చిత్రం: గృహలక్ష్మి (1967)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
రచయిత: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల, భానుమతి
పల్లవిః ఘంటసాలః కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి
భానుమతిః కన్నులే నాకోసం కాచుకున్నవా...
వెన్నెలలే అందుకని వేచియున్నవా
చరణంః భానుమతిః ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
కొంటెతనం ఈ రేయి కూడదన్నవి... కూడదన్నవి
కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా
చరణంః ఘంటసాలః అందమైన ఆవేశం ఆగనన్నది
భానుమతిః హద్దులోన ఉంటేనే అందమున్నది
ఘంటసాలః అందమైన ఆవేశం ఆగనన్నది
భానుమతిః హద్దులోన ఉంటేనే అందమున్నది
ఘంటసాలః తుళ్ళిపడే నా మనసే చల్లపడాలి
భానుమతిః చందురుడే నిన్నుగని జాలిపడాలి... జాలిపడాలి
ఘంటసాలః కన్నులే నీకోసం కాచుకున్నవి
భానుమతిః వెన్నెలలే అందుకని వేచియున్నవి
చరణంః ఘంటసాలః విరహంలో నా తనువే వేగుతున్నది
భానుమతిః తీయని ఆ విరహంలో హాయివున్నది
ఘంటసాలః విరహంలో నా తనువే వేగుతున్నది
భానుమతిః తీయని ఆ విరహంలో హాయివున్నది
ఘంటసాలః ఎందుకిలా నన్ను సతాయింతువు నేడు
భానుమతిః మాటలింక చాలునులే మామవున్నాడు...
చందమామవున్నాడు
కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా
ఘంటసాలః కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి