10, డిసెంబర్ 2011, శనివారం

వికటకవి కవన ఖడ్గానికి రెండు ప్రక్కలా పదునే - తెనాలి రామకృష్ణ చిత్రం నుండి

చిత్రం:    తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి
గానం:    ఘంటసాల వెంకటేశ్వరరావు
రచన:    తెనాలి రామకృష్ణకవి
వికటకవియైన తెనాలి రామకృష్ణుడు ఆంధ్రభోజుడని వాసిగాంచిన శ్రీకృష్ణదేవరాయల వారికి తన ఆశుకవిత్వంతో, సమయస్ఫూర్తి తో రోజురోజుకు దగ్గర అవడం కొందరు సాటి దిగ్గజాలకు, రాయలవారి గురువైన శ్రీ తాతాచార్యుల వారికి అసూయగా వుండేది. రామకృష్ణుడిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని తాతాచార్యుల వారు ప్రేరేపించగా అష్టదిగ్గజాలలో ఒకరైన భట్టుమూర్తి (ఇతనికే 'రామరాజభూషణుడు' అని మరొక పేరు), గోవిందయ్య అనే ద్వారపాలకుడిని పిలిచి "రామకృష్ణుడు సభలోకి వస్తున్నాడు, నువ్వు అడిగినట్లే, కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్" అనే సమస్యను పూరించమని అడిగిస్తాడు. అందుకు వికటకవి కోపంతో అసలు అడిగిన వారిని ఉద్దేశిస్తూ గోవిందయ్యతో ఇలా అంటాడు..


                                 గంజాయి తాగి తురకల
                                 సంజాతము చేత కల్లు చవిగొన్నావా?
                                 లంజల కొడకా! ఎక్కడ
                                 కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !!

 అని సమస్యను పూరించడంతో తేలుకుట్టిన దొంగల్లా తాతాచార్యులు, భట్టుమూర్తి కిక్కురు మనకుండా ఊరుకుంటారు. అయితే ఎలాగైనా రామకృష్ణుడికి బుద్ధి చెప్పాలని రాయల వారికి ఫిర్యాదు చేస్తారు.  రాయల వారు వికటకవిని పిలిచి అదే సమస్యను ఇచ్చి పూరించమంటాడు. అపుడు రామకృష్ణుడు తెలివిగా ఈ క్రింది పద్యం చెబుతాడు..

                                రంజన చెడి పాండవులరి
                                భంజనులై విరటు కొల్వు పాలైరకటా!
                                సంజయా! విధి నేమందును
                                కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !

అది విని రాయలవారు "శభాష్! రామకృష్ణా! నీ బుద్ధి బలానికి రెండు ప్రక్కల పదునే" అని మెచ్చుకుంటాడు. 

గమనిక: పిల్లలకు చెప్పడానికి సులువుగా వుండే తెనాలి రామకృష్ణ కథలకు (ఆంగ్లంలో) ఇక్కడ క్లిక్ చేయండి.

9, డిసెంబర్ 2011, శుక్రవారం

ఘంటసాల, కోమల పాడిన 'విజ్ఞాన దీపమును వెలిగింప' - చంద్రహారం చిత్రం నుండి ఆడియో, విడియో, సాహిత్యంతో

1954  లో ఎన్.టి.ఆర్, ఎస్.వి.ఆర్., శ్రీరంజని, సావిత్రి నటించిన విజయా వారి చిత్రం 'చంద్రహారం' అంత ఆర్ధిక విజయం సాధించలేదు. దానికి కారణం సరియైన కథా బలం లేకపోవడం. కథానాయకుడైన రామారావు గారి పాత్ర చాల వరకు విగతమై పడి వుంటుంది. అందువలన అతనికి  ధైర్య సాహసాలు ప్రదర్శించే అవకాశం లేదు. భార్య (శ్రీరంజని) పాతివ్రత్యం తో తప్ప అతనికి పునర్జన్మ లభించదు. అంతేకాక ఆనాడు కన్నీటి కనక వర్ష తార గా ప్రసిద్ధి చెందిన శ్రీరంజని ప్రేక్షకులను మరీ ఏడిపించినదనుకుంటా. ఎంతో ఉల్లాసంగా ఉండే సావిత్రి పాత్ర విలన్ పాత్ర. అదీ ఒక దెబ్బే మరి. అయితే సంగీతం మాత్రం అద్భుతం. ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి చక్కని బాణీలు కూర్చారు. అందులో ఎక్కువగా విననిది, చక్కని ఆణిముత్యం వంటి పాట "టైటిల్ సాంగ్", పింగళి నాగేంద్ర రావు గారు రచించిన "విజ్ఞాన దీపమును వెలిగించ రారయ్య". దీనిని మాస్టారు, ఎ.పి.కోమల, బృందం పాడారు. శ్రీమతి ఎ.పి.కోమల 1940 ల నుండి 60 ల వరకు మాస్టారితో సుమారు 9 యుగళ గీతాలు రక్షరేఖ, రహస్యం, సత్యనారాయణ మహాత్మ్యం, చంద్రహారం, పాండురంగ మహాత్మ్యం, బాలసన్యాసమ్మ కథ మొదలయిన చిత్రాలలో పాడారు. ఆపాట ఆడియో, వీడియో, మరియు సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను.    

    

పింగళి      ఘంటసాల     కోమల 
చిత్రం:         చంద్రహారం (1954)
రచన:         పింగళి నాగేంద్రరావు
సంగీతం:      ఘంటసాల
గానం:         ఘంటసాల, ఎ.పి.కోమల, బృందం
పాట:          (టైటిల్ సాంగ్)
ఘంటసాల:           ఓమ్!,
కోమల-బృందం:      ఓమ్!, ఓమ్!
ఘంటసాల:           విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య
కోమల-బృందం:      విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య
ఘంటసాల:           అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా
కోమల-బృందం:      అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా
అందరు:              విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య
ఘంటసాల:           పరహితమె, పరసుఖమె, పరమార్థ చింతనమే...
కోమల-బృందం:      పరహితమె, పరసుఖమె, పరమార్థ చింతనమె
అందరు:              మానవుల ధర్మమని భావించరయ్యా
అందరు:              విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య
ఘంటసాల:           వినయమున, సహనమున విజయములు సాధించీ..
అందరు:              వినయమున, సహనమున విజయములు సాధించి
                        దీన బలహీనులను కరుణతో పాలించి
ఘంటసాల:           జీవులకు, దేవులకు భేదమే లేదనీ..
కోమల-బృందం:      జీవులకు, దేవులకు భేదమే లేదనీ
                        భువిని ఈ సత్యమును చాటించరయ్యా
అందరు:              విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య
                        అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా
                        విజ్ఞాన దీ..పం        Thanks to Sri Bollapragada Someswara Rao garu for providing the video in You Tube.

7, డిసెంబర్ 2011, బుధవారం

మనదేశం నుండి మాస్టారి గొంతులో పురాణ శ్లోకాలు

1949 లో విడుదల అయిన మనదేశం చిత్రం నటుడిగా నందమూరి తారక రామారావు గారిని తెలుగువారికిచ్చి, ఆ కళామతల్లికి ముద్దు బిడ్డగా పెంచి, తదుపరి చిరస్మరణీయమైన పౌరాణిక, సాంఘిక పాత్రలలో జీవింపజేసి విశ్వ విఖ్యాత నట సార్వభౌమునిగా తీర్చి దిద్దింది. భారత స్వరాజ్య సంగ్రామము నేపధ్యంగా "విప్రదాస్" అనే బెంగాలి నవల ఆధారంగా నిర్మించబడిన సాంఘిక చిత్రమిది. ఇందులో రామారావు గారు పోలీస్ ఇన్స్పెక్టర్ గా నటించారు.  అయితే రాజకీయ ఇతివృత్తం నేపధ్యంలో చిత్రంగా మొదలయిన 'మనదేశం' తెలుగువారి ఆత్మగౌరవమనే వేదికపై సింహనాదంగా మారి  'తెలుగుదేశం' ఏర్పడటానికి దారి తీస్తుందని "అన్నగారు" ఆనాడు అనుకొని ఉండకపోవచ్చును. మనదేశం చిత్రం కోసం రెండు శ్లోకాలు, ఒక బుర్రకథ, కొన్ని పాటలు మాస్టారు గానం చేసారు.  శ్లోకాలు ఇక్కడ పొందు పరుస్తున్నాను. 
సంగీతం: ఘంటసాల
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత


జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ
రామ్ రామ్ రామ్
ఈ శ్లోకానికి మూలం రామాయణమని, రావణ వధానంతరం లక్షణునితో శ్రీరాముడు ఈ శ్లోకాన్ని పేర్కొన్నాడని కొందరి అభిప్రాయం. ఈ పంక్తికి మరొక విశిష్టత వుంది. 'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అనేది నేపాల్ దేశపు 'ఆదర్శవాక్యం" (motto). భారతదేశానికి "సత్యమేవ జయతే" అని అనుకుంటాను. అయితే రామాయణ కథనం ప్రకారం ఈ పంక్తికి ముందు ఇంకొక పంక్తి వున్నది. అదేమిటంటే..

అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ

తాత్పర్యం: "ఓ! లక్ష్మణా! ఈ స్వర్ణమయమయిన లంక నన్ను ఏవిధంగా ఆకట్టుకోలేదు. కన్నతల్లి, పుట్టిన ప్రదేశము స్వర్గం కన్న మిన్న సుమా!"

      మనదేశం చిత్రం కోసం ఘంటసాల మాస్టారు గానం చేసిన ఇంకొక శ్లోకం పంచమ వేదం మహాభారతం లోని పవిత్ర భగవద్గీత నుండి గ్రహించబడింది. భగవద్గీత లో మొదటి అధ్యాయమైన "అర్జున విషాద యోగం" లో 33 వ శ్లోకమ్ లో అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు:


యేషామర్థే కాంక్షితమ్ నో రాజ్యం భోగాః సుఖాని చ  
త ఇమే(అ)వస్థిత యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా  ధనాని చ



తాత్పర్యం: "మనం ఎవరి గురింఛి రాజ్యాన్ని, భోగ భాగ్యాలను, అన్ని సుఖాలను కోరుతున్నామో, వారంతా తమ  ధనాన్ని, ప్రాణాలను సైతం వదలుకునేందుకు సిద్ధపడి ఈ యుద్ధ భూమిలో నిలిచి యున్నారు".

గమనిక: శ్లోకం తరువాత వచ్చే వ్యాఖ్యానంలో వినపడిన ఇద్దరి గొంతుకలలో రెండవది మాస్టారిది.

5, డిసెంబర్ 2011, సోమవారం

చిత్ర సీమలో ఘంటసాల గారు పాడిన మొదటి భక్తి గీతం

కన్నాంబ, గోవిందరాజుల సుబ్బారావు
1947 లో విడుదల అయిన పలనాటి యుద్ధం చిత్రం లో ఘంటసాల మాస్టారు నాలుగు పాటలు పాడారు. అలనాటి ప్రముఖ నటి, గాయని అయిన శ్రీమతి పసుపులేటి కన్నాంబ నాయకురాలు నాగమ్మ గాను, శ్రీ గోవిందరాజుల సుబ్బారావు బ్రహ్మనాయుడు గాను, శ్రీ ఎ.ఎన్.ఆర్. బాలచంద్రుడు గాను ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. అవి ఏమిటంటే, సంగీత దర్శకులైన శ్రీ గాలి  పెంచల నరసింహారావు గారికి మన ఘంటసాల మాస్టారు సహాయ సంగీత దర్శకునిగా పనిచేసారు. అక్కినేని గారు స్వయంగా పాడారు, మాష్టారితో కలిసి పాడారు.  ఘంటసాల గారు చలన చిత్ర రంగంలో పాడిన మొట్ట మొదటి భక్తి గీతం "తెర తీయగా రాదా" కన్నాంబతో పాడిన యుగళ గీతం. దాయాదుల మధ్య రేగిన మతద్వేషాల వలన ఎంతో జననష్టం జరిగి, ఇంచుమించు ఇరుపక్షాల లో అంతా పల్నాటియుద్ధం లో మరణించాక, రక్త సిక్తమయిన చేతులు జోడించి చెన్నకేశవ స్వామి ఎదురుగా నిలిచి పశ్చాత్తాపంతో బ్రహ్మనాయుడు, నాగమ్మ పాడతారు ఈ పాట. మాస్టారు ఏ పాట పాడినా, ఎవరితో పాడినా వారి ఉచ్చారణ స్వచ్చంగా, తేట తెల్లంగా వుంటుంది. ఈ పాట వింటే మీకే తెలుస్తుంది. ఈ పాట ఆడియో, సాహిత్యం ఇక్కడ పొందుపరుస్తున్నాను. సాహిత్యంలో ఎక్కడయినా తప్పులు దొర్లివుండవచ్చును. మీకు తెలిస్తే తప్పక నాకు తెలుపగలరు. సరిదిద్దుకుంటాను. 
ఘంటసాల    కన్నాంబ 
చిత్రం:         పల్నాటి యుద్ధం (1947)
రచన:         సముద్రాల రాఘవాచార్యులు
సన్గీతం:       గాలి పెంచల నరసింహారావు
గానం:         ఘంటసాల, పి.కన్నాంబ





                    ఘంటసాల:   తెర తీయగా రాదా! దేవా!
                                    తెర తీయగ రాదా! దేవా!
                                    తెర తీయగ రా.దా! దేవా!
                                    తెర తీయగ రా..దా.. 
                    కన్నాంబ:     తన వారూ, పెరవారనని            | తనవారూ |
                                    తరతమ భావములు మాని        | తరతమ |
                    ఘంటసాల:   జగదానందమె పరమార్ధముగా     | జగదానందమె |
                                    నరులు బ్రదుక రాదా..కాదా.        | నరులు బ్రదుక |
                                    తెర తీయగ రాదా

                    ఇద్దరు:        సత్యము, శివము, సుందరమౌ
                                    సాత్విక రూపము నిత్యము కాదా
                                    మాలో యిక అనురాగము, సమత    | మాలో యిక |
                                    శాంతి శాశ్వతము కావా
                                    శాంతి, శాశ్వతము.. కాదా..

4, డిసెంబర్ 2011, ఆదివారం

రాలీ, నార్త్ కరోలినాలో ఘంటసాల మరియు బాలు గాన కచేరీ

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం లోని రాలీ (Raleigh, NC) పట్టణంలో నవంబరు 2011 లో హైదరాబాదు కు చెందిన వేగేశ్న ఫౌండేషన్ వారు వికలాంగుల సహాయార్ధం స్థానిక ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (TATA) అధ్వర్యంలో నాలుగవ ఘంటసాల ఆరాధనోత్సవం మరియు ప్రధమ బాలు సంగీతోత్సవం నిర్వహించారు. వేగేశ్న సంస్థకు చెందిన శ్రీ వంశీ రామరాజు గారు మాట్లాడుతూ తమ ప్రయత్నం "వికలాంగులను సకలాంగులుగా" చేయడమని, ఆ యజ్ఞంలో భాగంగా ఘంటసాల గారి పాటలతో విరాళాలను సేకరించుతున్నామని చెప్పారు.  



ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయనీ గాయకులు హ్యుస్టన్, టెక్సాస్ కు చెందిన శ్రీమతి మణిశాస్త్రి గారు, హైదరాబాదుకు చెందిన శ్రీమతి గానాంజలి గారు, శ్రీ తాతా బాలకామేశ్వరరావు గారు, శ్రీ వినోద్‍బాబు గారు, స్థానిక గాయకులు సూర్యనారాయణ వులిమిరి, పలు ప్రసిద్ధమైన ఘంటసాల మరియు ఎస్.పి.బాలసుబ్రమణ్యం గార్ల పాటలను కెరియోకీలతో అద్భుతంగా గానం చేసి శ్రోతలను ఆనందింపజేసారు. వారు పాడిన పాటలలో ఈ వీడియోలో కొన్ని మాత్రం చూపించడం జరిగింది. అవి: 

వాతాపి గణపతింభజే  (వినాయకచవితి)  - బాలకామేశ్వరరావు; 
దేవదేవ ధవళాచల  (భూకైలాస్) - బాలకామేశ్వరరావు; 
భలే మంచిరోజు  (జరిగిన కథ)  - వినోద్ బాబు; 
సఖియా వివరించవే  (నర్తనశాల)  - మణిశాస్త్రి; 
పార్వతి స్తోత్రం  (ప్రైవేట్ సాంగ్) - గానాంజలి; 
ఆడవే మయూరి  (చెల్లెలికాపురం)  - వినోద్ బాబు; 
శివశంకరీ  (జగదేకవీరునికథ)  - బాలకామేశ్వరరావు, వినోద్ బాబు; 
కురిసేను విరిజల్లులె  (ఘర్షణ)  - గానాంజలి, వినోద్ బాబు; 
తెలిసిందిలే తెలిసిందిలే  (రాముడు-భీముడు)  - బాలకామేశ్వరరావు, మణిశాస్త్రి; 
పల్లెకు పోదాం  (దేవదాసు)  - వినోద్ బాబు; 
జయజయమహాదేవ శంభో  (కాళహస్తి మహత్మ్యం)  - సూర్యనారాయణ వులిమిరి; 
నీలీల పాడెద దేవా  (మురిపించే మువ్వలు)  - మణిశాస్త్రి; 
నగుమోము గనలేని  (త్యాగరాజకీర్తన)  - గానాంజలి; 
శిలలపే శిల్పాలు  (మంచిమనసులు)  - బాలకామేశ్వరరావు; 
ఝుమ్మంది నాదం  (సిరిసిరిమువ్వ)  - వినోద్ బాబు, మణిశాస్త్రి; 
పుష్పవిలాపం  (ప్రైవేట్ సాంగ్)  - బాలకామేశ్వరరావు; 
సాథీయా తూనే క్యాకియా  (హిందీ) - వినోద్ బాబు, గానాంజలి; 
మది శారదాదేవి మందిరమే  (జయభేరి)  - బాలకామేశ్వరరావు. 

తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కుమార్ నెప్పల్లిగారు వందన సమర్పణ చేసారు. టాటా కు చెందిన కమిటీ సభ్యులు శ్రీ నండూరి సాంబశివరావు గారు కార్యక్రమం నిర్వహించడంలో, వీడియో తీయడంలో సహకరించారు.  సూర్యనారాయణ వులిమిరి గాయకులకు, వేగేశ్న నిర్వాహకులకు తమ యింట ఆతిధ్యమిచ్చారు. వీడియో ఆఖరున కనిపించే గ్రూప్ ఫోటోలో ఉన్నవారు, ఎడమ నుండి కుడికి -కుమార్ నెప్పల్లి, సూర్యనారాయణ వులిమిరి, తాతా బాలకామేశ్వర రావు, వినోద్ బాబు, నండూరి సాంబశివరావు, వంశీ రామరాజు, గానాంజలి, మరియు మణిశాస్త్రి. ఈ కార్యక్రమము యొక్క కవరేజి టీవీ 9 లో ప్రసారమయింది. ఆ వీడియోను దిగువన పొందుపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమం కోసం స్థానిక దాతలు సుమారు పదివేల డాలర్ల విరాళాలు ఇచ్చారు. మాస్టారి పాట ఎంతమందికో జీవనోపాధి చూపిస్తోంది కదా!



బలే మంచిరోజు మాస్టారి పుట్టినరోజు - కొన్ని మాస్టారి ప్రముఖ వెబ్ సైట్లు

ఘంటసాల మాస్టారికి జన్మదిన శుభాకాంక్షలు!  
ఈ రోజు అమర గాయకుడు శ్రీ ఘంటసాల గారి 89వ పుట్టినరోజు. ఆ మహానుభావుని గురించి ఎంతయినా వ్రాయవచ్చును. ఆయన కారణజన్ముడు. తెలుగువారికి శ్రీ ఘంటసాల ఒక అమూల్యమైన వరం. ఆయన పేరిట ఎందరికో సంగీతంలో అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆయన పాట ఎంతోమంది అభాగ్యులైన పిల్లలకు జీవనోపాధిని, క్రొత్త జీవితాన్ని ఇచ్చింది. ఒక పాట అన్నా, పద్యం అన్నా ఇలా పాడాలన్న ప్రామాణికాన్ని నెలకొల్పింది ఆయన మంగళ గళం. మాస్టారు పాడిన పాటలలో ఏ పండగకైనా, కార్యక్రమానికైనా హాయిగా పాడుకునే పాట "జరిగిన కథ" చిత్రానికి శ్రీ సినారె వ్రాసిన "బలే మంచిరోజు పసందైన రోజు" అని ఒకసారి జనరంజని రేడియో కార్యక్రమంలో మాస్టారు అన్నారు. వారి పుట్టిన రోజున పసందైన ఈ పాటను, మాస్టారి మాటలను క్రింది ఆడియో ఫైలు లో వినండి. ఆడియో మూలం "ఘంటసాల గాన చరిత".
 

ఈ సందర్భంగా మాస్టారి గురించి తెలిపే, తెలుసుకోగలిగే కొద్ది సమాచారాన్ని నాకు అవగతమైన మేరలో తోటి ఘంటసాల అభిమానులకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ పొందుపరుస్తున్నాను.
   
మన ఘంటసాల - ఘంటసాల ప్రాజక్టు: ఈ సైటులో ఘంటసాల మాస్టారికి సంబంధించిన అన్ని వివరాలు దొరుకుతాయి. ముఖ్యంగా మాస్టారికి పలువురు సమర్పించిన నివాళులు, ఛాయా చిత్రాలు, వ్యాఖ్యానాలు, మాస్టారి కచేరీలు (న్యూయార్క్, చికాగో, మరియు కలకత్తా), పద్యాలు, పాటలు, భగవద్గీత, ఫన్ గేమ్స్, పాటల డేటాబేస్, గీతాల సాహిత్యము (లిరిక్స్) లభ్యమవుతాయి. ఈ సైట్ ను అభివృద్ధి పరచడంలో పలువురు ఘంటసాల అభిమానులు చేయూతనిస్తున్నారు. మాస్టారు పాడిన మొదటి పాట నుండి 60 ల వరకు మాస్టారు పాడిన, సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలోని పాటలు, పద్యాలు, కాలక్రమంలో అమర్చబడి వున్నాయి. ఈ పాటలన్నిటినీ వినొచ్చు లేదా భద్రపరచుకొన (download) వచ్చును. ఆయా లింకుల కోసం కావలసిన పదం మీద క్లిక్ చేయండి.
ఘంటసాల యాహూ గ్రూప్: ఇది ఇ-లేఖ (e-mail) గ్రూప్. ఇందులో మాస్టారికి సంబంధించిన పాటల, చిత్రాల తదితర విషయాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొనవచ్చును, లేదా పాల్గొనవచ్చును. అంతేకాక ఘంటసాల గారి పాటల లిరిక్స్, ఆడియో ఫైల్సు, యూ ట్యూబ్ వీడియో లింకులు మాస్టారి అభిమానులచే పోస్టు చేయబడతాయి.  ఈ ఇ-గ్రూప్ లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఘంటసాల గళామృతం - పాటల పాలవెల్లి:  పలువురు ఘంటసాల మాస్టారి అభిమానులు కలసి వారి పాటల, చిత్రాల వివరాలను సేకరించి, సమకూర్చిన వెబ్ సైట్ ఇది. ఇందులో అక్షరక్రమంలో ఘంటసాల గారు పాడిన, సంగీత దర్శకత్వం నిర్వహించిన చిత్రాలలోని పాటల, పద్యాల వివరాలు పొందుపరచబడి వున్నాయి. దీనిని నిర్వహిస్తున్నది శ్రీ కొల్లూరి భాస్కర రావు గారు. వీరు హైదరాబాదు ఘంటసాల సంగీత కళాశాల సంచాలకులు. 
సఖియా: ఈ వెబ్ సైటు పైన పేర్కొన్న "ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి" కి అనుబంధమైనది. ఇందులో 1930 ల నుండి 1960 ల వరకు వచ్చిన చాల తెలుగు చిత్రాల వివరాలన్నీ దొరుకుతాయి. ప్రతి చిత్రానికి సంబంధించిన సాంకేతిక వర్గం, పాటల విషయ సూచిక, మరియు ఆడియో ఫైల్సు పొందుపరచబడి వున్నాయి. 

Old Telugu Songs: ఈ సైటులో తెలుగు చిత్ర పరిశ్రమ ఆరంభం నుండి సుమారు 1960s వరకు విడుదలయిన చిత్రాల పాటలు free గా download చేసుకోవచ్చును. అంతేకాక కావలసిన సినిమా, గాయని లేదా గాయకుడు, సంగీత దర్శకుడు/దర్శకురాలు, లేదా గీత రచయితను, లేదా వారి కాంబినేషను గాని ఎన్నుకొని పాటలను వెదుక్కోవచ్చు.
 
చిమట-మ్యూజిక్: ఈ వెబ్ సైట్ లో ఘంటసాల గారితో మొదలుకొని అందరు తెలుగు చలన చిత్ర రంగం లోని గాయనీ గాయకుల పాటల ఆడియోలు, కొన్ని వీడియో మరియు లిరిక్స్ యొక్క లింకులు దొరుకుతాయి.

వేగేశ్న ఫౌండేషన్వికలాంగులను సకలాంగులుగా చేసే ఉన్నతమైన ఆశయంతో హైదరాబాదులోని హయత్ నగర్ లో వేగేశ్న ఫౌండేషన్ స్థాపించబడింది.  ఈ సంస్థను నిర్వహిస్తున్న శ్రీ వంశీ రామరాజు గారు ప్రతి సంవత్సరం శ్రీ ఘంటసాల గారి ఆరాధనోత్సవాలు జరుపుతుంటారు. స్వదేశంలోను, ప్రవాసంలోను నివాసం చేస్తున్న ప్రఖ్యాత గాయనీ, గాయకులతో మాస్టారి పాటల కచేరీలను పలు నగరాలలో ఏర్పాటు చేసి వికలాంగులైన పిల్లల అభివృద్ధికి విరాళాలు సేకరిస్తుంది ఈ సంస్థ. ఒకానొక కార్యక్రమంలో రామరాజు గారు మాట్లాడుతూ "ఘంటసాల మాస్టారి పాటలు ఈ పిల్లలకు భవిష్యత్తును యిచ్చాయి". వీరంతా మాస్టారికి ఎంతో ఋణపడి వున్నారు" అని అన్నారు. ఆ విధంగా మాస్టారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ, వారు మన మనసులలో చిరస్థాయిగా నిలిచి వున్నారు, వారి పాటలు ఎందఱో అభాగ్యుల చీకటి హృదయాలలో వెలుగును నింపుతున్నాయి. 

ఘంటసాల పాటల సాహిత్యం దొరికే కొన్ని వెబ్ సైట్లు:  
ఘంటసాల: ఇది నా బ్లాగు. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన పద్యాల, పాటల సాహిత్యాన్ని పొందు పరచే ప్రయత్నం చేస్తున్నాను. సాహిత్యంలో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే సహృదయంతో క్షమించి, సవరణలు సూచించ గలరు. 
సూచన: మీ స్పందనను బ్లాగ్ పోస్టు దిగువన గల కామెంట్స్ బాక్స్ లో వ్రాయ గలరు. ఇతర సమాచారం కొరకు suryvulimiri@gmail.com కు వ్రాయగలరు.   

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)