1967
సంవత్సరంలో విడుదలైన అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన కాంభోజరాజు కథ చిత్రం
నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన ఇంతటి మొనగాడివని అనే ఈ యుగళం రచన సినారె, స్వరపరచినది టి.వి. రాజు. ఈ చిత్రంలో తారాగణం శోభన్‌బాబు, ఎల్.
విజయలక్ష్మి, గుమ్మడి, రమణారెడ్డి,రాజశ్రీ, అంజలీదేవి. ఈ చిత్రానికి నిర్మాతలు డి.భాస్కరరావు-కె.భానుప్రసాద్ మరియు దర్శకుడు కె.కామేశ్వరరావు.
| చిత్రం: | కాంభోజరాజు కథ (1967) | |||
|---|---|---|---|---|
| నిర్మాణం: | అనంతలక్ష్మీ ప్రొడక్షసన్స్ | |||
| రచన: | సి. నారాయణరెడ్డి | |||
| పాడినవారు: | ఘంటసాల, సుశీల | |||
| సంగీతం: | టి.వి. రాజు | |||
| అభినయం: | శోభన్ బాబు, రాజశ్రీ | |||
| ప. | సు: | ఇంతటి మొనగాడవనీ ఇపుడే తెలిసిందిలే | ||
| ఇపుడే తెలిసిందిలే | ||||
| ఘ: | ఎంతటి మోనగాడవో ఇపుడేం తెలిసిందిలే | |||
| ఇపుడేం తెలిసిందిలే | ||||
| చ. | సు: | కన్నులు నిన్నుగని కలువలు ఆయెనూ | ||
| తలపులు నిన్నుగనీ అలలై పోయెనూ | ||||
| ఘ: | కన్నుల బాసలనూ కమ్మని ఆశలనూ | |||
| నిన్న తెలుసుకున్నాను | ||||
| నేడు కలుసుకున్నాను | ॥ ఇంతటి|| | |||
| చ> | సు: | నున్నని బుగ్గలలో నిన్నే చూసుకో | ||
| మెత్తని సిగ్గులనే మెల్లగ దోచుకో | ||||
| ఘ: | బుగ్గన చిటికేసీ - సిగ్గుల తెరతీసీ | |||
| నిన్ను దోచుకుంటానే - నిజం తెలుసుకుంటానే | ||||
| సు: | ఇంతటి మొనగాడవనీ | |||
| ఇపుడే తెలిసిందిలే - ఇపుడే తెలిసిందిలే | ||||
| ఘ: | ఇంతటి నెఱజాణవని - ఎపుడో తెలిసిందిలే | |||
| ఎపుడో తెలిసిందిలే |