1956 లో విడుదలైన అనువాద చిత్రం సాహస వీరుడు. ఎం.జి. రామచంద్రన్, భానుమతి, పద్మిని, బాలయ్య ప్రధానంగా నటించిన ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు జిక్కీతో కలసి ఒక యుగళగీతం పాడారు. ఈ చిత్రానికి అనేక విజయవంతమైన తమిళ చిత్రాలకు స్వరకర్తయై, శాస్త్రీయ సంగీతాన్ని సినీ మాధ్యమం ద్వారా అందించి పామరులను సైతం రంజింపజేసిన సంగీత దర్శకులు జి. రామనాథన్. అనువాద చిత్రగీత రచనకు ఆద్యుడు శ్రీశ్రీ పాటలు వ్రాసారు. అనువాద చిత్రాలకు నటీనటుల పెదవుల కదలికకు అతికినట్టుగ పాటలు వ్రాయడం కత్తి మీద సామువంటిది. అయినా ఇది శ్రీశ్రీకి ఇది కొట్టినపిండి. అయితే పాటలో "నంగిరి" (వెకిలితనం) అనే పదం చూసి ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఇది శ్రీకాకుళం మాండలికానికి చెందినది. అన్యప్రాంతాల వారికి తెలియకపోవచ్చును. మరి శ్రీశ్రీ శ్రీకాకుళానికి చేరువనగల విశాఖ నుండి కదా. ఈ చిత్రంలో భానుమతి, ఎం.ఎల్.వసంతకుమారి ఇతర గాయనీమణులు. ఘంటసాల ఒక పద్యాన్ని కూడ పాడారు. కాని అది ప్రస్తుతం అలభ్యం.
Thanks to Wickipedia and Ghantasala Galamrutamu-Patala Palavelli for providing useful information.
Video Courtesy:Sri Rajasekhar Raju
చిత్రం: | సాహసవీరుడు-1956 (డబ్బింగ్) | |
గానం: | ఘంటసాల, జిక్కీ | |
సంగీతం: | రామనాథన్ | |
రచన: | శ్రీశ్రీ | |
దర్శకత్వంః | డి.యోగానంద్ | |
పల్లవి: | ఘంటసాల: | కానిపనులు చేస్తే మరియాదా కాదు కాదయా -2 |
అయ్యా కాదు కాదయా | ||
ఘంటసాల-జిక్కీ: | అయ్యా కాదు కాదయా | |
చరణం: | ఘంటసాల: | నాగులప్పా నంగిరికుప్పా, కూచిలాంటి పోకిరి తుప్పా |
ఊళ్ళుకొడితే నిన్నే విడిచేనా దగా చాలయా | ||
అయ్యా దగా చాలయా -2 | ||
చరణం: | ఘంటసాల | కేటుమారి తుంటరి దొంగా, కోట చెఱలో గంజి తాగగా -2 |
జిక్కీ: | పాడుబతుకు బతికే జనులారా మేలుకోండయా | |
పాడుబతుకు, పాడుబతుకు, పాడుబతుకు | ||
పాడుబతుకు బతికే జనులారా మేలుకోండయా | ||
నేడే మేలుకోండయా -2 | ||
ఘంటసాల: | కాలు విరిగే పరువులు మేలా, కన్నమేసే పని మనకేలా | |
జిక్కీ: | కలలో కూడా వద్ధుగదయ్య, వద్దే వద్దయా -2 | |
అయ్యా, వద్దే వద్దయా -2 | ||
చరణం: | ఘంటసాల: | ఊరుదోచీ బ్రతుకుట చాలూ..ఊ.. ఆ.. --2 |
ఎవరికైనా భయపడరాదు -2 | ||
జిక్కీ: | కాడి పట్టీ బ్రతికే బ్రతుకే మేలు మేలయా -2 | |
అయ్యా మేలు మేలయా, అయ్యా మేలు మేలయా -2 | ||
ఇద్దరు: | కానిపనులు చేస్తే మరియాదా కాదు కాదయా -2 | |
అయ్యా కాదు కాదయా, అయ్యా కాదు కాదయా |
Thanks to Wickipedia and Ghantasala Galamrutamu-Patala Palavelli for providing useful information.