పల్లవి: |
ఘంటసాల: |
వినరయ్యా రామకథా, శ్రీ
రఘుకులమౌళీ పుణ్యకథా, వినరయ్యా రామకథా |
|
బృందం: |
రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం (2) |
చరణం: |
ఘంటసాల: |
దశరథ నృపతి సంతతి కోరి, చేసె పుత్రకామేష్టి |
|
|
దేవతలొసగిన పాయసమహిమా కలిగిరి నలుగురు సుతులూ.. |
|
బృందం: |
వినరయ్యా రామకథా, శ్రీ రఘుకులమౌళీ పుణ్యకథా, వినరయ్యా
రామకథా |
చరణం: |
ఘంటసాల: |
దేవేరులు తమ కూరిమిసుతుల, పెంచిరి కడుమురిపాన |
|
|
అరువదినాలుగు కళలనేర్చిరి గురువు వశిష్టుని కరుణా..ఆ. |
|
బృందం: |
వినరయ్యా రామకథా, శ్రీ రఘుకులమౌళీ పుణ్యకథా, వినరయ్యా
రామకథా |
చరణం: |
ఘంటసాల: |
విశ్వామిత్రుడు దశరథరాముని పంపగకోరెను తనవెంటా |
|
|
క్రతురక్షణకై రామలక్ష్మణులు కదలిరి కౌశికువెంటా..ఆ. |
|
బృందం: |
వినరయ్యా రామకథా |
చరణం: |
ఘంటసాల: |
యాగముగాచీ మిథిలకుసాగి, పతిశాపమున శిలయైయున్న |
|
|
సతి అహల్యకు తొలిరూపొసగే తనపదధూళీ దాశరథీ |
|
బృందం: |
వినరయ్యా రామకథా |
చరణం: |
ఘంటసాల: |
జనకునిసభలో శివునీధనువు చెఱకుకోలవలలే విరుగగజేసి |
|
|
సకలలోకములు సంతోషింప సీతను రాముడు పెండ్లాడె |
|
బృందం: |
వినరయ్యా రామకథా |
చరణం: |
ఘంటసాల: |
చిననాడొసగిన వరముల బదులుగ కౌసల్యాసుతు కానలకంపి |
|
|
తన కొడుకునకు పట్టమూగట్టగా దశరథునడిగెను కైకేయి |
|
|
తండ్రిమాట పరిపాలనసేయగ తమ్ముడూ, సీతయూ వెంబడిరాగా |
|
|
సాకేతమువిడి దినమొకచోటుగ చేరెపంచవటి రఘుమౌళీ |
|
బృందం: |
వినరయ్యా రామకథా |
చరణం: |
ఘంటసాల: |
సొంపుగ పర్ణకుటీరమువేసి, ఇంపగు పండ్లూ,
పూవులొసంగి |
|
|
అన్నమూ, నిదురామాని లక్ష్మణుడు అన్నావదినల సేవించే |
|
బృందం: |
రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం |
చరణం: |
ఘంటసాల: |
సౌమిత్రినిగని శూర్పణఖా, ప్రేమించుమనీ బాధింపా |
|
|
చుప్పనాతి ముక్కుచెవులూగోసి పంపెను మోహపుఫలితముగా |
|
|
పంపెను మోహపు ఫలితముగా |
|
|
మారీచుడు బంగారులేడియై వదలగ ఆశ్రమభాగానా |
|
|
పతిని లేడి కొనితెమ్మనె సీతా, రాముడేగె కొనితేగా.ఆ.,
రాముడేగె కొనితేగా |
|
|
రాముబంటుతో "హా! లక్ష్మణా! హా!
లక్ష్మణా"యని అరచెను బిట్టుగ మాయావి |
|
|
అన్నకు తోడుగ పొమ్మని తమ్ముని ఆదేశించెను వైదేహీ.ఈ.
వైదేహీ |
|
బృందం: |
రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం |
చరణం: |
ఘంటసాల: |
వదినమాట కాదనగాలేక, వంచనయని నమ్మించగలేక |
|
|
గిరులుగీచి ఇవి దాటిరాకుమని వెడలెను మఱదీ
విధిలేక |
|
|
మారువేషమున సీతారాముల పర్ణశాల ముంగిట నిలచీ |
|
|
"భవతీ భిక్షాందేహీ! భవతీ భిక్షాందేహి"యటంచు
రావణాసురుడు పిలచే..ఏ.. |
సాకీ: |
|
బిచ్చమువేయగ వచ్చిన జానకి, గడ్డతోడ పెకలించి
హరించి |
|
|
ఆకసాన లంకాపురిజేరి, అశోకవనిలో నుంచే |
|
బృందం: |
రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం (4) |