రాజా యిమ్మంటారు హృదయంలో చోటు | ||
ఘంటసాల: | అద్దిగదీ.. | |
వగలాడీ వయ్యారం బలేజోరు | ||
నీ వయ్యారం వొలికించు వన్సు మోరు | ||
జిక్కీ: | ఆడకండి నాటకాలు అయ్యగారు | |
మీ వన్సుమొరుపు జవాబే మూయి నోరు | ||
ఇద్దరు: | తననానీ తననానీ తానినానా తని నానానీ తానానీ తానినానా | |
అహ తానానీ తానానీ తానినానా ఒహొ తానీనా తానీనా తానినానా |
కృతజ్ఞతలు: సమాచారం అందించిన వికీపీడియా-తెలుగు మరియు ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి